"పొరపాటు తల్లీ. అంత మాట అనకు. చాలా పొరపాటు." చనువుగా అన్నాడు గౌతమ్, ఆమె మాటల మధ్యలోనే. "నీకింకా చిన్నతనం. తెలియదు. న్యాయ స్థానాలూ, ధర్మ పీఠాలు ఉండబట్టే ఈ మాత్రం గానయినా ఉన్నాము. ఎక్కడో, ఎవరో నీకు తెలిసిన ఒక్కరు అధర్మంగా ప్రవర్తించి నంత మాత్రాన ఆ ఆధారంతో సర్వ ప్రామాణిక నిర్ణయం చేసి వేయకూడదు."
సత్యాదేవి మాట్లాడలేదు.
గౌతమ్ తన మాటలను పొడిగించాడు. "ధర్మానికి నోరు లేకపోయినా, శక్తి ఉంది. ధర్మచక్రం చాలా పదునైనది.
'అయితే మన కండ్ల ఎదుట జరుగుతున్న ఈ అన్యాయాలన్నీ ఏమిటి?" సత్య అడిగింది.
గంబీర మందహాసం చేశాడు గౌతమ్. "సింహం నిద్రించినంత సేపే కుందేళ్ళ అట. ధర్మదేవత దయా స్వరూపిణి. ఓర్పుతో , చూచీ చూడనట్లు పోయినంత కాలమే అధర్మం ఆటలు సాగేది. ధర్మదేవత మేలుకొని ధర్మ చక్రం విసిరితే ఆ చక్ర భ్రమణ వేగోద్ద్రుతం;లో స్వపర బేధాలు ఉండవు. న్యాయదేవత నాట్యం లో నగ్న సత్యా లెన్నో బయల్పడతాయి. అధర్మం కుత్తుకమ నిర్దాక్షిణ్యంగా ఖండించడమే ధర్మ చక్రం ధ్యేయం. ఈ సత్యాన్ని ఒకనాటికి నువ్వే గుర్తిస్తావు."
తృప్తిగా నవ్వింది సత్య. "నిరాశ చెందిన నా మనసులో మీ మాటలు ఆశా చంద్రికలు వెలిగించి, ఏ మూలో నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. నీతి దాయకమైన ప్రపంచాన్ని ఎప్పటి కైనా చూడగలననే ఆశిస్తున్నాను."
"ఆశ కాదు తల్లీ, నమ్మకం! మంచి నమ్మకం నిలిపి ఉండు. కాని ఒక మాట గుర్తుంచుకో. న్యాయ ధర్మాలను నిజంగా ప్రేమించి విలువనూ, పొందనూ ప్రయత్నించే వారు జీవితం లో అతి సాహసో పేతమైన కార్యాన్నే చెప్పట్టామని గుర్తించాలి. ధర్మదేవతకు స్వపర పక్షపాత బుద్ది లేదు. ఆ దేవత సాక్షాత్కారం కోసం చేసిన ఆరాధనా, పడిన వేదనా ఆ ధర్మదేవత అను గ్రహనంతరం తీరని బాధగా, అరని జ్వాలగా పరిణమించి అక్రోశింప జేస్తాయి. మనస్సు కు ఎటు మిగిలినా శోకమే. కాని, ఆధర్మం లో ఉండేది అవివేకమైన, అస్పష్టమైన సంతృప్తి ; ధర్మం లో ఉండేది తృప్తి తో కూడిన అసంతృప్తి, అనిర్వచనీయమైన అనుభూతి. కడకు మిగిలేది వేదనే అయినా, ధర్మమనే ప్రమిద లో వేదనా భారమనే తైలంతో వెలుగొందే సత్యజ్యోతి విరజిమ్మె చల్లని కరుణామాయ కాంతుల లో, అహింసా దీప్తులతో జగమంతా ఒలలాడు తుంది. ధర్మ యుద్ద కర్తకు మిగిలే తృప్తి అదే."
గౌతమ్ వాగ్దొరణికి , ఆవేశానికి, సత్యాదేవీ ధర్మారావు కూడా విపరీతాశ్చర్యం పొందారు.
"మరి మనం వెళ్ళుదామా ?' అన్నాడు ధర్మారావు దారి తీస్తూ.
"ఊ. ఉంటాము, గౌతమ్ గారూ" అంటూ సత్య అతడి ననుసరించినది.
"దండాలు బాబూ. దండాలమ్మాయి గారూ." వెనక నుంచి ఖైదీ లందరూ ఆప్యాయంగా వీడ్కోలు ఇచ్చారు.
"ఏదో తన అనుభవాన్ని పునశ్చరణ చేసు కుంటూ చెప్పినట్లుంది కాని, ఆ గౌతమ్ మీ మాటలకు సమాధానం చెప్పినట్లు అనిపించలేదు నాకు. ఏదో ఒక ఆవేశవస్థలో ఉన్నట్లున్నాడు అయన" అన్న ధర్మారావు , తన మాటలకు సమాధానం రాక పక్కకు తిరిగి చూచాడు.
మెల్లగా అడుగులు వేస్తూనే, తన డైరీ లో ఏమో వ్రాసుకుంటున్న సత్యాదేవి ని చూచి విస్మయం చెంది, "ఏమిటి వ్రాస్తున్నారు?' అని అడగబోయి , మళ్ళీ సభ్యతఅడ్డు రాగా , మౌనంగా ఊరుకున్నాడు.
వ్రాయడం ముగించిన సత్య ధర్మారావు నేత్రాలలోని ప్రశ్నను మౌనంగానే చదివేసి చిరునవ్వుతో సమాధానం చెప్పింది ; "విశిష్ట భాషణను ఎప్పటి కప్పుడే పదిలంగా అట్టి పెట్టుకోవాలి. మనకు కావాలన్న ప్పుడేల్ల వినిపించదు."
"నిజమే!"
"ఏమిటంత పరధ్యానంగా ఉన్నారు?' చాలా సేపటికి ధర్మారావు ప్రశ్నించాడు తలవంచి నడుస్తున్న సత్యను.
"ఏమీ లేదు." మెల్లగా అన్నది. "ఇంతటి ఉత్తమ భావాలూ, ఉన్నత హృదయమూ కల వ్యక్తీ దేశ ద్రోహి నేరంతో ఇక్కడ బంధింప బడ్డాడు. దేశ రహస్యాలకు సంబంధించిన రికార్డు ను శత్రువులకు అందిస్తూ పట్టు బద్దాడని ఆరోపణ. ధర్మదేవత కు నిజంగా కళ్ళూ, హృదయమూ ఉంటె ఇంతింత దారుణా లేలా సహిస్తూ కూర్చున్నది?"
చాలాసేపు మౌనంగా ఉన్న ధర్మారావు శాంత స్వరాన అన్నాడు : 'అయన ఆ నేరం చేయ లేదంటారా?"
'అవును. ఆయనను చూస్తె మీకు మాత్రం అనిపించుతున్నదా, అతడు నేరం చేసి ఉంటాడని?"
"ఏమో? అయినా ఎందుకు చేయకూడదు? ఒకవేళ ఇటీవల ఆయనలో పరివర్తన కలిగి మంచి వాడవడాన్ని మనం చూస్తున్నామేమో?"
"కావచ్చు." విషాద మందహాసం చేసింది సత్య. "ఆయనను చూస్తుంటే మాత్రం, అటువంటి దారుణాలను కలనైనా యోచించ లేను నేను. నాకు ఈ ప్రపంచం లో ఈ మనుష్యులూ, ద్రోహాలు, నేరాలు -- ఏమిటో, చూచినకొద్దీ, ఆలోచించిన కొద్దీ మతి వశం తప్పిపోతుంది."
"నిజమే. కాని ఈ ప్రపంచ పరిధిని దాటి ఎక్కడికి పోగలము?"
మాటలు పూర్తీ కాకుండానే గేటును సమీపించారు.
"సెలవు. రేపు వస్తాను.' కారెక్కుతూ అన్నది సత్య.
"సంతోషం. రేపు ఆదివారం కూడా. మీకోసం ఎదురు చూస్తుంటాను. గుడ్ నైట్."
"గుడ్ నైట్."
కారు సాగిపోతుంటే రేగిన దుమ్ము లాగా, అఅ;ైన బాధాకరమైన ఆలోచనలు రేగాయి . నిలబడి చూస్తున్న ధర్మారావు మనస్సులో సత్యాదేవి గురించీ, గౌతమ్ ని గురించీ ఎందుకో గౌతమ్ నిత్య దైవ్య వదనం ధర్మారావు కూ బాధగానే ఉన్నది. ఉత్తమ విశిష్ట గుణ రూపాది విశేషాలున్న అతడు నేరం చేసి ఉంటాడని ఊహించడానికే మనస్సు అంగీకరించడం లేదు.
పరధ్యానంగా గదిలో అడుగు పెడుతున్న అతడిని,"షికారు కు వెళ్ళలేదా , అప్పుడే వచ్చేశావు?' అని ప్రశ్నించింది దయామయి.
"లేదమ్మా." అన్యమస్కంగానే జవాబిస్తూ తన గదిలోకి వెళ్ళిపోయాడు.
"అమ్మా" అంటూ చేరవచ్చి అనునిత్యం ఎన్నో కబుర్లు,విశేషాలు చెప్పే అతడెందు కంత అన్యమనస్కుడుగా , చింతా క్రాంతుడై ఉన్నాడో తెలియక, తికమక పడిన దయామయి 'అలా ఉన్నా వేమిటి బాబూ?' అని అడిగింది భోజనం దగ్గర.
"ఏమీ లేదమ్మా. బాగానే ఉన్నాను" ప్రయత్నపూర్వకంగా నవ్వుతూ సమాధానం చెప్పాడు.
దయామయి కి సంతృప్తి కరంగా లేకపోయినా, ఏదో సమాధానపడి ఊరుకుంది.
8
సాయం సమయంలో వచ్చిన సర్యాదేవి ని ఎదురేగి మనః పూర్వకంగా ఆహ్వానించి కూర్చుండ జేసి, దయామయి కి పరిచయం చేశాడు ధర్మారావు.
స్త్రీ సహజమైన సునిశిత విమర్శనా స్వభావం, కుతూహలం తో సత్యాదేవి ని సంభాషణ లోనే పలురీతుల వివరాలు తెలుసుకొన్నది దయామయి.
సత్యాదేవితో సంభాషణ నంతరం దయామయి వదనం లో క్రోదాసహ్య రేఖలు పెరుకొనడం, మనసులోని ఏదో మదనను ఆమె ప్రయత్నా పూర్వకంగా అణచి పెట్టడం గమనించిన ధర్మారావు లోలోన కలవర పడ్డాడు. కాఫీ తెచ్చే మిషతో లేచి లోపలికి వెళ్ళిపోతున్న ఆమెను తానూ అనుసరించాడు.
ధర్మారావు ఏమో మాట్లాడే లోగానే దయామయే తీవ్రంగా అడిగింది. "ఎందుకొచ్చిందా పిల్ల?"
నివ్వెర పోయిన ధర్మారావు మాట్లాడేలోగా తిరిగి దయామయి అన్నది : "అసలు మీకెలా పరిచయ మయింది? ఎప్పటి నుంచి ఈ స్నేహం?"
'ఏమిటమ్మా నీ కోపం? నాకేమీ అర్ధం కావడం లేదు."
"బుద్ది మండగిస్తుంటే అర్ధమేలా అవుతుంది?' కఠినంగా అన్నది.
మందస్వరం లో అడిగాడు ధర్మారావు : "అమ్మా! నామీదేమైనా అనుమానమా?"
"కంటికి కనుపించే దానికి వేరే తర్కం దేనికి? ఈ స్నేహాలు నాకిష్టం లేదు."
"అదేమిటమ్మా? పరిచయం అంతే. ఇంకా స్నేహం కాలేదు. అయినా ఉద్యోగస్తులం -- ఒకరితో ఒకరికి స్నేహ పరిచయాలు ఉండక పోతాయా?"
"అదంతా నా కనవసరం. ఆమెతో స్నేహం వద్దు. అంతే."
"అమ్మా!"
"మరి తర్కించకు. వెళ్ళు, ఇదుగో కాఫీ."
బయట సత్యాదేవి వేచి ఉండడం వల్ల ధర్మారావు మరి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు.
కాఫీ తీసుకున్న అనంతరం 'అలా ఓసారి జైలు వైపు వెళ్ళుదామా?" అంది సత్యాదేవి.
నవ్వేశాడు ధర్మారావు. "నడవండి. వారిని పరామర్శించనిదె మీకు తోచ దనుకుంటాను. మీకు 'ప్రేమ మయి' పేరు సరిపోతుందనుకుంటా."
సమాధానంగా ఆమె కూడా చిన్నగా నవ్వింది. "అన్నట్లు మీకు తెలుసా? గౌతమ్ ను ఖైదీ లంతా దేవుడనీ, ధర్మరాజని పిలుస్తారు."
"ఓ! సంతోషంగా అన్నాడు ధర్మారావు. "తగిన పేరు."
"నిజం."
"అమ్మా! అలా ఖైదీల నోసారి చూచి వస్తాము" అన్నాడు ధర్మారావు.
"మీరెప్పుడైనా చూశారా? రండి మీరూ మాతో" అన్నది సత్య.
"అవునమ్మా, రా. నువ్వెప్పుడూ చూడలేదుగా?"భారంగా ఉన్న ఆమె మనస్సు ను తేలిక చేద్దామనే భావంతో అన్నాడు ధర్మారావు.
"వద్దు వద్దు . నేనెందుకు?' ఖంగారుగా అన్నది దయామయి. "మీరు మాత్రం ఎందుకు? ఆదివారం కూడా అదే ఉద్యోగమా?"
"అబ్బే, కాలక్షేపా నికమ్మా."
ఇద్దరూ నడుస్తుండగానే ఒక కాన్ స్టేబుల్ వచ్చి ఒక కవరు ఇచ్చి వెళ్ళాడు ధర్మారావుకు. పోలీస్ సూపరింటెండెంట్ అర్జున్ రావు నుండి తన ఇంటికి టీ కి రమ్మని ఆహ్వానం.
సంగతి వినగానే తమ సమావేశానికి అంతరాయం కలిగినందుకు సత్యాదేవి ముఖం వాడిపోయింది. కాని "నేను రేపు వస్తాను లెండి. వెళ్ళండి . మీ ఎంగేజ్ మెంటు పాడు చేసుకోవద్దు" అన్నది.
ధర్మారావు బాధపడ్డాడు. "వద్దు. మీరు వెళ్లి పోకండి. సూపరింటెండెంట్ గారికి ఇప్పుడు తీరిక లేదని కబురంపిస్తాను"అన్నాడు.
"వద్దు, వద్దు. అంత పని చేయకండి." చనువుగా వారించింది సత్యాదేవి. "మీరేమీ అనుకోనంటే ఒక్క మాట. ఎందుకో మీరంటే ఒక ఆత్మీయత ఏర్పడింది. ఈ అత్యల్ప పరిచయం తోనే."
"చెప్పండి. అంతకంటేనా? నాకూ మీరంటే అతి గౌరవం."
"మీరీ ఉద్యోగం లోకి కొత్తగా వచ్చారు. అసలు మీకు మొన్న మొన్నటి వరకూ చదువే సరిపోయిందేమో!"
"అవును. అయితే?"
చిరునగవు తో అన్నది సత్యాదేవి; "ఉద్యోగ వాతావరణ మూ, ఉద్యోగస్తుల అంతరంగా లూ, పై ఉద్యోగస్తుల స్వభావాదులూ, వారితో మెలగవలసిన తీరు తిన్నులూ మీకు పూర్తిగా అపరిచితాలు."
ఆశ్చర్యంగా వింటున్నాడు ధర్మారావు.
"అందుకే ఇప్పుడాయన పిలుపు స్వీకరించి వెళ్ళండి. అయన మీతో వ్యక్రిగతంగా కూడా స్నేహం చేసుకోవాలనో, లేక ఏమైనా సలహా లివ్వాలనో అనుకుంటున్నట్లున్నారు."
ఆశ్చర్యంతో చలించాడు ధర్మారావు. "సరే. థాంక్స్" అన్నాడు.
"మరి, నాకు సెలవు. రేపు వస్తాను. అమ్మగారితో చెప్పండి."
"రేపు నేనే వస్తాను. మీ అడ్రసివ్వండి. రోజూ మిమ్మల్ని శ్రమ పెట్టలేను."
సత్య ఏమీ బదులివ్వలేదు.
"అభ్యంతరమా ?"
'లేదనుకోండి . కాని నేనే వస్తాను. " స్థిరంగా ఉన్నాయి సత్య మాటలు.
ధర్మారావు మౌనంగా నిలబడ్డాడు.
చిరునవ్వుతో చెప్పింది సత్య. "జస్టిస్ న్యాయమిత్ర మా పినతండ్రి. వారి ఇంట్లోనే నేను ఉండేది."
ఉలిక్కిపడ్డాడు ధర్మారావు. మీరు జడ్జి గారి అన్న కూతురా?"
"అవును. అయితే మీరు రావడానికి అభ్యతరం లేదనుకోండి. కాని మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన దినాన స్వయంగా మా ఇంటికి తీసుకు వెళ్లాలని నా అభిప్రాయం."
"కృతజ్ఞుడిని." ఎంత ప్రయత్నించినా ఎదలోని సంతోషాన్ని వదనం లో ప్రదర్శించ కుండా నిగ్రహించు కోలేక పోయాడు ధర్మారావు.
"మరి సెలవు. నమస్కారం."
"నమస్కారం."
