8. పిల్లలు నోట్లో వేలేసుకునే అలవాటుని చిన్నప్పుడే మాన్పించాలి
చంటిపిల్లలు చాలామందినోట్లోవేలేసుకునే హాయిగా నిద్రపోతూ వుంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ ఆ అలవాటు మనివేస్తారు కాని కొందరికి మాత్రం పదేళ్లు వచ్చినా, ఇరవై నిండినా నోట్లో వేలిసుకునే అలవాటుపోదు.
అర్దోడెంటిస్ట్ చెబుతున్నదాన్నిబట్టి ఎత్తుపళ్ళు వుండి, పై పెదవి కిందిపదవికంటె చిన్నదిగా వుండేవారిలో నూటికి 70మందికి నోట్లో వేలేసుకునే అలవాటు ఉంటుందని తెలుస్తోంది . చిన్నతనం నుంచి సంవత్సరాలతరబడి నోట్లో వేలేసుకుని చీకుతూండటంవల్ల మృదువుగా వుందే ముందుపళ్ళ చిగుళ్ళు దెబ్బ తింటాయి. తిన్నగా రావలసిన ముందుపళ్ళు ముందుకు వంగి పెద్దయిన తరువాత ఎత్తుపళ్ళుగా తయారవుతాయి. పైదవడకి, పల్లకి పెదవికి ఒత్తిడి కలగడంతో పై పెదవి, కింద పెదవితో సమానంగా వుండక చిఒన్నడిగా తయరవుటుంది దాంటో ఎంత అందమైన కళ్ళు ఉన్నా, ఎంత గుద్రతి ముక్కు వున్నా మొత్తం అందం అంతా చేడిపోతుంది.
నోట్లో వేలు వేసుకునే అలవాటుని చిన్నప్పుడు మన్పిమ్చాలి. బాలవంతంగా ఈ అలవాటును మన్పిస్తే పిల్లలు మానసికంగా దెబ్బ తింటారని కొందరు అంటారు. కానిడాక్టర్ గాళ్, డాక్టర్ పర_ ఈ అలవాటును బలవంతంగా మానేసిన పిల్లల్ని ఎందరినో పరీక్షించి వారికి మానసికంగా ఎటువంటి దెబ్బ తగలలేదని నిర్దారించారు. పైగా నోట్లో వేలువేసుకునే అలవాటు సంవత్సరాల తరబడి ఉన్నవారిలో చదువుపట్ల శ్రద్ధ తక్కువ వుంటుంది. వారికీ వయసుతోపాటు మానసిక వికాసం సరిగా వుండదు" అన్నాడు.
నోట్లో వేలేసుకునే అలవాటుని 5వయసులోగా మాన్పించాలి. లేకపోతే పళ్ళు వంకరగా ఎత్తుగా రావాడానికి ఆస్కారం వుంది.ఈ అలవాటువల్ల మట్టిలోని క్రిములు కడుపులోకి పోయి పాములాలాంటివి తయారవడం,కడుపు నొప్పి రావడంలాంటి రాగాలు వస్తాయి.
పిల్లలకి వున్న ఈ అలవాటుమనిపించడానికి తల్లి తండ్రులు మొదట నుంచీ కృషి చేయాలి. ప్రేమతోనే ఈ అలావాతుని మాన్పించవచ్చు. నిద్రపోయేటప్పుడు నోట్లో వేలేసుకుని నిద్రపోయి వుంటే ఆ వేలుని నిదానంగా నోట్లొంచి తీసివేయాలి. కొద్దిగా వయస్సు వచ్చిన పిల్లలకి అలా వేలు వేసుకోకూడదని చెప్పాలి. ఇంకా మానకపోతే వెళ్ళు అన్నింటికీ కలపి " స్టికింక్ ప్లాస్టర్" అంటించాలి. లేదా వేళ్ళకి చేదుగా వుంటే పదార్ధం రాయాలి. అందువల్ల నోట్లో వేలు వేసుకోగానే చేదు అనిపించి నిదానంగా ఆ అలవాటును మనివేస్తారు. డెంటల్ సర్జన్స్ పిల్లల్లో వున్న ఈ అలవాటు పొగొట్టడానికి ముళ్ళు వుండే ప్లేటుని పళ్ళవెనుకనే అమర్చతారు. అలవాటుగానోట్లో వేలువేసుకుంటే ముళ్ళు గుచుకుని నోట్లో వేలు వేసుకోవడం మనివేస్తారు.
****
