Previous Page Next Page 
హెల్త్ సైన్స్ పేజి 58

         54.  ఉలిపిరికాయలు లేస్తే గుర్రం వెంట్రుకతో ముడివేస్తె పోతాయా?
 
    ఉమామహేశ్వరారావుకి కాలుమీద కందిగింజంతఉలిపిరికయ లేస్తే గుర్రం వెంట్రుక ముడి వేశాడు. నిదానంగా అది ఏమదిపోయి రాలిపోయింది. అది రాలిపోయింది కదా అని ఆనందిస్తూ వుండగా నుదుటిమీద చిన్న చిన్న పొక్కులు లేచి అసహ్యంగా తయరయింది. అని బాధ కలిగిస్తున్నయా అంటే అదీలేదు అవేవైనా మొటిమలు లాంటివేమోనని బజారులో దొరికే అయిమ్టుమెంట్లు పైపూతగా కూడా రాశాడు. కాని ఫలితం శిఇంయం. చివరికి చేతిమీద, వెళ్ళమీదచిన్న_చిన్న పావుక్కులంటివి లేచి, కండిబద్దల పరిణామంలో తయరయ్యాయి. అవి కూడా ఎటువంటి నొప్పి. దురద ఉన్నట్లు అనిపించలేదు. అదేమిటో అర్ధంగాక అయోమయంలో పడిన ఉమామహేశ్వరరావు డాక్టరు దగ్గరికి వెళ్ళాడు. డాక్టరు పరీక్ష చేసి, "ముఖంమీద వచ్చినవీ చేతిమీద వచ్చినవీ ఉలిపిరి కాయలే" అనివివరించాడు.

    ఉమామహేశ్వరరావు వచ్చినట్లే, చాలా మందికి ఉలిపిరికాయలు రకరకాలుగా వస్తూవుంటాయి. వీటినే "వార్ట్" అంటరు. ఇవి రావడానికి వైరస్ క్రిములు కారణం. వైరస్ క్రిములు చర్మం మీద అక్కడక్కడ స్థావరం ఏర్పరాచుకుంటాయి. వైరస్ చేరినచోట చర్మంలోకి కణాలు అధికంగా పెరిగి ఉలిపిరి కాయలుగా తయారవుతాయి. శరీరంమీద ఒకచోట చేరిన వైరస్ మరొకచోటకి కూడా సంక్రమించి, అక్కడ కూడా ఉలిపిరికాయలు తాయారవవచ్చు, ఉలిపిరికాయలు రావడం చిన్నపిల్లల్లో ఎక్కువ వీటికి సంభందించిన వైరస్ క్రిములు చర్మం మీదస్థావరం ఏర్పరుచుకున్న   తరువాత 90రాజులకి గాని ఉలిపిరికయులుగా బయటకి తెలవు.

    ఉలిపిరికాయలు కొన్ని పెసర గింజలు లాగా లేస్తే, మరికొన్ని ఎక్కువ స్థానంలో దగ్గర_దగ్గరుగా లేచి, చింతగింజలంత పరిమాణంలో వున్నట్లు కనబడతాయి. కొన్ని అవగింజల కంటె చిన్నవిగా లేస్తే, మరి కొన్ని మెత్తమెత్తగా గుత్తులుగా లేస్తాయి. కొని ఉలిపిరికాయలు ఎటువంటి బాధ, వాసనా లేకుండా వుంటే, మరికొన్ని నొప్పిని, దుర్గంధాన్నీ కలిగిస్తాయి. అందుకునే ఉలిపిరికాయలు విషయంలో అవి వచ్చిన స్థలాన్నీ స్థితిని బట్టి వేరు_వేరు పేర్లు పెట్టబడ్డాయి.

    వేరుసీ జ్యూనినైలిస్ అనే ఉలిపిరిక్యాలు రావటం చిన్నపిల్లల్లోనూ, యువతీ యువకుల్లోనూ ఎక్కువ ఇవి ముఖ్యంగా ముఖంమీద చేతుల మీద వస్తాయి. అవి గరుకు గరుకుగా అనిపిస్తాయి. ఇంతా చేస్తే, గుండు సూది తలంట పరిమాణంలో అనేక సంఖ్యలో వచ్చి లైన్లు లైన్లుగా కనబడతాయి.

    మరొకరకమైన ఉలిపిరికాయలు చేతుల్లోనూ, కళ్ళలోనూ, గొళ్ళ చుట్టూతావస్తాయి. ఇది ఒకటి రెండుగా రావచ్చు. లేదా అనేకం ఒకేచోట రావచ్చు. తలమీద వచ్చినప్పుడు మాత్రం క్యాలీప్లవర్ రూపాలో గుత్తులు గుత్తులుగా కనబడతాయి.
    ఆనెలు మాదిరిగానేఉలిపిరికాయలు కూడా అరికాల్లల్లోనూ, అరిచేటుల్లోనూ వస్తాయి. అరికాళ్ళలో ఉలిపిరికాయలు లేచినప్పుడు చాలా బాధపెడతాయి. అవి పైకి చూడటానికి చిన్నవిగా కనబడినా లోపలి వెడల్పుగా ఉంటాయి. అనేలలాగా ఉలిపిరికాయలు బరువు అనే చోట వస్తాయి. జననేంద్రయాల దగ్గర, గజ్జలలోను, మల ద్వారం దగ్గర కూడా ఉలుపిరికాయలు లేస్తాయి. వాటికీ బాక్టీరియా క్రిములు తోడు కావడంతో అవి వాసన కూడా వేస్తాయి.

    చర్మం మీద వివిధ చోట్ల వివిధ రూపాల్లోనూ వచ్చిన ఉలిపిరికాయలు వాటిపైన 95శాతం ఫెల్ గాని, 50శాతం ట్రైక్లోరోఎసితిక్ యాసిడ్ గాని, పోడోఫిల్లిన్ ద్రవం రాయడం వల్లగాని ఉఉదిపోతాయి. అలాగే వాటి నిర్మూలనకు 20శాతం ఎసిటోన్ కూడా ఉపయోగపడతాయి. ఎలాక్రోకాటారైజేషన్ పద్దతి కూడా కొన్ని ఉలిపిరికయలను తీసివేయడానికి ఉపయోగపడుతుంది. చాలాకేసుల్లోఉలిపిరికాయలచుట్టూ మత్తు ఇంజక్షను ఇచ్చి బ్లేడుతో కోసి తీసివేస్తారు. ఉలిపిరులనునిర్మోలించగల టేబట్లు, క్యాప్సూల్స్ ఇంతవరకు కనిపెట్టబడలేదు. ఉలిపిరికాయల వల్ల వికారంగా కనిపించడం తప్ప సాధారణంగా ఎత్తి అనారోగ్యమూ కలగదు. కాని అరుదుగా అవి కేన్సరుకు సంభందించినవిగా మరి త్వర త్వరగా వాటి పరిమాణం పెరుగుతూ వుంటుంది. అటువంటప్పుడువెంటనే డాక్టరు సంప్రదించడం అవసరం.             

                            ****
   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS