"మొహంలోకి చూడాలంటే మరి మొహం మీద మొహం పెట్టక్కర్లేదు.... కాస్త వెనక్కి జరుగు...లేకపోతే చూసిన వాళ్ళు నన్ను ముద్దు పెట్టుకోడానికి ప్రయత్నిస్తున్నావని అనుకుంటారు..." సీరియస్ గా అంది కాంతామణి.
కన్నారావు వెనక్కి జరిగాడు.
"చెప్పు...ఎందుకలా అనుకుంటున్నావ్?" దూరం నుండే ఆమె మొహంలోకి చూస్తూ అడిగాడు.
"ఎందుకంటే వాడు వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి అనుమానంగా చూస్తున్నాడు మన వంక. అంతేకాదు... ఆటోలో ఇక్కడదాకా వచ్చినవాడు యింటి దగ్గర ఆటోని ఆపుతాడుగాని ఇలా మధ్యలో ఇక్కడదాకా వచ్చనవాడు యింటి దగ్గర ఆటోని ఆపుతాడుగాని ఇలా మధ్యలో ఆగి ఎందుకు నడుస్తాడూ?"
"అవును....ఎందుకు నడుస్తాడూ?" బుర్రగోక్కున్నాడు కన్నారావు.
"ఎందుకంటే మనకి వాడి ఇల్లు తెలీడం ఇష్టంలేదు... ఇంటికి దూరంగా ఆటో దిగి మన కళ్ళు కప్పి వెళ్ళిపోదామని అతని ఆలోచన..."
"వాడు అనుకున్నట్టే మన కళ్ళు కప్పి వెళ్ళిపోయాడుగా?"
"క్షణాల్లో ఎక్కడికి మాయమౌతాడూ?... వాడెక్కడికి పోలేదు... ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటాడు. మనం వెళ్ళిపోగానే బయటికి వచ్చి తనూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనమేం చెయ్యాలంటే మనం కూడా ఎక్కడ్తేనా దాక్కుని వాడు బయటికి రాగానే వాడిని మళ్ళి ఫాలో కావాలి!!!" అంది చింతామణి.
కన్నారావు చిట్టుపక్కల పరికించి చూశాడు.
కాస్త దూరంలో అతనికి సగం కట్టిన గోడ కనిపించింది.
"ఆ...మనం ఆ గోడ వెనకాల దాక్కుందాం ..." సంబరంగా అంటూ గోడవ్తెపు వడివడిగా అడుగులు వేశాడు కన్న్రారావు. కాంతామణి అతన్ని ఫాలో అయ్యింది.
ఇద్దారూ గోడ వెనక్కి వెళ్ళి ఉలిక్కిపడ్డారు.
అక్కడ శివరావు ఉన్నాడు!!
శివరావు వీళ్ళని, వీళ్ళు శివరావుని తెల్లబోతూ ఒకర్నొకరు చూస్కున్నారు.
కాంతామణి వెంటనే తేరుకుంది.
కన్నారావు వంక సీరియస్ గా చూసి "ఏది ఇక్కడ షాపేదో ఉందన్నావ్?... ఎక్కడో?" అంది కన్నుగోడ్తూ.
కన్నారావు మెలికలు తిరిగిపోయాడు.
"మరి..హి... మొన్న నేనోచ్చినప్పాడు ఇక్కడే ఉండాలి!.. ఏమ్తెందో ఆ గోడ?... హిహి-
"గోడ కాదు.... షాపు!! ...షాపు!!.." నొక్కి పలికింది కాంతామణి. "ఆ షాపులో మంచి పర్ ప్యూం ఉంది... నీకు కొనిపెడ్తానని చెప్పి సండులన్ని తిప్పతున్నావ్!" విసుక్కుంటూ అంది.
"ఈగోడ వెనకాల ఉండాలి షాపు!- నాకు బాగా గుర్తు...."
"ఈగోడ కాదు... ఇలా సగం కట్టిన గోడ ఇవతలికి లాక్కొచ్చింది.
"మెలికలు తిరుగుతూ నంగినంగిగా మాట్లాడ్తావేం చకచకా సమాధానాలు ఇవ్వక?" కన్నారావు మీద మండిపడ్తూ అంది.
"ఏం చెయ్యను మరి... నువ్వు కన్నుకోట్టేసరికి ఒళ్లంతా జివ్వుమని లాగేసింది..."సిగ్గుపద్తూ అన్నాడు కన్నారావు.
'సర్లె పద త్వరగా' కన్నారావు చెయ్యిపట్టి ముందుకు లాక్కెళ్ళింది.
"ఎక్కడికి?..." ఆమె వెంట వెళ్తూ అడిగాడు కన్నరావు.
ఆమె సమాధానం చెప్పకుండా కన్నరావుని ఒక యింటి కాంపౌండ్ లోకి లాక్కెళ్ళింది.
"ఈ కాంపౌండ్ వాల్ వెనక నుండి గమనిద్దాం" అంది కాంతామణి.
"ఈ యింటి వాళ్ళు చూస్తే బాగుంటుందా?" సందేహిస్తూ అడిగాడు కన్నారావు.
"ఈ ఇంటికి తాళం పెట్టి ఉంది...ఇందాకే చూశాను..." కన్నారావు వంక చూడన్తేనా చూడకుండా సమాధానం చెప్పింది. కాంపౌండ్ వాల్ కి కాస్త ప్తెకి తల పెట్టి సగం కట్టిన ఆ గోడ వంక చూస్తూ కాంతామణి.
ఇద్దరూ నిశ్శబ్దంగా ఓ రెండు నిముషాలపాటు ఎదురు చూశారు.
శివరావు మెల్లగా ఆ గోడ వెనకనుండి బయటికి వచ్చాడు. అతన్ని చూడగానే కన్నారావు, కాంతామణి కాంపౌండ్ వాల్ కంటే కిందికి తలలు వంచారు.
శివరావు ఓసారి భయంగా అటూ ఇటూ చూసి తనని ఎవరూ గనించడం లేదని నిర్ధారించుకుని అడుగులు ముందుకు వేశాడు.
"వాడు వెళ్ళిపోతున్నాడు. మనం త్వరగా వెళ్ళాలి. పద!...." అంది కాంతామణి కాంపౌండ్ వాల్ మీది నుండి తల కాస్త ప్తెకేత్తి చూస్తూ.
ఇద్దరూ శివరావుని మళ్ళి వెంబడించారు.
శివరావు సందు చివరదాకా వెళ్ళి మలుపు తిరుగుతూ ఓసారి వెనక్కి తిరిగి చూశాడు.
అతనికి కన్నారావు కాంతామణి తనని ఫాలో అవుతూ రావడం కనిపించింది.
ఈసారి శివరావుకి నిజంగానే కంగారుపుట్టింది.
గబగబా సందు తిరిగాడు. ఆ సందులోనే అతని యిల్లు ఉంది. త్వరగా అడుగులు వేస్తూ యింటి ముందుకు వచ్చాడు. ఇంటి కాంపౌండ్ వాల్ గెటు గడియ లోపల్నుండి వేసి ఉంది. దానిని గేటు గ్రిల్స్ సందుల్లోంచి తియ్యాలంటే కాస్త టైం పడ్తుంది. ఈలోగా వాళ్ళిద్దరూ వచ్చేస్తారు.
ఏ మాత్రం ఆలస్యం చెయ్యకూడదు. గభాలున కాంపౌండ్ వాల్ దూకి వాళ్ళకి కనబడకుండా యింట్లో కి వెళ్ళిపోతే అక్కడంతా తన కోసం వెతికి కనిపించక ప్తె సందులోకి వెళ్ళిపోతారు అనుకున్నాడు శివరావు.
అలా అనుకున్న మరుక్షణం చటుక్కున కాంపౌండ్ వాలేక్కి లోపలికి దూకాడు శివరావు.
అంతే-
మరుక్షణం ఒక దుడ్డుకర్ర అతని నెత్తిని బలంగా తాకింది.
శివరావు గావు కేకపట్టి వెనక్కి విరుచుకుని పడిపోయాడు.
"ఆహ! మా యింటికే దోంగాతాననికి వస్తావా? నీకెంత ద్తేర్యంరా?"
పనివాడు వెంకన్న దుడ్డుకర్రని నెలకి ఆనించి పట్టుకుని మార్చపోయి ఉన్న శివరావు వంక చూసి గుండెలు బాదుకున్నాడు.
"ఆయ్ బాబో... అయ్యగారూ మీరా? ఎంత పొరపాటైపోనాది బాబూ మనింట్లోకి రాడానికి గేట్లోంచి రాక గోడేందుకు దూకారు బాబూ"
వెంకన్న గోల విని కన్నారావు కాంతామణి అక్కడికి వచ్చారు. ఆ సందులోకి తిరగ్గానే వాళ్ళకి శివరావు పెట్టిన గావు కేక కూడా వినిపించింది.
"ఏమ్తెంది?" గోడ మీది నుండి కన్నారావు వెంకన్నని ప్రశ్నించాడు.
"మా అయ్యగారు గోడెక్కి లోపలికి దూకితే ఇక్కడ నిల్చుని ఉన్న నేను దోంగోదేమో అనుకుని ఆయన బుర్ర రామకిర్తన పాడించా బాబూ" బాధగా శివరావు వంక చూస్తూ అన్నాడు వెంకన్న.
కన్నారావు కాంతామణి గోడ మీది నుండి వంగి కిందికి చూశారు.
శివరావు వేల్లకితలా పడి ఉన్నాడు.
"ఈయన మీ అయ్యగారా?" కాంతామణి వెంకన్న అడిగింది.
"అవునమ్మ!..."
"మీ పెద్దయ్యగారు ఇక్కడే ఉంటారా!"
"పెద్దయ్యగారేవరయ్య?"
"ఈయన తండ్రిగారు"
"ఆయన తల్లిదండ్రులు లేరు కదమ్మా... ఎప్పుడో చచ్చిపోయరమ్మ. ఇక్కడ ఈయనా నేనే ఉంటామమ్మ-"
"ఆ!!...విరాస్వామిగారు చచ్చిపోయారా?" ఆశ్చర్యంగా అడిగాడు కన్నారావు.
"వీరస్వామి ఎవరండి?" అంతకంటే ఆశ్చర్యంగా అడిగాడు వెంకన్న.
"ఈయన పేరు శివరావే కదా?"
"అవును బాబూ"
"ఈయన తండ్రి వీరాస్వామి కాదా?"
"కాదు బాబూ. ఈయవ తండ్రి పేరు సంగామేశ్వర్రావు." ఆయనేప్పదో చచ్చిపోయారండి"
కన్నారావు, కాంతామణి మొహమొహాలు చూస్కున్నారు.
"ఏంటి బాబూ? ఇంతకి తమరు ఎవరికోసం వచ్చారు?" ఇద్దరి వంక మార్చి చూస్త్గూ అడిగాడు వెంకన్న.
"మేము శివరావు ఇంటికోసం వచ్చాముగాని మాకు కావాల్సిన శివరావు ఈయన కాదులే. ఈ కాలనీలో ఇంకో శివరావు ఉండి ఉంటాడు" అని సమాధానం ఇచ్చి "రా కన్నా" అంటూ కన్నారావు చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళి పోయింది కాంతామణి.
వాళ్ళు వెళ్ళిపోగానే వెంకన్న శివరావు వంక చూసి మళ్ళి గుండెలు బాదుకున్నాడు.
