"మేము ఐదునిముషాల్లో వెళ్ళిపోతాం. కాకపోతే, మమ్మల్ని ఒక నిముషం చూసి వెడదామని. "ఊ, ఊ అంది భయంగా" వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. హమ్మయ్య" గడియారం ఇంకా పదినిముషాలు టైము వుందని చెప్పింది. శారద వీధివైపు చూస్తోంది.
బస్సుస్టాండులో ఆగటం ఆలస్యం రామం గబగబా ఆటో మాట్లాడుకున్నాడు. నారాయణ గూడా పోనీ అన్నాడు. పెట్టె ఆటోలో పెట్టి. ఆటో వేగంగా పరిగెత్తింది. సందుమొదటి కొచ్చేసరికి రామం ఆటోడ్రైవర్ భుజంపై చెయ్యి వేసాడు. "ఇటుకాదు, విద్యానగర్ పోనీ, వెనక్కి తిప్పు డ్రైవరు ఒక్కసెకను ఆగాడు, ఆటో విద్యానగర్ వైపు పరిగెత్తింది.
చిన్నడాబాముందు ఆగింది ఆటో 'ఎవరూ' -వెంకట్రామయ్య కళ్ళజోడు సరిచేసుకున్నాడు. 'నేనండీ రామాన్ని' - పెట్టె లోపల పెట్టాడు రామం.
రామం నాలుగేళ్ళు ఆయింట్లో అద్దెకున్నాడు. పెళ్ళి అయ్యాక నారాయణగూడాలో బస్ స్టాప్ దగ్గరున్న ఇంట్లోకి మారాడు. లోపల పనిలోవున్న లలిత ముందుగదిలో కూచున్న రామాన్ని చూసి ఆశ్చర్యపోయింది.
'ఊరినించి తిన్నగా ఇటే వచ్చేశావా' అంది ఆశ్చర్యంగా రామం వంకచూస్తూ 'అవును. రామం ముఖం పేపరులోనే వుంది. తనిక్కడ కెందుకొచ్చాడు ముందుగా. అసలు శారద ఎలా వుంది. ఏమిటి అక్కడి విశేషాలు కనుక్కోవాలి. అయితే, ఎలా మొదలు పెట్టాలో ఆలోచిస్తూ అటు ఇటు చూస్తున్నాడు.
'అమ్మ బాగుందా' అంది లలిత నిశ్శబ్ధాన్ని తప్పిస్తూ.
'ఆ' - రామం ముఖం పేపరులోనే - తను తప్పు చేశాడు - తనింటికి వెళ్ళాల్సింది -
"ఆ. ఏం లేదు. శారద ఎలా వుందో ముందునీ దగ్గరనుంచి విందామని" -- నెమ్మదిగా అన్నాడు.
శారద గురించి ఏం చెప్తుందో వినాలనే ఆతృత ఎక్కువైంది రామానికి శారద గురించి ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో, ఎలా చెప్పాలో, అయినా ఒక శ్రేయోభిలాషిగా తను చెప్తే తప్పేముంది. మనసులో మళ్ళీ మళ్ళీ అనుకుని, ధైర్యంగా నోరు విప్పింది లలిత.
"ఏం లేదు కానీ. ఈమధ్య శారదలో వస్తున్న మార్పు ఒక్కసారిగా నీకు షాక్ కలిగించవచ్చనే భయంకొద్దీ చెప్తున్నాను. అంటే, కొత్త స్నేహాలు కొత్త భావాలు దాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయనిపిస్తోంది. లలిత చెప్తున్న మాటలేవీ అర్ధంకాలేహ్డు రామానికీ.
అబ్బ - విసిగించకు - ఉన్న విషయం వున్నట్టు చెప్పేయి - రామం బతిమాలుతున్నట్టే అన్నాడు.
"నీరజ అని నాకు శారదకి క్లాస్ మేట్. తర్వాత శారద ఆ అమ్మాయితో స్నేహం చేసుకోటంలోనే నాకు బాధగా వుంది. అంటే లలిత ఏదో చెప్పబోయింది.
రామానికనిపించింది. ఇంక చాలా వుంది. ఎందుకో లలిత చెప్పడానికి వెనకాడుతోంది. తను లలితను మధ్యలో ఇబ్బంది పెట్టడం బాగాలేదు. ఏం జరిగినా ఎదుర్కోటానికి జీవితం ఎప్పుడూ సిద్దంగానే వుంచుకోవాలి!! అనుకున్నాడు రామం మనసులో "చాలా థాంక్స్ ఆ అబార్షన్ చేయించుకున్నప్పటి నుంచీ శారదలో చాలా మార్పు గమనిస్తున్నాను. అయినా ఒకసారి సైకో యాట్రీషన్ ని కలవటం అవసరం అని కూడా అనిపిస్తోందినాకు. మీరు సాయంత్రం రండి" - రామం బయటికి నడిచాడు. అప్పటికి ఎనిమిది గంటలు దాటింది. రామానికి ఇంటికెళ్ళాలనిపించటం లేదు కానీ ఇక్కడ వుండటమూ బాగుండదు. ఆ ఇంట్లో లలిత, తండ్రి వెంకట్రామయ్య వుంటారు. లలిత తల్లిమరణించి ఆర్నెల్లయింది. అన్నలిద్దరూ ఉద్యోగాలుచేసుకుంటూ విజయవాడలో, గుంటూరులో వున్నారు. ఆ తండ్రి బాధ్యత అంతా లలితదే.
'భోజనం చేసి వెళ్ళు బాబూ' వెంకట్రామయ్య రామంతో అన్నాడు. 'లేదండీ. వెళ్ళాలి. మీ యింట్లో ఎన్నోసార్లు భోం చేశాను. ఇంకోసారి వస్తాను. అన్నాడు రామం.
లలిత వీధి గుమ్మంలో నుంచుంది. రామం ఆటో ఎక్కాడు. హోటల్ తాజ్ మహల్ దగ్గర ఆటో ఆపాడు. ఇంటికెళ్ళాలంటే మనసు రావటం లేదు ఎందుకో.
హోటల్లో కూర్చున్న రామం మెనూ కార్డు చదవటం మొదలెట్టాడు. ఒక ప్లేటు ఇడ్లీ, అయినా ఇంకా ఆకార్డు వంకే చూస్తున్నాడు. ప్లేటులో ఇడ్లీ చల్లారిపోతోంది. తినాలనిపించలేదు ఉన్నట్టుండి ఒక ఆలోచన వచ్చింది. "ఒక మసాలాదోసె పాక్ చేయి" శారదకిష్టం - తనకోసం దారిలో ఆగిపాక్ చేయించానంటే ఎంతో సంతోషిస్తుంది - రామం నడుచుకుంటూ రోడ్డు జాగ్రత్తగా దాటాడు శారద ఏం చేస్తోవుంటుందిప్పుడు - తనకోసం ఎదురుచూస్తో వుండి వుంటుంది - పూలమార్కెట్ ఎదురుగా వుంది. "నాలుగు మూరలు" పూలవాడు పూలమాల చుట్టాడు. నా శారద ఏ తప్పులు చేసినా క్షమించగలను - హుషారుగా వచ్చిన రామం ఇంటి ముందుకి రాగానే నిశ్చేష్టుడయ్యాడు.
ఇంటికి తాళం స్వాగతం పలకడంతో శారద వీధివైపు చాలాసేపు చూసింది. ఏడున్నర దాటింది బస్సురాలేదేమో అనుకుంది ఎనిమిదిన్నర దాటింది. శారద మనసు పరిపరివిధాల పోయింది. రామం ఎందుకు రాలేదో - శారద చిరాగ్గా ఇంట్లో ఆ పని ఈపని చేసుకుంది.
"ఆంటీ.....ఫోను" - ఇంటి వాళ్ళబ్బాయి కిందికొచ్చిచెప్పాడు. "ఫోనా - శారద కూడా హడావడిగా మేడమీద వెళ్ళింది.
"నేనూ. నీరజని. ఇవాళ ఫైట్ కాన్సిలయింది. ఇటువస్తావా నువ్వు"
"కాన్సిలయిందా..."
"ఏం, మీవారొచ్చారా"
"రాలేదు. మరి రేపొస్తారేమో.నాకు బోర్ గా వుంది"
"మరింకేం. వెంటనే వచ్చేయి" ఫోను పెట్టేసింది శారద.
గడియారం ఎనిమిదిన్నర చూపిస్తోంది. 'ఈ రోజు రానట్టే - ఏమో ఒక వేళ బస్సురావటం ఆలస్యమయితే - ఏమో, ఎంతసేపని ఎదురుచూస్తాను "రాధను రా, నీ రాధనురా, ఆరాధనా రాధనురా" అంటూ. శారద నవ్వుకుంది తనలో తాను. పదినిముషాల్లో ముస్తాబయింది. తాళం చెవి పక్కవాటాలో యిచ్చి, బయటికి వచ్చింది శారద.
'రా ఇంత ఆలస్యమా'. నీరజ ఎదురొచ్చిలోపలకి తీసుకెళ్ళింది శారదని.
"ఫ్లైట్ ఎందుకు కాన్సిలయింది - వెదర్ బాగుందిగా అంది శారద నీరజవైపు తిరిగి నీరజ, దినేష్ పకపకానవ్వారు. అసలు ఫ్లైట్ ఏదీ - ఊరికే అలా అన్నాం మీ వారిని చూద్దామని బయలుదేరాం. తీరా మీయింటి కొచ్చేసరికి వారు వస్తారని నువ్వు పడుతున్నా హడావిడికి చూసి, ఇంకోసారి చూడచ్చనుకుని వచ్చేసాం. ఏదో సమయానికి అబద్దం చెప్పాం అంతే" గలగలా నవ్వింది నీరజ.
'ఇంకో విషయం కూడా చెప్పేయ్' దినేష్ నీరజను మోచేత్తో పొడిచాడు. 'దినేష్ బర్త్ డే రేపు. మేమంతా పిక్ నిక్ కి వెడుతున్నాం. మరి నువ్వుకూడా రావాలి"
శారద వెంటనే సరే అనేసింది. దినేష్ కొంటెగా నీరజవైపు చూసాడు.
