Previous Page Next Page 
హెల్త్ సైన్స్ పేజి 57

                              53.  పాదాలద్వారా ప్రవేశించే 'కొంకిపురుగు' లవ్యాధి       
                               
    నేరసం, నడిస్తే ఆయాసం అనే సరస్య డాక్టరు దగ్గరకు మందు కోసం వెళ్ళింది. డాక్టరు ఆమెను పరీక్ష చేస్తూ నాలుకను బయటకు చపామన్నాడు. ఆమె నలిక బియ్యపుపిండిలా తెల్లగా వుంది. డాక్టరు ఆమె కిందరెప్ప లాగిచూశాడు అదీ కలాహీనంగా తెల్లగా వుంది.

    "చూడు సరసంమా, నీకు ఒంట్లో అసలు రక్తమే లేదు. అందుకే కదిలితే కాళ్ళునొప్పులు, నడవబోతే నీరసం. "అంటూ అసలు కారణం వివరించాడు డాక్టరు.

    "అయితే దాకత్రుగారూ, నాకు మంచి టానిక్ సీసారాసిచ్చేయండి. త్వరగా రక్తం పట్టేసి బలంగా తయరై పోవాలి." అన్నదామె. అలాగే, కాని రేపు ఒకసారి నీ విరేచనం తీసుకుని రా. మలపరీక్ష చేసి మందురాసిస్తా." అని తాపీగా జావబిచ్చాడు డాక్టరు.

    "రక్తం పట్టటానికి మంచి టానిక్ రాసివ్వమని అడిగితె మలంపట్టుకుని రా, అంతాదేమిటబ్బా" అని ఆశ్చర్యపోయింది సరసమ్మ.

    సరసమ లాంటి వాళ్ళకి మలంలో కనబడే దోషానికీ, వంట్లోరక్తం తగ్గిపోయి నీరసం రావటానికి సంభంధం తెలియకపోవచ్చు. జీర్ణకోశంలో కొంకిపురుగులు (హుక్స్ వర్మ్) అనే చిన్న_ చిన్న పురుగులు వుంటాయి. ఈ పురుగులు చిన్నప్రేగుల గోడల్లో స్థావరం ఏర్పరచుకుని అక్కడవున్న రక్తనాళాలనుకన్నంపేట్టి అ రక్తం త్రాగి బ్రతుకుతూ వుంటాయి. మన శరీరంలోని రక్తమే వ్తికి ఆహారం. అవి గ్రహించే రక్తం కొంచెమే అయినా అని జీర్ణకోశం లోపల రక్తనాళాలకు చిల్లులుపెట్టటంవలన వృధా అయ్యేరక్తం యెక్కువ.

    ఈ కొంకిపురుగులు జీర్ణకోశంలోకొన్నివేల సంఖ్యలో వుంటాయి. నీటి పరిమాణం దాదాపు అరఅంగుళంవుంటుంది. ఈ పురుగులు జీర్ణకోశములో అనేక గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు మలవిసర్జనతో పటు బయటకు వస్తూ వుంటాయ్. మలంతోపాటు విసర్జించబడినఈ గుడ్లు తడి_తడిగా, పొడి_పొడిగా ఉండే స్థలంలో 4_5 రోజుల్లో పరిపక్వమైఅందులోనుంచిచిన్న_చిన్న పిల్లలుగా రూపం యెత్తుతాయి. ఇలా గుడ్లనుంచి వెలువడిన పురుగులు చెప్పులులేకుండా నడిచినపుడు మనకు తెలియకుండానే చర్మాన్ని చేదించుకుని, శరీరంలోకి ప్రవేశించి, శ్చ్వాసకోశాలల్లోకి చేరుతాయి. తరువాత అవి వూపిరిగొట్టంద్వారా పైకి ఎగబ్రాకి చివరికింనవహికలోకి ప్రవేశిస్తాయి. అక్కడనుంచి అవి చిన్న ప్రేగులలోనికి చేరి కొంకిపురుగులుగా పూర్తీర్తూపాన్ని సంతరించుకొంటాయి.

    కొంకిపురుగులు కడుపులో వుందేవారిలో, చాలమందిలో కడుపులో పుండు వున్నట్లుగా నొప్పి అనిపిస్తూ వుంటుంది. కొద్దిపాతి క్రిములు వుంటే ఎ బాధా అనిపించక పోవచ్చు. ముఖ్యంగా ఈ కొంకి పురుగులు చిన్న ప్రేవుల్లో స్థావరం ఏర్పరచుకుని, రక్తపిశాచుల్లా రక్తాన్ని పీల్చివేయడంవల్ల రక్తహీనత (ఎనీమియా)ఏర్పడుతుంది. ఆ రక్తహీనతఎక్కువ వుమ్దడీ, తక్కువ వుండేదీ, చినప్రేవుల్లో స్థావరం ఏర్పరచుకున్న పురుగుల సంఖ్యను బట్టీ ఆ వ్యక్తి తీసుకునే ఆహారాన్ని బట్టీ వుంటుంది.

    కొంకిపురుగులు వల్ల పేదవారిలో రక్తహీనత, దానివల్ల కలిగే దుష్పలితాలు ఎక్కువ.పరిసరాలు శుభ్రంగా లేకపోవడం, మలవిసర్జన ఎక్కడ పడితే అక్కడ చేయడం, కాళ్ళకు చెప్పులు లేకుండా నడవడంవల్లపేదవారిలో ఇవి తెలికిగా ప్రవేశిస్తాయి. చిన్న పిల్లల పేగుల్లో ఈ పురుగులు వున్నప్పుడు రక్తహీనతకలిగి, వారి ముఖం ఉబ్బినట్లు, పాలిపోయినట్లు, కడుపు ఎత్తుగా ఉన్నట్లు, కళ్ళకు, పొట్టకు నీరు చేరినట్లు ఉంటుంది. ఇటువంటి పిల్లలు పొట్టికడుపులో నొప్పి అనడం, ఆయాస అప్డుతున్నట్లు బాధ పాడడం సహజమవుతుంది. వీటన్నింటినికీ తోడు విటమినులు, ప్రోటీనుల లోపంవల్ల కలిగే అనర్ధాలు స్పష్టంగా కనబడతాయి.

    ఇలాగె కొంకిపురుగులు వున్న స్రీ మామూలు రోజుల్లో ఎవ్ బాధలు లేనట్లు కనబడినా గర్భం ధరించిన తరువాత చాలా త్వరగా పాలోపోయినట్లు కనబడుతుంది. ఆయాసం కూడా ఉంటుంది. దానికి కారణం గర్భవతి పిండం ఎదుగుదలకు ఎక్కువ రక్తం అవసరం కావటమే. అయితే కొంకిపురుగులు పేగుల్లో ఉండటంవల్ల శరీరానికి తగినంత రక్తం అందక ఆమె రోగిగా తయారవుతుంది.

    ఒకసారి శరీరంలో రక్తం రక్కువయితే మళ్ళీ తయారవడానికి మన ఆహారంలో ఐరన్, ప్రోటీన్లు తగినంత ఉండాలి. రక్తహీనత కలగాదానికి గల కారణాలలో కొంకిపురుగులు కూడా ముఖ్య కరంబమే. అందుకునేరక్తహీనత ఉన్నప్పుడు, మలపరీక్ల్ష చేసి, అందులో వీటికి సంభందించిన గుడ్లు కనబదినట్లేఅవి పూర్తిగా పోయేవరకు మందు వాడటం అవసరం. మలంలో పూర్తిగా గుడ్లు పోవడమంటే పేగుల్లో ఆ పురుగులు నిర్మూలింపబడినట్లే గుర్తు!

    ఆ పురుగులు నిర్మూలించబడటానికి దేకారిన్, పాస్ట్ ల్మిన్ , మేతెక్స్ లాంటి మందులు చాలా ఉన్నాయి. కాని అవి మళ్ళీ మన శరీరంలోకి ప్రవేశించకుండా శుభ్రతను పాటించటం, చెప్పులు వేసుకుని నడవడంలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. రక్తహీనత పోవడానికి ఐరన్ కి సంభందించిన బిళ్ళలు, టానిక్కులు, ప్రోటీన్లకు సంభందించిన మందులు వాడితే మంచిది. వీటికి తోడు ఆకుకూరలు, గుడ్లు పాలు లంటివి తీసుకుంటే త్వరగా రక్తం పట్టి, ఆ వ్యక్తులు త్వరగా కులుకుమ్తారు.   

                                ****


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS