Previous Page Next Page 
చిన్నమ్మాయ్ చిట్టబ్బాయ్ పేజి 61

    చిన్నమ్మాయి ఫోన్ పెట్టేసి వచ్చి సోఫాలో కూర్చుంది.

    కన్నారావు కాంతామణిలతో మాట్లాడిన తరువాత ఆమె మనసుకి కాస్త రిలిప్ గా  ఉంది.

    నిజంగానే వాళ్ళు తన సమస్యని పరిష్కరించగాలరా? నిజంగానే వాళ్ళు తన పెళ్ళి చిట్టబ్బాయ్ తో  జరిపించాగలారా? తన జీవితాన్ని చిట్టబ్బాయ్ తో పంచుకోగాలదా?...

    అలా కాస్సేపు ఆలోచిస్తూ కూర్చుంది.

    అప్పడే స్నానం ముగించుకుని వచ్చిన రంగనాయకులు తను కూడా హల్లోమరో సోఫాలో కూర్చున్నాడు.

    "యేం...? ఈ వేళ ఆఫీసుకి వెళ్ళరా అంత తీరుబడిగా కూర్చున్నారు?" చేతిలో కాఫీ సిప్ చేయసాగాడు రంగనాయకులు.

    అతనికి ఈమధ్య మనసు దేనిమీదా లగ్నం కావడం లేదు. మనసంతా అల్లకల్లోలంగా  ఉంది.

    ఆఫీసుకి కూడా వెళ్ళబుద్ది కావడం లేదు.

    భర్త మొహం వంక కాస్సేపు చూసి అతని నుండి ఏ విధమ్తెన  సమాధానం రాకపోవడంతో  ఊరకుండి చాముండేశ్వరి.

    రంగనాయకులు కాఫీ మెల్లగా సిప్ చేయసాగాడు. అప్పడే కూరగాయల సంచితో భీమయ్య లోపలికి వచ్చాడు. చాముండేశ్వరి భీమయ్య చేతిలోని కూరల సంచిని అందుకుంది.

    "భీమయ్య...ఇది తిస్కెళ్ళు"

    ఖాళి కప్పను ముందుకు చాపాడు రంగనాయకులు. భీమయ్య ఆ కప్పని అందుకున్నాడు.

    చాముండేశ్వరి కూరల సంచితో లోపలికి వెళ్ళబోయింది. అప్పడే వినిపించింది ఆ పిలిపు.
    "హయ్ అత్తయ్యా...హయ్ మావయ్యా..."

    అందరూ గుమ్మంవ్తెపు చూశారు."

         శివరావు!!...

    అతన్ని చూడగానే అందరి మొహాలు రంగు మారాయి.

    శివరావు గదిలోకి గబగబా వచ్చి రంగనాయకులు కాళ్ళ మీద పడిపోయాడు.

    రంగనాయకులు ఆశ్చర్యంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు.

    చాముండేశ్వరి భీమయ్య ఒకర్నొకరు కళ్ళింతింత చేస్కుని చూస్కున్నారు.

    "ఏంటో అనుకున్నాం గాని... కుర్రాడు బుద్ధిమంతుడే. పెద్దలంటే గౌరవం భక్తి ఉన్నాయి" మెల్లగా అంది చాముండేశ్వరి.

    "యస్ అమ్మా... యస్..." రంగనాయకులు పాదాల చెంత ఉన్న శివరావు పరవంశగా చూస్తూ అన్నాడు భీమయ్య.

    చిన్నమ్మాయి చికాకుగా తల్లివంక చూసింది.

    "అతను నాన్నగారి పాదాలకి మనస్కరించడం లేదు... లోపలికి వస్తూ గుమ్మం తట్టుకుని తూలి నాన్నగారి పాదాల మీద పడ్డాడు" తల్లి చెవిలో విసుగ్గా అంది చిన్నమ్మాయి.

    "అంతేనా?..." దీర్ఘాలు తీస్తూ అంది చాముండేశ్వరి.

    "ఏంటి చిన్నమ్మాయిగోరూ నాక్కూడా  చెవిలో చెప్పరా?...టెల్ చిన్నమ్మయిగోరు టెల్..." తల పక్కకి పెట్టి చిన్నమ్మాయి మొహం మీద చెవి పెట్టాడు.

    "ఏం లేదు...నువ్వు కాస్త దూరంగా జరుగు" విసుక్కుంటూ అంది చిన్నమ్మాయి.

    భీమయ్య వెనక్కి జరిగి నిల్చున్నాడు.

    శివరావు మోకాలు చిప్పలు  రుద్దుకుంటూ లేచి రంగనాయకులు పక్కన సోపాలో కూర్చున్నాడు.

    చిన్నమ్మాయి తన పక్కనే ఉన్న వారపత్రిక తిసి శివరావు కనిపించని విధంగా మొహానికి అడ్డుపెట్టుకొని చదువుతున్నట్లు నాటించసాగింది.

    "ఇంటికొచ్చిన అతిథులకు కాఫీ, టిల్లాంటి ఏర్పాట్లేవి లేవా మావయ్య?" అన్నాడు శివరావు రంగనాయకులు వంక చూస్తూ.

    వెంటనే రంగనాయకులు చాముండేశ్వరి వంక చూశాడు. "మాయదారి సంత... ఏంటలా చూస్తున్నావ్? వెళ్ళి కాఫీ తీసుకురా..."

    చాముండేశ్వరి లోపలికి వెళ్ళబోయింది.

    "అమ్మా...నువ్వుండు...కాఫీ నేను పెడ్తాను...." చటుక్కున లేచింది చిన్నమ్మాయి.

    ఫరవాలేదే... మనమంటే అభిమానం బాగానే ఉంది" నవ్వాడు శివరావు.

    చిన్నమ్మాయి భీమయ్యకు స్తెగ చేస్తూ వినవిసా లోపలికి వెళ్ళిపోయింది. భీమయ్య చిన్నమ్మయిని  ఫాలో అయ్యాడు.

    అక్కడ శివరావు ఎదురుగా కూర్చుని ఉండడం ఇష్టం లేదు చిన్నమ్మాయికి. అందుకే కాఫీ పెట్టె వంకతో లోపలికి వెళ్ళింది.

    చిన్నమ్మాయి  లోపలికి వెళ్ళగానే పెళ్ళి ముహూర్తం ఎప్పుడు పెడ్తారని రంగానాయకుల్ని అడిగాడు శివరావు.

    త్వరలోనే పెడ్తానని రంగనాయకులు శివరావుకి చెప్పాడు. ఎక్కువ కాలం ఎదురు చూడడం తనకి ఇష్టంలేదని చెప్పాడు శివరావు.

    అంతలోనే భీమయ్య కాపి కప్పతో అక్కడికి వచ్చాడు.

    శివరావు రెండు గుక్కల్లో పాఫి  తాగేశాడు.

    "మీరు ఒకసారి బయటికి వస్తారా?... మీతో  మాట్లాడాలి?..."సోఫాలోంచి లేస్తూ అన్నాడు శివరావు.
    రంగనాయకులు కూడా లేచి నిలబడ్డాడు.

    శివరావు గబగబా బయటికి వెళ్తూ గుమ్మాన్ని తన్నేసి మళ్ళి బోర్లా పడిపోయాడు. రంగనాయకులు శివరావుని లేవనెత్తాడు.

    ఇద్దరూ వరండాలోకి వెళ్ళారు.

    అంతలోనే  ఫోన్ మ్రోగింది. భీమయ్య చటుక్కున ఎఇసివార్ ఎత్తాడు.

    "హలో?...ఎవరూ?.." అని అడిగాడు.

    "అవతలి వ్యక్తి సమాధానం విని "యస్.. యస్... చిన్నమ్మాయి గార్ని నేను కాలింగు. మీరు వెయిటింగ్ చెయ్యండి..."అన్నాడు భీమయ్య.

    "ఫోన్ అమ్మాయికా?" అడిగింది చాముండేశ్వరి.

    అవునని సమాధానం చెప్పి "చిన్నమ్మాయి గోరూ...మీకు ఫోన్ కమింగ్ రండి. కం అమ్మాయిగారూ..." లోపలికి చూస్తూ అరిచాడు భీమయ్య.

    చిన్నమ్మాయి బయటికి వచ్చి ఫోన్ ఎత్తింది.

      "హలో..."

    "హలో...నేనండి కన్నరావుని"

    "ఏంటండి మళ్ళి ఫోన్ చేశారు?"

    "ఇప్పుడు మీ ఇంటికి ఒకతను వచ్చాడుకదా..అతనెవరు?"

    "వచ్చినట్టు మికెలా తెల్సు?!" ఆశ్చర్యంగా అడిగింది చిన్నమ్మాయి.

    "ఇందాక మీ ఇంటికి దగ్గర్లో ఉన్న షాపునుండే ఫోన్ చేశాను...ఫోన్  పెట్టిసి  వస్తుంటే మీ ఇంటి ముందు ఆటో ఆగడం, అందులోంచి ఒకతను దిగి మీ ఇంట్లోకి రావడం చూశాను. ఒకవేళ అతనే శివరావేమోనని తెల్సుకుందామని ఫోన్ చేశాను.

    "వాడే..." చెప్పింది చిన్నమ్మాయి.

    "ఓహొ! అయితే వాడేనన్నమాట. వాడి సంగతి నేను చూసుకుంటాలే మరోసారి చెప్తున్నాను...మీరు కోరుకున్న విధంగానే జరుగుతుంది."

    "థ్యాంక్యూ..."

    "ఉంటానండి..." అన్నాడు కన్నారావు.

    అలాగే...బ్తె..."

    "బ్తె.."

    చిన్నమ్మాయి ఫోన్ పెట్టేసింది.

    రంగనాయకులు లోపలికి వచ్చాడు. ఆయనకూడా శివరావురాలేదు. తను బయటే నిలబడి ఉన్నాడు. రంగనాయకులు గబగబా లోపలి గదిలోకి వెళ్ళాడు. అతను ఓ నిముషం తరువాత చేతిలో వంద రూపాయల కట్టతో బయటికి వచ్చాడు.

    "ఎందాకా డబ్బు?" చాముందేశ్వారి అడిగింది.

    "ఆ అబ్బాయికి ఇవ్వడానికి"

    "ఆ అబ్బాయికా ? ఎందుకూ??" మళ్ళి ప్రశ్నించింది.

    "డబ్బుకి అవసరం వచ్చిందంట... కట్నంలో ఎడ్జస్తు చేస్కోమన్నాడు..." చెప్పాడు రంగనాయకులు మెల్లగా.

    "ఇంతకి కట్నం ఎంత?"

    "అబ్బబ్బ దరిద్రం సంత!!... ఏంటి ప్రశ్నల మీద ప్రశ్నలేస్తున్నావ్?" విసుక్కుంటూ వరండాలోకి వెళ్ళాడు రంగనాయకులు.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS