విష్ణు తన ఆశ్రమంలోని విదేశీ భక్తులతో సంప్రదించిన మీదట ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాడు.
* * * *
బ్రహ్మాండమయిన ప్రజా వేదిక అది!
రాష్రం యావత్తూ కదిలి వచ్చిందా అన్నంత అనంత ప్రజా వాహిని......
ఆ రోజు ఇద్దరు ముఖ్య వ్యక్తులు ఆ సభలో పాల్గొనడమే డానికి కారణం......
ఒకరు సాక్షాత్తూ దైవాంశ సంభూతుడైన విష్ణు అయితే రెండవ వ్యక్తీ భారత ప్రజలు అభిమానించి, తమ పవిత్రమయిన ఓట్లతో గెలిపించి పదవి కట్టబెట్టిన తెలుగు వాడిన ప్రధాని.....
ఇద్దరు మహామహులులు వస్తున్నారంటేనే పోలీసుల హడావుడి ఇక చెప్పలనవి కాదు......ఎటు చూసినా పటిష్టమయిన బందోబస్తు , ట్రాఫిక్ డైవర్షన్.
కలెక్టర్ ధీరజ, కమీషనర్ పృద్విరాజ్, ఇన్స్పెక్టర్ వినయ్ కుమార్, ఏసిపి కిరణ్మయి, రీటా లందరూ విధి నిర్వహణలో నిమగ్నమై వేదికపై ప్రముకులకు సకల రక్షణను కల్పించడంలో మునిగి వున్నారు.
ఆ రోజు ప్రధాన మంత్రి పుట్టిన రోజు కావడం మరొక విశేషం. ఆరోజు తనకు ఇష్టమయిన ఆంధ్రప్రదేశ్ లో గడపాలని ప్రధాన మంత్రి నిర్ణయించుకోవడం వెనువెంటనే విజయవాడ నగరంలో మహా సభ ఏర్పాట్లు సిద్దం చేయడం క్షణాల మీద జరిగిపోయాయి.
సభాస్థలి జన సందోహంతో క్రిక్కిరిసి పోయి వున్నది.
రాజకీయ నాయకులతో పరివేష్టతమైన ప్రధాన మంత్రి స్టేజిని అలంకరించారు. ప్రధాని తనదైన శైలిలో సభికులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఆయనను అభినందిస్తూ వివిధ రాజకీయ నాయకులు కూడా తమ విశ్వాసాన్ని ప్రకటించుకున్నారు.
రాజకీయ ఉపన్యాసాలు అయిపోయిన తర్వాత వచ్చాడు విష్ణు.
ఆయనను సాదరంగా ఎదురెళ్ళి మరీ వీడ్కొని తెచ్చారు ప్రధాన మంత్రి.
చిరునవ్వుతో వేదికపై ప్రత్యేకంగా ఏర్పరిచిన రాజసింహాసనంలో కూర్చోబెట్టారు విష్ణుని.
"స్వామీజీ....ఈ భక్తుడ్ని ఆశీర్వదించండి"
ఒక దేశానికి ప్రధాన మంత్రి అయి వుండీ.....తాను కొన్ని కోట్ల ప్రజల తరపు ప్రతినిధిని అన్న విషయం సయితం మరచిపోయి ......భక్తీ ప్రవత్తులతో విష్ణు కాళ్ళపై సాష్టాంగ పడ్డారు ప్రధాని.
ఎవ్వరూ ఉహించని ఆ చర్యకు ప్రజలు , పెద్దలు , విజ్జులు ముక్కున వేలు వేసుకున్నారు.
కానీ, అలా చేసింది సాక్షాత్తూ ప్రధాని కాబట్టి బిగ్గరగా చప్పట్లు కొట్టి మరీ తమ ఆనందాన్ని వ్యక్తీకరించారు ఆబాలగోపాలం........
"ఆయుష్మాన్ భవ.......లే చిరంజీవి........"
అప్పుడు కానీ పైకి లేవలేదు ప్రధాని.
"నీ పుట్టిన రోజు నా కానుకగా దీన్ని స్వీకరించు........." అని గాలిలో అలా చేయి కదిలించాడు విష్ణు.
మరుక్షణం వెండితో చేసిన శివలింగం విష్ణు చేతిలో ప్రత్యక్షమయింది.
ఈ శివలింగాన్ని నీ పూజా పీఠంలో ప్రతిష్టించుకో. నీకు శుభం కలుగుతుంది." అంటూ చేతిని ముందుకు సాచాడు విష్ణు.
"మహా ప్రసాదం , స్వామీ ........" దోసిలి పట్టారు ప్రధాని.
క్షణాల మీద జరిగిన ఆ సృష్టిని చూసి నిన్ను తప శక్తికి ఆశ్చర్యపోయారు.
విష్ణు ముందు మైక్ ను అమర్చారు.
వేదికపై నిలిచి చేయెత్తి ప్రజలకు అభివాదం చేయడంలో ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొన్నది.
ఆ దృశ్యం చూసిన ప్రధానికి నోట మాట రాలేదు.
"ఒక్క కనుసైగతో ప్రజలను శాంత పరిచాడు. ఎంత గొప్ప తపశ్శాలో కదా!" అని తనలో తనే విష్ణు గొప్పదనానికి ఆశ్చర్యపోయా రాయన.
భక్త మహాజనులారా......." ఆశ్రమంలో క్షణం కూడా తీరిక లేక పోయినా ఇలా మీ అందరి ఎదుటా నిలిచి నాలుగు మాటలు చెప్పాలని నా ప్రియ శిష్యుడు మన ప్రధాని పదే పదే కోరడం వలన నేను ఇక్కడకు రాక తప్పింది కాదు. వచ్చింది ఏ పండిత సభలకో.....సంమాల సభలకో కాదు.....రాజకీయ నాయకులు తమ నాయకుని పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటున్న సభలకు కాబట్టి, రాజకీయాలు నాకు నచ్చని అంశమే అయినప్పటికీ ఇప్పుడు చెప్పక తప్పడం లేదు...."
విష్ణు ఏం చెబుతాడా అని చెవులు రిక్కించి వింటున్నారంతా.
"ఈరోజున రాజకీయాలన్నీ కలుషితమైపోయాయి. కేవలం తమ స్వార్ధం కోసమో, కీర్తి కాంక్ష కోసమో రాజకీయ నాయకులు మసలినంత కాలం ఈ దేశం అభివుద్ది పధం వైపు సయనించదు.
"మన దేశ సంస్కృతీ విదేశాలలో సయితం ఈనాటికీ ఎందుకు గొప్పగా చెప్పుకుంటారు? ఇంతకాలం మనలను ఏలిన హిందూ దేశ రాజులు మనకు సంపాదించి పెట్టిన కీర్తి ప్రతిష్టల వలన......కానీ ఈ రోజు కుల వైషమ్యాలతో మితిమీరిన అరాచకాలతో ఒకరి నొకరు చంపుకుంటున్నారు.
"జాతి మాత బేధాలతో తమ వారికి న్యాయం జరిగితే చాలు అనే స్వార్ధపిశాచి కోరలు సాచి ప్రత్యర్ధులను వేటు వేసి మట్టు పెట్టె హత్యారాజకీయాలు పెరిగిపోయాయి. ఇలాంటి అరాచకాలు నశించి సమ సమాజ స్థాపనే ధ్యేయంగా భావించే పాలకులు నేడు కావాలి. అటువంటి వాళ్ళు మన రాజకీయ నాయకులలో ఎవరయినా వున్నారా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను......"
అవి విష్ణు అన్నాడో లేదో......
మరుక్షణం ప్రజాస్పందన పెల్లుబికింది.
"లేరు..........లేరు.......'
