
(రాష్ట్రాలకు రాజ్యాంగం ఇచ్చిన అధికారాలపై కేంద్రం పెత్తనం సహించబోమని ఎలుగెత్తిన ఎన్టీఆర్ , దేశ సమగ్రతకు ఏమాత్రం భంగం కలిగే ప్రమాదం ఉన్నా, అందరి కంటే ముందు వరుసలో నిలబడి తన చివరి రక్తపు బొట్టు దేశం కోసం ధారపోస్తామని ప్రకటించారు )
(పార్టీ ఆవిర్భావం నుంచి అన్ని మతాలను, ప్రాంతాలను
సంప్రదాయాలను సమానంగా గౌరవించే విధానాన్ని తెలుగుదేశం
అవలంభించింది .)
ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించినా అణువణువునా జాతీయతను నింపుకున్న పార్టీ తెలుగుదేశం. అందుకే ఎన్టీఆర్ ని సంకుచిత ప్రాంతీయ తత్వానికి ప్రతినిధిగా చూపాలన్న రాజకీయ ప్రత్యర్ధుల యత్నాలన్నీ విఫలమైనాయి. రాష్ట్రాలను స్వతంత్ర ప్రతిపత్తి కావాలని నిరంతరం పోరాటం చేసినా, అది భారత రాజ్యాంగ సమాఖ్య స్పూర్తికి అనుగుణంగా ఉండాలని అయన అభిలషించారు. భిన్న మతాలు, ఆచారాలు , సంప్రదాయాలు, వేష భాషలకు ఆలవాలమైన దేశం ఒక్కటిగా ఉండాలంటే రాజకీయ, సాంస్కృతిక బహుళత్వాన్ని ఆదరించాలన్నది తెలుగుదేశం సిద్దాంతం.
రాష్ట్రాలకు రాజ్యాంగం ఇచ్చిన అధికారాలపై కేంద్ర పెత్తనం సహించబోమని ఎలుగెత్తిన ఎన్టీఆర్ , దేశ సమగ్రత, ఐక్యత విషయంలో తెలుగుదేశం ఎటువంటి రాజీ పడదని పలుమార్లు స్పష్టం చేశారు. దేశ సమగ్రతను ఏమాత్రం భంగం కలిగే ప్రమాదం ఉన్నా అందరికంటే ముందు వరుసలో నిలబడి తన చివరి రక్తపు బొట్టు వరకు దేశం కోసం ధారా పోస్తామని అయన 1984 లో కలకత్తా ప్రతిపక్షాల సమావేశంలో ప్రకటించారు. దేశ విచ్చిన్నాన్ని కోరుకునే శక్తులను అంతం చేయడానికి తామెప్పుడూ అండగా నిలబడతామని చెప్పారు.
అందుకే ప్రాంతీయ పార్టీ నేతగా రాజకీయాల్లోకి ప్రవేశించినా, 1980 వ దశకంలో జాతీయ స్థాయిలో ప్రభావశీల నాయకుడిగా పాత్ర పోషించగలిగారు. జాతీయతాభావాన్ని నింపుకున్న నాయకుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు లభించినందువల్లే నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా గౌరవాన్ని అందుకున్నారు. అయన అపార దేశ భక్తిని ఇందిరాగాంధీ నుంచి ఎల్.కె అద్వాని వరకు జాతీయ నాయకులు ప్రశంశించారు.
1984 లో ఎన్టీఆర్ అమెరికా పర్యటన సందర్భంలో ప్రతిపక్ష పాలనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ పట్ల ఇందిరాగాంధీ ప్రభుత్వం అవలంబిస్తున్న వివక్షపూరిత వైఖరి పై ఇండియా టుడే అడిగిన ప్రశ్నకు ఎన్టీఆర్ చెప్పిన సమాధానం దేశ ప్రతిష్ట పట్ల ఆయనకు ఉన్న గౌరవానికి నిదర్శనం. 'నేను న్యూయార్క్ లో ఉన్న విషయాన్ని మరిచిపోయాను . మా అంతర్గత విషయాల గురించి విదేశీ గడ్డ మీద చర్చించి దేశ గౌరవాన్ని దెబ్బ తీయలేను," అని అయన బదులిచ్చారు.
కాషాయ వస్త్రాలు ధరించి, హిందూ తాత్వికతను ఒంటబట్టించుకున్నా పరిపాలనలో నిజమైన లౌకిక విధానాన్ని అనుసరించారు ఎన్టీఆర్. పార్టీ ఆవిర్భావం నుంచి అన్ని మతాలను, సంప్రదాయాలను సమానంగా గౌరవించే విధానాన్ని తెలుగుదేశం అవలంభించింది. హైదరాబాద్ లో అంతవరకూ ఏటేటా సర్వసాధారణమైన మత కల్లోలాలను ఉక్కు పాదంతో అణచివేసిన ఘనత ఎన్టీఆర్ దే.

(నందమూరి తారక రామారావు రెక్కల కష్టం నుంచి తెలుగుదేశం
పుడితే, నారా చంద్రబాబు నాయుడి చెమట చుక్కల నుంచి ఆ పార్టీ
బలమైన రాజకీయ శక్తిగా రూపుదిద్దుకుంది.)
విశ్వ వేదికపై తెలుగు సంతకం
నందమూరి తారక రామారావు రెక్కల కష్టం నుంచి తెలుగు దేశం పుడితే, నారా చంద్రబాబు నాయుడి చెమట చుక్కల నుంచి ఆ పార్టీ బలమైన రాజకీయ శక్తిగా రూపుదిద్దుకుంది. చిన్న వయసులోనే ఎమ్మెల్యే గా, మంత్రిగా పనిచేసిన అనుభవంతో 1983 నుంచి పార్టీ నిర్మాణానికి అయన అవిరళం కృషి చేశారు. నలభై ఐదేళ్ళ పిన్న వయసులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాధసారధిగా బాధ్యతలు చేపట్టి , తెలుగుదేశాన్ని సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా చంద్రబాబు తీర్చిదిద్దారు. భారతదేశ రాజాకీయ నాయకుల్లో ఒక కొత్త తరానికి ప్రతినిధిగా గుర్తింపు పొందారు.
అయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన 1996-2004 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో దూసుకుపోయింది. దేశంలో ప్రవేశపెట్టిన ఆర్ధిక సంస్కరణలను సంపూర్ణంగా అమలు చేయడం ద్వారా సరికొత్త అవకాశాలను చేజిక్కించుకొని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అయన ప్రపంచపటంలో నిలిపారు. సగటు రాజకీయ నాయకుడి మాదిరిగా కాకుండా, ప్రజల ఉజ్వల భవిష్యత్తు కు దారులు వేసే రాజనీతిజ్ఞుడిగా వ్యవహరించారు. దేశీయంగానే కాదు, అంతర్జాతీయంగా కూడా నారా చంద్రబాబు నాయుడి పేరు ప్రగతి శీల పాలనకు మారుపేరుగా నిలిచింది.
కంప్యూటర్లు అంటే అవగాహన లేని కాలంలోనే ప్రపంచం ఎటువైపు ప్రయాణిస్తుందో ముందే గ్రహించి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం ప్రాధాన్యాన్ని గుర్తించి, హైదరాబాదు ను ఐటి కేంద్రంగా మలచడానికి చంద్రబాబు చేసిన కృషి చరిత్రలో నిలిచి పోయింది. అయన తన స్వహస్తాలతో హైదరాబాద్ ను ఆధునిక నగరంగా, ఆదాయ వనరుగా పునర్నిర్మించారు. హైటెక్ సిటితో మొదలైన ప్రస్థానం హైదరాబాద్ ను దేశంలోనే ప్రముఖ సాప్ట్ వేర్ హబ్ గా మార్చేవరకు ఆగలేదు. మైక్రోసాఫ్ట్ వంటి అగ్రశేణి సంపెనీతో పాటు అమెరికా అధ్యక్షుడిని కూడా ఆంధ్రప్రదేశ్ కు రప్పించిన అయన సామర్ధ్యానికి అచ్చెరువందని వారు లేరు. వ్యవసాయక ప్రధాన రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ను ఐటి వంటి సేవారంగాలు, ఫార్మా వంటి పారిశ్రామిక రంగాలకు కేంద్రంగా రూపొందించడం లో
(గాయపడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి,
రాజధాని అనబడే పాలనా కేంద్రం లేదు. యంత్రాంగం లేదు. జరుగుబాటు
లేదు. ఆదాయ నవరులు లేవు. ఆస్తులు లేవు. ఆప్తమిత్రులు లేరు.)
చంద్రబాబు నాయుడు పాత్రను శ్లాఘిస్తూ న్యూయార్క్ టైమ్స్ వంటి అంతర్జాతీయ పత్రికలు వ్యాసాలు ప్రచురించాయి. ఐటి రంగాన్ని ప్రోత్సహించడం వల్ల రాష్ట్రానికి ఆదాయం పెరగడమే కాదు, కొన్ని తరాల తెలుగు ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. దేశంలో మరే రాష్ట్రం చేపట్టని రీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును ప్రణాళికాబద్దంగా తీర్చిదిద్దడానికి 1999 లోనే మేకేన్సీ కన్సల్టేంట్స్ సహకారంతో విజన్ 2020 డాక్యుమెంటుని తయారుచేసిన దూరదృష్టి నారా చంద్రబాబునాయుడిది. సాంకేతికత ద్వారా పారదర్శకతను తీసుకొచ్చి, పరిపాలనలో అవినీతిని నిర్మూలించడానికి సమర్ధంగా ప్రజలకు సేవలను అందించడానికి చంద్రబాబు పాలనలోనే బీజం పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి గా రికార్డు స్థాపించడమే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలబెట్టిన చరిత్ర కూడా ఆయనదే.
ఆ తరవాత పదేళ్ళ పాటు ప్రతిపక్షంలో తెలుగుదేశం అనేక అటుపోట్లను ఎదుర్కోన్నప్పటికి తన నిర్వహణాదక్షత , మొక్కపోనీ దీక్షతో అయన పార్టీని ముందుండి నడిపించారు. రాజకీయంగా ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా, తెలుగువారి సంక్షేమమే ధ్యేయంగా పనిచేశారు. 2014 లో మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టేనాటికి కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ అనాధ శిశువులా మిగిలింది. గాయపడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి, రాజధాని అనబడే పాలనా కేంద్రం లేదు. యంత్రాంగం లేదు. జరుగుబాటు లేదు. ఆదాయ నవరులు లేవు. ఆస్తులు లేవు. ఆప్తమిత్రులు లేరు.
అయినా చంద్రబాబు నేరవలేదు. సమకాలిక అవసరాలను సమర్ధంగా నిర్వహించగల నాయకుడిగా రాష్ట్ర పునర్మీర్మాణానికి అయన నడుం కట్టారు. కొత్త రాజధానికి పూనిక కావచ్చు. ఆదాయ వనరులని పెంచడానికి అవకాశాలని వెదకడం కావచ్చు , పెట్టుబడులని పెంచి ఉపాధి కల్పించాలన్న కాంక్ష కావచ్చు , వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్న పట్టుదల కావచ్చు , విద్యుత్ వెలుగులకు కరువు లేకుండా చేయాలన్న ఆత్రం కావచ్చు, ఎన్ని చేసినా సంక్షేమానికి పెద్ద పీట వేయాలన్న గ్రహింపు కావచ్చు, ఆధునికతకు ఆలవాలంగా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారాలన్న దీక్ష కావాచ్చు- ఐదేళ్ళ కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చూపిన చొరవ పడిన కాష్టం, సాదించిన ఫలితాలు సామాన్యమైనవి కావు.
ఐదేళ్ళ కాలంలో అవశేష ఆంధ్రప్రదేశ్ ని ఒక ఉత్తుంగ తరంగంగా చంద్రబాబు నాయుడు మార్చగలిగారు. రాజధానికి ఒక రూపు కల్పించారు. పాలనా యత్రాంగాన్ని గాడిలో పెట్టారు. పెట్టుబడులకు మార్గం ఏర్పరిచారు. పరిశ్రమలకు పెద్ద పీట వేశారు. ఆదరువు లేని రాయలసీమకు బాసటగా నిలిచారు. నిర్లక్ష్యపు నీడలో ఉన్న ఉత్తరాంధ్రకు కొత్త ఊపు తీసుకొచ్చారు. నిస్సత్తువ సోకిన కోస్తాను ఉరకలెత్తించారు. 2029
(పదేళ్ళపాటు ప్రతిపక్షంలో తెలుగుదేశం అనేక అటుపోట్లను ఎదుర్కొన్నప్పటికి
మొక్కవోని దీక్షతో అయన పార్టీని ముందుండి నడిపించారు. రాజకీయంగా
ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా, తెలుగువారి సంక్షేమమే ధ్యేయంగా పనిచేశారు.)

(ఐదేళ్ళ కాలంలో అవశేష ఆంధ్రప్రదేశ్ ని ఒక ఉత్తుంగ తరంగంగా చంద్రబాబు నాయుడు మార్చగలిగారు. రాజధానికి ఒక రూపు కల్పించారు. పాలనా యత్రాంగాన్ని గాడిలో పెట్టారు. పెట్టుబడులకు మార్గం ఏర్పరిచారు. పరిశ్రమలకు పెద్ద పీట వేశారు.)
వరకు రాష్ట్ర భవిస్యత్తు కు ప్రణాళికలు రచించి, తెలుగు ప్రజలకు మార్గనిర్దేశం చేశారు. తొమ్మిదేళ్ళు ఉమ్మడి రాష్ట్రానికి, ఐదేళ్ళు సవ్యాంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా , మరో పదేళ్ళ పాటు ప్రతిపక్ష నాయకుడిగా నారా చంద్రబాబు నాయుడు చేసిన సేవను ఈ చిరు సంకలనంలో సమగ్రంగా పొందుపరచడం అసాధ్యం. అయినా తెలుగు ప్రజల వికాసానికి అయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ చేసిన అపార సేవలను క్లుప్తంగా తెలుసుకుందాం.
