Previous Page Next Page 
నరుడా ఏమి నీ కోరిక పేజి 59

 

    సిటీలోని ఓ పెద్ద పైవ్ స్టార్ హొటల్ కి తీసుకెళ్ళాడు శ్రీచంద్ర.


    రిసెప్షన్ లో మాట్లాడి రెండు రోజులకు డీలక్స్ సూట్ బుక్ చేశాడు.


    ఐదో అంతస్తులో ఉంది రూమ్.


    లిప్ట్ లో వెళ్ళుతుంటే గమ్మత్తుగా ఉంది యమధర్మరాజుకు.


    "ఆహా! మేమే తెలివైనవారమని అనుకుంటిమి మానవా! మీకునూ బలే తెలివితేటలున్నవే! హాయిగా మెట్లు ఎక్కకుండా ...ఇలా ఈ పెట్టెలో నుంచున్నచో అదే పైకి పోవుచున్నది. ఎటులైననూ మీ మానవులు తెలివైన వారే సుమీ!" అన్నాడు లిప్ట్ ని చూసి మురిసిపోతూ!


    "అప్పుడే ఏం చూశారు. ఇంకా మా తెలివితేటలు ముందు ముందు మరి మరి చూచెదరు" గర్వంగా అన్నాడు శ్రీచంద్ర.

 

                                                        * * *


    విశాలంగా ఉన్న రెండు రూమ్స్, వాటిలో నీట్ గా డెకరేట్ చేసి వున్న మంచాలు ఫ్రిజ్, టివీ అన్నీ బాగా నచ్చాయి యమధర్మరాజుకి.


    "ఎంత బావుందో ఈ హొటల్. నిజానికి మా లోకంలో ఇన్ని సౌకర్యాలు లేనేలేవు శ్రీచంద్రా!" అన్నాడు ఫ్రిజ్ లోని కూల్ డ్రింక్ సీసా తీసి తాగబోతూ!


    'అయ్యయ్యో! అది తాగినచో సపరేట్ చార్జీ చేయుదురు...." అన్నాడు శ్రీచంద్ర కంగారుగా.


    "ఆ! ఏమున్నది డబ్బేగా! సృష్టించుదుము. నో ప్రాబ్లెం. నువ్వునూ తాగుము కావలెనన్న" అన్నాడు యముడు హుషారుగా.


    "అంతేనంటారా?"


    "అంతేగాక మరేమిటి? ఊ! లాగించు?"


    ఓ పెప్సీ ఓపెన్ చేసి 'చీర్స్' అన్నాడు శ్రీచంద్ర.


    అలా అలా యముడితో చాలా రాత్రి వరకూ గడిపి , సుష్టుగా డిన్నర్ చేసి, అప్పుడు ఇంటికి బయలుదేరాడు శ్రీచంద్ర.

 

                                                                * * *


    ఆ హొటల్ సెంట్రలయిజ్ద్ ఏసి కావడంవలనా, యముడికి రూంలో ఏసి ఫుల్ స్పీడ్ లో ఉండటం వలనా ఓ రాత్రివేళ వణుకు పుట్టింది యమధర్మరాజుకి. హొటల్ వాళ్ళు సర్దిపెట్టిన బ్లాంకేట్స్ రెండూ కప్పుకున్నా చలి ఆగటం లేదు. లేచాడు.ఏసి ఎలా ఆఫ్ చేయాలో చూశాడు అర్ధం కాలేదు.

 

    అటూ ఇటూ తిప్పి చూశాడు అయినా రాలేదు.


    "ఏం చేయాలబ్బా?" అనుకున్నాడు. ఈలోగా శ్రీచంద్ర చెప్పింది గుర్తుకొచ్చింది. ఏమైనా అవసరమైతే మొదటి స్విచ్ ప్రెస్ చేయమని బోయ్ వచ్చి ఏం కావాలో అడుగుటాడని చెప్పటం గుర్తొచ్చింది.


    బెల్ కొట్టాడు.


    ఐదు నిమిషాల తర్వాత బోయ్ వచ్చాడు.


    "ఏం కావాలి సార్?" అన్నాడు.


    "చలితో వణికి చస్తున్నాను బాబూ! కాస్త ఆ చలి మిషన్ ఆపి వెళ్ళు" అన్నాడు ఏసి వైపు చూపిస్తూ.


    ఆ కుర్రాడు నవ్వుకుంటూ ఏసి ఆఫ్ చేసి.....


    "మంచి ఇంగ్లీషు సినిమా వస్తోంది కద్సార్! చూడరా?" అన్నాడు ఇంకా నవ్వుతూనే.


    "ఆ పెట్టిలో నుంచి వస్తోంది కదూ! ఏది పెట్టుచుద్దాం! నాకు ఇందాక ఎలా పెట్టాలో తెలిలేదు" అమాయకంగా చెప్పాడు యముడు.


    ఆ బోయ్ టివీ అన్ చేసి పే ఛానల్ లో వస్తోన్న ఇంగ్లీషు పిక్చర్ పెట్టి వెళ్లిపోయాడు.


    మెత్తటి పరుపు మీద , వెచ్చగా బ్లాంకెట్ కప్పుకుని టీవి వైపు మిడిగుడ్లేసుకుని పిక్చర్ చూస్తూ అలాగే ఉండిపోయాడు యమధర్మరాజు.


    ఆ వస్తోంది ఓ బ్లూ ఫిలిం.


    చిత్రంగా, విచిత్రంగా, మత్తుగా , గమ్మత్తుగా ఉంది యమధర్మరాజుకి.


    ఓ అరగంట చూసేసరికి యమధర్మరాజు ఒళ్ళు సెగలు, పొగలుతో కాగిపోసాగింది.


    ఎంకావాలో అతనికే తెలియటం లేదు.


    వెచ్చగా దిండుని కౌగలించుకుని నోరు తెరచుకుని చూస్తుండిపోయాడు టీవి వైపు.


    కాసేపటికి ఆ తాపాన్ని భరించలేక టీవిని ఆఫ్ చేయాలనుకున్నాడు. ఎలాగో తెలియలేదు.


    మళ్ళీ బెల్ కొట్టాడు.


    బోయ్ వచ్చాడు. నిద్రమత్తులో వున్నడతను. అయినా యముడి పరిస్థితి అర్ధమైంది.


    "ఏంటిసార్?" అన్నాడు నెత్తి గోక్కుంటూ నిద్రమత్తులో.


    
    యముడు ఒక్క క్షణం బిడియపడ్డాడు. అతనికి మనసులో ఆ సినిమా ఇంకా చూడాలని ఇంకా వీలైతే అలా చేయాలని కూడా ఉంది. కానీ ఎలా అడగాలో తెలియటం లేదు.


    బోయ్ కి పరిస్థితి అర్ధమయిపోయింది. అతను రోజు ఇలాంటి వాళ్ళని బోలెడుమందిని చూస్తాడు.


    "ఏంటిసార్ అలాంటి అమ్మాయి కావాలా?" అన్నాడు డైరెక్టుగా.


    యముడు సిగ్గుపడి నవ్వాడు.


    "పావుగంటలో వస్తాను ఆలాంటమ్మాయిని తీసుకుని" అని వెళ్లిపోయాడు బోయ్.


    యముడికి సంతోషంతో పిచ్చికేకలు వేయాలనిపించింది. బలవంతాన ఆపుకున్నాడు.

 

                                                           * * *


    "గురూ...." గట్టిగా అరిచి శ్రీచంద్రను అతి భయంకరంగా వాటేసుకున్నాడు సత్తిపండు.


    "సరే....పండూ....ఉపిరాడక చస్తాన్రా.....జనం ఇలా మనం ఒకరినొకరు కౌగలించుకుంటే, 'ఆ టైప్" అని అనుమానిస్తార్రా....నీ ఆనందాన్ని జూబ్లిహిల్స్ లో స్టాట్యులా నేలబెట్టా.....వదల్రా.'


    
    అప్పటిగాని వదల్లేదు సత్తిపండు.


    అయిదువేలతో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓపెన్ చేస్తున్నాడని శ్రీచంద్ర చెప్పడం వల్ల సత్తిపండుకు కలిగిన అనందం తాలుకూ రియాక్షన్ అది.


    క్లాక్ టవర్ సెంటర్లో ఓ కార్నర్ ఎంచుకున్నాడు శ్రీచంద్ర. పోష్ లోకాల్టి అది. దగ్గర్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు లేవు.


    ఓ పాడైపోయిన డొక్కు నాలుగు చక్రాలబండిని చూశాడు. ఎందుకు పనికిరాకుండా వున్న ఆ బండిని ఎవరో వదిలేశారు. ఓ అయిదు వందలు ఖర్చు పెట్టి దాన్ని తన తెలివితేటలతో అందంగా డెకరేట్ చేశాడు సత్తిపండు సాయంతో.


    శ్రీచంద్ర ఫాస్ట్ ఫుడ్ సెంటర్' అని ఓ బోర్టు తయారుచేయించాడు.


    సమీరక్కూడా ఉత్సాహంగా ఉంది.


    "ఏంటోరా చందూ యాంకరింగ్ చెప్పి, చెప్పి నా నోరు నొప్పెట్టింది. ఎంత సేపూ "మీరిప్పుడు ఓ అందమైన క్లిప్పింగ్ చుస్తారానో, ట్రింగ్....ట్రింగ్.....మీకేపాట కావాలి....అనో చెప్పటం .....ఛ...ఛ.....బోర్ కొట్టిన నాకు ఇది ఓ కొత్త వెరైటిగా ఉంటుందిరా....." అంది సమీర శ్రీచంద్రతో.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS