అ క్షణం నుంచీ నేను మానసికంగా మిమ్మల్నే మనసా వాచా కర్మణా భర్తగా ఊహించుకుంటూ గడుపుతున్నానే......హైందవ సంస్కృతీ పట్ల ఏవగింపుతో ఇండియాలోకి అడుగు పెట్టినా ఆ సంస్కృతికే ముచ్చట పడి, భారతీయ వనితగానే మారిపోయానని మీకెలా తెలిపేది? అందుకే మీరులేని నాకు ఈ అలంకారాలెందుకు? ఈరోజు నుంచి మీ గుర్తుగా నా నుదుట బొట్టు పెట్టుకోను. గాజులు వేసుకొను. ' అని లోపల అనుకుంటున్నట్టు పైకే అని బొట్టు చెరిపేసుకుని, గాజులు పగలగొట్టుకుంటున్న భారతి వైపు అంతా జాలిగా చూశారు.
అప్పటికే సమాధి తవ్వి గంధపు చెక్కలు తీశారు.
చిత్ర......విచిత్రం.....మరో అద్భుతం .....నమ్మలేని నిజం.......
ఆ సమాధి నుంచి ఒక్కసారిగా విష్ణు పైకి లేచి నిలుచున్నాడు.
అతను అందరి వైపు తిరిగి అభివాదం చేశాడు.
అంతవరకు కడగంటి చూపుకు కూడా నోచుకోక దూరమై పోయాడనుకున్న ఆత్మ విభుడు కనిపించాడన సంతోషంతో కాబోలు విష్ణును ఆరాధించే వాళ్ళందరి హృదయాలలో అనందం వెల్లివిరిసింది.
"అందరికి అనంతకోటి వందనాలు.......నిజం చెప్పాలంటే ఇది పునర్ జన్మ. నేను మరో అవతారం ఎత్తినట్టే బ్రహ్మదేవుడు నా అయ్హు పరిమాణాన్ని పెంచి తిరిగి భూమిపైకి పంపాడు. ఎందుకో తెలుసా?
నీ వల్ల భారత దేశానికి ఎంతో మేలు జరగవలసి వున్నది. కొందరు స్వార్ధపరులు కుటిల రాజకీయాల వలన రకరకాల రాజకీయ పార్టీలు పుట్టుకొచ్చి సచ్చీలురైన భారత ప్రజలను అష్టకష్టాల పాలు చేస్తున్నాయి. ఇక నుంచి నువ్వు ధర్మ సంస్థాపనార్ధమై విజ్రుంభించాలి.......
హిందూ ధర్మ ప్రచారాన్ని భారదేశం నలుమూలలా ప్రచారం చేసి ప్రజలు అందరినీ ఒక్కతాటిపై నడపాలి. భారతదేశాన్ని సస్యశ్యామల దేశంగా తీర్చిదిద్దవలసిన బాధ్యతను నీ భుజ స్కందాల పై వుంచుతున్నాను నీ కర్తవ్యాన్ని కొనసాగించు......అని హితభోద చేసి పంపాడు...."
"ఆ దేవదేవుని అజ్ఞా శిరసా వహించి తిరిగి మీ మధ్యకు వచ్చాను. ఇక నుంచి సదా మీ సేవకే కట్టుబడి వుంటానని హిందూ ధర్మ ప్రచారమే నా లక్ష్యమని పరకాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను...." అని తనదయిన గంభీర స్వరంతో చెప్పి వడివడిగా నడిచి వెళ్ళిపోయాడు విష్ణు.
అంతకుముందు కన్నా నూతనోత్సాహంతో పడుతున్నాయి విష్ణు అడుగులు......
విష్ణు ఎక్కిన పడవ భవానీ ద్వీపం నుంచి బయలుదేరింది.........
* * * *
కలెక్టర్ కార్యాలయం లో ఫోన్ మ్రోగింది.
ధీరజ రిసీవర్ తీసింది.
"హల్లో మేడమ్......ఐ యామ్ రీటా"
"ఓ....నువ్వా"
మేడమ్......నేను మీతో పర్సనల్ గా మాట్లాడాలి"
ధీరజ ఒక నిముషం ఆలోచించింది.
"ఓ.కె. ....అఫీసుకురా"
"అలాగే మేడమ్" రీటా ఫోన్ పెట్టేసింది.
లాంగ్ లీవ్ పెట్టి తన పేరెంట్స్ ను చూడడానికి వెళ్ళాలనే ప్రయత్నంలో వున్నది ధీరజ.
ఆ ఏర్పాట్లలో వున్నప్పుడే రీటా ఫోన్ కాల్ చేసింది. నిజానికి ఇంకొక పావుగంట తరువాత ఆమె ఫోన్ చేసినా ధీరజ దొరికి వుండేది కాదు.
పావుగంటలో కలెక్టరు బంగాళాలో వున్నది రీటా.
"మేడమ్.....మీకు విషయాలను చెప్పబోయే ముందు నన్ను పరిచయం చేసుకోవడం మంచిదేమో..."
"అంత అవసరమంటావా?" ఆమె మాటలను మధ్యలోనే త్రుంచి అన్నది ధీరజ.
"ఎస్ మేడమ్, యూనో మేడమ్......ఐయామ్ ఫ్రం ఐ.బి. .......ఇంటలిజెన్స్ బ్యూరో"
"వాట్."
"ఎస్ మేడమ్! ఈ నిజం విష్ణుకు కూడా తెలుసు, కానీ చివరి క్షణం వరకూ అతను తనకు తెలియనట్టే ప్రవర్తించాడు. విదేశీ గూడచారులు కొందరు విష్ణు ఆశ్రమాన్ని కేంద్రంగా చేసుకుని తమ కార్యకలాపాలు సాగిస్తున్నారనే అనుమానం మీద కూపీ తీయడానికి భారత ప్రభుత్వం నన్ను ఇక్కడకు పంపింది. నేను వచ్చిన పని పూర్తీ అయింది. విష్ణు శిష్య బృండంలోనే విదేశీ ఏజెంట్లు ఉన్నారు. వాళ్ళెవరో ఆదారాలతో సహా నేను సంపాదించాను" అన్నది రీటా.
"ఏమిటి నువ్వనేది.....నేను నమ్మలేకపోతున్నాను. విష్ణు శిష్యులలో విదేశీ ఏజెంట్లు ఉండడమా......ఇంపాజిబుల్. ..నేను నమ్మను...." నమ్మలేనట్టు అన్నది ధీరజ.
"నిజమే.......నేను అలానే అనుకున్నాను. కానీ నా పరిశోధనలో అది నిజమని తేలింది. అసలు మీకు తెలియదేమో విష్ణు కూడా విదేశీ ఏజెంట్ అన్న అనుమానంతోనే నేను విష్ణు చుట్టూ తిరిగాను, కానీ అతనెంత సచ్చీలుడో , ఎంత తపాశ్శక్తి సంపన్నుడో తెలుసుకున్నాను....."
'అప్పటినుంచి విష్ణును ఆరాధిస్తూ నా కర్తవ్యాన్ని మరచిపోయి విష్ణు నామ జపంలోనే మునిగిపోయాను. ఆ భక్తీ పారవశ్యంలో మునిగి నా బాధ్యతను విస్మరించాను.
నాకు కనువిప్పు కలగడానికి కొంత సమయం పట్టింది.
మైగాడ్.......!
అసలు విష్ణును ఆరాధించే వాళ్ళు ఇంకెంత మంది వున్నారో..
మొన్న భవానీ.....
నిన్న కిరణ్మయి....
