Previous Page Next Page 
రారామాఇంటిదాకా పేజి 6


    "పేదరికం కాకపోతే అమాయకత్వం. ఆడపిల్లకు ఈడురాగానే తల్లిదండ్రులు సంకెళ్ళను తగిలించేస్తారు. బయటకు వెళ్ళి నలుగురిలో తిరగని అమ్మాయిలకు వీటి గురించి ఏం తెలుస్తాయి? ఫస్ట్ నైట్ న ఏం జరుగుతుందో తెలియని ఆడపిల్లలు కూడా చాలామందే వున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా ఊరులో పెదరాయుడి గారి అమ్మాయి రాధ"
    
    సుజనకు ఇంట్రెస్ట్ ఎక్కువైంది. తన రీసెర్చి టాపిక్ కు ఉపయోగపడే విషయం కనుక "ఎవరు రాధ?" అని అడిగింది.
    
    "మా ఊరిలో ఏకైక మోతుబరి పెదరాయుడు. ఊరిలోని ముప్పాతిక భాగం భూములు ఆయనవే. అందరికంటే తామే ఎక్కువన్న అహంభావం వారికి బాగానే వుండేది. దీంతో ఇరుగు పొరుగు వారితో కూడా క్లోజ్ గా వుండేవాళ్ళు కారు.
    
    ఎవరింటికీ వచ్చేవాళ్ళు కారు. ఎవరూ వాళ్ళింటికి వెళ్ళేవాళ్ళు కారు.
    
    ఒక్కమాటలో చెప్పాలంటే వాళ్ళకు సోషల్ లైఫ్ వుండేది కాదు.
    
    రాయుడికి ఒకతే కూతురు. పేరు రాధ. చాలా అందంగా పాలలో ముంచినట్లు తెల్లగా, దంతపు బొమ్మలా వుండేది. పదో తరగతిలోనే చదువు ఆపించేశారు.
    
    రజస్వల అయిన సంవత్సరానికల్లా పెళ్లిచేశారు. ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్ళడానికి ససేమిరా ఒప్పుకోలేదు రాధ.
    
    "ఆ కొత్త వ్యక్తితో నేను గదిలోకి వెళ్ళను. బూచాడిలా పెద్ద పెద్ద మీసాలు ఆ హిప్పీ క్రాపు - సూది రంద్రాల్లా చిన్న చిన్న కళ్ళు - ఆయన్ను చూస్తుంటే భయమేస్తోంది. గదిలో ఒంటరిగా వుంటే - ఆయన నన్ను గొంతు నులిమి చంపేస్తే - నేను వెళ్ళను దేవుడో" అంటూ మొరాయించింది.
    
    గదిలో ఆయన నిన్ను చంపడని తల్లీదండ్రీ చెప్పినా వినలేదు. అంతకంటే మించి ఎలా చెప్పాలో వాళ్ళకి అర్ధం కావడంలేదు. శోభనంరోజున పెళ్ళి కొడుకు చంపేస్తాడని బెదిరిపోతున్న ఆ పిల్ల అమాయకత్వాన్ని ఎలా పోగొట్టాలో తెలియడం లేదు.
    
    ఇదంతా గమనిస్తున్న ఆమె బామ్మ రంగంలోకి దిగింది. మనవరాల్ని దగ్గరికి పిలిచి "ఏమిటే ఆ భయం పిచ్చి మొహమా గదిలో ఆయన నిన్ను చంపడు - కనీసం కొట్టడు కూడా. మీ నాన్న మీ అమ్మని చంపేశాడా? లేదే - మరి నీకెందుకు భయం?
    
    గదిలో మహా అయితే ఆ అబ్బాయి నిన్ను ముద్దులు పెట్టుకుంటాడేమో- అంతే- శోభనం అంటే ముద్దులు పెట్టుకోవడమే అంతకు మించి నిన్నేమైనా చేస్తే గట్టిగా అరువ్. మేమంతా ఈ హాల్లోనే గదా పడుకునేది" అని బుజ్జగించి చెప్పింది.
    
    "అంతేనంటావా?"
    
    "అవునే ముద్దు తప్ప మరేదానికి నిన్ను ముట్టుకోడే"
    
    "అలా అయితేనే వెళతాను"
    
    ఇదంతా పెళ్ళికొడుకు చాటునుంచీ విన్నాడు. రాధ అమాయకత్వం అతనికి అర్ధమైంది.
    
    ముద్దులు తప్ప మరేమీ పెట్టుకోకుండా ఎలా మేనేజ్ చేయాలా అని ఆలోచనలో పడ్డాడు.
    
    గదిలోకి వెళ్లి వెయిట్ చేస్తుండగా రాధ పాలగ్లాసుతో ప్రవేశించింది.
    
    ఏడుపుకి కందిపోయి మందారమొగ్గల్లా అయిపోయిన ఆమె బుగ్గలని చూస్తూ లోనికి ఆహ్వానించాడు.
    
    మంచం మీద కూర్చోబెట్టాడు. పాలు తాగి మీదకి ఒరగబోతున్న అతన్ని దూరంగా నెట్టేసింది.
    
    "ఏమిటలా మీద పడిపోతావ్? నువ్వు నన్ను ముద్దు పెట్టుకుంటావని మాత్రమే బామ్మ చెప్పింది. అంతకు మించి ఏమయినా చేస్తే నేను బామ్మను పిలుస్తాను. జాగ్రత్త" అంటూ ఏడుపు కలగలిసిన గొంతుతో హెచ్చరించింది.
    
    అతనికి సమస్య పూర్తిగా అర్ధమైంది. ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో కూడా తట్టింది.
    
    "నేనూ అంతకంటే ఏమీచేయను. కేవలం ముద్దులే పెట్టుకుంటాను. ముద్దంటే ఏ అవయవంతో ఆ అవయవాన్ని తాకటమే కదా ఫర్ ఎగ్జాంపుల్ నీ చేతుల్ని నా కాళ్ళతో తాకలేను కదా పెదవుల్ని పెదవులతో, కళ్ళను కళ్ళతో స్పృశించటమే ముద్దంటే. అంతకంటే మించి ఏం చేసినా నువ్వు బామ్మని పిలువ్" అన్నాడు ఆ లాజిక్ కి ఆమె కన్విన్స్ అయింది.
    
    ఇక ఆగలేదు అతను. తన కళ్ళతో ఆమె కళ్ళను తాకాడు. ముక్కుతో ఆమె ముక్కును రుద్దాడు. పెదవులతో పెదవుల మీద అద్దాడు.
    
    ఇలా కళ్ళతో మొదలుపెట్టిన అతను ఎక్కడ ఆగాడో ఊహించు అలా రాధ ఫస్ట్ నైట్ జరిగిపోయింది" అంతవరకు చెప్పి నవ్వసాగింది నిరుపమ. సుజన ఆమెతో శృతి కలిపింది.
    
    "ఆ రాధ మొగుడు ఎవరోగానీ గొప్ప చతురుడిలా వున్నాడే. లేకుంటే అలాంటి అమ్మాయిని చిన్న లాజిక్ తో దారిలో పెట్టగలిగేవాడా" సుజన బలవంతంగా నవ్వాపుకుంటూ అంది.
    
    "అది సరేగానీ... నీ శోభనం వాయిదా పడిందట కదా - ఎవరో చెప్పారు" నిరుపమ తను విన్నది నిజమా కాదా అని తెలుసుకోవడానికి అడిగింది.
    
    "అవును. సరిగ్గా ముహూర్తం సమయానికి నేను 'అవుటాఫ్ ది డోర్స్' ఆ తర్వాత మంచి ముహూర్తం లేదని నెలరోజులు వాయిదా వేసారు మా నాన్న. అసలు ఆడపిల్లకు ఈ మూడు రోజుల తతంగంతోనే డిప్రెషన్ మొదలవుతుంది. తన ఇష్టాయిష్టాలన్నీ కూడా వేరే విషయాలఫై ఆధారపడి వున్నాయని ఆడపిల్లకు తెలిసిపోతుంది. మనుషులే కాకుండా ప్రకృతి సైతం తన మీద పెత్తనం చెలాయిస్తూ వుందని అర్ధమయిపోతుంది.
    
    ఉదాహరణకు ఓరోజు ఇంటిల్లిపాదీ సినిమాకు వెళ్ళాలని అనుకుందాం. ఆమె కూడా ఉత్సాహంతో బయల్దేరుతూ వుంటుంది. కానీ సడన్ గా ఇష్టంలేని అతిథి అర్ధరాత్రి వచ్చినట్లు మూల కూర్చుంటుంది. ఇలాంటి సమయంలో సినిమాకు రాకూడదనీ, ఈ మూడు రోజులూ ఇంటి బయటే వుండాలనీ చెప్పి వరండాలో చాప వేసి సెపరేట్ గా చెంబూ, గ్లాసూ యిచ్చి అందరూ వెళ్ళిపోతారు. ఆమె బిక్కు బిక్కుమంటూ ఒంటరిగా తనని కంట్రోల్ చేస్తున్న ప్రకృతిని తిట్టుకుంటూ వుండిపోతుంది"
    
    "నిజమే - మనం ఈ సంఘం చేతిలో కీలుబొమ్మలం. ఆకలి మన కడుపులోనే వేసినా, అది తీరే పదార్ధాలన్నీ బయటే వుంటాయి. మనం అంతా ఎవరో వెనక నుంచి చెప్పిస్తూ వుంటే నటిస్తుంటాం. అందుకే మానవ జీవితం ఒక నాటకం అంటారు. ఈ నాటకానికి సూత్రదారి ఎవరో తెలుసా? డబ్బు అది కావాలనుకుంటే మనల్ని నవ్విస్తుంది. ఏడిపించాలనుకుంటే ఏడిపిస్తుంది. ఈ పాఠం నేనెప్పుడు నేర్చుకున్నానో తెలుసా? నా ఫస్ట్ నైట్ రోజున"
    
    సుజన ఎగ్జయిట్ మెంట్ తో తూలింది. వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లు ఆమె ఉక్కిరి బిక్కిరయింది.
    
    ఫస్ట్ నైట్ గురించి తాను ఆగడాలనుకుంటూ వుండగానే నిరుపమ ఆ టాపిక్ ఎత్తడం గమ్మత్తుగా వుంది ఆమెకి.
    
    "నీ ఫస్ట్ నైట్ రోజునా! ఏం జరిగింది?"
    
    "అదంతా ఓ తమాషా"
    
    "ఆఁ... ఏం జరిగిందో చెప్పనా?"
    
    "చెప్పక తప్పదా! ఎప్పుడో - మూడు సంవత్సరాల నాటి సంగతి తలుచుకుంటూంటే ఏదో నిన్నో మొన్నో జరిగినట్లుగా వుంటుంది"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS