Previous Page Next Page 
ఆరాధన పేజి 8


                                     5
    శారద నా జీవితాన వెలుగు పండించుతుందని రంగు రంగుల బంగారు కలలు గన్నాను.
    చెల్లాయి చుట్టూరా మల్లెల పరిమళాల్ని జల్లుతుందని మురిసిపోయాను. నవ్వుల పువ్వులు రువ్వుతూ, విరజిమ్ముతూ , మనసు ఝల్లు మన, మధురోహలు ఘల్లుమన, ఆనందానురాగాలతో విందు చేస్తుందని ఊహల ఊయలలో వూగురూ పరవశించి పోయాను.
    శుభలేఖలు అచ్చు వేయించ బడ్డాయి. శారద తో మరో మలుపు తిరగాబోతోందను కున్నాను. వలపుతో దాగిన మలుపు లు తెలియని నా హృది మధువు సేవించినట్లు పాలిపోయింది.
    అల్లుకున్న బంగారు కలలు రూపు దాల్చబోతూన్న మధుర క్షణాలవి. నాలుగు రోజులే వుంది వివాహానికి గడువు. కాని నాలుగు యుగాలన్పించింది నాకు. నవ వధువు లా అలంకరించుకున్న శారద ను ఈ హరికృష్ణ ప్రక్కన ఊహించుకుని మైమారచి పోయాను.
    న బ్రతుకున పన్నీరు కురుస్తుందనుకున్నాను. పున్నమి వెన్నెలే అవుతుంది నా జీవితం అని వూహల పల్లకి లో తూలి పోయాను. ఆమె మనసున మనసు నాయి కలలు గందామను కున్నాను. అనురాగ వీణియ పై అందాల కృష్ణుడనై , ప్రణయ గీతాల నెన్నింటి నో పాడుకుందామనుకున్నాను.
    ఆ కన్నుల వెలిగే కాంతి నేనై, ఆ మనసున మలచిన మందిరాన వెలసిన మధుర మూర్తి ని నేనై వెలిగి పోదామని అనుకున్నాను.
    ఆశలతో అందంగా అనురాగం నిండిన మేడ కట్టుకున్నాను. వెన్నెలలో కూర్చుని తిన్నగా పాడుకుంటున్నాను.......
    శారద వచ్చింది దేవకన్య లా. ఎదురు వెళ్లి మల్లెల్ని దోసిట లో పోశాను. కను లెత్తి చూసి నవ్వుతుందనుకున్నాను. ఉహూ! నవ్వలేదు సరిగదా! కనీసం కనుబొమ కూడా కదిలించలేదు.
    'కూర్చో శారదా!' అన్నాను. మౌనంగా కూర్చుంది. ఎందుకీపుదు వచ్చావని ప్రశ్నించాను. మాట్లాడలేదు. మళ్ళీ అడిగాను. నిట్టూర్చింది పెద్దగా.
    'నన్ను క్షమించమని అడగను. కానీ నమ్మించి పారిపోతున్న ఈ శారద ను మాత్రం మరిచి పొమ్మని వేడుకుంటున్నాను' అన్నది.
    నాకది కలలా వుంది. నేనేం వింటున్నానో తెలుయకుండా పోయింది. వెర్రి వాడిలా పెద్దగా అరిచాను . 'ఏమిటి? శారదా! నువ్వంటున్నది .' అని.
    'నాకు పెళ్లయింది ?' అన్నది. నా పైన పిడుగు పడింది.
    'పెళ్ళీ! ఎపుడయింది ? ఎవరా అదృష్ట వంతుడు? మరి నన్నెందుకిలా మభ్య పెట్టావు శారదా! వినోదం చూడాలను కున్నావా?' అన్నాను కోపంగా.
    'ఎన్ని అన్నా భరించ గలను బావా! నాకు తెలియదీ సంగతి. నాటకం అని దూషించుతావు నువ్వు! కానీ నిజమే! నిన్ననే వచ్చారు అమ్మా, నాన్నా.
    మీ మామయ్య అమ్మా వాళ్ళతో ఏవో అబద్దాలు చెప్పి మన వివాహాన్నిజరగనీయడెమోనన్న భయంతో మావాళ్ళెవరికీ తెలియ పరచలేదీ సంగతి నేను. కానీ నువ్వు శుభలేఖలు అచ్చు వేయించావు.
    శకుని లావెళ్ళాడు మీ మామయ్య. వెంటనే వచ్చారు నాన్న , అమ్మ ను కూడా తీసికొని. కూడా మరో యువకుడు వున్నాడు. అతని పేరు సతీశ్ బాబు అమెరికా లో డాక్టరేటు పుచ్చుకుని వచ్చాడట. అతనికీ నాకూ చిన్నతనం లోనే వివాహం జరిగిందన్నారు నాన్నగారు.
    అమ్మకు నాకు ఆరేళ్ళ వయసు లో జబ్బు చేసిందట. బ్రతకనన్న భయంతో సతీశ్ బాబుతో ఆ వయస్సు లోనే పెళ్లి జరిపించి వేయమని కోరిందట. నాన్న గారా కోరికను నిరాకరించ లేక పోయారు. అమ్మ తర్వాత భగవంతుడి దయ వల్ల కోలుకుంది. కానీ అప్పటికి ఆర్ధికంగా బీద స్థితిలో వున్న సతీశు ని నాన్నగారు పదివేలిమ్మని అడిగారట. అప్పటికే రాజకీయాలు మా కుటుంబాల మధ్య చిచ్చు పెడుతూ న్నాయి. ఆ కోపంలో నాన్న చిల్లి గవ్వ కూడా యివ్వనన్నారు. అయితే శారద మా యింటి గడప త్రోక్కదని బెదిరించారాయన. అసలు రానే రాదన్నారు నాన్న. పేదరికం లో చితికిపోయిన ఆ కుటుంబం పరువు కోసం బొంబాయి లో ఏదో చిన్న ఆసరా చూసుకుని వెళ్ళిపోయింది. వెళ్తూన్న క్రూరమైన పనిచేశారు సతీశుని తండ్రి గారు. నన్ను రహస్యంగా పిలిచి మెడలో వున్న మంగళ సూత్రాన్ని తీసుకున్నారు. ఆటల్లో పడి మరిచిపోయిన నేను నాన్నగారి కాసంగతి చెప్పేసరికి వాళ్ళు బొంబాయి వెళ్లి పోయారు.
    'పోనీ! పీడ వదిలింది! నా తల్లికి పెళ్ళే కాలేదను కుంటాను అన్నారు నాన్న ఆగ్రహంతో, అలాగే పెంచారు నన్ను. కానీ సతీశ్ బాబు వచ్చారు. మాట తప్ప లేక పోయారు అమ్మా నాన్న. అందుకే అతడిని కూడా వెంట దీసుకుని వచ్చారు. ఇపుడెం చేయమంటావు బావా!' అంది దుఃఖాన్ని దిగమ్రింగుతూ.
    వింటున్నావా , అనూ! కలలు కరిగిపోయాయి. పున్నమి వెన్నెలలో కారు మేఘాలు కటిక చీకటిని గుమ్మరించాయి.
    మనస్సు చిక్క బట్టుకుని 'వెళ్ళు! శారదా! హరికృష్ణ అన్న మనిషే లేడనుకో! నీ జీవితం ఆనందంతో గడిచి పోవాలని ప్రార్ధిస్తున్నాను ' అన్నాను.

 

                                  
    అంతకన్నా ఏమని దీవించ గలను? అంతే! అవే నా బ్రతుకున తిరిగి అంధకారాన్ని నింపిన మరుపు రాని క్షణాలు -- అందుకే శారద ను మరిచి పోలేను. కానీ ఆ అనురాగ మయి నా మూలాన నరకాన్ని సృష్టించుకుంటుందేమోనన్న భయంతో దూరంగా జరిగి వచ్చేశాను. కావాలనే కబురంపినా వెళ్ళనేనాడు.
    నిన్ను తనకు చూపించాలన్న వింత కోరిక కలిగింది నాలో. అందుకే వెళ్ళానా రోజున.
    శారద దేవతే! కానీ ఆ దేవతను ఆరాధించడానికి అర్హత లేదు నాకు. అందకే యిలా శపించాడు నన్ను భగవంతుడు . అందుకే నేనిక ఏ మనిషితోనూ ఆత్మీయతను పెంచుకోలేదప్పటి నుంచి. అనురాగాన్ని పంచలేదేవరికి.
    కానీ నిన్ను చూసిన తర్వాత నాలో వింతైన సంచలనం చెలరేగింది. నీతో అంతా చెప్పుకోవాలని ఆతురతతో వూగిపోయానిన్నాళ్ళూ, ఎందుకో నాకే తెలియదు అనూరాధా! నిన్ను కాదని , చూడగూడదనుకుని వెళ్లి పోదామను కున్నాను. కాని మనస్సు నా మాట వినలేదు.
    ఈ హరికృష్ణ ఎవరి నుంచీ ఏమీ ఆశించడింక. కానీ నీ ముందే ఆ సృష్టిలో తీయనైన స్నేహాన్ని అందించమని చేయి జాస్తున్నాను. కాదనకు అనూ! ఈ మాత్రపు కోరకను నిరాకరించ లేదని అడుగుతున్నాను.
    ఏం? మాట్లాడ వేమిటి? మౌనం దాల్చావా? నువ్వు కూడా!
    అపార్ధం చేసుకోకు అనూ! అంతా విప్పి చెప్పాను. నీరజ నిన్నోసారి చూడాలంటుంది . రాగలవా? నీ జవాబు కోసం నిరీక్షించుతుంటానని మరోసారి చెప్పనా?
    జాబు రాకపోతే నేనే వస్తాను. మరి ఎదురు చూడనా?
                    వస్తాను మరి --
                    స్నేహితుడు --
                    'హరికృష్ణ .
    అనూరాధ గుండెలు దడదడ లాడాయి. ఆ చివరి మాటలు చదవగానే. అతనితో పరిచయం కలిగినందు కేంతగానో నిందించుకుంది తనను తానే. కానీ మనస్సున ఆ యువకుని పై సానుభూతి అలలా లేస్తోంది. నీరజ దీనంగా 'రావా' అని అర్దిస్తోంది. శారద, మాట యివ్వ గూడదా అంటోంది.
    ఆలోచనలకి అవధులే లేకుండా పోయాయి. కవరు మడిచి తలగడ క్రింద వుంచింది. తల్లికి చెప్పాలను కుంది. కానీ ఏం వుంది దానిలో చెప్పడానికి? స్నేహమేగా అతడు కావాలన్నది. దానికే యింత భయం ఎందు కనుకుంది. అతని జీవితాన దొర్లిన శాపాన్ని చెప్పింది తల్లికి. శారద గురించి కూడా చెప్పింది. కానీ అతడు తన స్నేహాన్ని కోరిన సంగతి మాత్రం చెప్పలేక పోయింది.
    జవాబు యేమని వ్రాయాలో తోచకుండా పోయిందామెకు. ఏదో ఒకటి వ్రాయాలను కున్నదా రోజున. 'క్షమించండి . ఒకరికి స్నేహాన్ని పంచగల ఆత్మస్థైర్యం లేదు నాలో.' అని వ్రాసింది చివరలో రాలేనని వ్రాస్తూ.
    కానీ అతడి హృదయాన్ని అశాంతి తో వూపివేస్తున్నానెమో పాపం! అని జాలి పడింది. ' నా అంతస్తు కిదే తగిన మార్గం ' అని సరిపెట్టు కొంది. అయినా మనసు అన్యాయమని గోల పెడుతూనే వుంది అనుక్షణం --
    బోటనీ ప్రాక్టికల్స్ కోసమని కాలేజీ కి వెళ్ళింది . సెలవుల్లో కూడా కొన్నాళ్లు క్లాసులు తీసికోనున్నది ప్రిన్సిపాల్.
    కాలేజీ కి వెళ్లగానే 'ఫ్యూన్', చేతి కిచ్చింది పోస్టు చేయమని.' ఫ్యూను అలాగేనని తీసికొని వెళ్లగానే క్లాసు రూమ్ కేసి వెళ్ళ బోతుండగా ఎవరో పిలిచి నట్లు విన్పించి ఆగిపోయింది. వెనుదిరిగి చూసింది. అంతే! అచ్చెరువు అయ్యిందామె    
    నోట మాటే రాలేదేంత సేపటికి-- బొమ్మలా నిల్చుంచి పోయింది. ఎదుట వున్నది 'హరికృష్ణ లా అగుపించడం లెదామేకు. తానూ చేసిన దానికి శిక్షించడానికి వచ్చిన న్యాయమూర్తి లా నిల్చున్నా డతడు.
    'విజిటర్స్ రూమ్ లో వుంటాను. ప్రిన్సిపాల్ నడిగి వస్తావుగా!' అంటూ వెళ్లి పోయాడతడు. అందరూ తనకేసి చూస్తున్నారేమోనన్న వూహ రాగానే వెంటనే ప్రిన్సిపాల్ నడిగి వచ్చేసింది. అతడిని దులిపి వేయాలన్నంత ఆగ్రహంతో లోన అడుగు పెట్టింది. కానీ విభ్రాంత అయ్యింది.
    శారద కూడా వుంది అక్కడే! నమస్కారం చేసింది ఆశ్చర్యాన్నుంచి తేరుకుని.
    'రామ్మా! అనూ! కోపం రాలేదు గదా! ఇలా చెప్పకుండా వచ్చినందుకు' అన్నది శారద అనూరాధ ను కూర్చోమని చెప్పి.
    'ఊహూ! కోపం ఎందుకు! అక్కయ్యను చూడాలని ఏ చెల్లెలను కొదు ?'
    'మరి....బావనో!' అన్నది శారద పరిహస్యంగా.
    'ఆ సంగతి నీకే తెలియాలి!' ఏ భావమూ ధ్వనించ లేదా స్వరాన.
    హరికృష్ణ తో పాటు శారద ఎందుకు వచ్చిందో అనూహ్యంగా మిగిలి పోయిందామెకు. వాళ్ళను యింటికి ఆహ్వానించా లో, లేక ఏం చేయాలో అర్ధం కాకుండా పోయింది.
    చివరికి రమ్మనే ఆహ్వానించింది. అన్నపూర్ణమ్మ గారెంతో సంతోషించారు శారదను చూసి. హరికృష్ణ సంగతి తెలిసికొని జాలి పడిందామె హృదయం.
    రాజు, హరికృష్ణ తో కలిసి బజారుకు వెళ్ళాడు. శారద తనకో స్నేహితురాలి పెళ్లి కి పిలుపు రావడం వలన ఏలూరు రాగలిగానని చెప్పింది.
    ఆ సాయంత్రం రాజూ, హరికృష్ణ కలిసి సినీమా చూడబోయారు. శారదా, అనూరాధ లను కూడా రమ్మన్నారు. హరికృష్ణ కానీ అనూరాదే రాలేనని తప్పించు కుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS