Previous Page Next Page 
మనసు పొరల్లో పేజి 8

 

    "ఏమేవ్! నేనేళుతున్నా, తలుపెసుకో!" అంటూ పక్కింటి వాళ్ళ క్కూడా వినబడేలా గట్టిగా అరిచి మాట్టాడుతున్న అతడి కేసి చిరాగ్గా చూసి టిఫిన్ డబ్బా అందించింది. "ఇదెందుకూ? అలవాటు లేని అవపోశనం ఆ డబ్బా గిబ్బా నా వల్ల కాదు. హాయిగా మా బండి వాడున్నాడు. వాడి బజ్జీలున్నాయి . వొస్తా! తలుపులు గట్టిగా వేసుకో! ఎవరైనా తలుపులు కొడితే వాడు దొంగ వెధవో దొర వెధవో తెలుసుకుని మరీ తలుపు తియ్యి. ఏ వెధవ కంటే ఆ వెధవకి తలుపు తీసి , మాట్లాడకు" అంటూ అప్పగింతల స్తోత్రం చదివేసి వెళ్ళిపోయాడు పానకాలు.
    అంత వరకు అదిమిపెట్టిన దుఃఖం కట్టలు తెంచుకుని ఏరులాగా పొంగు కొస్తే, తలుపు గడియ వేసి మంచం మీద పడుకుని వెక్కి వెక్కి ఏడ్చేసింది కౌసల్య.
    ఆ సాయంకాలమే సుధాకర్, రాదా కౌసల్యని చూద్దామని పళ్ళూ మిఠాయిలు అన్నీ పుచ్చుకుని వచ్చారు.
    "ఏమ్మా అలా ఉన్నావు? ఒంట్లో బాగులేదా?" అన్నాడు తలుపు తీసిన కౌసల్యని చూసి, లోపలికి అడుగు పెడుతూ సుధాకర్.
    "బాగానే వుందన్నాయ్యా. కొంచెం తలనొప్పిగా వుందంతే. పడుకున్నాను" అంది వొదిన గారి చేతులలోని పొట్లాల నందుకుంటూ. "అయితే కాలేజీకి పోలేదన్నమాట! ఇద్దరూ కాలేజీకి వెళ్ళిపోయి ఉంటారని ఇప్పుడు బయలుదేరాం మేం" అన్నాడు సుధాకర్.
    అప్పుడే లోపలి కొస్తున్న పానకాలు ఆ మాటలు విని, "మీ చెల్లాయి మీతో చెప్పనే లేదా బావగారూ?" అనడిగాడు సుధాకర్ ని చూసి.
    "ఏ విషయం?" అన్నాడు సుధాకర్ ఆశ్చర్యంగా.
    "తను కాలేజీ కెళ్ళాదట! ఎంతగానో చెప్పాను. ఇద్దరం ఒకే కాలేజీలో ఒకే క్లాసులో చదవటం నా కిష్టం లేదు,  అయినా ఆడపిల్లని పెళ్ళయి పోయింది, ఇక నేను చదవకపోయినా ఫరవాలేదు అంది అన్నాడు.
    అంత చక్కగా నీట్ గా అబద్దం అడేసిన పానకాలు కేసీ ఆశ్చర్యంగా చూసింది కౌసల్య. అతణ్ణి చూస్తున్న కొద్దీ ఆమెలో అసహ్యమూ, కోపమూ కూడా ముంచుకొస్తున్నాయి.
    పొద్దున్న వేసుకేళ్ళీన బట్టలు నలిగిపోయి, అసహ్యంగా ఉన్నాయి. ఏవో కాఫీ మరకలు పడి. బూట్ల నిండా ఎక్కడో బురదలో నడిచినట్లు మట్టంటూకుంది. జుట్టు గాలికి చెదిరిపోయి చిందరవందరగా ముఖాన్ని కప్పేస్తూ ఉంది. అతడికేసి అన్నయ్య కూడా అదోలా చూడడం గమనించిన కౌసల్య సిగ్గుతో తలవంచుకుంది. పానకాలు మాటలు నమ్మలేకపోయాడు సుధాకర్.
    "అవునా అమ్మా! నువ్వు పి.హెచ్.డి చేసి ప్రొఫెసర్ అవుతావని ఎంతో అనుకున్నాను. ఎందుకమ్మా ఇటువంటి నిర్ణయం తీసుకున్నావ్? చదువుకోవాలంటే నీ కెంతో ఇష్టం. నాకు తెలుసు మరి..."
    "ఆ నిర్ణయాన్ని ఇప్పుడు మార్చుకున్నానన్నయ్యా!" అంది తలెత్తకుండా . ఆ మాటలు నమ్మలేకపోయాడు సుధాకర్.
    రాధామ్మకు తెలుసు కౌసల్య అంతవరకు చెప్పినది అబద్దమే నని! ఇల్లు చూసే మిషతో లేచి లోపలి కెళ్ళింది. వెనకాలే కౌసల్య కూడా నడిచింది. "నిజం చెప్పు. అతడు నిన్ను కాలేజి మానేయ్యమన్నాడు కదూ! అందుకని పొద్దుటే నుంచీ ఏడుస్తూ కూర్చున్నావ్! అంతేనా కళ్ళతో చూసినట్లుగా చెబుతున్న వదిన కేసి చూసింది కౌసల్య. ఆమెలో అమ్మ రూపం కనిపించింది - కళ్ళు తుడుచుకుంటుంది.
    "అలా అని అన్నయ్యకు చెప్పకోదినా!" అంది చెంపల మీద జారబోతున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ.
    "పిచ్చిపిల్లా! నీకు చదువంటే ఎంత ఇష్టమో మీ అన్నయ్యకు తెలీదా? నువ్వు కాలీజీకి వెళ్ళనన్నావు అంటే అయన నమ్మొద్దూ? కౌసల్యా! ఎన్నిసార్లు అబద్దాలు చెప్పి ఆయనను ఎన్ని విషయాలు నమ్మిస్తాము? నాకు భయంగా ఉంది. నిజం నాతొ ఎందుకు చెప్పలేదు అని నన్ను నిలదీస్తే?" భయపడుతూ చెప్పింది రాధమ్మ.
    "నిజం , నీకు తెలుసునన్న విషయం అన్నయ్యకీ చెప్పవలసిన అవసరం ఏముంది? దానంతట అదే తెలుస్తే మనమెవ్వరం భాద్యులం కాదు" అంది కౌసల్య.
    "ఏమిటీ? వొదినా మరదళ్ళు రహస్యంగా మాట్లాడుకుంటున్నారు?" అంటూ అక్కడి కొచ్చాడు సుధాకర్. కౌసల్య గెడ్డం పట్టుకొని తలపై కెత్తి "నిన్ను కాలేజీకి వెళ్ళా వద్దన్నాడా?" అనడిగాడు కౌసల్య కళ్ళల్లోకి చూస్తూ. కౌసల్య ఖంగుతిన్నట్టు ఉలిక్కిపడింది. సమాధానం చెప్పేలోగా "మిఠాయి చాలా బాగుంది" అంటూ ప్యాకెట్ విప్పేసి నోటినిండా కుక్కుకున్న మైసూర్ పాక్ ముక్కలను మింగడానికి ప్రయత్నిస్తూ గబగబా గ్లాసుతో నీళ్ళు తాగేస్తూ అక్కడికి వచ్చాడు పానకాలు. అతను తినే ఆ విధానం చూస్తే కౌసల్య కు పరమ రోత. అయిదేళ్ళ పిల్లాడు కూడా అలా కిందా మీదా పోసుకుంటూ తినడు. అతనికేసి అసహ్యంతో చూసి, "ఉండన్నయ్యా కాఫీ పెడతాను" అంటూ లోపలి కెళ్ళింది కౌసల్య.
    "ఇప్పుడెందుకులేమ్మా. ఇంటి దగ్గర తాగే వస్తున్నాము" అన్నాడు సుధాకర్.
    'అయితే ఏంలే అన్నయ్యా కొద్దిగా తాగండి" అంది కౌసల్య.
    "కాఫీ ఎక్కువగా తాగడం మంచిది కాదు. ఒద్డంటున్నారుగా! ఎందుకు బలవంతం చేస్తావు?" అన్నాడు పానకాలు. కౌసల్యకు మనసు చివుక్కుమంది. వాళ్ళోద్దన్నా అతడు అడగవలసింది పోయి అలా మాట్లాడడం బాధ కలిగించింది. వంటింట్లోకి కెళ్ళాబోతున్నదల్లా మానేసి అన్నయ్య వెనకాలే నడిచింది.
    "వాళ్ళోద్దన్నారు కానీ, నాకొద్దని నేనలేదే కాఫీ" అన్నాడు పానకాలు.
    సుధాకర్ పానకాలునీ, కౌసల్యని మర్చి మార్చి చూసి, " అతనికి ఇవ్వమ్మా!" అన్నాడు.
    "రోజూ అతడు కాఫీ తాగడం లేదు. ఇవ్వాళ అందరూ వోద్దంటున్నా ఇతడు కావాలంటున్నాడు. కౌసల్య కి వొళ్ళు మండింది. ఇంతవరకు అన్నయ్య వదినలతో ఒక్క మాట మాట్లాడలేదు వాళ్ళొచ్చి అంతసేపైనా "ఛీ! ఛీ!" అనుకుంటూ లేచి వంటింట్లోకి వెళ్ళి కాఫీ పెట్టె పనిలో పడింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS