Previous Page Next Page 
ఆరాధన పేజి 7


    "అజంతా - ఎల్లోరా చూడటానికి వెళ్తుమున్నా రమ్మని" రాశారు కుమార్ మంజుల. పంపమని ప్రమీల వాళ్ళు వార్డెన్ కు రాశారు.
    వారంరోజుల్లో పుష్ప వచ్చింది.
    పుష్పను చూచి మంజు నిశ్చేష్టత అయింది.
    ఆనాటి పుష్ప కాదు, ఈ పుష్ప నిజంగా గులాబీ పుష్పంలాగా వికసించి ప్రకాశిస్తోంది. తీర్చి దిద్దిన కనుబొమలు, ముక్కు, చిన్న మూతి, కుందనపు బొమ్మలా ముద్దులొల్కే రూపాన్ని చూస్తూ జాలిపడింది.
    ఆ సాయంత్రమే ఔరంగాబాద్ కు బయలు దేరారు. ఎల్లోరా గుహల చెంత అజంతాగుహల చెంత ఫోటోలు తీసుకున్నారు.
    మరుసటి రోజు అక్కడి మంత్రసానిని సహాయానికి తీసుకొని వచ్చాడు.
    ఆ రాత్రి పన్నెండు గంటలకు స్నానంచేసి భర్త సాన్నిధ్యానికి వచ్చింది మంజు. కుమార్ మెలుకువతో ఆమెకోసం కనిపెట్టుకుని ఉన్నాడు మంజు ముఖం బాగా అలసి వుంది. కళ్ళు భారంగా ఉన్నాయి. ముఖంలో తీరని ఆవేదన ద్యోతకమౌతోంది. కుమార్ ఆమెను పొదివి పట్టుకున్నాడు. అతని కౌగిలిలో ఆమె కెనలేని శాంతి లభించింది.    
    "నా మంజుకెంతటి అవస్థ వాటిల్లింది" అని కుమార్ విచారించని క్షణంలేదు.
    అరగంటకు గాని ఆమెను పలుకరించలేక పోయాడు. "ఎలా వుంది?"
    "బాగానే వుంది - ఈ ఆయా మంచి అనుభవం గలది. చాలా ధైర్యం జెప్పింది. ఎందుకో - దానికి నిజం చెప్పాను.
    "మంచిపని జేశావు....నేను కూడా నిజం చెప్పాను."
    కాసేపాగి కుమార్ అన్నాడు "పది గంటల కనుకుంటా ఎవరోవచ్చి ప్రక్కగదిలో ఏదో యివ్వాలన్నాడు. మా చెల్లికు సుస్తీ జేసింది ఆగమన్నాను. వెళ్ళిపోయాడు, ఏం తెమ్మన్నావు?"
    "వేడినీళ్ళు"
    "మరేం చేశావు?"
    "కాగితాలు కాల్చి వేడిచేసింది నీళ్ళు."
    కుమార్ మౌనం దాల్చాడు. నెమ్మదిగా లేచి పుష్పగదిలోకి వెళ్ళారు. ఆమె నిద్రిస్తోంది. గది శుభ్రంగా ఎప్పటిలాగానే ఉంది. ఆయా చాపమీద కూచుని ఆమె నమలుతూ కిళ్ళీ తయారుచేసికొని నోట్లో వేసుకుంటోంది. కుమార్ వంద రూపాయల నోటు ఆమెకిచ్చాడు. ఆమె దోసిలిపట్టి అందుకుని నమస్కరించింది.
    పుష్పను చూస్తుంటే మంజుకు అదోక లాంటి తృప్తి కలిగింది, పుష్ప పవిత్రురాలైనట్లుంది. ఆమెలో ఏ కల్మషం లేదు. ఈ శిక్షచాలు ఆమె కనువిప్పుకు, కానీ హృదయంలో చిన్న పోటు ప్రారంభమైంది. మరో జత అమాయిక పోటు ప్రారంభమైంది. మరో జత అమాయిక కళ్ళు - ఆవేదనా పూరితమైన స్త్రీ కంఠం ఆమె హృదయాన్ని కలుషితం చేశాయి.
    నేరం చేసిన దానిలా తలొంచుకుని భర్తతో బయటికి నడిచింది మంజుల.
    ఖర్చులకని ప్రమీల పంపిన డబ్బును. మర్యాదగా మందలిస్తూ తిరిగి పంపించేశారు.
    ఈ రెండు సంఘటనలల్లో ఏది నేరం -
    ఏది తప్పు - ఏది ఒప్పు.
    చేయకపోవటం తప్పా? చేసింది తప్పా?
    మంజు ఎప్పటికీ తేల్చుకోలేకపోయింది.
    ఒకటిమాత్రం ఆమెకు సంశయం లేకుండా ఖచ్చితంగా తెలుసు. పుష్ప విషయంలో తను తన బాధ్యతను నేరవేర్చింది. దాని తాలూకు సంతృప్తి ఆమెకు కొంతశాంతి ప్రసాదించింది.

                                 *    *    *

    చిరంజీవి సౌభాగ్యవతి కళ్యాణికి, చిరంజీవి భాస్కర్ కు అత్యంత వైభవంగా పెళ్ళయింది. పెళ్ళికి మంజు వెళ్ళలేకపోయింది. ఆ రోజంతా పెళ్ళి ఎలా జరిగి వుంటుంది ఊహించుకుని సంతృప్తి చెందింది. కల్యాణిని పెళ్ళికూతురుగా చూడాలన్న కోర్కె నెరవేరనే లేదు పాపం.
    పోనీ తరువాత వస్తారుగా? మూర్తి వెంటనే వచ్చి కబురు చెప్తానన్నాడు, ఏ బండి కొస్తారో, మంజులలోని పరధ్యానానికి కుమార్ జాలిపడే వాడు. "మంజూ మనం ఫారిన్ లో ఉన్నామనుకో. మరి పెళ్ళికి రాగలిగే వాళ్ళమా? అలాగే అనుకో- వస్తుందిగా....." ఇలాగే ఏదో సర్ది చెబుతుండేవాడు. నిజమే అనుకునేది గాని వెంటనే మనస్సు చెల్లి వైపు పరుగుదీసేది.
    బండి ఆలస్యమైనందువల్ల మధ్యాహ్నానికి చేరామని, రేపు సాయంత్రం రిసెప్షన్ కు తప్పక రమ్మని మూర్తి వచ్చి చెప్పాడు. మంజు ఆ రేపటికోసం ఎదురు చూస్తోంది. ఇంతకు గంట ముల్లు కదలందే!
    ఆ సాయంత్రం మూర్తి తల్లి ఇద్దరినీ రమ్మని కబురు చేసింది. మంజు హడావిడి చెప్పలేము. ముత్యాలు పొదిగిన దుద్దులు, భాస్కర్ కు ఒక ఉంగరం తీసికొని వెళ్ళారు.
    టాంగా గుమ్మంలో ఆగింది. ఇల్లంతా పెళ్ళి హడావిడిలో కళకళ లాడుతోంది. బంధుజనంతో పందిరి కిటకిట లాడుతోంది. వీరంతా తమకు బంధువులు. భాస్కర్ పెళ్ళివారింట్లో ఆఖరి పెళ్ళికావటం మూలాన దాదాపు దగ్గర చుట్టాలంతా హాజరయ్యారు.
    అంత మందిలోంచి మూర్తి వదిన పరుగుల మీద వచ్చి మంజు చెయ్యి పట్టుకుని ప్రక్క సందులోంచి వెనుక వైపుకు తీసికొని వెళ్ళింది.
    నిన్ను ఎవరైనా గుర్తిస్తారేమోనని ఇలా తెచ్చాను."    
    ఆమె తనను మన్నించటం లేదని గుర్తించి మంజు లోలోపలే సంతోషించింది.
    "కల్యాణి ఎక్కడుంది. ఒంటరిగావుంటే..."
    అలసిపోయిందనిఅత్తయ్య మేడ మీదికి పంపించారు. భాస్కర్ కూడా ఉన్నాడు. ఇప్పుడే అందరు భోజనాలకి లేచారు. మనం పైకి వెళ్దాం.
    "మరి డాక్టరుగారు- మీ మరిది లేకుండా నేను ఒంటరిగా కళ్యాణిని చూడటమా! వద్దు...వారిని కూడా పిలిపిస్తే....." ఆమె సంభ్రమాశ్చర్యంతో మంజు వైపు చూచింది. కనపడీ కనబడని గర్భం- నీలి పట్టుచీరెకు అందాన్ని -రూపురేఖల్ని దిద్దుకున్నట్లున్న సుందర వదనం- చేతికి నిండుగా వేసుకున్న నీలి మెరుపు గాజుల తళుకు. ఆమె కలువ కన్నులలో విలసిల్లుతున్న విభ్రమాన్ని చూచి ఆమె మనస్సు అ దతరంగాలపై తేలియాడింది. నవవధువైన కళ్యాణిలో కూడా ఈ పొగను, సౌకుమార్యం మాధుర్యం లేదు. అంటే మంజు వైవాహిక జీవితం మూడుపువ్వులారుకాయలుగా వర్ధిల్లుతోందన్నమాట.
    ఆమె చూపులకు మంజు సిగ్గుపడి కలువ మొగ్గలా ముడుచుకుపోయి కొంగు నిండుగా కప్పుకుంది.
    "చెల్లి వరస అయిపోయావమ్మా....లేక పోతే....సరే ఇక్కడే కూచో.....వస్తాను..."
    ఆమె వెళ్ళింది.
    ముందర పందిట్లో సందడి వెనుక పందిట్లోకి వచ్చింది. స్టూలుమీద కూచుని ఎదురు చూస్తున్న మంజు దగ్గరకు మూర్తి వచ్చి అన్నాడు-
    "పదమ్మా కుమార్ వస్తున్నాడు."
    మంజు హాల్ లో ఉన్న మెట్లను సమీపించింది. కుమార్ మెట్టుపై నుంచుని ఉన్నాడు.
    వారిద్దర్నీ వదిలేసి మూర్తి-వదిన వెళ్ళిపోయారు.
    భార్యాభర్తలు పైకి వెళ్ళి గది తలుపు తట్టారు.
    "మంజూ- నువ్విక్కడ ఉన్నట్లు- ఇప్పుడు నువ్వు వస్తున్నట్లు- తెలీదట" అంతలోకి భాస్కర్ తలుపు తెరచి ప్రక్కకు తొలగి నించున్నాడు.
    కల్యాణి ఎవరో పరాయివారొచ్చారని తలవంచుకుని నుంచుంది, కుమార్ వైపు చూచింది మంజు. ఆమె కళ్ళు ఆనందంతో నవ్వుతున్నాయి. నెమ్మదిగా చెల్లిని సమీపించి ఎదురుగా నుంచుంది చేతులు రెండు చెల్లి భుజం మీద వేసింది. కళ్యాణి ఆశ్చర్యంగా కళ్ళెత్తి చూచింది. అంతే. మరుక్షణంలో వారిద్దరు ఒకరినొకరు కౌగలించుకున్నారు, కల్యాణి "అక్కయ్యా....ఎన్నాళ్ళకి....ఎన్నాళ్ళకి అంటూంది. మంజు చెల్లిని వదలి- ఆమెవైపు ఆప్యాయంగా చూస్తూ అంది" డాక్టరుగారు కళ్యాణీ....నా భర్త..."
    "ఏమ్మా.... మీ అక్కయ్య నెల రోజుల నించి ఈ క్షణం కోసం కలలు కంటోంది. ఇవ్వాల్టికి కోరిక తీరింది.... మా భాస్కర్ నిన్ను ఏ విధంగా కష్టపెట్టినాసరే వెంటనే వచ్చేసెయ్యి భాస్కర్ ఫక్కున నవ్వాడు.
    కళ్యాణి గ్రుడ్లప్పగించి చూస్తోంది. అక్క పరిచయం చేసిన విధానానికి బాధపడి -వ్యధతో అంది "అక్క- మా బావగారు కదూ"

                   
    ఆమె కుమార్ ఎదురుగా వెళ్ళి శిరస్సువంచి నమస్కరిస్తూంది.
    "నన్ను ఆశీర్వదించండి....మిమ్మల్నిద్ధర్నీ చూచే భాగ్యం ఇవ్వాల్టికి కల్గింది" ఆమె కంఠం గాద్గదికమైంది. ఆశీర్వచనంగా కుమార్ మంజులలు ఏదో గొణిగారు. మంజు చెల్లికి. భాస్కర్ కు తాను తెచ్చిన కానుక లిచ్చారు.
    "అక్కయ్యా - నీ భర్త-నాకు బావకాదా.... నాన్నలా అందరం నీమీద కత్తికట్టలేదు...నేను మునుపటి కళ్యాణినే, నీ భర్తగాబట్టి బావ పూజనీయులే. వారిని ఆ విధంగా గౌరవించాలని నా అభిలాష.....ఇకపై ఎప్పటికీ నన్ను మాత్రం దూరం చెయ్యకు."
    మంజు చెల్లి మాటలకు ఉబ్బి తబ్బిబ్బయి పోయింది. ఆనాడు చిన్నదైనా నీతులు బోధించింది. ఈనాడు తామిద్ధర్నీ గౌరవిస్తోంది. ఎంత మార్పు.
    వారిద్దరు మాట్లాడుతుండగా మూర్తి తల్లి వచ్చింది.
    "ఏమ్మా - చెప్పావుకావు...ఏం నాయనా - మిమ్మల్ని గూర్చి ఏ శుభవార్త విందామా అని ఎప్పుడు ఎదురు చూస్తుంటానన్న సంగతి మర్చిపోయావా?....ఏవైనా తినాలనిపిస్తే మూర్తిచేత కబురు పంపు మీ చెల్లెలుందిగా? ఆమెకు కబురందచేయటానికి సిగ్గెందుకు? భోంచేస్తానంటే ఇక్కడికే పంపిస్తాను. వద్దంటే కారియర్...."ఒద్దమ్మా వెళ్తాము...." ఆమెవినిపించుకోలేదు.
    "భాస్కర్ - వదినెతో చెప్పి కారేజి తీసుకురా- మొహమాట పడ్తున్నారా మీరు....మీరక రహస్యంగా జరగాలని తాపత్రయ పడ్డాం. మా పెద్ద బావగారు తోటికోడ లున్నారే వారు పూర్వకాలం మనుష్యులు. మీరు స్నేహితులని చెప్పాము"
    ఆమె భాస్కర్ తెచ్చిన కారేజీని విప్పబోయింది.
    "ఆలస్యమౌతుంది. ఇంటికెళ్ళి భోంచేస్తాము రాత్రికి నా డ్యూటీ వుంది, సర్టన్ మాదప్ప నేను వెళ్ళాక వస్తారు.... "కుమార్ అన్నాడు. "ఆ......నిజమే......భోజనానికి ఉండమని చెబితే మళ్ళీ వస్తాన్నారు....ఏదో అర్జెంటు కేసుందట. ఆమె టిఫిన్ కాడ బిగించింది. ఇద్దరినీ మరీ మరీ రమ్మని చెప్పి వెళ్ళిపోయింది.
    వీరి సంభాషణను వింటూ కళ్యాణి ఎంతో ఆశ్చర్యపడింది. కుమార్ బావ అంటే అత్తగారికెంత ప్రేమ? బావకేసి చూసింది, కుమార్ గడియారం చూచుకుంటున్నాడు.
    అక్క చెల్లెండ్రు ఏదో శ్రద్ధగా మాట్లాడుకుంటున్నారు.
    అనలేక అనలేక "వెడదామా మంజూ" అన్నాడు.
    తపోం!భంగమైనట్లు వాళ్ళిద్దరూ కుమార్ వైపు చూశారు.
    "సరే మీరు మాట్లాడుకోండి కాసేపు అలా మూర్తి దగ్గర...." అంతలోకే మూర్తి గబగబా వచ్చి "నీకోసం మాదప్ప వాన్ పంపారు. అర్జెంట్ ఆపరేషన్ ఉందిట... ఆక్సిడెంట్ అట"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS