Previous Page Next Page 
బ్రతుకు బొంగరం పేజి 7

                               
                                   4
    సురేంద్ర కొన్ని ఏళ్ళయింది ఉదయపు సూర్యుణ్ణి చూసి, అతనికి రోజూ తొమ్మిది గంటలకు గాని ఉదయం ప్రారంభం కాదు. గబగబా లేచి ఆదరా బాదరాగా ముఖాన్ని కడుక్కొని, అ గొంది లోనే ఒక పక్కగా ఉన్న టీ దుకాణం వాణ్ణి కేకేసి టీ తెప్పించుకొని బద్దకంగా కాసేపు మళ్ళీ అటూ ఇటూ దొర్లి గాని పక్క చుట్టడు. ఏవైనా రిహార్సల్సు ఉంటె మాత్రం పదకొండు గంటల కల్లా తయారయి ఆ గొంది లోనే మరో మూల ఉన్న భోజన హోటల్లో భోజనం అయిందని పిస్తాడు. భోజనం అంటే మూడు రొట్టెలు, ఇంత కటోరీ లో సాంబారు. అంతే!
    రవిచంద్ర కు ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. తెల్లవారే ముందు ఎప్పుడో ఒక కునుకు వచ్చింది . మళ్ళీ ఆరు గంటలకే మెలకువ వచ్చింది. ముఖం కడగడం కానిచ్చి సురేంద్ర కు మేలుకొలుపు లు పాడటం మొదలెట్టాడు.
    "ఒరేయ్ , సూరీ , లేరా! లేవరా!" దాదాపు పదిసార్లు పిలిచినప్పటి కి సురేంద్ర "ఊ, ఆ!' అనటం తప్పలేవలేదు. మహా అయితే "ఉండరా!"అంటూ అటు నుంచి ఇటు పొర్లడం , మళ్ళీ కాసేపాగి ఇటు నుంచి అటు పొర్లడం ! అంతే. రవిచంద్ర విసిగి , పక్కనే పడేసి ఉన్న ఏదో పుస్తకాన్ని అటూ ఇటూ తిరగావేయటం మొదలు పెట్టాడు.
    దగ్గిరగా వేసి ఉన్న కిటికీ తలుపులు తెరుచుకున్నాయి. రావిదంద్ర పుస్తకం లోంచి తల ఎత్తలేదు. ఎవరో వచ్చినట్ల నిపించింది.
    "కౌన్ హై" అన్నాడు.
    గాజులు చప్పుడయ్యాయి. ఉలిక్కిపడి అటు చూశాడు. ఎదురుగా స్త్రీ!మరాఠీ కట్టుడు చీరే. రెండు జడలు. గుండ్రంగా ఉన్న ముఖంలో అందంగా పొదగబడిన ముక్కు, నోరు, చెవులు. మరీ ఆకర్షణీయంగా ఉన్నవి, కాటుకతో నిండి ఉన్న కళ్ళు.
    రవిచంద్ర ను చూడగానేకొంచెం సిగ్గు అభినయిస్తూ "క్షమించండి . అడ్రసు పొరపాటు అనుకుంటా" అని హిందీలో అని తిరిగి వెళ్ళిపోవడానికి ఉద్యుక్తురాలయింది.
    "ఎవరు జావాలి?' అని అడిగాడు రవిచంద్ర.
    "డ్రామా యాక్టర్ సురేంద్ర."
    "మీరేమీ పోరపడలేదు , నిద్రపోతున్నాడు సురేంద్ర, అడుగో " అంటూ నిండా దుప్పటి కప్పుకున్న సురేంద్ర ను చూపించి, "సూరీ లేవరా! నీకోసం ఎవరో వచ్చారు!" అన్నాడు. సురేంద్ర బద్దకంగా లేచి ఎదురుగా ఉన్న ఆమెను చూస్ కంగారు పడి "హల్లో " అని "వన్ మినిట్, కూర్చో . ముఖం కడుక్కుని వస్తాను" అని మరాఠీ లో చెప్పి గబగబా బాత్ రూం లోకి పరుగు తీశాడు.
    ఆమె రావుచంద్ర ను పరీక్షగా చూసి, "మీరు వారి స్నేహితులను కుంటాను" అని మరాఠీ లో అంది.
    "సారీ, ఐ డోంట్ నో మరాఠీ" అని ఇంగ్లీషు లో చెప్పాడు రవి.
    ఆమె గభాల్న ఇంగ్లీషు లోకి భాషనూ మార్చి అదే ప్రశ్న అడిగింది.
    "అవును! చిన్ననాటి స్నేహితులం" అన్నాడు రవి.
    "ఎప్పుడు వచ్చారు?' అంది ఆమె.
    "నిన్న."
    గుచ్చి గుచ్చి ఆమె చూసే వాలకం రవిచంద్ర ను కొంచెం ఇన్=ఇబ్బందిలో పడేసింది. అయినప్పటికీ ఆమె అందం అతన్ని ముగ్ధుణ్ణి చేసింది.
    ఇంతలో సురేంద్ర వచ్చాడు. "సారీ, సురేఖా! ఎనిమిదింటికి రాలేకపోయాను. చూశావుగా, ఇప్పుడే లేవడం" అని హుషారుగా చెప్పాడు.
    సురేఖ మనోహరంగా నవ్వుతూ , "నాకు తెలుసు , నీవు రావని. అందుకే నీ అడ్రసు వెతుక్కుంటూ వచ్చాను" అంది.
    వారి సంభాషణ మరాఠీ లోనే సాగిపోయింది. ఇంతలో రవిచంద్ర అక్కడున్నట్లు సురేంద్ర కు జ్ఞాపకం వచ్చింది.
    గభాల్న రవిని చూపిస్తూ, "మీట్ మై క్లోజ్ ఫ్రెండ్ రవిచంద్ర , ఏమ్.ఎ. " అన్నాడు.
    సురేఖ అందంగా నమస్కరించింది.
    సురేఖా దేశ పాండే! మై ప్రొఫెషనల్ కొలీగ్"--  అంటూ, "ఇఫ్ యూ పర్మిట్" అని చురుగ్గా సురేఖ ను చూశాడు.
    సురేఖ కొంటెగా చూసింది.
    రవిచంద్ర ప్రతి నమస్కారం చేశాడు.
    సురేంద్ర వీధి బయటకు వెళ్లి "టీన్ చాయ్" అని టీ బడ్డీ వాణ్ణి కేకేశాడు.
    "రవీ నేను ఈవిణ్ణి పరిచయం చేశానుగా! ప్రొఫెషనల్ కొలీగ్ అంటే నాతొ బాటు నాటకాల్లో నటిస్తుంది. చాలా బాగా పాడుతుంది. వచ్చే శనివారం ధన్ వట్ రంగ్ మందిర్ లో మా ప్రోగ్రాం ఉంది. ఈ సిటీ మేయర్ ప్రిసైద్ చేస్తున్నాడు. టికెట్లు కూడా చాలావరకు అమ్ముడు పోయినాయి." సురేంద్ర దువ్వుకుంటూ చెప్పసాగాడు.
    సురేఖ "మీరుఅప్పటి దాకా ఇక్కడే ఉంటారను కుంటా" అంది తెలుగులో.
    రవి ఆశ్చర్యపోయాడు. "అయితే మీకు తెలుగు వచ్చన్న మాట" అన్నాడు.
    సురేఖ మందహాసం చేసింది. ఇంతలో సురేంద్ర అమాంతంగా వెనక్కి తిరిగి, "ఆమెకు తెలుగేమిటి ఖర్మ! ప్రపంచంలోని అన్ని భాషలు వచ్చనుకుంటా. హిందీ, బెంగాలీ, తెలుగు-- సరే మరాఠీ చెప్పనే అక్కర్లేదు...."అంటుండగా సురేఖ మధ్యలో అందుకొంది' ఉష్! వారిని గాభరా పెట్టకండి. తెలుగు నాకు త్వరగా రావడానికి కారణం ఉంది లెండి. మా పూర్వికులు తెలుగు వారెనట. చాలారోజుల కిందట, అంటే దాదాపు కనీసం యాభై సంవత్సరాల కిందట ఇక్కడికి వచ్చేశారు. అనుకోకుండా మా నివాసం తిలక్ నగర్ లో ఒక తెలుగు వారింటి పక్క అయింది. వారు కాస్త, మిష్టర్ సురేంద్ర వచ్చిన తరవాత అయన కాస్త నేర్పారు" అంది.
    "నో నో! నేను ఒప్పుకోను. నేను ఈ నాగపూర్ వచ్చేసరికి ధారాపాతం గా నీవు మాట్లాదేస్తున్నావు. నీవే నేను కొల్హాపూర్ లో తెలుగు మరిచిపోయి ఇక్కడకు వస్తే నాకు నేర్పావు."
    "మరి మొదట నాతొ మీరు మరాఠీ లో ఎందుకని మాట్లాడారు?" రవి ప్రశ్నకు సురేఖ చిరునవ్వుతో ఏదో చెప్పబోయేంత లో సురేంద్ర అడ్డు తగిలి , "ఆ! అందరికీ ఉండే రోగమే అది! మద్రాసు పో నీవు! చచ్చినా వాళ్ళు తెలుగు మాట్లాడరు! తెలుగు వచ్చినా ప్రతి  డానికి "ఎన్నా?' అంటూ మన్ని బోర్ కొట్టేస్తారు. ఇక్కడ కూడా......."
    సురేఖ అతన్ని వెక్కిరిస్తున్నట్లుగా చూస్తూ, 'అదేమీ కాదు. అలవాటు చొప్పున అడిగాను. సురెంద్రను మరాఠీ లో పర ఫెక్ట్ చేయడానికి ఈ మధ్య మేమిద్దరం మరాఠీ ఎక్కువగా మాట్లాడు తున్నాం . అది పోనీండి. మీరు ఏం చేస్తున్నారు?" అంది.
    రవిచంద్ర పేలవంగా నవ్వి , "నేను ఏమీ చేయడం లేదండీ. సరదాగా నాగపూర్ చూడడానికి వచ్చాను" అన్నాడు.
    సురేంద్ర విననట్లు నటించాడు.
    "మీ పేరు .....ఆ! రవీంద్ర అని చెప్పారు గదూ" అని సురేఖ అనబోయేంత లో , "కాదు, రవిచంద్ర అని చెప్పాను. వాడి పేరులోని చంద్రమామ ను కట్ చేయబోకు, నీకు పుణ్య ముంటుంది గానీ" అన్నాడు సురేంద్ర.
    సురేఖ హాయిగా నవ్వింది. ఇద్దరు కలిసి నాటకాల్లో నటించడం వల్ల వారిద్దరి మధ్య చనువు బాగా అభివృద్ధి చెందింది. దాదాపు నాగపూర్ లో ఇప్పటికి కనీసం పది నాటకాలైనా ఇద్దరు కలిసి ప్రదర్శించారు. సురేఖ "కధానాయిక" పాత్ర వేస్తుంది ఎప్పుడూ. ఆమెకు సురేంద్ర నాగపూర్ రాక మునుపే మంచి రంగ స్థల నటిగా పేరు ఉంది. సురేంద్ర వచ్చిన తరవాత కొద్ది రోజుల్లోనే నాటకాల రాయుళ్ళ దృష్టిని ఆకర్షించాడు. నాగపూర్ లో మూడు నాలుగు నాటకాల కంపెనీలు, వ్యాపారాన్ని దృష్టి లో ఉంచుకొని నడిపేవి ఉన్నవి. ప్రతి కంపెనీ కి ఒక కంట్రాక్టర్ ఉంటాడు. అతని పని అల్లా "ప్రోగ్రాం ఏర్పాటు చేయటం, నాటకానికి కలక్షన్స్ బాగా వచ్చేటట్లు చూడటం, దాదాపు ఉన్న ఆ నాలుగు కంపెనీ లకు మంచి గిరాకీ ఉంది. మహారాష్ట్ర ప్రాంతాల వాళ్ళు నాటకాలంటే చెవి కోసుకుంటారు. జానపద, పౌరాణిక ,సాంఘిక నాటకాలు ఏవైనా సరే వారిని ఆకర్షిస్తాయి. ఆ ప్రోత్సాహంతో అక్కడ స్టేజీ బాగా అభివృద్ధి చెందింది. సినిమాలు వచ్చి స్టేజి ని కొంత దెబ్బ తీశాయి. కాని నాటకాలు చూడటానికి అలవాటు పడ్డ ఒక తరగతి ప్రేక్షకులు ఇంకా ఉన్నారు కాబట్టి వ్యాపార రీత్యా కూడా నాటకాల ప్రదర్శన కొంచెం కిట్టు బాతుగానే ఉంది. సురేంద్ర , సురేఖ -- ఇద్దరూ ప్రస్తుతం ఒక కంపెనీ లోనే పని చేస్తున్నారు.
    కుర్రవాడు తెచ్చిన టీని ముగ్గురు తాగారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS