Previous Page Next Page 
అతని లక్ష్యం పేజి 7


                                     3
    'ఇదుగో శర్మగారి వద్ద నుండి వారింట్లోనే దిగవలసిందిగా' అంటూ మరిదితో చెప్తూ అంతలో ముందరి హల్లో కొచ్చిన నిర్మల, ఫెడీ మని కారు తలుపు మూసి లోపలి కోస్తున్న రాజమ్మ గార్ని చూడ్డం తోనే ఒచ్చినంత వేగిరం మళ్లీ లోపలికి పరిగెత్తింది కాఫీ తీసుకొచ్చే నిమిత్తం.
    చేతులో వున్న పర్సు ని టీపాయి మీదికి విసిరేసి మురళీ కెదురుగా వున్న సోఫాలో చతికిల పడింది ధుమధుమ లాడుతూ ఆవిడ.
    'కాఫీ అత్తయ్యా?' అంటూ ట్రేని ఇద్దరి మధ్యా వున్న బల్ల మీద పెట్టింది నిర్మల.
    'పైన ఫేన్ కూడా తిరుగుతుంది చల్లారి పోతుందేమోనమ్మా' అన్నాడు తాను తాగడం పూర్తీ చేసిన ఇంక అలాగే కూర్చున్న తల్లిని చూసి మురళి.
    'నువ్వెందుకు మధ్య హెచ్చరించడం . అదుండగా' అన్నట్టుగా వోసారి విసుగ్గా మురళి వైపు చూసి కప్పందుకున్నారావిడ. తల్లి మాటలకి నిర్లిప్తంగా నవ్వాడు మురళి.' కారు కాస్త త్వరగా పంపడానికేం' ఇక ఆపుకోలేక అడిగేశారావిడ.'
    'మామగారు రావడంతోనే పంపించేశానత్తయ్యా' శాంతంగా అంది నిర్మల.
    'ఓహో ఆయనగారు చేసిన పనేనా ఇదీ... టక్కున ట్రేలో పెడుతూ ఈర్ష్యగా అన్నారు.
    'ఏడు గంటలకే కదమ్మా! అవునా?' తల్లిని రెచ్చగొట్టడమంటే మహా సరదా మురళి కి.
    'అదా మాటా! ఆరున్నర కల్లా పంపమని నే చెప్పి వెళ్ళానా లేదా, అందరూ వెళ్ళి పోయేదాకా అక్కడ వెల్లాడుకుంటూ అసహ్యం' చివరి మాటలు తనలో తను అనుకున్నట్లన్నారు.
    'అసల్సంగతి . ఇవాళ నగల్నీ చీరెల్నీ గురించి చర్చించే తమ ముఖ్య స్నేహితు లెవ్వరూ రాలేదు గావాల్నులే? లేకపోతె ఈ టైము సరిపోయేదేవిటసలమ్మకి?' కొంటె తనంగా చూస్తూ అన్నాడు మురళి.
    'అంటే చీరల్నీ, నగల్నీ గురించి ముచ్చటించుకుందుకు మాత్రమే నేను క్లబ్బు కెల్తూన్నదనేనా, నీ ఉద్దేశం' చురచురా చూస్తూ అడిగారు.
    'ఏమో... నీకోసరం నే కారు తీసుకొచ్చి నప్పుడల్లా ఈ ముచ్చట్లు మాత్రమే చూస్తున్నందున అడిగాను.
    'అన్నట్టు అయ్యరోచ్చాడా?'
    'ఇంకా లేదు.'
    'నాకు తెల్సునుగా, పోయాడంటే అదే [పోక....అందుకే 'నే తెస్తానమ్మా సామాన్లూ,' అంటూ మహా భక్తిగా బయల్దేరుతాడు బజారుకి....'
    'అవునమ్మా. పద్మవ్యూహం వంటి ఈ ఇంట్లోంచి బయట పడాలీ అంటే అతని కున్నది ఈ ఒక్క అవకాశమేగా! మరి అ వెళ్ళినప్పుడే అతని పన్లూ మన పనులూ అన్నీ చక్క బెట్టుకు రావాలి గదా! పాపం అతను మాత్రం ఏం జేస్తాడూ?' తల్లి నెత్తి పొడిచే అభిప్రాయంతో అయ్యరు మీద సానుభూతి చూపిస్తూ అన్నాడు మురళి.
    'అయ్యో? గ్లాసుడు మంచినీళ్ళు ముంచు కోవాలంటే ఎవ్వరికీ ఒళ్లోంగదు గానీ, అంతా మాత్రం అయ్యర్ని అనే వారేలే.'
    'అయినా అందరి సర్దు బాట్లకీ సిద్దంగా ఉండే ఈ ఒదినే కి మాత్రం అతని మీదేప్పుడూ కోపం రాదెందుకో. ఏం ఒదినా' అన్నాడు. 'అతనికి భర్తీగా చేసేది ఒదినైతే నీకెందుకు మధ్య విసుగు' అన్నట్టుగా మురళి --
    'సరి ఈ ముఖ స్తుతులకేం గానీ, ఏడున్నర దాటోస్తుందీ కదా ఇంకా'-
    'వంటయిపోయిందత్తయ్యా, రొట్టెల్తిని మామగారు వెళ్ళిపోయారు కూడా.
    'ఎక్కడికి?'
    'రాధని తీసుకు రావడానికి గుంటూరు వెళ్లారు. రేపేగా మరీ మీ ప్రయాణం? అందుకని, నారాయణరావు గారి కారెందుకో గుంటూరు వెళ్తుంటే తనూ ఏకంగా అందులో వెళ్లిపోయారు.
    'ఏం చేశావ్ మరి రొట్టేల్లోకి....
    'రెండో కూరేదీ ఇంట్లో లేదు. బాబు కూడా చేయి దిగలేదు. వాళ్ళూ త్వరగా వెళ్లి పోవాలంటూ --
    'ఆ? రోజల్లా రెక్కలు కష్టించాల్సిన మనిషాయే. చెయ్యాలను కుంటే ఏదన్నా చేసుండొచ్చు' నిర్మల పడ్డ ఇంత శ్రమనీ ఒక్క మాటతో కొట్టి పారేశారు దురుస్తనికలవాటు పడ్డ రాజమ్మ గారు.
    చిన్నబుచ్చుకు నిలబడున్న ఓదిన గార్ని చూశేసరికి తల్లి మీద ఎక్కల్లెని కోపమూ ఒచ్చింది మురళి కి.
    'ఆయన్దేసలే వేడి శరీరం. అందుకు తోడు పొరుగూరు ప్రయాణం. హు నేనింట్లో లేకపోతె అన్ని ఇలాగే ఎడుస్తుంటాయి.' అక్కడి కన్నీ తను స్వయంగా చూసుకునే మనిషి లాగే అన్నారావిడ.
    'అందుకనే ఆ తోడేసిన పెరుగేదో అయన కిచ్చేశా' వెళ్లు విరుచుకుంటూ బెదురుతూ అంది నిర్మల.
    'ఏవిటీ? ఆ ఉన్న కాస్త పెరుగూ ఇచ్చేసి నాకు లేకుండా చేశావా? ఒక్కపూట కాయనకి లేకపోతె ఏమయిందటా!' అంటూ అంత ఒళ్లూ మోసుకుంటూ చివాల్న లేచారావిడ. తల్లి స్వభావతత్వానికి తనలో తనే నవ్వుకుంటూ మేడ మీది కెళ్లి పోయాడు మురళి.
    ఒకసారి జేబురు మాల్తో మొహం తుడుచుకుని మళ్లీ ఎప్పట్లా కాలు మీద కాలు వేసు కూర్చున్నారావిడ.
    ఇంతట్లో మెల్లగా గేటు తీసుకుని బెదురు బెదురుగా లోపలి కొచ్చిన ఒకాయన 'దత్తు గారిల్లిదే నాండీ'అన్నారు మెట్ల మీద నుంచే.
    'అబ్బబ్బ అడ్డమైన వాళ్లూ లోపల్దూరాడవే గదా? ఎయి. పైడయ్యా భద్రకాళిలా అరుచుకుంటూ బయట కొచ్చింది రాజమ్మ గారు.
    'అబ్బబ్బ వీధి వాకిట్లో నిలబడి ఏవిటమ్మా ఆ అరవడం? అంటూ చదువుతున్న పుస్తకాన్ని వేలడ్డం తో మూసి పట్టుకుని దబదబా మెడ మెట్లు దిగొచ్చిన లీల 'ఎవరి కోసరమండీ' అని మెల్లగా ఆయన్ని అడిగింది.
    'ఆ ఇప్పుడొచ్చి ఈ శ్రీరంగ నీతుల్ని చెప్పకపోతే మొదట రారాదూ.' అని విసుక్కుంటూ మళ్లీ లోపలి కెళ్లి పోయరావిడ.
    'ఎవరి కోసరమండీ' మళ్లీ అడిగింది లీల'
    'కర్పూరపు విశ్వనాధ దత్తు గారి కోసరవమ్మా , వారిల్లెనా ఇదీ!!' బొక్కపోతూ అడిగాడాయన.
    'అవునండీ మా నాన్నగారే అయన'
    'అలాగా? మొహం చూస్తేనే తెలుసుంది. నా దగ్గర చదువుకునే రోజుల్లో అచ్చంగా ఇలాగే వుండేవాడమ్మా' అతడు మా చెడ్డ తెలివైన వాడులే. ఆ--
    'అలాగా రండి ఇలా ఈ కుర్చీలో కూర్చోండి.' వో బెత్తం కుర్చీ ముందుకు జరిపింది లీల.
    'బయట 'కె.వి.దత్' అని ఉంటేనూ బహుశా ఇతడే అయుంటాడను కున్నానే గానీ తీరా లోపలి కొద్దామంటే ఏ కుక్కన్నా మీద బడుతుందేమోనని భయం?....అదీగాక అవతల వీధిలో ఇలాగే పేరు చూసి అడిగితె 'ఇక్కడ లేరు పో'మ్మన్నారు అయినా ఈ కాలంలో కుక్కలకన్నా ఘోరంగా మొరుగుతూ వచ్చిన వార్ని తరిమేశే మనుషులూ వున్నార్లే/' -- ఇంకా ఏదో అనబోయి దబ్బున నాలి క్కోరుకున్నా రాయన.

                              
    'నాన్నింకా రాలేదా అమ్మాయి?'
    'ఒచ్చి గుంటూరు వెళ్ళారండి, ఉదయం ఒస్తే వుంటారు.'
    'ఆ? ఇతను బర్మా నుంచి ఒచ్చి ఇక్కడ మకాం పెట్టుకున్నాడని విని ఈ ఊరొచ్చి నప్పుడల్లా వాకబు చేస్తూనే వున్నా, ఇంత మహా బస్తీ లో ఎలా పట్టుకో గల్ననీ!'
    (నవ్వుకుంది లీల)
    'ఏదో తీరా ఇల్లు కనిపెట్టాను గదా. అంటే! చూడ్డం పడింది కాదు. మళ్లీ మా 'కంకిపాణ్నుం' ఛి రావాలంటే బళ్ల బెత్తుల్లా రాను రూపాయి పోనూ రూపాయి అవుతుంది!' రెండు చేతుల్నీ గొడుగు కమాను మీద అనుకుని నిలబడి ఆలోచనగా వోసారి తలా, ఒళ్లూ ఊపాడాయన. పాపం రాత్రికి వుండమందాం అనుకుని లోపలి కెళ్ళిన లీల ముక్కు తోటే ఒక్క కసురు కసిరి పారేసిన తల్లి వంక అదోలా చూసి, మళ్ళీ ఒచ్చేసింది.
    'సరి నేనేల్లోస్తా గానీ, నాన్నోస్తే 'వెంకన్న మాస్టారోచ్చి వెళ్లారూ' అని చెప్తావు కదూ!' అంటూ మెట్లు దిగి నాయన కాస్సేపాగి మళ్లీ వెనక తిరిగి చూసి. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS