Previous Page Next Page 
వంశాంకురం పేజి 8


    "ఊర్వశీ.....ఊర్వశీ ...ఈ వీధిలోకి ఆ మహాతల్లి ఏమంటూ వచ్చిందో , పెద్ద బెరాలన్నీ ఆటే వెళ్తాయి. 'ఆమె మాటలు విన్న ఆనంద్ మనస్సు చివుక్కుమంది. పాపం రసికులకు ఆనందాన్ని పంచి ఇచ్చే స్త్రీలు , ఆనందంగా ఉంటారా, లేదు. పొట్ట పోషించుకునే మార్గము. అతని హృదయము కరిగిపోయింది. జేబులో నుంచి పాకెట్ తీశాడు. పది రూపాయల నోటు అందుకుని ఆమె చేతిలో పెట్టాడు. ఆమె కళ్ళు తృప్తిగా మెరిశాయి.
    "ధర్మ దాతలు బాబుగారు. నా బిడ్డకు రేపు మందిప్పిస్తాను. "వరహాలుకు మేము లంచాలు పెట్టలేము. ఇక్కడ కేవ్వరిని పిలుచుకు రాడు. మరోసారి వచ్చినప్పుడు మీరే రండి బాబూ. డబ్బు ఇవ్వ వద్దులే. 'ఆనంద్ ఆగిపోయాడు. "భగవాన్ నీ సృష్టిలో అందరూ సమానమే కాదా ఇంట నికృష్టపు బ్రతుకు వారికెందుకు ప్రసాదించావు? కూతురు జబ్బుగా వుంటే, కన్నతల్లి ముఖానికి సంతోషాన్ని పులుముకొని విటుల నాహ్వానించాలా? యెంత దయనీయమైన విధి!"
    "అక్కడే ఆగిపోయారేం బాబుగారూ! ఈ వగలాడి నిలబెట్టి తన సోది మొదలు పెట్టిందేమిటి?" కొంచెం దూరము వెళ్ళి తిరిగి చూశాడు వరహాలు. ఆనంద్ త్వరగా అటు వెళ్ళాడు. "పాపమూ అమ్మాయికి జబ్బుటగా?"
    "దానికి జబ్బు లేని దెప్పుడటా? ప్రభుత్వ ఆస్పత్రి లో పారవేయ్యవే పీడా పోతుందని చెబితే వింటుందా? దాన్ని చదివించి పంతులమ్మను చేస్తుందట....'ఆగిపోయాడు. ఆనంద్ అటు చూచాడు. ఒక కారు ఇంటి ముందు ఆగి ఉంది. "వెనుక వైపు దారి వెడల్పు , కారులో వచ్చినట్టున్నారు. మీరు అనవసరంగా ఆలస్యము చేశారు బాబూ."
    "ఇప్పుడేమయింది?"
    "అదిగో ఊర్వశి ఇంటిముందు కారుంది. రేపు కాస్త పెందలాడే బయలుదేరండి. ' వరహాలు చెబుతుండగానే కారు కదిలిపోయింది.
    "పదండి , బేరము కుదరనట్టుంది" ముందుకు సాగెడు.
    "యెంత తీసుకుంటుందేమిటి?"
    "లెక్క లేదు. బాబు అందుకే మీకారు దూరము పెట్టించాను. కారు వారిని మొదటే చూస్తె ముసలి చంప , ఆకాశాన్నంటే ధరలు చెబుతుంది. ఊర్వశి చాలా మంచిది. మీరే చూస్తారుగా!" ఇరువురూ వెళ్ళి గుమ్మము ముందు నిల్చున్నారు. సన్నని తెరలో నుండి, లైటు వెలుతురులో లోపలవారు కనిపిస్తున్నారు. అంతా యువకులే అర్ధ నగ్నంగా ఉన్నారు. అక్కడే నిల్చున్నా పురుషులతో చవకరమైన డాన్స్ చేస్తున్నారు. తమకు జతగాడు లేనివారు చప్పట్లు కొడుతూ , ఏదో పాట పాడుతున్నారు. వయసు మళ్ళినావిడ ఓ మూల కూర్చుని తన యిష్టము వచ్చిన రీతిని హర్మోనియము వాయిస్తుంది. మరో దిక్కు, ముసలిదైన , సన్నని నైలాన్ దుస్తులతో అలంకరించుకుని, ఆకులూ వక్కలూ ముందు పెట్టుకుని సోఫా లాంటి పాత కుర్చీ లో కూర్చుంది. వరహాలు తేర తొలగించగానే, అందరూ యెక్కడి వారక్కడ ఆగిపోయారు.
    "ఏం వరహాలు..." అని ఏదో అడగబోయిన ముసలమ్మ , వెనకాల నిలబడిన ఆనంద్ ను చూచి ఆత్రంగా లేచింది.
    "రండి...రండి గులాబీ, చెంపా , మందారా అలా చూస్తారేమే బాబుగారికి కుర్చీ వేయండి." యువతులంతా నలుమూలలా చెల్లా చెదురుగా పరిగెత్తారు. ఒకమ్మాయి కుర్చీ తెచ్చి వేసింది. అతని ప్రమేయం లేకుండానే మరో ఇరువురు యువతులు అతన్ని చెయ్యి బట్టి తెచ్చి కూర్చోబెట్టారు. ఆనంద్ పురుషుల వంక చూశాడు. వారందరూ మ్రింగివేయాలన్నట్టు ఆనంద్ వంక చూడసాగేరు. ముసలమ్మా తలాడించింది. నల్గురు పురుషులూ తమ ప్రియురాండ్ర వెంట చుట్టూ పక్కల ఉన్న గదిలోకి తప్పుకున్నారు.
    "చెప్పండి బాబూ.' అతి వినయంగా చేతులు కట్టుకుని అడిగింది.
    "చాలు నీ వేషాలు చెప్పడాని కేముంది బాబుగారు, ఊర్వశి కోసము వచ్చారు." వరహాలు కట్టే విరిచినట్టు మాట్లాడినాడు.
    'ఊర్వశీ ఈరోజు యెందుకో కోపంగా ఉంది. మీకు ఎదురయి ఉంటారు. అతను లక్షాధికారి.....
    "ఇక్కడ బిక్షాదికార్లు యెవరూ లేరు. నీ వేషాలు కట్టిపెట్టి బాబుగార్కి కావలసిన ఏర్పాట్లు చెయ్యి. డబ్బు కళ్ళ చూడనిదే కదలదు బాబూ. ఓ యాభై రూపాయలు దాని ముఖాన పారెయ్యండి. వరహాలు చెప్పినట్టే యాభై రూపాయలు అతని కిచ్చాడు. పది తానుంచుకుని నలభై ముసలమ్మ కిచ్చాడు. వరహాలు అంత ఆప్యాయంగా యెందుకు పిలిచాడో అర్ధం అయింది.
    "నీ ఆశ కూల, నా దగ్గర పది కొట్టావు. బాబుగారి వద్ద యెంత తీసుకుంటావురా!" తిట్టుకుంటూ పాతకాలపు మెడ మెట్లు ఎక్కింది. మరో పది నిముషాలలో క్రిందికి దిగి వచ్చింది.
    "రండి బాబుగారూ...." ఆమె వెంట పైకి వెళ్ళాడు. గదిలో అడుగు పెడుతుంటే అతనిలోని సంస్కారము మేల్కొన్నది. తను ఏం చేస్తున్నాడు? వెంటనే వెను తిరగబోయాడు. కిటికీలో నుండి వచ్చిన గాలి అతని శరీరము ను తాకి గిలిగింతలు పెట్టసాగినది. వస్తూ సువాసనలు మోసుకువచ్చింది.
    "రండి బాబూ...." ముసలమ్మా హెచ్చరించినది. గదిలో అడుగు పెట్టాడు. మందమైన నీలిరంగు బల్బు వెలుగుతుంది. మెత్తని తివాచీలు పరిచి ఉన్నాయి. అందమైన అధునాతనమైన సోఫా సెట్టు . ఒకమూలకు అందమైన పూల కుండి నిండుగా తాజా పూలున్నాయి. మరో మూలకు గ్లాసులో ప్లాస్టిక్ పూలున్నాయి. పార్టీషన్ లా గదిలో తెర అడ్డుగా వుంది. అస్పష్టంగా తెర లోపల పందిరి మంచము . మరో దిక్కున డ్రస్సింగ్ టేబుల్ ముందు కూర్చున్న ఆకారము కనిపించాయి. వరహాలు ఊరించిన ఊర్వశి ఆమె నేం కాబోలు....
    "బాబుగారి కళ్ళు అటు తిరిగాయి....వెకిలిగా నవ్వింది. వృద్దురాలు. "మీరు కూర్చుని ఉండండి...వస్తుంది." ఆనంద్ ఒక కుర్చీలో కూర్చుని, మరో సిగరెట్టు వెలిగించాడు. అతని ముందు ఒక ట్రేలో పానీయాలు తెచ్చి పెట్టింది.
    "వాటి బిల్లు వేరుగా ఉంటుంది. ఇక్కడ దొరకవు. హైదరాబాద్ నుండి మీలాంటి వారి కోసం దొంగ చాటుగా తెప్పిస్తాము...." చేతులు నులుముకున్నది. ఇక్కడికి వచ్చే రసికులు మధువును కూడా అస్వాదిస్తారన్నమాట. తన కలవాటు లేకపోయినా, అక్కడి ఆచారము ననుసరించి త్రాగాలి కాబోలు , ఒక సీసాలోని పానీయము గ్లాసు లోకి ఒంపి , నోటి దగ్గర పెట్టుకున్నాడు. చేదుగా ఉంది, అతని నాలుక తెగిపోయినట్టు ఫీలయ్యాడు.
    "మీరు పరధ్యానము మనుష్యుల్లా ఉన్నారే. అందులో సోడా కలుపుకుంటే రుచి వస్తుంది." ముసలిదల్లా నిల్చుండటము మహా చికాకుగా ఉంది. అతనికి ఏకాంతము కావాలని పించింది.
    "నువ్విక వెళ్ళవచ్చు. నాకు కావలసినదేదో నేను తీసుకో గలను." కరుకుగా అన్నాడు. అలాంటి విదిలింపులకు అలవాటు పడిన ఆ వనిత బాధపడలేదు.
    "దయచేసి బిల్లు చెల్లిస్తే .......నసిగింది.
    "యెంత?"
    "పాతిక రూపాయలు." వెంటనే పర్సు తీసి మూడు పదులు ఆమె ముఖాన కొట్టాడు. వేశ్యా గృహము, జూద గృహములలో ప్రవేశించిన పురుషుడు ఎందుకు పతనమవుతాడో అతనికి తెలిసి వచ్చింది. ముసలి వేశ్య సంతోషంగా ఏదో సినిమా పాట గొణుగుకుంటూ వెళ్ళిపోయింది.
    అతను ఊర్వశి కోసము వేచి యున్నాడు. తెర చాటు నుండి సన్నని నవ్వు వినిపించింది. తరువాత గాజుల గలగల వినిపించింది.
    "ఇలాంటి ప్రదేశానికి క్రొత్త వారులా ఉన్నారు మహాశయా? ఈసారి నవ్వు పెద్దగా వినిపించింది. ఆ కంఠం యెప్పుడో విన్నట్టు అనిపించింది. సిగరెట్టు యాష్ ట్రేలో వేసి, లేచి తెర వైపు చూచాడు. లీలగా కనిపించిన ఆకారము నిజంగా ఊర్వశి లాగే ఉంది. కవులు వర్ణించే   ఊర్వశే....."
    "అందరూ నన్ను క్రోత్తవాడని గుర్తు పట్టారు, నాలో క్రొత్తదనము కనుపించిందా." రెండడుగులు ముందుకు వేశాడు.
    క్రొత్త వారన్నందుకు అభిమానపడుతున్నారులా వుందే. మీ ప్రతి కదలిక క్రొత్త వారని తెలుపుతుంది. పాతవారెవ్వరూ అరగంట ముసలమ్మా తో తమ కాలము వృధా చేయరు. ఆమె వైపు డబ్బు పారేసి యధేచ్చగా పైకి వస్తారు. పైకి వచ్చి గృహిణి రాకకై వేచి యుండే గృహస్తులా , ఓపికగా కూర్చోరు. గది నలుమూలలా గాలిస్తారు....రండి." ఆమె తెరచాటు నుండి ఇవతలకు వచ్చింది. మొదట అతని దృష్టి ఆమె శరీరం పై పడింది. కళ్ళు మూసుకోవాలనుకున్నాడు. ఆమె బట్టలు ధరించిందనే కంటే నగ్నంగా ఉందనుకోవడమే మేలు. మరుక్షణమే నవ్వుకున్నాడు. తాను వచ్చిందే ఆమె శరీరము కోసము. ఆమె ముందుకు వచ్చి అతని రెండు చేతులూ చెంపలకు రాసుకుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS