గిరిజ స్నేహితురాండ్రతో కలిసి నవ్వుకుంటూ గిరి వయిపు చూస్తూ చూస్తూ వెళ్ళిపోయింది....గేటు యివతలికి రాగానే - అడక్కుండా చేయకుండానే ఒక రిక్షావాడు వచ్చి ముందు ఆగాడు - ఆమె ఎక్కుతూ - చేయి పట్టుకు ఎక్కండి? అని అంది- ఆలోచిస్తున్న గిరివయిపు చూసి - గిరి బిక్కమొహం వేసి ఆశ్చర్యపడిపోయాడు. "ఎక్కండి బాబూ?' అని రిక్షావాడన్నాడు నవ్వుతూ-
"రండి మా యింటికెడదాం!" అంది ఆమె కూడా నవ్వుతూ - చుట్టు పక్కల కిళ్ళీకొట్టువాళ్ళు. టీ డుకాణాలవాళ్ళూ తనవయిపే చూసున్నట్టు గమనించాడు గిరి....ఎందుకో అనుమానం' సిగ్గు, అవమానం వేసింది! ఏం చేయడానికి తోచని స్థితిలో వున్నాడు....
ఏంరా గిరీ ఏమిటి విశేషం?" అని నా ఫ్రెండు గోపాలం భుజం తడుతూ అడిగేడు...ఆమె అతడిని చూసే నవ్వింది -
"బ్రతుకు జీవుడా అనుకున్నాడు గిరి - "అబ్బే ఏం లేదు....ఇంటికి పోదామని!" అని అన్నాడు ఏదో ఒకటి జవాబు చెప్పాలని.....
"ఎవరింటి కేమిటి?" అని వంగ్యంగ అన్నాడు గిరి -
"అదేమిటి! మాయింటికే!" అన్నాడు గిరి-
"అదా! ఆమె ఇంటికేమోనని!" అని అన్నాడు-
"అదేమిటలా అంటావు.... ఆమె ఎవరో నాకు తెలీదు..." అని తబ్బిబ్బవుతూ అన్నాడు.
"మనలో మనమాట.... గురూ! పాత పరిచయమేనా?"
ఈమాట గిరికేం అర్ధం కాలేదు....
"లేదండీ నేనే రమ్మన్నాను రిక్షాలోకి-" అని అంది ఆమె కిసకిసా నవ్వుతూ....
"సాయమా?....వద్దులేమ్మా గిరి.....బుద్దిగా యింటికిపో....నేను వెడతాలే!..." అంటూ రిక్షా ఎక్కి ఆమె పక్కని కూచున్నాడు. రిక్షా వాడు రంయ్ మని స్టార్టు చేశాడు.....ఆమె ఏమిటేమిటో వాడితో గొణుగుతూంది.
అది చూసి దుఖాణాలవాళ్ళందరూ గొల్లుమన్నారు-
"అదేటి బాబూ ఎగరేసుకు పోతుంటే చూస్తూ ఊరుకున్నారు!"
అని ఒకడన్నాడు....
దేనికీ జవాబు చెప్పలేని స్థితిలో వున్నాడు గిరి.
"పాపం! క్రొత్తకాబోలు. ఏం తెలియనట్టుంది? బాగానే పట్టిందిగాని......ఛాన్సుపోయింది" అని యింకొకడు.
ఫోన్లెండి విచారించకండి బాబూ. మరో గంట కల్లా యిక్కడికి తయారు! సెకండ్ షో ఆవుతూంటే వస్తుంది? మళ్ళీ టికెట్ కొని లోప కూర్చోండి!" అని విరగబడి నవ్వేడు ఇంకొకడు
యింక అక్కడ నుంచోలేకపోయాడు తల వంచుకొని గబగబా అక్కడినుండి వెళ్ళీపోయాడు గిరి. ఎంతపని జరిగిపోయింది. ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది! యింకానయం.... ఆ గోపాలం రాకపోతే ఏం జరిగేదో ఆమె వదిలేఘటమేనా?....యిప్పుడర్దమయింది. ఆమె ఎవరో! ..... అనుకుంటూ యింటికి పోయాడు.
అయితే గిరిజకి ఆమె అలాంటిదని - తెలియక పోవడం. తర్వాత జరిగిన ఈ విషయాలన్నీ ఆమె కంటబడకపోడం గొప్ప అదృష్టం. గిరి అనుకున్న ప్లాను ఫలించింది కాని ఆ మర్నాడు దాసుగారిచేత ఆశీర్వచనాలు మాత్రం తప్పలేదు.
ఆ మర్నాడు పార్కులో ఆ అవకాశాన్ని అతను వినియోగించుకున్నాడు- అతను చెప్పే విషయాలు మంచివే అయినా- ఏమిటో ముసలి గోల- పార్కులోను, బీచిలోనూ ఇలా ఆముదంరాస్తే ఎలా?
గిరి పాలిటికి - ఒక అమ్మాయి పంజాబీ డ్రెస్ వేసుకుని పార్కులోకి వచ్చింది- తమ్ముడిని కూడా తీసుకువచ్చింది. స్వచ్చంగా తెలుగే మాట్లాడుతుంది!.... అది దాసుగారి కంటబడింది! అయినా కర్మ కాకపోతే మన వాళ్ళకా పోయేకాలం ఏమిటి చెప్పండి!- సలక్షణాన్ని విలక్షణం చేసుకోవడం తప్పిస్తే....యికనేం దాసుగారు అందుకున్నారు-
"అటు ఆపిల్లవేపు చూశావూ?" అని అడిగేరు-
"చూడలేకుండా వున్నానండీ?" అన్నాడు గిరి నవ్వుతూ.
"అవున్లే మనమే ఆపనిచేస్తే ఆక్షేపణ వుండదు! కాని ఒకళ్ళు చేస్తే మట్టుకు మాత్రం విమర్శిస్తాం! .... అది మనకు సహజ గుణం!" అని అన్నాడతను ఒక పొడివేస్తూ.
"అదేవిటండోయ్! నే నేమయినా అలాంటిపని చేశానంటారా? అని తనని తానొకసారి పరీక్షించుకున్నాడు గిరి.
"నిన్న సినిమాలో నీ భార్య, వేషం చూసి గిరిజ చెప్పిందిలే. నీ స్వంత విషయాల్లో కలుగజేసి కుంటునా ని ఏమి అనుకోకు- "హిందూస్థానీ వాళ్ళలా ముసుగు వేసుకుందిటగా?.....అదేమిటి అది వాళ్ళకి సంప్రదాయం అయితే - మనకో ఆక్షేపణ. అఘాయిత్యం కూడాను!'
అప్పుడు గిరికి నిన్నరాత్రి సంగతి జ్ఞాపకం వచ్చింది. సరి అంతటినయం.....యింకా జరిగిన భాగోతం తెలిస్తే ఏమయి వుండేదో? అని అనుకొని -
"అబ్బెబ్బె? పెద్దలు మీరనవలసినవారు, నేను పడవలసిన వాడిని. మీరేం చెప్పినా ఏమీ అనుకోను! ... కానీ నిన్నరాత్రి....ఆమెకు వంట్లోబాగులేదట. యివతలగాలి చల్లగా వీస్తేనూ...అలా కప్పుకుంది కాబోలు నేను చూడలేదు. అయినా నాకూ యిలాంటి అనుకరణలంటే అసహ్యమే!" అన్నాడు.
"ఒక్క నీసంగతేకాదు! ఈ రోజుల్లో చాలా మంది ఇలాగే - ఇప్పుడు ఈ అమ్మాయినే తీసుకో- చక్కగా పదిహారేళ్ళ పిల్ల. ఆ ఇష్టం ఏమిటి? చలిదేశం కాబట్టి వాళ్ళకా డ్రెస్సు సరిపోతుందేమో. మన వాళ్ళు మన కట్ట. బొట్టూ మాని వాళ్ళని అనుకరిస్తే బావుంటుందా? ..... చక్కగా పరికిణీ,ఓణీ వేసుకుని తెలుగు పిల్లలా వుంటే ఎంత బావుండేది?
"అవుననుకోండి! అయినా ఒక దేశంలో ఒక దేశం- సన్నిహిత సంబంధాలు అనివార్యం: ఎక్కువ అవుతున్న ఈ రోజుల్లోను ఒకరి సంప్రదాయాలు ఒకరు....చూసి అర్ధం చేసుకోవడంలో అంత తప్పేంలేదేమో!"
"నిజమే ఒప్పుకుంటాను....ఎంత వరకూ? ఒకరి నొకడు. అర్ధం చేసుకునే వరకూ? కాని....మనకు సరిపడని అలవాట్లను అనుకరించడం ఎందుకూ అంటాను. స్నేహం చేయవచ్చును. అయితే ఒక కంచంలో తిని ఒక మంచంమీద పడక్కుంటేనేగాని స్నేహం ఆపదా? .... వ్యక్తిత్వాన్నేమరిచిపోకూడదు?.... సృష్టి అంతా సమానమే గాని అందులోనే - ప్రతి వస్తువా, మరో వస్తువతో పోలిలేదు, ప్రతి దానికి ఒక్కొక్క ప్రత్యేకత వుంది. వేటి స్వభావం వాటిది! ఒక దాని స్వభావం - మరొక దానికి అన్వయంచేస్తే అవుతుందా? అలాగే ఎవరి ప్రత్యేకతని వారు, ఎవరి వ్యక్తిత్వాన్ని వారు కాపాడుకోవాలి? మనం ఎంత స్నేహం చేసినా, ఒకరి సంస్కృతి సంప్రదాయాలని ఎంత అర్ధం చేసుకున్నా .....అది మాత్రం మరిచిపోయేంత అనర్ధం వాటిల్లకూడదు! అలా మరచిపోయిననాడు .....ఆత్మ హత్యలాంటిదే కాదా?"
"అవునండి! అందులోనూ మన తెలుగు వాళ్ళు మరీను. ఒక్క అరగంట పైవాడితో మాటాడితే చాలు! వాడి అహంభావాల్ని అనుకరించడం మొదలెడతారు! పూర్వం మనవాళ్ళు గొప్ప గొప్ప కళ్ళల్లో ఏకసంతగ్రాహులని పేరు తెచ్చుకుంటే ఈ నాడు అనుకరణలో - ఏకపంత ఏకదృశ్య- గ్రాహులవుతున్నారు ! ..... నిన్న సినిమా చూశావా అదీ అంతే .... అదొక బెంగాలీ కథకి అనుకరణ ..... ఎందుకు చెప్పండి! మన తెలుగులో మంచి కథలు లేకనా? స్వతంత్ర కవులూ స్వతంత్ర రచనలూ లేకనా? ...." గంగిగోవు పాలు గంటెడైకను చాలు" అన్నట్టు ఒకరిని కాపీ కొట్టి - అనుకరించి, అరువుతెచ్చుకుని సినిమా తీస్తే - అది బావున్నా .... వీరి గొప్పేముంది? స్వతంత్రంగా అలాటి చిత్రం తీసి - మనవాటినే వాళ్ళు అనుకరించేట్టు తీస్తే ఎంత గొప్ప!"
"ఈ అనుకరణ ఒక్క మనకే కాదులే. యించుమించు అందరికీ వుంది!....కాని ఏదేశపు టనుకరణఅయినా ముందు ప్రచారమూ తర్వాత అనుకరణ జరుగుతుంది .... కాని - మన తెలుగు దేశాచారం ప్రపంచంలో ఎక్కువగా అనుకరించబడుతున్నా దానికి ప్రచారం లేదు - ఇప్పుడు అన్ని దేశాల్లోనూ, రమారమి అందరూ అనుసరిస్తున్న చీరకట్టు విధానం, మన తెలుగు సంప్రదాయంలోంచే వచ్చిందని చెప్పుకోవచ్చు - ఎంచేతంటే - చూడూ ప్రతీ ప్రాంతానికీ ఒక్కొక్క ప్రత్యేకత మయిన దుస్తులు వున్నాయి - చీర కట్టడంలో కూడా అరవలు ఒక రకంగా, మహారాష్టులు ఒక రకంగా, ఉత్తరంశం వాళ్ళు ఇంకోకలాగకడతారు. మొత్తం మీద ఇప్పుడు ప్రచారంలోవుండి అందరూ కడుతున్న చీరకట్టు తీరు చూస్తే మనవాళ్ళు పూర్వం నుండి అనుసరిస్తున్న పద్ధతికి చాలా దగ్గరగా వున్నట్టు తెలుస్తుంది! కాని పేరా వూరా? మొదటి నుండి ప్రచారం లేదు కాబట్టి అది అందరిసొత్తూ అయి కూచుంది. ఇలాటి మన పద్ధతులను అందరూ అనకరిస్తూంటే మన వాళ్ళు వాటిని వదిలేసి ఉత్తరదేశం వాళ్ళని పాశ్చాత్యులని చూసి వాళ్ళు వదిలేస్తున్న వాటిని పట్టుకు ప్రాకులాడుతున్నారు!
ఇలాగే భాషానుకరణ కూడాను. ఈనాడు ప్రతి వాళ్ళు పుట్టుకతోనూ. ఉగ్గు పాలతోనూ వచ్చిన మన భాషను మాని! ప్రయత్న పూర్వకంగా హిందీ భాషను వాడుతూండడం, నాగరి కత అయిపోయింది! ఏమయ్యా అని అడిగితే హిందీ జాతీయ భాష - "వెధవ తెలుగు ఎందుకు?" అని అంటారు!
సోనీ ఇంగ్లీష్ లాగో మన నెత్తిమీద వుంది కదా! ఇంకా మరో భాషకూడా తెచ్చుకుని. మన తెలుగుని యింకా చంపడం ఎందుకంటే - ఇంగ్లీషు పరాయి భాషట! ప్రపంచంలో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క భాష వుండాలట! అందరూ అదె మాటాడాలట! .... ప్రపంచంలో మనది ఒక దేశం. అలాగే మన దేశంలో మనదొక రాష్ట్రం! మన భాష ఎందుకు దేశభాషకాకూడదు! అంటే హిందీ భాష ఎక్కువగా మాట్లాడు తారంటారు. అయితే - మన దేశంలో "హిందీ భాష మాట్లాడేవారుంటే ప్రపంచం మొత్తం మీద ఇంగ్లీషు వచ్చిన వాళ్ళు ఎక్కువవున్నారు అంచేత దేశం అనే సంకుచితాభిప్రాయంవదిలి, ప్రపంచ భాష అయిన ఇంగ్లీషు వుంటే ఏం " ఇంగ్లీషు వారికి పరాయి భాష అయితే హిందీ మనకు ఎందుకుకాదు? అని అడిగితే సరి అయిన జవాబు చెప్పరు! ఏదో సమర్ధించుకో చూస్తారు -
ఈ అనుకరణవల్ల - మన భాష మన జాతీయత. ఎంత దెబ్బ తింటున్నదో వారికి అర్ధంకాదు! ఇలా చాలామంది ఈ వ్యామోహంలోపడి - ఆఖరికి- ఏ జాతో, ఏ భాషో, ఏ మతమోకూడా తెలియలేని స్థితికి వస్తున్నారు-వ్యక్తిత్వాన్నే మరచిపోతున్నారు.
మా పినతండ్రి కొడుకు ఒకడున్నాడు. వాడింట్లో యిలా అనుకరణ అనే అంటువ్యాధి పూర్తిగా వ్యాపించింది! వాళ్ళయింట్లో హిందీయే మాట్లాడుతారు. హిందీయే చదువుతారు, హిందీ లోనే దెబ్బలాడుకుంటారు! ఆఖరికి హిందీతోనే ఏడుస్తారు! -ఇక వాడికీ, వాడి పెళ్ళానికీ మాత్రం తెలుగురాయనూ చదువనూ వచ్చు. వాడి కొడుకులూ కూతుళ్ళకీ తెనుగు మాట్లాడ్డం మాత్రమే వచ్చు రాయనూ చదవనూరాదు యింక వాడి మనవల అసలు తెలుగంటే ఏమిటో తెలీదు.... యిదీ వాడియింటి పరిస్థితి - వేష భాష లన్నీ ఆ పద్ధతులే- తిండిలో కూడా అదే పద్దతి-
హిందీవాళ్ళు రొట్టెలు తింటారు కాబట్టి- అవే తినాలి! అసలది ప్రధానలక్షణం! అది తప్పితే, మన సహజాహారం! వారికి పడదు! శీతోష్ణస్థితులూ దేశకాల పరిస్థితులూ, వాతావరణం, మనుష్యుల తత్వం. యివన్నీ పరిశీలించి, ఆలోచించి- మన పూర్వులు ఆహారాల నియమాలు చేశారు. అవన్నీ అనాలోచితంగా రోజుల ప్రభావానికి లొంగిపోయి, త్రోసిరాజని, యితరులని అనుకర్షించడం ఎంత తెలివితక్కువ?
