Previous Page Next Page 
హేల్త్ సైన్స్ పేజి 6

                        6. వర్షాకాలంతో పాటు వచ్చే ప్లూ జ్వరం

    ఎండలు తగ్గాయి. కాస్త చల్లబడిందికదా అని సంతోషిస్తున్న అచ్యుతరావుకి "అచ్చు" అంటూ ఒక తుమ్ము వెంట మరొక తుమ్ము వచ్చి తల దిమ్మేక్కినట్లు అయింది. అనిత విషయం సరేసరి. వర్షాకాలం ప్రారంభంఅయిన దగ్గరనుంచి గంగా_ జమున తెంపు లేకుండా ఆమెతో సహాజీవనం చేస్తున్నాయి. జలుబుతో ముక్కు చీదిచీది ఎర్రబడిపోయింది. ఇంట్లో ఉన్న ఇందిరా, సుందరి సంగతి సరేసరి. ఒళ్ళునొప్పులు, కళ్ళ మంటలు ఏ పని చేయడానికి వీలు లేకుండా బాధ కలిగిస్తున్నాయి.

    ఎండాజ్కాలం పోయి వర్షాకాలం ప్రారంభం కావడంతో చాలా మందికి పై బాధలు మమూలే. ఎండలు తగ్గాయి కదా కాస్త హాయిగా ఉండామనుకునే సరికి జలుబు దగ్గు, తుమ్ములు, జ్వరం వంటి బాధలు ప్రారంభం అవుతాయి. వీటికితోడు చాలసార్లు "ప్లూ" జ్వరం విజ్రుభించిన. దీనితో చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఇంట్లో అందరూ మంచన పడవలసి వస్తుంది. మరికొన్ని సందర్భాలల్లో వర్షాకాలం ప్రారంభంతో పటు పొంగు, అట్లమ్మ, గవాడబిళ్ళలువంటి వ్యాధులు రావడానికిగానీ, అతి సూక్ష్మక్రిమి అయిన వైరస్ ముఖ్యకారణం. ఈ వైరస్ క్రిములు ఎప్పుడూ వాతావరణంలో వుంటాయి. కాని ఒక ఋతువు నుంచి రుతువుకి కాలం మరినప్పుడు ఆ వాతావరణం మార్పు వైరస్ క్రిములు విజ్రుంభీంచడానికి దోహదం చేస్తుంది.

    సాధారణంగా ఏ కాలంలో వచ్చే పళ్ళు_ ఫలాలు ఆ కాలంలో తీసుకుంటే ఆ కాలంలో వచ్చే వ్యాధులు రావని అంటూ ఉంటారు. ఇందులో పూర్తీ నిజం లేకపోయినా ఆయా సీజన్స్ కి వచ్చే ఫళ్ళు_ఫలాలని, కాయగూరలని తీసుకుంన్నట్లయితే చక్కని రాగానిరాధక శక్తి పేంపొందుతుంది. ఆయా కాయగూరల్లో, ఫలాల్లో శరీరానికి కావలసిన పోషక పదార్ధాలు చాలావరకు ఉంటాయి. దానివలన మంచి ఆరోగ్యం చేకూరి వ్యాధులు అంట తేలికగా దరిచేరావు అయినా ఎంతటి ఆరోగ్యవంతులకైనా వర్షాకాలం వచ్చేసరికి జలుబు చవి చూపిమ్చాకమానాడు. తుమ్ములు_ జలుబు లకి కారణం. ఇవి వాతావరణం మార్పుతో విజ్రుంభించి జలుబు కలిగేతట్లు చేస్తాయి. సాధారణంగా చల్లగాలి తగలబట్టి, వర్షంలో తడవబట్టి జలుబు చేసిందని భ్విస్తారు. కాని వాస్తావానికి అందువల్ల కాదు వర్షపు గాలివల్ల వర్షంలో తడవబట్టి ఒళ్ళు చల్లబడి శారిర ఉష్ణోగ్రతలో అకస్మాత్తుగా మార్పు ఏర్పడి అంతవరకు శరీరంలో నిస్స్తేజంగా ఉన్న వైరస్ క్రిములు చైతన్యవంతమై జలుబుకి కారణం అవుతాయి. జలుబుకి సంబందించిన వైరస్ క్రిములు ఒకరి నుంచి మరొకరికి అతి తెలికిగా సంక్రమించి ఒకటి_ రెండు రోజులలో ఎదుటువారికీ జలుబు కలిగేటట్లుచేస్తాయి. జలుబు చేసినప్పుడు తలకానొప్పి, ఒళ్ళునొప్పులు కూడా కొమ్దరకీ ఉంటాయి. వర్షాకాలంలో పాటు వచ్చే ప్లూ జ్వరాలు కూడా మరొక రకమైనా వైరస్ క్రిములు వల్లనే వస్తాయి.

    నిమోనియా కూడా వర్షాకాలంలో వచ్చే వ్యాధే దేనికికూడా వైరస్, బాక్టీరియా క్రిములు కారణం. వర్షాకాలం ప్రారంభంలో వాంతులు విరోచనాలు, కలరావంటి వ్యాధులు ఎక్కువ అవుతాయి. అలాగే టైఫయిడ్, పచ్చకామెర్లు వ్యాధులు ఎక్కువ అవుతాయి. వీటితోపాటు మలేరియా, ఫైలేరియా వ్యాధులు విజ్రుంభిస్తాయి. వీటన్నేటికి కారణం వర్షాకాలం వచ్చేటప్పటికి మురుగునీరు చేరడం, తాగేనీరు కల్మషం అవడమే. దీనితో వ్యాధి క్రిములు తేలికగా మనలోకి ప్రవేశిస్తాయి. మురికిగుంటలు దోమలకి మంచి అలవాలమని అందరికీ తెలిసిన విషయమే కదా.

    వర్షాకాలం వచ్చేటప్పటికి ఉబ్బసం రోగుల సంగతి చెప్పేనే అవసరం లేదు. వాతావరణం మార్పు నీళ్ళతో ఉబ్బసం తిరిగి తలెత్తి బుసకోట్టేటట్లు చేస్తుంది.

    కాలం మార్పుతో వచ్చే వ్యాధులని దృష్టిలో పెట్టుకుని వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.                        *****


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS