"నేను కాదు...నిజం ని మీదొట్టు రాజీ...ని మాటంటే నాకంత వేళాకోళం అనుకున్నవా?...."
"అయితే ఈ వెనకాల ఎవరో ఉన్నారు...మనం వేరే చోటికి పోయి కూర్చుందాం పద..."
వాళ్ళు లేచిన అలికిడి అయ్యింది.
కన్నరావుకి చాలా కుతూహలంగా ఉంది.
అతన్ని చూడాలి!-అతనెవరో చూడాలి!
ఆ గొంతు ఇదివరకే విన్న గొంతే!
తనకు పరిచయం ఉన్న మనిషే !
కన్నారావు గబుక్కున ముందుకు వంగి పొదలకి అటువ్తెపు చూశాడు.
రోజితో వెళ్తున్న మనిషిని చూసి ఉలిక్కిపడ్డాడు కన్నారావు.
అతనెవరోకాదు.
ప్రేమికులకు సలహాలు ఇచ్చే ప్రేమానంధం!...
* * *
ఫోన్ మోగుతూ ఉంది.
చదువుతూన్న పుస్తకంలోంచి తలెత్తి విసుగ్గా ఫోన్ వంక చూసింది చిన్నమ్మాయ్.
ఈ మధ్య ఫోన్ ఎత్తాలంటేనే చికాకుగా ఒక్కొక్కపుడు భయంగా ఉంటుంది.
ఆ ఫోన్ చేస్తుంది శివరామోనన్న అనుమానమే ఆమె భయానికి మూలకారణం.
కాస్సేపు చూసింది....
ఎవరూ రాలేదు.
"ఒరేయ్ భీమయ్య..." లోపలికి చూస్తూ పలికింది.
భీమయ్య కూరగాయలు తేడానికి వెళ్ళాడు" వంట గదిలోంచి అరిచింది చాముండేశ్వరి.
"నాన్న స్నానం చేస్తున్నట్టున్నారు!" అనుకుంది చిన్నమ్మాయ్.
-పండు స్కూలుకి వెళ్ళిపోయాడు.
చిన్నమ్మాయ్ కాలేజి ఉన్నా వెళ్ళడం లేదు, ఒకవేళ వెళ్తే బయట శివరామ్ ఎక్కడ పట్టుకుంటాడోనని ఆమె భయం.
కాలేజికి వచ్చ్సిఅనా రావొచ్చు. అప్పుడు కాలేజిలోనే స్నేహితులంతా "ఎవరు అతను?" అని అడిగితే ఏం చెప్పాలి?....
అందుకే చిన్నమ్మాయ్ కాలేజికి వెళ్ళడం కూడా మానుకుంది.
"ఫోన్ మోగుతుంటే తియ్యవేంటే?"
వంట గదిలోంచి చాముండేశ్వరి అరిచింది.
అయిష్టంగానే లేచి ఫోనేత్తింది చిన్నమ్మాయ్.
"హలో..." అంది అవతలి కంఠం.
అది శివరామ్ గొంతు కాదు-
తేలికగా ఊపిరి పీల్చుకుని "హలో..." అంది చిన్నమ్మాయ్ "ఎవరు కావాలి?"
"ఎవరు?..రజని గారేనా?" అడిగింది అవతల గొంతు.
"అవును మీరెవరు?"
"నేనండి... కన్నరావుని... చిట్టబ్బాయి ఫ్రెండ్ ని. దయచేసి ఫోన్ పెట్టేయ్యకండి.. నేను చెప్పేది పూర్తిగా వినండి-"
"ఫోన్ పెట్టేయ్యనులెండి. చెప్పండి" అంది చిన్నమ్మాయ్.
"చిట్టబ్బాయి నాకు జరిగిందంతా చెప్పాడు.." ఆగాడు కన్నారావు.
"ఊ..."
"మీరేమి బాధపడకండి... ఎలాగ్తెనా మీ ఇద్దర్ని కలపాలనే నిర్ణయించు కున్నాం" చెప్పాడు కన్నారావు.
"ఎవరు?" నిరాసక్తంగా ప్రశ్నించింది చిన్నమ్మాయ్.
"నేనూ కాంతామణి..."
"కాంతామణి??... కాంతామణి ఎవరు?"
"చిట్టబ్బయికి మిరేలానో నాకు కాంతామణి అలాగ..." కొన్ని క్షణాల మౌనం అనంతరం చెప్పాడు కన్నారావు.
"ఓ...."
మరికొన్ని క్షణాల మౌనం...
"ఎలాగ్తెనా మీ ఇద్దర్ని కలిపే తిర్తాం చిన్నమ్మాయ్ గారూ. మీరు ద్తేర్యంగా ఉండండి..."మళ్ళి అన్నాడు కన్నారావు.
"అది సాధ్యమయ్యే పని కాదండి కన్నారావుగారూ" మెల్లగా అంది చిన్నమ్మాయి.
"తప్పకుండా అవుతుందండి. మీరు అలా నిరుత్సాహపడకండి. మా వాడి బాధని చూడలేకపోతున్నా, తిండి తినడు... నిద్రపోడు. కదిలిస్తే కన్నీళ్ళు పెట్టుకుంటాడు...ఎదో ఒకటి చేస్తే తప్ప లాభం లేదు."
చిన్నమ్మాయ్ మనసు బాధతో గిలగిల్లడింది. ఆమె కంట్లో నీళ్ళు తిరిగాయ్.
"ఆయన్ని అలా ఉండొద్దని అనండి...వేళకి భోజనం చెయ్యమని చెప్పండి."
మాట్లాడ్తుంటే ఆమె గొంతు పూడుకుపోతూంది. ఎంతో కష్టపడి అంది ఆ రెండు ముక్కలూ.
"చెప్తానుగాని మీరు కూడా ద్తేర్యంగా ఉండండి...మా ప్రయత్నాలు మేము గట్టిగా చేస్తాం... మా ప్రయత్నం ఫలిస్తుందని కూడా మేము అనుకుంటున్నాం..."
"మీ ప్రయత్నం ఫలించాలనే నేనూ కోరుకుంటున్న...అంతకంటే నాకు కావాల్సిందేముంటుంది....." మెల్లగా అంది చిన్నమ్మాయ్.
"సరేగాని...వాడి పెరేంటండి?" నాకు గుర్తు రావడం లేదు" అడిగాడు కన్నారావు.
"ఎవరూ?"
"వాడే... మన విలన్ గాడు..."
కన్నారావు అలా అనేసరికి అంత బాధలోనూ ఆమె పెదాలమీదకి మెల్లగా చిరునవ్వు వచ్చింది.
"శివరావు..." చెప్పింది చిన్నమ్మాయ్.
"శివరావు? ఆ శివరావుగాడి పని మేము పడ్తాం లెండి... సరేగాని వాడి ఇంటి అడ్రసు మీకు తెల్సా?"
"ఎందుకూ?"
వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళ నాన్నని కల్సి మీ ఇద్దరి ప్రేమ గురించి ఎక్స్ ప్లెయిన్ చేసి ఇద్దరు ప్రేమికుల్ని విడదీసి పాపం చుట్టుకోకండి.. మనసులో ఎవర్నో అభిమానించి ప్రేమించే అమ్మాయిని మీ కోడలుగా ఎలా చేస్కుంటారు? అలా చేస్కుంటే మీ అబ్బాయికి మాత్రం బాధ కాదా తన భార్య వేరే మగాడిని ప్రేమించిందంటే...అని చెప్పి వాళ్ళు ఈ సంబంధం మానుకునేలా చేస్తాను." గుక్క తిప్పకోకుండా చెప్పాడు కన్నారావు.
"అది కుదిరే పని కాదులే కన్నరావుగారూ...అయినా నాకు వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలిదుగా!"
"అలాగా?"
కన్నారావు ఆలోచనలో పడినట్టు కాస్సేపు నిశ్శబ్దం...
"పోనీ మీ నాన్నగారిని అడిగి చెప్పండి" అన్నాడు కొద్ది క్షణాల తర్వాత.
"ఎందుకూ అని మా నాన్నగారు అడిగితే ఏమని సమాధానం చెప్పను? అసలే మా నాన్నగారికి తెల్సు నాకి పెళ్ళి ఇష్టం లేదని" చెప్పింది చిన్నమ్మాయి.
కొన్ని క్షణాలు ఆలోచించిన తర్వాత కన్నారావు అన్నాడు "పోన్లెండి నేనే ఎలాగోలా కనుక్కుంటాను... సరేగాని ఆ శివరావుగాడి మీ ఇంటికి వస్తుంటాడా?"
"వస్తుంటాడు."
"చాలు. ఇంక నా పని నేను చూస్కుంటా మీరేం వర్రీ కాకండి"
"అలాగే...చాలా థాంక్సండి కన్నరావుగారూ...నా గురించి మీరు చాలా శ్రమ తిస్కుంటున్నారు"
"ఇందులో శ్రమేం ఉందండి... అసలు ఇది నా బాధ్యత!!..." అన్నాడు కన్నారావు.
"ఇంక ఉంటానండి. ఆయన్ని ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోమని చెప్పండి."
"అలాగే చెప్తాను. ఫోన్ డిస్కనెక్ట్ చేయకండి... మీతో కాంతామణి మాట్లాడ్తానని అంటుంది"
చిన్నమ్మాయి ఫోన్ పట్టుకునే నిల్చుని ఉంది. రెండు క్షణాల అనంతరం అవతల నుండి "హాలో" అని స్త్రీ కంఠం వినిపించింది.
"హలో..."బదులుగా అంది చిన్నమ్మాయి.
"నా పేరు కాంతామణి అండి. కన్నారావు నా గురించి మీకు చెప్పాడుగా.. మీ ప్రాబ్లెం గురించే రెండు రోజుల్నుండి మేము ఇద్దరమూ ఆలోచిస్తున్నాం... తప్పకుండా మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుందనే నేను అనుకుంటున్నాను" అని ఫోన్లో మరో రెండు నిముషాల పాటు చిన్నమ్మాయికి ద్తేర్యం చెప్పి ఫోన్ పెట్టేసింది కాంతామణి.
