7. వేడి చేసిందని భ్రమ కలిగించే మూత్రపిండాల వ్యాధి.
"డాక్టర్, నేను ఈ బాధకి టట్టుకోలేక పోతున్నాను. వెంటనే చూడండి" అంటూ ప్రకశరావుబాధతో మెలికలు తిరిగుతూ రెండు చేతులతో పొట్టా, నడుమూ నొక్కి పట్టుకున్నాడు. "డాక్టర్, నాకు బాగా వేడి చేసినట్టువుంది. రాత్రి పడుకునే సమయానికి ఏమీ లేదు. ఉదయం లేచేసరికి కడుపులో నొప్పి, పగలగోట్టేశాయి. ఏ బాధలకి తోడు మూత్రం మాటిమాటికి రావడం, మంట పుట్టడం కూడా వున్నాయి. దీనితో ఈ బాధనంతా చెప్పుకున్నాడు.
ప్రకాశరావు ఒక్కడేకాదు, చాలా మండి ఇటువంటి బాధ యేర్పడినప్పుడు వేడి చేసిందని చిట్కా విద్యలు చేసి చూస్తారు. మరీ బద ఎక్కువమయినప్పుడు డాక్టరు దగ్గరకు వేళతారు. కాని అకస్మాత్తుగా ఇలాంటి బాధలు కలగడానికి కారణం కొన్ని రకాల బాక్టీరియా, వాటిల్లో ముఖ్యంగా ఇ.కోలై అనే బాక్టీరియా కారణం. దీనివల్ల మూత్రపిండాలు వ్యాధి గ్రస్తమవుతాయి ఇటువంటి వ్యాధిని విద్యాబాషలో 'పైలైటిన్' అనీ, "ఫిలో నెఫ్రయిటివ్" అనీ వాడుతూ ఉంటారు.
కొందరిలో ఇటువంటి మూత్రపిండాల వ్యాధి ఎటువంటి బాధ లేకుండా ఉండవచ్చు. కాని సాధారణంగా పైలైటిన్ వ్యాధి లక్షణాలు రోగికి ఎక్కువ బాధ కలిగిస్తూనే బయటపడతాయి. అందులోనూ ఈ వ్యాధి లక్ష్యణాలు అంతకు ముందు ఎటువంటి బాధాలేకుండా అకస్మాత్తుగా కనబడటాయి. క్రింద కడుపులో నొప్పి, నడుము నొప్పి, బాగా అనిపించడం, జ్వరం రావడం, జ్వరంతోపాటు చలి_వణుకు ఉండటం, కడుపులో వికారం, వాంతులు, తలనొప్పి, ఒళ్ళునొప్పులు అమితంగా వుండటం, ఈ వ్యాధిలో ముఖ్య లక్ష్యణాలు, వీటితోపాటు మూత్రవిసర్జన తరచూ అవడం, మంట పుట్టడం వుంటాయి. మూత్రంలో మంట, ఎక్కువసార్లు రావడమనేది మూత్రపిండాలతోపాటుమూత్రకోశం కూడా ఒకే సమయంలో క్రిములకు గురి కావడానికి గుర్తు. కొందరిలో ఈ బాధలన్నీ మరీ ఎక్కువానిపిమ్చకుండా ఏ మందూ వడకుండానే తగ్గిపోవడం జరుగుతూ వుంటుంది. ఇలా ఒకటికి నలుగుసార్లు కొద్దిపాటిగా వచ్చి తగ్గిపోతూ వుంటే ఆ సమయంలో వరు వేడిచేసిందని పంచదార_ నిమ్మకాయ నీళ్ళూ త్రాగి సరిపుచ్చు కోవడం చేస్తుంటారు సరయిన చికిత్స జరిగాక వ్యాధి మెండి డవుతుందిదానితో మూత్రపిండాలు క్రిములువల్ల దెబ్బతిని రక్తపోతు రావడం, యుఉరేనియా వంటి దుష్పరిణామాలు కలగడం జరగవచ్చు.
"పైలైటిన్ " లేదా పియాలో నెఫ్రయిటిన్" అని పిలవపడే ఈ మూత్ర పిండాల వ్యాధి చిన్న పిల్లలోనూ వుంటుంది. వృద్దిల్లోనూ వుంటుంది. పురుషుల్లో కంటె స్రీలలో ఈ వ్యాధి రావడం ఎక్కువ వస్తుంది. దానికి స్రీ గర్భవతులుగా వున్నప్పుడు కడుపు లోపల ఉండే మూత్ర నాళాలని గర్భంనొక్కి వేయడంవాళ్ళా సరిగ్గా మూత్రం ప్రయాణించడానికి వీలులేక అందులోని వ్యాధి క్రిములు అతి తెలికిగా వృద్ది చెందడం జరుగుతుంది. స్రీలుగాని, పురుషులుకుగానీ ఎవరిలోనైనా సరే షుగర్ వ్యాధి అంటే, మేఖానికి, ఒంటికి నీరు వస్తుందని భావిస్తూ వుంటారు. కని పైలైటిన్ వంటి మూత్ర పిండాల వ్యాధిలో ఒంటికి నీరురావడం జరగదు.
ఏ కారణం చేతనైనా మూత్ర పిండాలలోను, మూత్ర నాళ్ళంలోను మూత్రకోశంలోను రాళ్ళవంటివి ఏర్పడి మూత్రం సరిగ్గా అవడానికి ఆటంకం ఏర్పడ్డా, ప్రోస్టేట్ గ్రంధి పెరిగినా కేన్సరు వంటి కణితలు మూత్ర నాళాన్ని నొక్కివేసినా పైలైటిన్ వ్యాధి రావాడానికి ఆస్కారం వుంది. కొందరు పురుషులలో పురుషాంగం చివర చర్మం పూర్తిగా మూసివేయబడి మూత్ర విసర్జన దుర్లభం అవుతున్నా వ్యాధి క్రిములు బాగా వృద్ది చెంది తరచూ కడుపునొప్పి, జ్వరం మూత్రంలో మంటవంటి లక్షణాలు ఏర్పడతాయి 'పైలైటిస్ ' వ్యాధి వున్న స్రీలు పూర్తిగా చికిత్స పొందక పోయినట్లయితే దాంపత్య జీవితం గడిపినప్పుడల్లా ఒకటి రెండు రోజుల్లో కడుపు నొప్పి నడుమునోపి, జ్వరం. వంతులు, వికారం వంటి లక్షణాలుబయలుదేరుతూప్ వుంటాయి.
చాలా మందిలో వేడి చేసినట్లు ఈ వ్యాధి లక్ష్యణాలు కనబడినా వైద్య చికిత్సలో వ్యాధిని తేలికగా నివారించవచ్చు. అలా కాకుండా తరుచుగా దీనికి లక్ష్యణాలుకనబడుతూ వుంటే ఆ వ్యాధి వున్నవారిలో మూత్ర పరీక్ష చేస్తే వ్యాధికి సంభందించిన బాక్టీరియా క్రిమిని కూడా గుర్తించవచ్చు. కొందరిలో ఏ వ్యాధి వచ్చినప్పుడు మూత్ర విసర్జన సమయంలో మంట అనిపించటమే కాకుండా మూత్రంలో రక్తం కూడాకలసి పోవడం జరుగుతుంది. ఏది ఏమైనా ఇటువంటి వ్యాధి లక్ష్యణాలుకనిపించినపుడు వేడి చేసిందని భావించి సొంత వైద్యం చేయకుండా సరైనచికిత్స పొందడంఎంతైనా అవసరం.
*****
