కొంతసేపు పెట్టిలోని వాళ్ళందరూ ఉదయకాలపు మత్తులో అట్టే మాట్లాడకుండా కూర్చుండి పోయేరు- పిల్లలిద్దరూ కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తూ ఆనందిస్తుంటే అదే సమయమను కుని తాము తెచ్చుకున్న వారపత్రికలను తిరగవేసేరు కాసేపు కళ్యాణి, కాంతారావు.
పత్రికలలో సినిమా బొమ్మలు చూస్తుంటే తాము సినిమా చూసిచాలా రోజులయిందనే సంగతి జ్ఞాపకం వచ్చింది కళ్యాణి కి. .' ఈ ప్రయాణం లో మద్రాసు లో కాని, బెంగుళూరు లో గాని వో సినిమా చూడాలి' అనుకుంది.
'తిరుపతి యింకా ఎన్ని మైళ్ళు ఉండండి?' అనడిగేడు కళ్ళజోడు ముసలాయన వారపత్రికను దీక్షగా చదువుతున్న కాంతారావు ఏకాగ్రతను భగ్నం చేస్తూ.
'బహుశా మరో వంద మైళ్ళు ఉండవచ్చు.' పుస్తకం లో నుండి తలెత్తకుండానే సమాధాన మిచ్చేడు కాంతారావు. భర్త అంత ఏకాగ్రంగా చదువుతున్నది ఏమిటా అని కొంచెం వంగి చూసింది పత్రికలోకి కళ్యాణి. అతను చదువుతున్నది పాఠకుల ప్రశ్నలకు ఎవరో మంచి గ్లామరున్న సినిమా తార జవాబులు!
చెప్పొద్దూ! అది చూడగానే చిన్నగా జెలసీ లాటి భావమేదో మెల్లగా కదిలింది ఆమెలో.
'ఇలాటి వెర్రి నాగమ్మలందరూ ఎగబడటం వల్లనే ఆ సినిమా తారలకు అంత టెక్కు! వీళ్ళ బలహీనత లను యిటు ప్రతికాదిపతులు గూడా ఉపయోగించుకుంటున్నారు.' అనుకుంది కసిగా.
'ఐనా ఎవర్ననీ ఏం లాభం లే! నానా టికీ ప్రతి రంగం లోనూ అసలైన విలువలు తమ అర్థాన్నే మార్చుకుంటున్నాయి. ఈ కాలంలో నిజంగా సినిమా తార లందరూ తమ నటనా చాతుర్యం తోనే పేరు తెచ్చుకుంటున్నారా? ఏ తార ఎక్కువగా తన శరీర భాగాలను ప్రేక్షకులకు చూపగలిగితే ఆ తారకు అంత గొప్ప విలువ ఉన్నట్లు లెక్క! ఆ తారకే 'సెక్సు శ్రీ' 'సౌందర్య శ్రీ' అంటూ పేర్లు పెట్టి జనం వేలం వెర్రిగా ఆరాధిస్తారు. ప్రజలు సినిమాలకు వెళ్ళేది నీతి బోధలు వింటానికి కాదు, మెదడును పదును పెట్టు కుంటానికి కాదు. నాలుగైదు సెక్సు సీన్లు, మంచి బాణీలతో, వ్రాసిన రెండు మూడు పాటలు, వో గిన్నెడు కన్నీళ్లు ఉంటె చాలు - ఆ సినిమా ఆ బాలగోపాలాన్ని ఆనందింపజేసి రజతోత్సవం లేదా అధవా శతదినోత్సవం చేసుకున్నట్లే! వీళ్ళ అభిరుచులకు తగ్గట్టే ఆ సినిమాలు కూడా అలాగే తగలడుతున్నాయ్! ఈ ఘోరాలు చాలక యింకా చలనచిత్ర రంగంలో 'ముద్దును' కూడా ప్రవేశ పెడుతున్నారట ఖర్మ! అసలు ముద్దు లోని మాధుర్యం ఎరిగిన ఏ మనిషైనా అలా పబ్లిగ్గా జరుగుతున్న ముద్దుల ప్రదర్శనను చూడటానికి పోగలడా? తాము వాస్తవిక జీవితంలో అనుభవించలేని అందాలను, మాధుర్యాన్ని పుస్తకాలలోనూ, సినిమాలలోనూ చూతానికి ప్రయత్నిస్తుంటారు. నూటికి తొంబై మంది మనుషులు . ఆ సంగతి తెలిసే ప్రొడ్యూసర్లు అందరూ వాళ్ళలోని బలహీనతలతో ఆటలాడి డబ్బు చేసుకుంటున్నారు. సినీ నిర్మాతలను మించిన గొప్ప మనస్త్వవేత్తలు , వ్యాపారస్తులు ఎవరున్నారీ లోకంలో?' అనుకుంది కళ్యాణి.
.jpg)
'ఇదో ఈ వార్ట విన్నావా? రాణి శ్రీ మళ్ళీ పెళ్ళి చేసుకుందిట-' అన్నాడు కాంతారావు ఉత్సాహంగా అదో గొప్ప న్యూస్ అయినట్లు.
'సినిమా తారలు అంతకంటే గొప్ప కార్యాలెం చేస్తార్లే!' అంటూ అంతవరకూ తాను సినిమా తారల మీద పెంచుకుంటూ వచ్చినకసిని కక్కేసింది కళ్యాణి.
'ఆహ! అలాగనకు సినిమా తారల్లోనూ మంచి వాళ్ళు ఉంటారు. వాళ్ళు మాత్రం మనుషులు కారు? చెడు అనేది ఏ రంగంలోనైనా ఉండేదే. ఒక్క సినిమా రంగంలోనే ఉంటుందని మనం ఎందు కనుకోవాలి?" అన్నాడు కాంతారావు.
'సర్లెండి. వాళ్ళను మీరేమీ వెనకేసుకు రానక్కర్లేదు." అంటూ మూతి తిప్పుకుంది కళ్యాణి.
"వాళ్ళు వ్యక్తిగతంగా ఎలాటి వాళ్ళయితే మనకెందుకు? మూడు గంటల పాటు మంచి వినోదాన్ని కొంతలో కొంత విజ్ఞానాన్ని కలిగించే సినీ పరిశ్రమకు, అందులోని వ్యక్తులకు సామాన్య ప్రేక్షకులమైన మనం చాలా ఋణపడి ఉన్నాం.' అన్నాడు కాంతారావు.
'వో పక్క ' వ్యక్తిగతంగా వాళ్ళేలాటి వాళ్ళైతేనేం ' అంటూనే, మళ్ళీ రాణీశ్రీ చేసుకున్న రెండో పెళ్ళి మీద అంత ఉత్సాహం చూపుతారెందుకు? సామాన్య ప్రేక్షకు లందరూ ఆ మూడు గంటల వినోద కలక్షేపంతో సంతృప్తి చెంది యివతలకు వస్తే లేందేముంది? ఆ తారల వ్యక్తిగత జీవితాల్లోని ఎత్తు పల్లాలను గురించి తెలుసుకుంటే గాని మీ కడుపు నిండదు. అందుకే తారల అంతరంగిక విషయాలను పతాక శీర్షికల్లో ప్రచురిస్తున్నారు పత్రికల వాళ్ళు.' అంది ఆవేశంగా కళ్యాణి.
కాంతారావు చిత్రంగా చూసేడు భార్య వంక.
కళ్యాణి యింకా చెప్పుకుపోతూనే ఉంది: 'ఈ మనుషుల్లో ఉన్న జబ్బే యిది. ఒక రచయిత గాని, నటుడు గాని తమ తమ రంగాల్లో ఉన్నతంగా ఉన్నంత మాత్రాన చాలదు ప్రజలకు. వాళ్ళ అంతరంగిక జీవితంలోకి తొంగి చూసి అందులో ఉన్న వెలితిని చూస్తె గాని సంతృప్తి చెందరు వాళ్ళు. అసలు 'స్కౌండల్' లో ఉన్న ఆకర్షణే అది. అందునా గొప్పవాళ్ళను గురించిన స్కౌండల్సు మరింత చేవులూరిస్తుంటాయ్, అలాటిది రోజూ వెండితెర మీద కనపడే తారల సంగతి వేరే చెప్పాలా?'
కాంతారావు వోసారి చుట్టుతా చూసి, తమ ధోరణి చూసి తాము దేబ్బాలడుకుంటున్నామని వాళ్ళంతా ఎక్కడ అనుమాన పడతారోనని భయపడి 'భోజనం వేళయినట్లుంది. వచ్చే స్టేషను లో తెప్పించుకుని తిందామా?' అన్నాడు మాట మారుస్తూ.
కళ్యాణి మాట్లాడలేదు. ఊపిరి పీల్చుకుంటానికి కాసేపు మౌనంగా ఉండిపోయింది.
కళ్యాణి కనుక వాదనలోకి దిగిందంటే దాని అంతు తెల్చుకొందే వదిలి పెట్టదు. పైగా వాదిస్తున్నంత సేపూ మనిషి మహా ఆవేశపడి పోతూ ఉంటుంది. అందుకే కాంతారావు కు ఆమెతో వాదన పెట్టుకొవాలంటే చచ్చే భయం. ఒక్కోప్పుడు ఆ వాదన తీవ్ర రూపం దాల్చిందంటే ఆ మనిషిని చేల్చి, చెండాడి , కొట్టినంత పని చేస్తుంది. పరిస్థితి విషమించక ముందే మీలాటి ఆమె దృష్టి ని మరో విషయం వైపుకు మూడు మళ్ళించి సదా తనను తాను రక్షించుకుంటుంటాడు కాంతారావు. మరో గంటలో పిల్లలకు పాలు పట్టి వాళ్ళిద్దరూ భోజనం చేసేరు.
తమ ప్రయాణం సాగుతున్న కొలదీ, తిరుపతి దగ్గర పడుతున్న కొలదీ రైలు పెట్టెలోని మనుషులందరికీ భక్తీ పారవశ్యం కూడా ఎక్కువవసాగింది.
'శనివారం ఉదయం 'సుప్రభాతం' చుదువుతుండగా ఆ వెంకటేశ్వరస్వామి వారి అందాన్ని చూసి తీరాలి. నిజంగా అప్పుడే నిద్రలేచి, స్నానం చేసి , నూతన వస్త్రాలను అలంకరించుకున్నట్లే, కనపడతాడు ఆ మరమాత్ముడు ' అంది చేతులు జోడిస్తూ ఒకామె.
ఆ మాటలు తనవంకే చూస్తూ అవటం వల్ల కల్యాణి చిరునవ్వు నవ్వి 'ఔను సుమండీ! ఏడు కొండల వాడి లీలలను మీలాటి వాళ్ళు చెప్తుంటే చాలాసార్లు విన్నాను. స్వయంగా చూడబోతున్నాను యిప్పుడు' అని ఎంతో వినయంగా సమాధానమిచ్చింది. లోపల మాత్రం 'పిచ్చి మొహం. ఆ భక్తీ పారవశ్యం లో ఏం మాట్లాడు తొందో కూడా యీవిడకు తెలియటం లేదు. లేకపోతె రాతి విగ్రహం నిద్రలేచి , స్నానం చేయట మేమిటి? ' అనుకుంది. 'ఈ మనుషులు కనీసం దైవాన్ని స్మరించేటప్పుడైనా తమని తాము మర్చిపోరు. ఈ విశాల విశ్వం లో అణు మాత్రమైన తమ ఉనికిని, యీ మహా శక్తి వంతమైన సృష్టి లో ఒక వ్యక్తీ గా తన నిస్సహాయతను గ్రహించి , తనలోని యీ మానసిక మైన బలహీనతను భయకన్ని మర్చిపోయే నిమిత్తం తన అజ్ఞానానికి , అశక్తతకు దేవుడనే పేరు పెట్టి తాత్కాలికంగా తృప్తి చెందదలచుకున్న యీ మానవుడు కనీసం ఆ ప్రయత్నం లో కూడా పూర్తిగా విజయాన్ని సాధించలేక పోతున్నాడు. తనలోని 'మకిలి' ని ఆ దేవుడికి కూడా అంటగడితే తప్ప తృప్తి కలగటం లేదు మనిషికి. తనలాగే దేవుడు అన్నం తిని, బట్టలు కట్టుకుని, భార్యా బిడ్డలతో సుఖించే సంసారి అన్న భావం సామాన్య మానవుడికి ఎంతో ఆనందాన్నిస్తుంది. ఇలాటి మానవుల అజ్ఞానం వల్లనే ఆ దేవుడన్న పదం ఏ ఉద్దేశ్యంతో సృష్టించబడిందో ఆ పరమార్ధం నశించి వ్యక్తీ అంటే యిష్టం లేదు కాంతారావుకు . ఇంకా చెప్పాలంటే భయం కూడాను. తనని ప్రేమిస్తూ, లాలిస్తూ కవ్విస్తూ, కోప్పడుతూ, ముద్దు ముద్దుగా తిడ్తూ మొట్టి కాయలు వేస్తుండే కళ్యాణి నే తను భరించగలడు ప్రేమించగలడు.
గంబీరంగా, మౌనంగా, తపస్వేని లా గోచరించే యిప్పటి కళ్యాణి ని చూడలేక పోతున్నాడతను.
ఆమె తనకు ఎక్కడ దూరమై పోతుందో నన్న భయంతో గట్టిగా ఆమె అరచేతిని తన గుప్పిటతో యిముడ్చుకుని 'కళ్యాణి ' అని కొంచెం హెచ్చు స్వరంతో పిలిచేడు.
