Previous Page Next Page 
చిన్నమ్మాయ్ చిట్టబ్బాయ్ పేజి 63

   
    వాళ్ళ అదృష్టం బాగుండి అటుగా ఇంకో ఆటో వచ్చింది. దాన్ని ఆపాడు కన్నారావు.

    "ఏయ్ ఆటో! ముందెల్తుందే ఆ ఆటోని వేంబడిస్తావా ?" అడిగాడు.

    "ఓ అలాగే" అని ఆటోవాడు ముందుకి కదిలాడు రివ్వుమని

    "ఏయ్ ఏయ్... ఆగు..." కంగారుగా అరిచాడు కన్నారావు ఆటో వెనకాల పరుగెత్తుతూ.

    "ఆ ఆటోని వెంబడించమన్నావు కదయ్యా...మళ్ళి ఆగమంటావెం?" ఆ ఆటోని ఆపి మొహం చిట్లిస్తూ ప్రశ్నించాడు ఆటోవాడు.

    "మా ఇద్దర్ని ఎక్కించుకుని  ఆ తరువాత వెంబడించు..." చెప్పాడు కన్నారావు.

    "ఓ...అలాగా?" అన్నాడు ఆటోవాడు.

    కన్నారావు, కాంతామణి ఇద్దరూ ఆటో ఎక్కారు.

    "పోనియ్ త్వరగా ఊ..."కంగారు పెట్టాడు కన్నారావు.

    ఆటో రివ్వుమని ముందుకు దూకింది.


                                                                       20

    శివరావు వెళ్ళిన తరువాత రంగనాయకులు ఆఫీసుకు వెళ్ళిపోయాడు. భీమయ్య తోటపని చూస్కోసాగాడు. చాముండేశ్వరి వంటగదిలో ఆ పని ఈ పని చక్కబెట్టడంలో మునిగిపోయి ఉంది.

    చిన్నమ్మాయి షెల్ప్ లోంచి చేతికందిన  నవల తిసి సోఫాలో కూర్చుని చదవసాగింది. ఆమె కళ్ళు చదువుతున్నాది ఆమె మనసు గ్రహించడం  లేదు. ఏం చదువుతుందో అస్సలు అర్ధం కావడం లేదు. ఆమె చదువుతున్నది ఒక క్త్రేం నవల. అది ఒక విక్లిలో సీరియస్ గా ప్రచురింపబడి ఇప్పుడు నవల మొత్తం పుస్తకం రూపంలో వచ్చింది. ఆ నవల మనసు ఫ్రెష్ గా ఉన్నప్పుడు చదివితేనే అర్ధంకాదు. ఎవరు ఎవరీకి శత్రువో, ఎవరు ఎవర్ని ఎందుకు చంపుతున్నారో, ఎవరికీ ఎఅవారి మీద పాగో ఏమి అర్ధంకాదు. అటువంటిది మనసంతా గంద్రగోళంగా ఉంటే ఏం అర్ధం అవుతుంది?

    చిన్నమ్మాయి విసుగ్గా నవలని పక్కన పడేసింది.

    ఆమెకి చిట్టబ్బాయి గుర్తుకు వచ్చాడు.

    "పాపం!.. నాగురించి ఎంత దిగులు పెట్టుకున్నాడో? ... నిద్ర పోవడం లేదంట, సరిగా భోజనం చేయటం లేదట!! ఆరోగ్యం పాడుచేస్కుంటున్నాడో ఏమిటో...."

    ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

    "ఒకసారి ఆఫీసుకి ఫోన్ చేస్తేనో?" అనుకుంది

    అంతలోనే ఆమెకి అనిపించింది. 'ఫోన్ చేసి ఏం చెప్పాలి? బాగా నిద్రపో బాగా భోంచెయ్యి అని చెప్పాలా? దిగులుపడొద్దు అని చెప్పాలా?అలా చెప్పినంత మాత్రాన ఆయనా బాధపడకుండా ఉంటాడా? నేను నిన్ను తప్ప ఎవర్ని చేసుకోను అని నేనుయ్ చెప్తే బాధపడ్డం మానేస్తాడు గాని ఊర్కే కంటి తడుపు మాటలు అతని  బాధని ఎలా తగ్గిస్తాయి?"

    చిర కోంగుతో  కళ్ళు వోత్తుకుంది చిన్నమ్మాయి.

    ఆమెకి కన్నారావు ఇందాక ఫోన్లో చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.

    "పాపం! అతను శెలవు పెట్టి మరి ప్రయత్నిస్తున్నట్టున్నాడు. అతని  ప్రయత్నం ఫలిస్తే బాగుండును" అనుకుంది చిన్నమ్మాయి.

    కాని మరుక్షణంలోనే ఇంకో ఆలోచన...

    'ఒకవేళ అతని ప్రయత్నం ఫలించకపోతేనో?"

    ఆలోచనే భయంకరంగా అనిపించింది చిన్నమ్మాయికి.

    ఆలోచించిన కొద్ది ఆమె శరీరాన్ని నిస్సత్తువ ఆవహించసాగింది.

    అలా ఖాళీగా కూర్చుంటే పిచ్చెక్కడం ఖాయం.

    ఎద్తేనా పనిలో నిమగ్నం కావాలి!!

    లేచి వంట గదిలోకి వెళ్ళింది.

      అడుగుల చప్పుడు విని చాముండేశ్వరి వెనక్కి తిరిగి చూసింది.

    వెనకాల చిన్నమ్మాయి నిల్చుని ఉంది.

    "ఏమిటే?..."అడిగింది చాముండేశ్వరి.

    "అబ్బే ఏం లేదు. నీకు ఏమ్తెన సాయం చేద్దామని..."అంది చిన్నమ్మాయి.

    "పనంతా అయిపోయింది... ఇంకా నువ్వు చేయ్యదానికేమి లేదు గాని డ్తెనింగ్
 టేబులు దగ్గర కూర్చో భోజనం వడ్డిస్తా..."

    "నాకు ఆకలిగా లేదు... తర్వాత తింటాను...." వెనక్కి తిరిగింది చిన్నమ్మాయి.

    "ఎంత తినగలిగితే అంతే తినవే...వేడివేడిగా ఇప్పుడు తింటే కాస్తయినా  ఎక్కుతుంది. తరవాత్తేతే అసలు తినలేవు" వెనక నుండి చాముండేశ్వరి అరుస్తున్నా వినిపించుకోకుండా  తన గదిలోకి వెళ్ళిపోయింది చిన్నమ్మాయి!

    తన గదిలోని అలమర సర్దింది.

    షెల్ప్ లోని పుస్తకాలన్ని తిసి దుమ్ము దులిపి పెట్టింది.

    తరువాత తండ్రి గదిలోకి వెళ్ళింది.

    ఆ గదిలోని సెల్ప్ లోని  పుస్తకాలు సర్దుతున్నప్పడు ఒక పుస్తకం మధ్యలోంచి దళసరి  కవరు జారి కిందపడింది.

    చిన్నమ్మాయి కిందికి వంగి ఆ కవరు తీసింది. దాన్ని మళ్ళి అదే పుస్తకం కాగితాల మధ్యన పెట్టబోయింది.

    చిన్నమ్మాయి కిందికి వంగి ఆ కవరు తీసింది. దాన్ని మళ్ళి అదే పుస్తకం కాగితాల మధ్యన పెట్టబోయింది.

    అంతలోనే ఆమెలో కుతూహలం ఏర్పడింది.

    ఏముంది ఈ కవర్లో?...

    ఇలా పుస్తకాల మధ్యన ఎందుకు పెట్టారు?

    గబగబ కవరు ఓపెన్ చేసి చూసింది.

    ఫోటోలు!!!

    ఎవరివి?!!..

    కవరులోంచి పోటోలు తిసి చూసింది.

    వాటిని చూడగానే ఆమె మొహం భయంతో పాలిపోయింది. ఆమె కళ్ళు పెద్దగా విచ్చుకున్నాయి. శరీరమంతా  గగుర్పొడిచింది.

    ఆమె చేతులు ఒణికాయి.....

    ఆ ఫోటోలు అఆమే చేతిలోంచి  జారి నేలమీద పడ్డాయి...


                           *                        *                       *

    ముందు వెళ్తున్న ఆటో ఆగింది.

    "ఏయ్...ఏయ్... నువ్వు ఇక్కడే ఆపేయ్...." కన్నారావు ఆటోవాడి భుజంమీద తడ్తూ అన్నాడు.

    ఆటోవాడు ముందున్న ఆటోకి ఇరవ్తేగాజాల వెనకాల ఆటోని ఆపాడు.

    ముందున్న ఆటోలోంచి  శివరావు దిగి ఓసారి వెనక్కి తిరిగి వీళ్ళ ఆటో వంక చూసి చకచక ముందుకు అడుగులు వేయసాగాడు.

    'అమ్మో!... శివరావు చాలా స్పీడుగా వెళ్ళిపోతున్నాడు.' అనుకుని కంగారుగా ఆటోలోంచి దిగాడు కన్నారావు. అతని వెనకాలే కాంతామణి కూడా దిగింది.

    కన్నారావు పదిరూపాయల నోటు ఆతోవాడి చేతిలోపెట్టి "త్వరగా చిల్లర ఇవ్వు..." అన్నాడు శివరావు వెళ్తున వ్తేపే చూస్తూ.

    "చిల్లరలేదు సార్..."

    ఆటోవాడు చిలిపిగా నావ్వుతూ అన్నాడు. వాడికి తెల్సు వాళ్లు చాల కంగారులో ఉన్నారని, వాళ్ళ కంగారుకి చిల్లర వదులుకున్తేనా వెళ్ళిపోతారని.

    "చిల్లరపోతే పోయింది...త్వరగా పద... లేకపోతే శివరావు మిస్సి పోతాడు..." అంది కాంతామణి.

    కన్నారావు ఆతోవాడి వంక ఒకసారి కోపంగా చూసి గబగబా అడుగులు ముందుకు వేశాడు. కాంతామణి అతన్ని ఫాలో అయ్యింది. ఇద్దరి చూపులూ ముందు నడుస్తున్న శివరావు మీదే ఉన్నాయ్.

    అది చిక్కడపల్లి ఏరియా, మెయిన్ రోడ్డు నుండి పక్కలకు చిన్నచిన్న సందులు ఉంటాయి....ఆ సందుల్లోంచి పక్కలకి  మళ్ళి చిన్న చిన్న సందులు ఉంటాయి. ఏ సండులోక్తేనా శివరావు వెళ్ళిపోతే పట్టుకోడం కష్టం.

    అందుకే గబగబా అడుగులు  వేస్తూ అతనికి  మరింత దగ్గరగా వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు కన్నారావు కాంతామణి.

    శివరావు చటుక్కున ఒక సందులోకి తిరిగాడు.

    "త్వరగా పద....వాడా సందులోకి తిరిగాడు..." నడక వేగం పెంచుతూ అన్నాడు కన్నారావు.

    వాళ్ళిద్దరూ దాదాపుగా పరుగు పెడ్తున్నారు.

    ఇద్దరు సందులోకి తిరిగారు. కనుచూపు మేరలో వాళ్ళకి శివరావు కనిపించలేదు.

    "ఇప్పటికిప్పడే వీడు ఎక్కడ మాయం అయ్యాడబ్బా!!" బుర్ర గోక్కుంటూ ఆశ్చర్యంగా అన్నాడు కన్నారావు.

    "వాడికి మనం వెంబడిస్తున్నట్టు అనుమానం కలిగింది" అంది కాంతామణి.

    "ఎందుకలా అనుకుంటున్నావ్?" ఆమె మొహంలోకి చూస్తూ ప్రశ్నంచాడు కన్నారావు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS