Previous Page Next Page 
చిన్నమ్మాయ్ చిట్టబ్బాయ్ పేజి 59

 

    "అయితే శివరావు తండ్రి రంగానాయకులకి బిజినెస్ లో  చాలా సాయం చేశాడంటావ్?"

    "నేననడం కాదు చిన్నమ్మాయి చెప్పింది. అసలు వాళ్ళు ఈనాడు ఈ స్ధితిలో ఉన్నారంటే ఆ శివరావ్ తండ్రి విరస్వామే కారణం అట! ఇతని బిజినెస్ లో  చాలామట్టుకు అతని పెట్టుబడులే ఉన్నాయట" చెప్పాడు చిట్టబ్బాయి.

    "అయితే" కళ్లుచిట్లించాడు కన్నారావు.

    "చెప్పాగా... ఆ శివరామ్ గాడు చిన్నమ్మాయి మీద కన్నేశాడు... త్యననే పెళ్ళి చేస్కుంటానని తండ్రితో చెప్పాడట... వీరాస్వామి రంగనాయకులు దగ్గరికి వచ్చ్చి తన కొడుక్కు చిన్నమ్మయిని ఇచ్చి చేయమని అడిగాడట... ఇవి చిన్నమ్మాయికి రంగనాయకులు చెప్పిఅన కారణాలు. ఇందాక రెస్టారెంట్లో చిన్నమ్మాయి  చెప్పింది ఈ వివరాలన్నీ."


    "రంగనాయకులు అసలు అలా ఎందుకు చేశాడు? తన కూతురు పెళ్ళి వేరేవాళ్ళతో నిశ్చయం అయిపోయిందని విరాస్వామికి చెప్పెయ్యేచ్చుగా?"

    "అతన్ని కాదంటే విరాస్వామికి కోపం వస్తుందని రంగానాయకులుకి భయం అట!... అంతే లాకుండా తన ఉన్నతికి కారణం అయిన వీరాస్వామి పట్ల కృతజ్ఞత ఉండాలని అతని ఉద్దేశం అట!"

    "మరి నీకిచ్చిన మాటో? మీ అమ్మా నాన్నాలని పిలిపించి తాంబూలాలు పుచ్చుకున్న విషయం మాతో??" ఆవేశంగా ఆన్నాడు కన్నారావు.

    చిట్టబ్బాయి పెదవి విరిచి విరక్తిగా నవ్వాడు.

    కన్నారావు కొద్ది క్షణాలు నిదానంగా ఆలోచించి అన్నాడు "నువ్వో పనిచెయ్యి... చిన్నమ్మాయిని నిన్ను తప్ప వేరేవాళ్ళని చేస్కోనని మొండికేయ్యమని చెప్పు... వేరేవాళ్ళకిచ్చి పెళ్ళి చెయ్యాలని చూస్తే ఆత్మహత్య చేస్కుంటానని వాళ్ళ నాన్నని బెదిరించమని చెప్పు"

   
    "ఆ బుద్ది తనకే పుట్టాలిగాని నేను చెప్పకూడదు. ఎవర్ని ఏ విషయంలోనూ బలవంతం చెయ్యకూడదు" తలవంచుకుని అన్నాడు చిట్టబ్బాయ్.


                                                 *             *                  *

    మోగుతున్న ఫోన్ ని విసుగ్గా ఎత్తింది చిన్నమ్మాయి.

    "హలో!" అంది అంది విసుగునంతా గొంతులో పలికిస్తూ.

    "హలో డార్లింగ్...నేనే" అవతల నుండి శివరావు గొంతు వినిపించింది.

    "ఏంటి?" కోపంగా అంది చిన్నమ్మాయి.

    ఈ మధ్య చిన్నమాయికి విసుగూ, కోపం చాలా ఎక్కువ్తేపోయింది. ఎవరు పలకరించిన విరుచుకు పడ్తుంది.

    "కాబోయే మొగుడిమీద అంత కోపం ఎందుకు డార్లింగ్...ఈ వేళ ఏదయినా మంచి సినిమాకి వెళ్దామా అని అడగడానికి ఫోన్ చేశాను"

    "నాకు కుదుర్దు"

    ధనేల్ మని  రిసీవర్ ని పెట్టేసింది చిన్నమ్మాయి.

    లోపలికి వెళ్ళబోతుండగా ఫోన్ మళ్ళి మోగింది.

    చిన్నమ్మాయ్ రిసీవర్ ని తిసి పక్కన పెట్టేసింది.

    అదే టైంలో లోపల నుండి హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు రంగనాయకులు.

    "ఎవరిదమ్మా ఫోను?" న్యూస్ పేపర్ చేతిలోకి తిస్కుంటూ అడిగాడు.

    "నా మొగుడిది.." విసురుగా అంది చిన్నమ్మాయి.

    "అమ్మో!.. బాధగా అన్నాడు రంగనాయకులు. కూతురు ఎప్పడూ ఎవరితో అంత దురుసుగా ప్రవర్తించలేదు.

    "నేను ఆ శివరావుగాడిని చేసుకోను నాన్న" అంది చిన్నమ్మాయి సీరియస్ గా.

    "అలా అనొద్దు తల్లి. ఏనాడ్తేనా  నామాటని నువ్వు కాదన్నావా అమ్మా"

    "ఏనాడ్తేనా  మీరు నా ఇష్టానికి వ్యతిరేకంగా చేశారా?...మరి నాకు నా జీవితానికి సంబందించిన  విషయంలో నాకు పూర్తిగా ఇష్టంలేని విధంగా ఎందుకు నిర్ణయం
తిస్కున్నారు?...." ఆవేశంగా అడిగింది చిన్నమ్మాయి.

    "ఇది కేవలం ని జీవితానికి సంబందించింది కాదామ్మ... మన అందరి జీవితాలకి సంబంధించినది..."

    "ఎందుకు మనందరి జీవితాలకి సంబందించింది? మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇవ్వను అని అంటే తలకొట్టి మొలేస్తాడా ఆ విరాస్వామి"

      "నీకు తెలిడంమా. మన బతుకులు విధిన పడ్తాయి. నా మాటా వినమ్మా... నీకు తండ్రిన్తేనా ని కాళ్ళు పట్టుకుని బతిమాలాడ్తాను..." కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ అన్నాడు రంగనాయకులు.

    "నాన్నా...."

    రంగానాయకుల్ని  పట్టుకుని భోరుమంది చిన్నమ్మాయి.

   
                                                           19

    ఇందిరాపార్కులో...

    సాయంత్రం ఆరుగంటల వేళ.

    క్రోటన్స్ గుబురు దగ్గర కన్నారావు, కాంతామణి కూర్చుని ఉన్నారు.

    వాళ్ళు పార్కుకి వచ్చి అరగంటైంది.

    అంతవరకూ కన్నారావు కాంతామణికి  చిట్టబ్బాయి, చిన్నమ్మాయ్ ల గురించి చెప్పాడు.

    "అయ్యో పాపం!" అంది అంతా విన్న కాంతామణి.

    "మనం వాళ్ళిద్దర్నీ ఎలాగ్తెనా కలపాలి కాంతా" అన్నాడు కన్నారావు.

    "కాని ఎలా?"

    "ఎలా అంటే ఎలా?...నాకు చిక్కు ప్రశ్నలు వేసి పేరు చెప్పకుండా ఎడ్పించే తెలివితేటలు కాదు... ఇలాంటి విషయాల్లో కూడా చూపించాలి ని తెలివితేట్లు..." అన్నాడు కన్నారావు కాంతామణి బుగ్గమీద చూపుడు వెల్తో మెల్లగా పొడుస్తూ!

    ఈ సమస్య పరిష్కారం కోసం అన్నట్లు కాంతామణి ఆలోచనలో పడింది. కన్నారావు ఆమె మొహంలోకి చూస్తూ కూర్చున్నాడు.

    సరిగ్గా అ సమయంలోనే  వాళ్ళు కూర్చున్న పొద వెనక వ్తెపు అలికిడి అయ్యింది.


    ఎవరో వచ్చి కూర్చున్న అలికిడి.

    "కూర్చొ డార్లింగ్! రా... నా పక్కన కూర్చో..."

    దీర్ఘాలు తీస్తూ పలికింది మగ గొంతు.

    "ఊ కూర్చుంటాలే చెయ్యేదలండి" నిర్లక్ష్యంగా  పలిఅకింది ఆడగొంతు.

    కాంతామణి కన్నారావు ఒకరి మొహంలోకి ఒకరు చూస్కుని నవ్వుకున్నారు.

    'వీళ్లు. మనలాంటికేసులే' మెల్లగా  కాంతామణి చెవిలో అన్నాడు కన్నారావు.

    "ఇంకాస్త దగ్గరికి రా డార్లింగూ..."

    "చాల్లే ముసలి సరసాలూ మిరూను" విసుక్కుంది ఆ అమ్మాయ్.

    కాంతామణి కిసుక్కున నవ్వింది.

    "ఏంటో రాజీ అంతలోనే విసుక్కుంటావ్...అంతలోనే కిసుక్కున నవ్వుతావ్ ని     వ్యవహారమే నాకు అంతుపట్టదు" అంది మగగోంతు.

      "నేనా?... నేనక్కడ నవ్వాను?" ఏం చూస్కుని నవ్వనూ. మిరేమ్తెనా నాకు చీరలు కొంటున్నారా, నగలు కొంటున్నారా?"

    "కొంటాను రాజీ...అంత కంగార్తేతే ఎలా?"

    "ఊ ఊ మీద నుండి చెయ్యి తియ్యండి... మీక్కూడా ఇంత కంగారు పనికిరాదు.."

    కన్నారావు వస్తున్న నవ్వుని ఆపుకుంటున్నాడు. వాళ్ళిద్దరూ పొదల వెనకాల నుంచి మాట్లడ్తున్న ఆ ఇద్దరి సంభాషణని కుతూహలంగా వింటున్నారు.

    "ఆ మగ గొంతు వింటున్న కొద్ది కన్నరావుకి ఎదో గుర్తుకు వచ్చినట్టు అనిపించింది.

    ఆ గొంతుని తను ఎక్కడ విన్నాడు?

    ఆ గొంతు తనకి పరిచయం ఉన్న గొంతే...

    ఎవరిదీ?ఎవరిదీ,ఎవరిదీ... కన్నారావు తలపట్టుకున్నాడు.

    "ఏమ్తెంది?" కన్నారావు భుజం మీద చేయ్యస్తూ మెల్లగా అడిగింది కాంతామణి.

    "ఆ గొంతు నాకు పరిచయం ఉన్నగోంతే...అతను నాకు తెలిసినవాడే...." గుసగుసలాడ్తూ సమాధానం చెప్పాడు కన్నారావు.

    "ఎవరతను?"

    "అదే గుర్తుకు రావడంలేదు" ఆలోచిస్తూ అన్నాడు కన్నారావు.

    పొదల వెనకాల నుండి వినిపిస్తున్న ఆ సంభాషణని ఇంకాస్త శ్రద్దగా విన్నాడు. ఆ సంభాషణని వింటుంటే ఆ గొంతు ఎవరిదో గుర్తురావడం లేదుగాని కన్నరావుకి చచ్చేంత నవ్వొచ్చింది.

    ఉన్నట్టుండి గట్టిగా నవ్వేశాడు.

    "రేపు నాకు మ్తెసూర్ శిల్క్ శారి కొనిపెట్టమంటే  నేనేదో జోక్ చేసినట్టు అలా నవ్వుతారేం?" సీరియస్ గా  వినిపించింది ఆ అమ్మాయి కంఠం.

    "హయ్యో రాతా...నేనెక్కడ నవ్వానూ? ఇంట్లో మా ఆవిడా నా మీద అరిచి నువ్వూ నా మీద అరిస్తే నేనేమోతాను డార్లింగూ?..."అంది ఆ మగగోంతు దినంగా.

    "అయితే ఇప్పుడు నవ్వింది నువ్వు కాదా?..."ఆశ్చర్యంగా అడిగింది ఆ అమ్మాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS