ధన్వి వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైనా అణువంత మనసు విప్పి ఏదన్నా చర్చించేది సామ్రాజ్యంతోనే.....నిజానికి అతడు చెప్పాల్సిన అవసరం లేకుండానే అతడి నుంచి అన్ని విషయాలు రాబట్టగల సమర్ధురాలామె.
ఒకరిలో మరొకరు యిష్టమైన అంశం అభిరుచులు కలవడము లేక ఎవరికి వారుగా సొంతంగా సృష్టించుకున్న ప్రపంచాల్లో బ్రతకడాన్ని ఇష్టపడడమో యిద్దరికీ తెలిదు....ఇద్దరూ అత్మియులై పోయారు.....
తనను శాసించగల చనువు సామ్రాజ్యం ఎలా సాధించింది అన్నది ధన్వికి సైతం అర్ధం కాని విషయం.....
"భోంచేస్తావా?" అడిగింది అతడ్ని చేయి పట్టుకుని సోఫాలో కూర్చోబెడుతూ...."నువ్వు యింకా తినలేదన్న విషయం కూడా నాకెలా తెలుసని ఆశ్చర్యపోకు.....ధియరీ ఆఫ్ ప్రోబబులిటి ప్రకారం వుహించాను" క్షణం ఆగి అంది " రైటేగా."
"ఆకలిగా లేదు."
ఫకాల్న నవ్వింది.....
అది పసిపిల్లలా నవ్వడమో లేక అలా నవ్వినందుకు సామ్రాజ్యం పసిపిల్లలా అనిపించిందో అతడికి తెలీదు.....
"నేను నిజం చెబుతున్నాను" చిరుకోపంగా అన్నాడు ధన్వి.
"ఓకె....నీ ఆకలి సంగతి యిక మాట్లాడను....అలా 'ఆకలి' అంటూ మరేదో శ్లేష ధ్వనించేట్టు మాట్లాడటం కూడా సామ్రాజ్యనికి కొత్త కాదు....."జస్ట్....సరే అంటావనుకున్నాను ఈ రోజైనా."
క్షణం పాటు దృష్టి మరల్చుకోలేకపోయాడు.
ధన్వి....
సామ్రాజ్యం ఒంటిమీద నైటీ విచ్చుకున్న ప్రకృతి పచ్చదనం మీద అల్లుకున్న నురగంగా తరగలా అనిపించింది.....కలల చెలిమితో కాంతిని సొంతం చేసుకున్న ఆమె నేత్రాలు .....బ్రతుకు ఎడారినైనా పచ్చిక మైదానంగా మార్చగల ఆత్మవిశ్వాశం.....సంఘం కప్పుకునే సాంప్రదాయాల పొరల్ని కావాలనుకున్నప్పుడు చించి నిరాశల రొంపి నుంచి బయట పడగల నిబ్బరం.....కరగని చంద్రకాంత శిలనైనా గానీ తృటిలో తాకి లయల ద్రవంగా రప్పించి మనసుకి, మేధకి మధ్య పూల వంతెనలా మారగల చేవ.....మిదపడే శోకాన్ని కూడా శ్లోకంగా మలచుకుని గుండె బృందావనంలా విస్తరించి గడలా అగాధాల్లో నుంచి పైకి లేవనెత్తగల ఒడుపు.....
"తినేయకు."
ఉలికిపాటుగా వాస్తవంలోకి వచ్చాడు ధన్వి. గిల్టిగా అనిపించింది. సామ్రాజ్యం వేపు చుదలేనట్టు తల తిప్పుకున్నాడు. "నువ్వు చెప్పిన సీరియల్ చదివాను" తెలివిగా టాపిక్ మళ్ళించాడు.
"అదే....నిరవం సీరియల్ చదవమన్నావ్ గా."
అతడి ఆలోచనల్ని చదివేసినట్టు మృదువుగా నవ్వి "సరే...." క్షణం ఆగి "ఎలా వుంది?" దృష్టి మరల్చకుండా అంది.
"నచ్చలేదు."
"ఎందుకని?" సీరియస్ గానే అడిగింది. "నువ్వు తెలివైనవాడివి ధన్వి! నచ్చలేదు అంటే చాలదు విశ్లేషణ కావాలి.
అరనిముషం నిశ్శబ్దం తర్వాత అన్నాడు, "భాష గొప్పది కావచ్చు, కానీ భావం భాష కన్నా గొప్పది."
"ఆ సీరియల్ లో భాషా భావం రెండు వున్నాయిగా."
"లేదు." ఖండితంగా అన్నాడు. "భావాల్ని భాష డామినేట్ చేసింది. తాను మంచి రచన చేయాలన్న ఆలోచన కన్నా మంచి భాషని వాడాలన్న తాపత్రయం కనిపించింది మధూళీలో."
"గుడ్" అభినందించింది. "రచయిత్రి పేరు బాగానే గుర్తుపెట్టుకున్నావ్. మధూళీ అంటే అర్ధం తెలుసుగా.
"పూవుల్లో వుండే తేనె కదూ."
"గుడ్....నిక్కుడా మంచి భాషాప్రావీణ్యం వుంది" క్షణం ఆగి మధూళీ తో మాట్లాడతావా" అడిగింది సామ్రాజ్యం.
విభ్రమంగా చూశాడు, "ఎందుకు?"
"ఇందాక నేను ఫోన్ చేసి అభినందించిన, ఆమెకి నీ అభిప్రాయమూ చేబుతావని."
'అవసరంలేదు."
"అమ్మాయి చాలా అందంగా వుంటుంది."
"ఉంటే నాకేం."
"వయసులో వున్నవాడివి, అందంగా వున్న రచయిత్రిని చుశాకయినా ఆమె రచనల్ని యిష్టపడతావేమో అని."
"నీకు తెలుసు రాజ్యం!" ఇబ్బందిగా తలవంచుకున్నాడు. "నేను అలాంటి యావతో తపించే మనిషిని కాను."
"కానీ స్పందిస్తావ్ గా."
జవాబు చెప్పలేకపోయాడు.
అవును, కాదూ అంటూ ఏ ఒక్క పదాన్నయినా ధన్వి ప్రయోగించి వుంటే సామ్రాజ్యం క్షమించేదేమో. "ఇది హిపోక్రసీ అనిపించుకోదా ధన్వి" ఘనీభవించిన ఏ స్వప్నాన్నో స్వగతంలా వ్యక్తం చేసింది సామ్రాజ్యం. "నువ్వు వయసులో వున్నవాడివి. నీ ఆలోచనలూ, సిద్దాంతాలు ఏమైనా కానీ ఇంద్రియాలు వాటి కోలాల సత్వం అంటూ వుంటుంది......మరోలా అనుకోకు.....ఇందాక నువ్వు నన్ను చూస్తుంటే తినేయకు అని నేను అన్నది నా ఆడతనాన్ని నువ్వు అంచనా వేస్తున్నావన్న ఆలోచనతో కదా! ఆ విషయం ధైర్యంగా ఎందుకు చెప్పవు."
తడబడలేదు ధన్వి. "చూసి అనందించటానికి, అనుభవంతో అనందం పాదాలనుకోవటానికి తేడా వుంది రాజ్యం యస్. నిన్నూ నీ అందాన్ని యిరోజే కాదు చాలాసార్లు యీ రోజులాగే చూశాను. యస్.....అక్కడే ఆగిపోయాను. అది స్పందన దాకా వెళ్ళనివ్వలేదు, ఎందుకంటే స్పందించిన మరుక్షణం అందుకోవాలన్న ఆలోచనా మొదలవుతుంది కాబట్టి."
ధన్వి ఏదో దాచి మాట్లాడుతున్నట్టుగా లేదు. తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా నిర్మొహమాటంగా తన నమ్మకాన్ని పదునైనా కత్తిగా మార్చి ఎదుటి వ్యక్తీ మెదడుని డినేక్ట్ చేసి నింపుతున్నట్టుగా వ్యక్తం చేస్తున్నాడు. అతడిలో ఆమెకు నచ్చే అంశం కూడా అదే. అయితే ఆ మొండితనం ఆమెని తరచు అందోళనకి గురిచేసి వుంటుంది.
