Previous Page Next Page 
చిన్నమ్మాయ్ చిట్టబ్బాయ్  పేజి 62

    చిన్నమ్మాయితో ఫోన్లో మాట్లాడిన తరువాత కన్నారావు, కాంతామణి సందు మొదట్లో నిలబడి శివరావు కోసం ఎదురు చూడసాగారు.

    శివరావుని ఫాలో అవుతే అతని ఇంటి అడ్రెసు తెలుస్తుందని వారి ఆలోచన. ఒకసారి అతని ఇంటిని చూస్తే ఆ తరువాత అతని తండ్రి వీరస్వామితో మాట్లాడవచ్చు.

    "విడింకా రాడేం లోపల్నుండి" అన్నాడు కన్నారావు రంగనాయకులు ఇంటివ్తెపు చూస్తూ.

    "ఇప్పడే వెళ్ళాడు కదా? ఎంతసేపటికి  వస్తాడో?! మెల్లగా భోజనాలూ గట్రా ముగించుకుని వస్తాడేమో.  మనం ఇంకా ఎంత సేపిలా ఎదురు చూడాలో" అంది కాంతామణి విసుగ్గా చూస్తూ.

    "వాళ్ళకి సహాయం చేయాలనీ అనుకున్నాప్పడు ఎంతసేప్తెనా చూడక తప్పదు..."

    కన్నారావు బాధగా మూలిగాడు.

    "ఏంటిలా బాధగా మూలిగావ్? వాడిని ఫాలో  చేసే మూడ్ నికిప్పాడు లేదా?" ఆశ్చర్యంగా కన్నారావు వంక చూస్తూ అడిగింది కాంతామణి.

    "నేను మూలిగింది అందుకు కాదు...నువ్వు డొక్కలో పోడిచినందుకు. సరేగాని ఏ విషయమ్తెనా చెప్పేటప్పుడు మామూలుగా చెప్పొచ్చుగా? అలా డొక్కలో పొడవాలా?...."

    డొక్కమిద  చేత్తో రుద్దుకుంటూ అడిగాడు కన్నారావు.

    కాంతామణి నాలుక కొరుక్కుంది.

    "సారి కన్నా... గట్టిగా పోడిచానా?" అంది కాంతామణి తాను కూడా అతని డొక్కమీద నిముర్తూ.

    "మనం ఇలా మాట్లాడ్తూ కూర్చుంటే అవతల వాడేళ్ళి పోతాడు. నువ్వు ఇంటికి వెళ్ళిపోకూడదూ? నేను వాడిని ఫాలో అవుతాను." అన్నాడు కన్నారావు.

    ఊహూ...నేను కూడా వస్తాను"మొండిగా అంది కాంతామణి.

    "అది కాదు... నేను చెప్పేదేమంటే ...."

    "నువ్వేం చెప్పినా నేను వినదల్చుకోలేదు..." కన్నరావుని చెప్పనివ్వకుండా అడ్డు తగిలింది కాంతామణి. "నేను  ని కూడా వచ్చితిర్తాను. నువ్వు నాతో ఇలా వాదిస్తూ కూర్చుంటే వాడు వెళ్ళిపోతాడు..."

    "సర్లె సర్లె మెల్లిగా మాట్లాడు. వాడు దగ్గరికి వస్తున్నాడు" కాంతామణిని  హెచ్చరించాడు కన్నారావు.

    ఇద్దరూ ఆ సందులో వెనక్కి జరిగి,గోడపక్కన నక్కినిల్చున్నారు. కొన్ని క్షణాల తరువాత శివరావు ఆ ఇద్దారూ  ఉన్న సందు దాటి మెల్లగా నడుచుకుంటూ ముందుకి వెళ్ళాడు.

    "ఊ పద" కాంతామణితో  అని అడుగులు  ముందుకు  వేశాడు కన్నారావు.

    కాంతామణి కన్నారావుని ఫాలో అయ్యింది.

    శివరావుకి ఇరవ్తే  గజాల దూరంలో అతని వెనకాల నడుస్తున్నారు కన్నారావు కాంతామణి.

    కాస్త దూరం నడిచిన తరువాత శివరావు హఠాత్తుగా  రోడ్డు మధ్యలో ఆగిపోయాడు.

    "ఎందుకలా చెత్తకుండి దగ్గర గజ్జికుక్క ఆగినట్టు ఆగిపోయాడు?" అన్నాడు కన్నారావు.

    కాంతామణి ఎదో అనేంతలో  శివరావు చటుక్కున వెనక్కి తిరిగాడు.

    కన్నారావు, కాంతామణి కూడా కంగారుగా వెనక్కి తిరిగి ఏటో చూస్తున్నట్టు నటించసాగారు.

    "వాడేందుకలా హఠాత్తుగా వెనక్కి తిరిగాడు?" అడిగింది కాంతామణి.

    "కోపందిసి వాడిని మనం ఫాలో  అవుతున్నట్టు అనుమనంగాని లేదు కదా" కన్నారావు తన సందేహం వ్యక్తపరిచాడు.

    "మనం ఒక అరఫర్లాంగు కూడా వెంబడించలేదు. అప్పడే అనుమానం ఎందుకొస్తుంది?"

    కొన్ని క్షణాలు ఇద్దరూ మౌనంగా ఉన్నారు.

    "అసలు వాడు ముందుకు కదిలాడు ఇటే చూస్తున్నాడో కాస్త వెనక్కి తిరిగి చూడు" అంది కాంతామణి.

    కన్నారావు మెల్లగా వెనక్కి చూశాడు. ఆ తరువాత నిట్టూర్చాడు.

    "ఉన్నాడా?... వెళ్ళిపోతున్నాడా?" అడిగింది కాంతామణి.

    "ఉన్నాడు..." చెప్పాడు కన్నారావు.

    "ఏం చేస్తున్నాడు?...."

    కన్నారావు సమాధానం చెప్పలేదు.

    కాంతామణి వెనక్కి తిరగాబోయింది.

    "నువ్వు వెనక్కి తిరగోద్దు" పళ్ళు బిగబట్టి  విసుగ్గా అన్నాడు కన్నారావు.

    ఏం?... ఎందుకని?? వాడు మనవ్తేపే చూస్తున్నాడా?" మెల్లగా అడిగింది కాంతామణి.

    "లేదు..."

    "మరి చూస్తేనేం?"

    కన్నారావు వాదించేంతలో చటుక్కున వెనక్కి తిరిగి చూసి కెవ్వుమని అరిచి ఇటువ్తెపు తిరిగింది కాంతామణి.

    "నేను వద్దన్న పని చేయాలా? వెనక్కి తిరిగి చూడోద్దంటే ఎందుకు చూశావ్ మరి?" విస్కుంటూ అన్నాడు కన్నారావు.

    "వాడేం చేస్తున్నాడో చెప్తే చూసేదాన్ని  కాదుకదా? అయినా మగాళ్ళకిదేం మాయదారి రోగం గోడల్ని తడపడం. ఇప్పడే వాళ్ళింట్లొంఛి వచ్చాడు కదా. అక్కాడే ఆ పని చేయుచ్చుకదా" అంతకంటే ఎక్కువగా విసుక్కుంటూ అంది కాంతామణి.

    "వెనక్కి తిరిగిందానివి నోరు నొక్కుకుని ఉండాల్సింది కెవ్వుమని ఆ కేకలేంటి అక్కడేదో హత్యలు జరుగుతున్నట్టు! ని కేక విన్నాడో యెంటో?"

    కన్నారావు మెల్లగా వెనక్కి తిరిగి ఓ క్షణంపాటు చూశాడు శివరావువ్తెపు.

    "వాడి పని అయిపోయిందా?" కాంతామణి మెల్లగా అడిగింది.

    "ఊ. కాని మనవ్తేపే చూస్తున్నాడు. మనం రోడ్డు మధ్యనే ఇలా నిలబడి ఉంటే  వాడికేమ్తేనా  అనుమానం వచ్చిందేమో! దానికితోడు నువ్వొక దానివి కెవ్వుమని అరిచావ్. పోనీ ఓ పనిచేస్తేనో?"

    "ఏంటది?" కాంతామణి ప్రశ్నార్ధకంగా కన్నారావువంక చూసింది.

    "వాడికి  అనుమానం రాకుండా నేను కూడా గోడ దగ్గరికి వెళ్ళి నటిస్తేనో?" అమాయకంగా అడిగాడు కన్నారావు.

          "చాల్లే నోర్ముయ్. చావు తెలివితేటలు నువ్వూను..." విసుక్కుంది కాంతామణి.

    కన్నారావు బుద్దిగా తల ఊపాడు. రెండు క్షణాల తర్వాత మెల్లగా తల తిప్పి చూశాడు.

    "ఏయ్...వాడెళ్ళిపోతున్నాడు పద...పద..." అన్నాడు కంగారుగా.

    ఇద్దరు మళ్లి శివరావు ఫాలో అయ్యారు.

    నాలుగడుగులు వేసిన తర్వాత శిరావు  చటుక్కున వెనక్కి తిరిగి వీళ్ళవంక  చూశాడు. వీళ్ళిద్దరూ కూడా అంతే స్పీడుగా వెనక్కి తిరిగి నిల్చున్నారు.

    శివరావు కాజువల్ గా వెనక్కి తిరిగి చూడలేదు. వీళ్ళని చూడాలనే  చాశాడు. నిజానికి శివరావుకి వీళ్ళమీద ఇందాకే అనుమానం కలిగింది. రంగనాయకులు  ఇంటి నుండి బయటికి వచ్చ్చి నాలుగడుగులు వేశాక వీళ్ళిద్దర్ని  సందు మొదట్లో నిల్చుని  ఉండడం చూశాడు. మామూలుగా అయితే అనుమానం రాకపోను. కాని తనని చూస్తూనే కాంతామణి కన్నారావు  డొక్కలో పొడిచి చూపించడం శివరావు గమనించాడు. వాళ్ళు తనని ఎందుకలా చూశారో అతనికి అర్ధం కాలేదు. అతను ముందుకు నడుస్తూ పక్కకి తిరిగి క్రిగంట గమనించాడు వాళ్ళిద్దరూ తనని ఫాలో ఆడం.

    అసలు అతని పాలో అవుతున్నారో లేదో నిర్ధారించుకోవాలని అనిపించింది. అందుకనే గోడ దగ్గర ఆగి నటించాడు. తనని ఫాలో కాని పక్షంలో వాళ్ళు తనని దాటి ముందుకు వెళ్ళిపోవలి!

    కాని అలా జరగలేదు. వాళ్ళు కూడా కాస్త దూరంలో ఆగిపోయారు.

    అంటే?...

    వాళ్ళిద్దరూ తనని ఫాలో అవుతున్నట్టు కన్ ఫర్మ్ అయిపోయింది శివరావుకి. వీళ్ళు తనని ఎందుకు ఫాలో అవుతున్నట్టూ?

    ఆలోచనలో పడ్డాడు శివరావు.

    అదే సమయంలో అటుగా ఒక ఆటో వచ్చింది. దాన్ని ఆపి ఎక్కేశాడు శివరావు.

    కన్నారావు, కాంతామణి కంగారు పడిపోయారు.

    "ఇప్పడేలా?... ఎలా?" గంతులేశాడు కన్నారావు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS