Previous Page Next Page 
హెల్త్ సైన్స్ పేజి 60

            56. అందగత్తెలను ఏడిపించే రకరకాల మచాలను పొగొట్టటం ఎలా?
   
    పద్మిని ముఖం నిజంగా పద్మంలాగానే తెల్లగా చూడముచ్చటగా వుంటుంది. విచిత్రం ఏమిటోగాని అందమైన ఆ పదహారేళ్ళ అమ్మాయి కళ్ళ చుట్టూ నల్లగా కమిలిపోయింది. తెల్లగా ఆకర్షనీయంగా వుందే ఆ అమ్మాయి కళ్ళదగ్గర కొత్తగా ఏర్పడిన నలుపు అసహ్యంగా కనబడుతూ పద్మిని అందోళన పరచసాగింది. ఇది ఇలా ఉండగా మరి కొద్ది రాజులైకు బుగ్గలమీద మచ్చలు, కళ్ళచుట్టూ తయారైన నలుపు కనబడకుండా కొన్నిరకాల స్నోలు, పోఎదర్లు వాడటంమ్ మొదలు పెట్టింది. ముఖం పాడైపోతుందని దిగులుపడుతున్న పద్మినికి కొత్తగా మరికొన్ని మచ్చలు కనబడ్డాయి. చివరికి డాక్టర్ దాహ్గ్గరకి వెళ్ళి చూపిస్తే మొదట వచ్చిన మచ్చలు ఒక కారణం వల్ల వస్తే, కొత్తగా వచ్చిన మచ్చలు కొన్నిరకాల స్నోలు అయిమ్టుమెంట్లు రాయటంవల్ల వచ్చాయని చెప్పాడు. డాక్టరు మాటలు విన్న పద్మిని అయోమయంలో పడిపోయింది.

    పద్మినికి వచ్చినట్లే చాలామందిముఖంమీద నల్లమచ్చలు రావడం, కళ్ళచుట్టూనలుపురంగు తయారవడం సహజమే. పురుషులు చాలామందివీటి గురించి పట్టించుకోకపోయినా స్రీలుమాత్రం తమ ముఖంమీదనలుపు మచ్చలు ఏ మాత్రం ఏర్పడినా అందోళన పడిపోతారు. మానసికంగా కృంగిపోతారు. మచ్చలనేవి ముఖంమీదే కడు, శరీరం మీద ఎక్కడైనా రవచ్చు. శరీరం సహజవర్ణం ఏర్పడటానికి ఒక ప్రత్యెక పదార్ధం  సమాపాళ్ళల్లో తయారవుతుంది. ఈ ప్రత్యెకమైనా 'మేలనీన్' పదార్ధం కొన్ని ప్రత్యెక సందర్భాలలో, ప్రత్యెక స్థలాల్లో శరీరమీద ఎక్కువుగా తయారవడంతో నల్లనిమచ్చలు ఏర్పడతాయి. కొన్నిరకాల హిర్మోన్ల అష్టవ్యస్థత, అనారోగ్య కారాణాలు, ఆహార లోపలు అందవికారమైన మచ్చలు ముఖంమీద, శరీరంమీద రావడానికి కారాణాలు. అలాగే ఎండలో ఎక్కువుగా తిరిగినా ఎక్స్రే కిరణాలకు ఎక్కువ గురిఅయినా చర్మంమీద నల్లదానం రావడానికి ఆస్కారంవుంది. అలాగే కొన్ని మందులు వాడటంవల్ల కూడా.

    ఆయా సందర్భాలలో శరీరంమీద నల్లటి మచ్చలు ఏర్పరవచ్చు. లేదా మొత్తం శరీరం సహజవర్ణాన్ని కోల్పోయి నల్లటి చర్మంగా మారవచ్చు. పద్మినికి ఏర్పడినట్లే కళ్ళచుట్టూ చాలామందికి నల్లగా కమిలిపోతూ ఉంటుంది. ఇలా నల్లగా తాయారవడానికి ఇంతవరకు సరైన కారణం తెలియదు. ముఖ్యంగా  విటమిన్లు లోపం పోషకహరలోపం ఇందుకు కారణం అని భావించబడుతోంది. అలాగే సరైన నిద్రలేకపోవడం, కళ్ళకు అలసతేక్కువ అవడం కూడా జ్కారణమే అని కొందరంటారు. ఏది ఏమైనా అక్కడ మేలసిస్ పదార్ధం ఎక్కువ తయారవుతుంది. అయితే చాలమందికి తమ కళ్ళ చుట్టూరా ఏర్పడిన నలుపు కొద్దిరోజుల్లో దానంతటదే తగ్గిపోతుంది.

    ముఖం వరకే నల్లమచ్చలు ఏర్పడే మరొక చర్మవ్యాధి ఉంది. దానినే "క్లోయాజ్మా" అంటారు. ఇది కూడా మేలసిస్ పదార్ధం ఎక్కువ తయారవడం వల్లనే వస్తుంది. మొదట బుగ్గలమీద కాస్త నల్లగా కొంచెం బూడిదరంగుల్లోనూ నయాపైసంత పరిమాణంలో మచ్చలు ఏర్పడతాయి. తరువాత ముక్కుమీద, కనుబొమల పైభాగాన, పై పెదవి పైన, గడ్డం కింద మచ్చలు తాయారవుతాయి. మొదట్లో ఈ మచ్చలు వేరువేరుగా చిన్నవిగానే ఉన్నా తరువాత అవి పెద్దవి అవుతూ మొఖం అంతా నల్లగానో, బూడిదరంగుగానో మరిపోతాయి.ఈ నలుపురంగు మెడకు కూడా వ్యాపిస్తుంది.
    సాధారణంగా ఈ విధమైన నల్లటి మచ్చలు, స్రీ గర్భవతిగా ఉన్నప్పుడు ఏర్పడి. కాన్పు అయిన తరువాత పోతాయి. అలాగే కొందరు గర్భస్రావం జరిగినప్పుడు ముఖంమీద వికృతంగా తయారవుతాయి. ఇంకొందరు స్రీలలోకుటుంబనియంత్రణ కోసం మాత్రలు వాడినప్పుడు ముఖంమీద మచ్చలు తయారవుతాయి.

    చాలా కాలం నుంచి జిగట విరోచనాలు అవుతున్న వారిలోను, లివర్ వ్యాధి వున్నవాళ్ళాల్లోనూ, జీర్ణకోష వ్యాధులు వున్నవరిలోను ముఖంమెడ నల్లమచ్చలు తరచూ యేర్పడటం, తగ్గిపోతూ వుండటం సహజ లక్షణం.

    అందం కోసం  అంటూ కొన్ని రకాల స్నోలు పోఎదర్లు వాడినప్పుడు సూర్యరశ్మితో అవి రియాక్షన్ పొండి ముఖంమీద నల్లతిమచ్చాలు ఏర్పడతాయి. ఈ రంకంగా నల్ల మచ్చలు, ముఖం మీద వచ్చే కలోయజమా పురుషులలో కంటేస్రీలలో ఎక్కువ పోషకాహర లోపం వుందేవారిలో కూడ్క్యా ఇలాంటి మచ్చలు రావడం సహజం. మంచి ఆహారం, మంచి ఆరోఅగ్యం ముఖంమీద నల్లమచ్చలు రాకుండా అరికడతాయి హిర్మైన్ల లోపంవల్ల, ముఖం మీద మచ్చలు ఏర్పడవచ్చు. అందుకని నల్లమచ్చలు ఏర్పడినపుడు డాక్టరుకు చూపించి తగిన చికిత్స పొందడం మంచిది.                     

            ****


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS