"ఎక్కడికి పంపుదామంటావ్?"
"ఎక్కడికైనా సరే. అలా తిరిగి రానివ్వండి. ఈ సంవత్సరం చదువు పాడయినా నష్టంలేదు. రమేశ్ మామూలు-మనిషి కావటమే ముఖ్యం."
సుశీలమ్మగారికీ ఆ మాటనిజమే ననిపించింది. భర్తతోనూ, కృష్ణమూర్తితోనూ చర్చించి కూడా ఏ నిర్ధారణకి రాలేక ఊరుకున్నారు.
శాంత పోయి మూడు నెలలు కాకుండానే, కృష్ణమూర్తికి మళ్ళీ సంబంధాలు రాసాగినాయి.
మొదటిమారు ఎవరో పిల్ల నివ్వటానికి వచ్చి నపుడు సుశీలమ్మగారు శాంతను తల్చుకుని వాళ్ళ ఎదుటనే కంట-నీరు పెట్టుకున్నారు.
కాని, చనిపోయిన భార్యను తల్చుకుంటూ ఇంకా చిన్నవయసులో ఉన్న కృష్ణమూర్తి ఎన్ని రోజులు సన్యాసిలా ఉండగలడు?
తన సంసారాన్ని కష్టంలేకుండా గడుపుకో గలిగిన సంపాదన ఉంది: చిన్నవయస్సు. వచ్చే పిల్ల సవతి తల్లి అవుతుందేమోనన్న భయమూ లేదు.
కృష్ణమూర్తి మళ్ళీ పెళ్ళిచేసుకోవటంలో తప్పేమిటి?
సుశీలమ్మగారు, రావుగారు ఆలోచించుకుని ఓ రోజు కృష్ణమూర్తి దగ్గర ఆ విషయాన్నెత్తారు.
"అబ్బాయ్! చిత్రదుర్గంనుండి ఎవరో వచ్చారు. వాళ్ళింట్లో పెళ్ళి కెదిగిన పిల్ల ఉందట. జాతకం అదీ సరిపోతే....."
కృష్ణమూర్తి అదిరిపడ్డాడు. ఇంత త్వరగా తన పెళ్ళి ప్రస్తావన వస్తుందని అనుకోలేదతడు. అలా అన్నంత మాత్రాన తన పెళ్ళి గురించి అతడు ఆలోచించనే లేదనికాదు. మళ్ళీ పెళ్ళిచేసుకోకుండా
కృష్ణ మూర్తి మళ్ళీ పెళ్ళిచేసుకోవటంలో తప్పేమిటి?
సుశీలమ్మగారు, రావుగారు ఆలోచించుకుని ఓ రోజు కృష్ణమూర్తి దగ్గర ఆ విషయాన్నెత్తారు.
"అబ్బాయ్! చిత్రదుర్గంనుండి ఎవరో వచ్చారు. వాళ్ళింట్లో పెళ్ళి కెదిగిన పిల్ల ఉందట. జాతకం అదీ సరిపోతే......"
కృష్ణమూర్తి అదిరిపడ్డాడు. ఇంత త్వరగా తన పెళ్ళి ప్రస్తావన వస్తుందని అనుకోలేదతడు. అలా అన్నంత మాత్రాన తన పెళ్ళి గురించి అతడు ఆలోచించనే లేదనికాదు. మళ్ళీ పెళ్ళిచేసుకోకుండా జీవితాంతం ఉండి పోలేదన్న సత్యం అతడికీ తెలుసు. కేవలం భావుకతకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే మనిషికాదు కృష్ణమూర్తి. మానవుడికి భావుకత అనేదే లేకపోతే జీవితం నరకం అనిపించే మాట నిజమే. కాని, లౌకికానికన్నా భావుకతకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే వయసు దాటిపోయిందతడికి.
తండ్రిమాటకు కృష్ణమూర్తి జవాబు చెప్పలేదు. కొడుకు మౌనాన్ని చూసి తండ్రి తన మాటలవల్ల అతడికి బాధ కలిగిందని అర్ధంచేసుకుని:
"ఎన్ని రోజులని ఇలా ఉండగలవు చెప్పు?" అన్నారు.
"ఇంత త్వరగా నా పెళ్ళి విషయం ఎత్తకండి. నాకింకా కొంతకాలం అవకాశం కావాలి."
"ఎప్పుడైనా పెళ్ళిచేసుకోవల్సిందేగా. ఎప్పుడో కావలసింది ఇప్పుడే అయితేనేం?"
"నిజమే; పెళ్ళిచేసుకోనని నేననను. కాని ఇపుడే వద్దంటున్నానంతే."
ఇంకా కొంచెం నొక్కిచెపితే ఒప్పుకుంటాడని తల్లిదండ్రులకు అనిపించింది. కాని, ఒక్కరోజే ఇంకా బలవంతం చేయటం మంచిదికాదని ఊరుకున్నారు.
కృష్ణమూర్తి అప్పటికి తన పెళ్ళి విషయం మరిచిపోయాడు.
ఇది జరిగిన వారంలో ఇంకెవరో ఆడపిల్ల-తండ్రి వాళ్ళింటికి వచ్చారు. కాఫీ, ఫలహారాలయ్యాక వచ్చి నాయన శేషగిరి రావుగారితో :
"మా అమ్మాయికి ఇరవైనాలుగు ఏళ్ళు నిండాయి. మీరు ఆలోచించుకుని, మీ పెద్దబ్బాయికి మా అమ్మాయిని తప్పక చేసుకోవాలి" అంటున్నారు.
"చూద్దాం. మా అబ్బాయేమో ఇప్పుడే వద్దంటున్నాడు......."
ఈ మాటలన్నీ గదిలో కూర్చున్న రమేశుడి చెవిలో పడ్డాయి. అతడికి ప్రపంచమంతా గిర్రున తిరుగుతున్నట్లనిపించింది.
అన్నయ్యకు ఇంకో పెళ్ళి! అంటే తనకు ఇంకో వదిన!
ఈ జన్మలో ఇది సాధ్యమా! ఇప్పుడే వద్దు అంటే కొన్ని రోజులు పోయాక చేసుకుంటాడనేగా!
అదెలా సంభవం? ఇంకో స్త్రీని తను వదినగా స్వీకరించటం సాధ్యమయ్యే విషయమేనా?
రమేశుడి రక్తం పొంగింది. గబుక్కున లేచిబయటకు వచ్చి ఆయనముందు నిల్చుని ఆవేశంగా:
"వదిన రావాలని ఎన్ని రోజులుగా కోరుకున్నారు మీరు? తను ఎప్పుడు చనిపోతుందానని కాచుక్కూర్చున్నారా? వదిన చనిపోవాలని దేవుడికి మొక్కుకున్నారా మీరు?"
తండ్రి కొడుకుని వారించడానికి ప్రయత్నించి విఫలులయ్యారు.
"వెళ్ళిపొండి, మళ్ళీ మా గడప తొక్కకండి. వదిన చనిపోయి మూడు నెలలు కాలా అప్పుడే ఈ ఇంటిని పెళ్లింటిగా చేద్దామని వచ్చారా మీరు? మీ అమ్మాయికి ఎక్కడా సంబంధం దొరక్కపోతే, నూతిలో పడమనండి. అంతేగాని....." అంటూ తండ్రివైపుకు తిరిగి :
"నాన్నా! ఇకమీదట ఇలాంటివాళ్ళను ఇంట్లోకి అడుగుపెట్టనివ్వకండి. ఇలాంటివాళ్ళ ఉసుర తగిలే వదిన చనిపోయిందేమో!" అంటూనే గబ గబా వెళ్ళిపోయాడు.
ఆ వచ్చినవారికి ఈ గడబిడంతా ఏమిటో అర్ధం కాలేదు. కాని తను రాక అతడి కయిష్టమన్న విషయం మాత్రం అర్ధమయింది...... రావుగారు:
"కొంచెం దుడుకు స్వభావం వాడిది. మీరేవీ' అనుకోకండి" అన్నారు.
"ఆ అబ్బాయెవరు?"
"మా చిన్నబ్బాయే."
"ఏమంటున్నారాయన?"
"ఏ, లేదులెండి. అతడి స్వభావం కొంచెం విచిత్రం; అంతే. కృష్ణమూర్తికి ఇప్పుడప్పుడే పెళ్ళి చేసుకునే అభిప్రాయం లేదు. మీ అడ్రసు ఇచ్చి వెళ్ళండి. చేసుకుంటానంటే మీకు కబురు చేస్తాను."
అలాగే అని అడ్రసు ఇచ్చి వెళ్ళిపోయారాయన.
రాత్రి పెద్దకొడుకుతో, జరిగిన విషయమంతా చెప్పారు రావుగారు:
"కృష్ణా! వీడు ఇయా మాట్లాడితే ఎలా? సంసారామన్న తర్వాత నలుగురూ వస్తారు; వెడతారు. నోటి కొచ్సినట్లు మాట్లాడితే బావుంటుందా? వచ్చేవాళ్ళ తప్పు మాత్రం ఏముంది చెప్పు. నీకు పిల్లనిద్ధామని వచ్చారు అది విని రమేశ్ అనరాని మాట లన్నాడు. ఇదేమన్నా బావుంటుందా? ఈరోజు కాకపోతే రేపయినా నీ పెళ్ళి జరగాల్సిందేకదా?"
తండ్రి మాటల్లోని సత్యం అతడికి మాత్రం తెలియనిదా?
"పరీక్షక్కూడా వెళ్ళకుండా కూర్చున్నాడు. వాడికి మాత్రం ఏం తోస్తుంది చెప్పు. కాంతరాజ్ అన్నాడు: 'కొద్ది రోజులు వేరే ఊరు వెళ్ళివస్తే బావుంటుం'దని. నాకూ అదే మంచిదనిపిస్తోంది" అన్నారు సుశీలమ్మగారు.
"ఎక్కడికి పంపుదామంటావ్? ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడికే కదా రావాలి?" అన్నారు శేషగిరిరావుగారు.
"నిజమే; కాని కొన్ని రోజులయినా మార్పు ఉంటే, తేరుకుంటాడేమో."
అంతవరకూ మౌనంగా కూర్చున్న కృష్ణ మూర్తి :
"నిజమేనమ్మా. ఈ వాతావరణంనుండి కొంచెం దూరం పోతేనైనా, కాస్త మామూలు మనిషిగా కాగలడేమో! అన్నట్లు బొంబాయి వెడితే వీలు?" అన్నాడు.
"అక్కడెక్కడుంటాడు?"
"మన శేషగిరి ఉన్నాడుగా అమ్మా! రేపే వివరంగా ఉత్తరం రాస్తాను వాడికి. కొద్ది రోజుల పాటైనా అలా వెళ్ళి రానీ. కొత్త చోటు, కొత్త మనష్యుల మధ్య పాత దుఃఖాన్ని విస్మరించవచ్చు."
"అలాగే కానీ: కాని, రమేశుడివల్ల శేషగిరి కేమైనా కష్టం కలిగేటట్టయితే మాత్రం వద్దు" అన్నారు శేషగిరిరావుగారు.
"కష్టమేమిటి? అలా అనుకునే స్వభావం కాదు వాడిది. రోజూ తనతోబాటు 'క్లినిక్' కు తీసుకుని వెడితే. అదీ ఓ విధంగా మంచిదే అవుతుంది."
ఆరోజు రాత్రి పన్నెండు గంటలకు ఇంటికి వచ్చాడు రమేశ్. ఇంట్లోనివారంతా ఆ వచ్చిన కొత్త మనిషితో కలిసి, తఃనమీద గూడుపుఠాణి జరుపుతున్న శత్రువులా అన్నట్టు అందరివైపూ చురచురా చూసి తన గదిలోకి వెళ్ళి దభేలున తలుపు వేసేసుకున్నాడు.
"భోజనానికి రారా" అన్నాడు సుశీలమ్మగారు.
"అక్కర్లేదు" తలుపు తెరవకుండానే సమాధానం వచ్చింది.
రమేశుడిని ఎలాగైనా ఆ వాతావరణంనుండీ తప్పించి వేరే చోటికి పంపాలని ఇంట్లో అందరూ నిశ్చయించారు. ఆ విషయం శేషగిరి నుండి జవాబు వచ్చాకనే చెప్పవచ్చునని ఊరుకున్నారు.
కృష్ణమూర్తి-ఉత్తరం చూసుకుని శేషగిరి "రమేష్ ని తప్పకుండా పంపు. నువ్వేం బెంగపెట్టుకోకు. ముందుగా ఏ ట్రైనులో వచ్చేది తెలిపితే స్టేషనుకు వస్తాము" అని రాశాడు.
కృష్ణమూర్తి తల్లిదండ్రులతో ఈ విషయం చెప్పాడు. సాయంకాలం తమ్ముడిని:
"రమేశ్! నాలుగు రోజులపాటు ఎక్కడికయినా వెళ్ళి వస్తావుట్రా. నీకూ ఇంట్లో ఏమీ తోచనట్లుంది" అని అడిగాడు.
"ఎక్కడికి వెళ్ళమంటావ్? ..... నే నెక్కడికీ వెళ్ళను. ఇక్కడే ఉంటాను.
"అలా కాదు, నీ వెప్పుడు మాకు కావాలి. మద్రాసు, బొంబాయి-ఎక్కడికైనా సరే; కొద్ది రోజులు వెళ్ళి రా. మనస్సు కాస్త కుదుటబడుతుంది. ఈమారు పరీక్ష పోయిందని బెంగెట్టుకోకు. వచ్చే సంవత్సరం చదువుదు గాని. నువ్వు సంతోషంగా ఉండటమే మాకు కావలసిందీనూ."
ఏం బదులు చెపుతాడా అని కృష్ణమూర్తి ఎదురుచూస్తున్నాడు. కాని, రమేష్ మాట్లాడకుండా, అక్కడినుండి వెళ్ళిపోయాడు. రెండు రోజులు కృష్ణమూర్తి తమ్ముడిని కదిలించలేదు. మళ్ళీ మూడోరోజున.
"ఏమని నిశ్చయించుకున్నావ్?" అని అడిగాడు.
"నే నెక్కడికీ వెళ్ళను" ముక్తసరిగా జవాబిచ్చాడు రమేశ్.
"కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళి వస్తే బావుంటుంది."
"నేను మీకంత భారంగా ఉన్నానా ఏం?"
తమ్ముడి మొరటు మాటలకు కృష్ణమూర్తి మనస్సు చివుక్కుమంది. అన్నయ్య-మొహం నల్లబడటం చూసి, తను అంతమాట అనకుండా ఉండాల్సింది అనుకున్నాడు రమేశ్.
"నువ్వు మాకు భారమని నేను చెప్పలేదురా తమ్ముడూ! నీకు మనస్సేమీ బాగాలేదు. అందుకే జ్ఞాపకాలతో బాధపెట్టే ఈ ఇంటి వాతావరణాన్ని వదిలిపెట్టి అలా వెళ్ళి వస్తే మంచిదనిపించింది చెప్పాను; అంతే; ఇష్టంలేకపోతే వద్దులే." అని కృష్ణమూర్తి అక్కడినుండి వెళ్ళిపోయాడు.
రమేష్ రెండు రోజులు ఆలోచించి ఆఖరికి:
"అన్నయ్యా! నువ్వు చెప్పిందే నిజం. నాలుగు రోజులపాటు ఎటైనా తిరిగి వస్తాను" అన్నాడు.
"కృష్ణమూర్తి తమ్ముడిలోని మార్పుకు సంతోషించినా, దాన్ని పైకి కనబడనీయకు:
"అలాగే! ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావ్?" అని అడిగాడు.
"నా కెక్కడికి వెళ్ళాలనే ఊహ కూడా లేదు. నువ్వే చెప్పు."
"నన్నడిగితే బొంబాయి వెళ్ళటం మంచిది. అక్కడ నా స్నేహితుడు శేషగిరి ఉన్నాడు. నీకూ తెలుసుగా. వాళ్ళింట్లో ఉండవచ్చు. అతనూ ఒక్కడే కనుక నీకూ బాగా కాలక్షేపం అవుతుందని నా అభిప్రాయం. నువ్వూ ఆలోచించుకో. నీకు ఇష్టమైతేనే అక్కడికి వెళ్ళు" అని ముగించాడు కృష్ణమూర్తి.
రమేష్ బొంబాయి వెళ్ళటమే నిశ్చయమయింది. కాని అతడు రైలు ఎక్కే వరకూ ఎవరికీ నమ్మకంలేదు. క్షణక్షణానికి మనసు మారుతూ ఉంటుంది. చివరి క్షణంలో "నేను వెళ్ళను" అంటే కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. అదే ఆరాటపడుతున్నారు అందరూ. '
కృష్ణమూర్తీ, శేషగిరిరావుగారూ స్టేషనుకు వెళ్ళి రైలెక్కించా రతనిని.
"డబ్బు కావాలంటే రాయి. సంకోచపడకు" అన్నాడు కృష్ణమూర్తి.
"రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త. అక్కడ చాలా రద్దీగా ఉంటుందిట."
రైలు వెళ్ళాక, "ఇక తిరిగి వచ్చేటప్పటికి రమేశ్ మామూలు మనిషి అయితే చాలు" అనుకుంటూ, ఇంటిమొహం పట్టారు తండ్రీ కొడుకులు.
రమేశ్ ఇంత దూరపు ప్రయాణాన్ని చేయటం ఇదే మొదటిమారు. మెడికల్ కాలేజి చదువు ఇలాంటి ప్రయాణాలను చేసే అవకాశాన్ని ఇవ్వలేదతడికి. దసరా, క్రిస్టమస్ శలవుల్లో స్నేహితులతో కలిసి జోగ్, శివసముద్రం-ఇలాంటి ప్రదేశాలకు మాత్రమే వెళ్ళి వచ్చాడు.
నిరాశా, నిస్పృహలు మూర్తీభవించినవాడిలా కనిపిస్తూ, ఒంటరిగా దిగులుగా ప్రయాణిస్తున్న రమేశుడి రూపం తోటి ప్రయాణికుల్లోని ఓ వృద్ధుడిని ఆకర్షించింది.
ఆయన కాఫీ దొరికే ప్రతి స్టేషనులోనూ కాఫీ త్రాగి:
"మైసూరు-కాఫీయే కాఫీ; బొంబాయి వెడితే ఇహ ఇంట్లోవాళ్ళు చేసే "చా" యే గతి. కాని, చూశారూ! తెల్లవారి లేవగానే ఓ కప్పు మైసూరు-కాఫీ తాగందే ఉండలేను నేను. కాఫీ కోసం పయాన్ నుండి దాదర్ వెళ్ళి ఉడుపి హోటల్లో కాఫీ త్రాగి వస్తాను. తరువాతనే నా బిజినెస్ ప్రారంభం...." అనేవారు.
"ఏం బిజినెస్సూ" అని రమేశ్ అడగాలని ఆయన వాంఛ.
కాని, రమేశ్ ఏమాత్రం కుతూహలం కనపర్చలేదు. ఇంకో ప్రయాణికుడు అడిగాడు:
