Previous Page Next Page 
చిన్నమ్మాయ్ చిట్టబ్బాయ్ పేజి 58

    జీపు కాస్త ముందుకు వెళ్ళిన తరువాత "డ్రైవర్! పొలిసు స్టేషనుకు కాదు ఇంటికి పోనియ్" చెప్పాడు బంగార్రాజు.

    "ఇంటికెందుకు సార్?" కంగారుగా అడిగాడు కన్నారావు.

    "లాకప్ లో పెట్టి లాఠిదెబ్బలు  కొట్టడం మామూలే .. నీకు గారిత కాల్చి వాతలు పెట్టి, కొత్త పద్దతిలో నిజం చెప్పిద్దామని " అన్నాడు బంగార్రాజు.

    "వద్దుసార్... కావాలంటే పొలిసు స్టేషన్ కి  తెస్కేళ్ళి లాఠి దెబ్బలు కొట్టండి సార్.... అంతేగాని మీ యింట్లో  వాతలు పెట్టకండి సార్.. పరువు పోతుంది.. ప్లీజ్ సార్" బ్రతిమాలాడాడు కన్నారావు.

    "షటప్...అట్టే మాట్లాడావంటే నేను కాకుండా మా అమ్మాయి చేత పెట్టిస్తా నీకు వాతలు!"

    కన్నారావు గుండెలు ఝల్లుమన్నాయి.

    కాంతామణి తనకి వాతలు పెట్టడమా?

    కన్నారావు బంగార్రాజుని  మనసులోనే తిట్టుకుంటూ కూర్చున్నాడు.

    అయిదు నిముషాల్లో జీపు బంగార్రాజు ఇంటి ముందు ఆగింది.

    "దిగావోయ్" అన్నాడు బంగార్రాజు కన్నారావు భుజం తడ్తూ.

    "పర్లేదుసార్.. నేను జిపిలోనే కూర్చుంటాను మీరు వెళ్ళిరండి. హిహి" అన్నాడు కన్నారావు మొహమాట పడ్తున్నాట్టుగా.

     దిగుతావా నాలుగు వాతలు ఎక్కువ పెట్టించమంటావా?" గట్టిగా అరిచాడు బంగార్రాజు.

    కన్నారావు నోర్మూస్కుని జీపు దిగాడు. బంగార్రాజు, ఏడుకొండలు కూడా కనారావు అతనికి ఎదురుగా భయం భయంగా కూర్చున్నాడు. కానిస్టేబులు ఏడుకొండలు గుమ్మంలో నిల్చున్నాడు.

    ఇంతలో కాంతామణి బయటికి వచ్చింది. మొట్టమొదట ఆమె బంగార్రాజుని చూసింది.

    "ఎంతసేప్తెంది నాన్నా వచ్చి?.. లోపలికి రాకుండా ఇక్కడ కూర్చున్నారేం?" అని అడిగింది.

      "గెస్టు ఉన్నాడుగా... అందుకని!" చెప్పాడు బంగార్రాజు.

    అప్పుడు చూసింది కాంతామణి కన్నరావుని.

    "ఏయ్ కన్నా... నువ్వెప్పడోచ్చావ్? మానాన్నతో కలిసోచ్చావా?" సంతోషంగా అడిగింది.

    "కలిసి రావడమా? రోడ్డు మీద కనిపించి పారిపోతూంటే లాక్కొచ్చాను" చెప్పాడు బంగార్రాజు.

    "ఆబ్బే.. పరిగెత్తడం అంటే పరిగెత్తడం కాదు.. రన్నింగ్ ప్రాక్టిసన్నంమాట!! హిహి" మెలికలు తిరిగిపోతూ అన్నాడు కన్నారావు.

    "ఆరోజు మా ఇంటికి వచ్చినప్పుడు రన్నింగు ప్రాక్తిసేనా?" కళ్ళు చిట్లించి అడిగింది కాంతామణి.

    కన్నరావుని సమాధానం చెప్పనివ్వకుండా వెంటనే బంగార్రాజు అందుకున్నాడు. "అవునోయ్.. ఆరోజు మా అమ్మాయితోబాటు  మా ఇంటికొచ్చి నేను బయటికి వచ్చేలోగా చెప్పా పెట్టకుండా పారిపోయావేం?"

    "మీరు మాట్లాడితే మర్డరు చేస్తానని అంటారుగా, అందుకని భయమేసి" నసిగాడు కన్నారావు.

    బంగార్రాజు  పకపక నవ్వాడు.

    "ఏవండి... ఆ రోజు వచ్చింది నేనే అని మీకెలా  తెలుసు?" ఆశ్చర్యంగా అడిగాడు కన్నారావు.

    "నాకు మా అమ్మాయి ని గురించి చెప్పిందిలే. నువ్వు పేరు అడిగితే పేరు చెప్పకుండా ఎడ్పించేదటగా ... నీకు గుర్తులేదూ?.. ఒకసారి నిన్నూ మీ ఫ్రెండుని నేను నడిరోడ్లో పట్టుకున్నాను. పిల్లల్ని కిడ్నాప్ చేసేవాళ్ళని అనుకుని... అదే సమయంలో మా అమ్మాయి వచ్చి నీకు చిక్కు ప్రశ్న వేసింది... నాకు అప్పడే తెల్సింది.. మా అమ్మాయి ఎడిపిస్తున్నది నిన్నేనని... మా అమ్మాయి తను ఇన్ స్పెక్టర్ కూతుర్ననే విషయం  ని దగ్గర రహస్యంగా పెట్టాలని అనుకుంది. అందుచేత  మేము ఒకరికి ఒకరు ఏమి కానివాళ్ళాలా పలకరించుకోలేదు...పొరబాట్న దాన్ని పలకరిస్తే నన్ను మర్డరు చేసేసేది.... దానికంతా నా పోలికే"

    "ఏంటిసార్... అమ్మాయిగార్తో పరాయివాళ్ళతో మాట్లాడ్తున్నట్టు  మాట్లాడ్తున్నారు అని అప్పుడు నేను అడగబోత సార్ నా చేతి మీద గిచ్చి నోర్మూసుకో. మాట్లాడొద్దని నా చెవిలో అన్నారు.. నేను నోర్మూసుకున్నా" అన్నాడు ఏడుకొండలు.

    "లేకపోతే మర్డరు చేసేసేవాన్నే" అన్నాడు బంగార్రాజు.

    అందరూ ఘోల్లుమని నవ్వారు.

    బంగార్రాజు ఇంట్లోకి చూస్తూ "ఒసేవ్ కామాక్షి" అని పిలిచాడు.

    "అబ్బ... ఏమిటండి.. నాకసలే ఆయాసం ఉంది" లోపల్నుండే అంది కామాక్షమ్మ.

    "త్వరగా వస్తావా మర్డరు చేయానా?" గట్టిగా అరిచాడు.

    "అబ్బబ్బ... వస్తున్నా నుండండి" లోపల్నుండి ఆమె కూడా అరిచింది.

    కొన్ని క్షణాల తరువాత కామాక్షమ్మ బయటికి వచ్చింది. 

    "ఏంటో త్వరగా చెప్పండి... నాకసలే ఆయాసం ఉంది"

    "ని ఆయాసం తగలెయ్యా.. ముందు కూర్చో " కామాక్షమ్మకూర్చుంది.

    "మన కాంతామణి ఫ్రెండుని చూశావా?" కన్నారావుని చూపిస్తూ అడిగాడు.

    "ఏం పెరుబాబూ... త్వరగా చెప్పు. నాకసలే ఆయాసం ఎక్కువ" అడిగింది కామాక్షమ్మ కన్నారావు వంక చూస్తూ.

    "కన్నారావండి" వినయంగా చెప్పాడు కన్నారావు.

    "ఎలావుంది మన అమ్మాయి సెలెక్షన్?" కళ్ళేగేరేస్తూ అడిగాడు బంగార్రాజు.

    కామాక్షమ్మ కన్నారావు వంక కొన్ని క్షణాలపాటు పరిశీలనగా చూసి తృప్తిగా తల ఊపింది.

    కన్నరావుకు సంతోషంతో గట్టిగా కేవ్వమని అరవాలని అనిపించిందిగాని అలాచేస్తే బంగార్రాజేక్కడ మర్డరు చేస్తానని అంటాడో అని నోర్మూసుకున్నాడు.


                                       *                  *                  *

    కన్నారావు ఆనందంతో ఇంట్లోకి అడుగుపెట్టాడు.

    "ఒరేయ్ చిట్టి!" హుషారుగా ఓ కేకపెట్టాడు గదిలోకి వస్తూ.

    సమాధానం లేదు.

    అప్పుడు చూశాడు కన్నారావు చిట్టబ్బాయ్ మంచంమీద అటు తిరిగి పడుకుని ఉండడం. 

       కన్నారావు కేకకి చిట్టబ్బాయిలో మెల్లగా చలనం కలిగింది. మంచం మీద అటు నుండి  ఇటు తిరిగాడు.

    చిట్టబ్బాయి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. మొహం పిక్కుపోయి ఉంది.

    కొన్ని గంటల క్రితానికి ఇప్పటికి ఎంత మార్పు!!

    తన ప్రేమ ఫలించిన వ్తెనాన్ని చిట్టబ్బయికి చెప్దామని హుషారుగా వచ్చిన కన్నారావు స్నేహితుడి మొహాన్ని చూడగానే పెదవి కదపలేకపోయాడు.

    చిట్టబ్బాయి మంచంమీద మెల్లగా  లేచి కూర్చున్నాడు. అతని శరీర కదలిక చూస్తుంటే ఒంట్లో ఏ మాత్రం శక్తిలేనట్టు అనిపించింది కన్నరావుకి.

    "ఏమ్తెంది?.. ఎందుకలా ఉన్నావ్?" ఆతృతగా  అడిగాడు కన్నారావు చిట్టబ్బయిని.

    చిట్టబ్బాయి తలెత్తి కన్నారావు మొహంలోకి చూశాడు.

    అతని కళ్ళలో కన్నీటి పోర!

    ఏం సమాధానం చెప్పలేదు అతను.

    "అన్ని సర్దుకుంటాయిలే...నువ్వేమి బాధపడకు" జాలిగా చూస్తూ అన్నాడు కన్నారావు.

    చిట్టబ్బాయి తల అడ్డంగా ఊపాడు.

    "ఇప్పడే చిన్నమ్మయిని కలిసోచ్చాను" మెల్లగా చెప్పాడు.

    ఆ మాట వింటూనే కన్నారావు గబుక్కున కూర్చుని భుజం మీద చెయ్యేసి ప్రశ్నమీద ప్రశ్న అడిగాడు.

    "ఏం మాట్లాడావ్?...  తనేం  చెప్పింది?   అసలు వాళ్లెందుకు  అలా ప్రవర్తిస్తున్నారు?"  చిన్నమ్మాయిని కలిశాక కూడా ని కెందుకి దిగులు?"

    చిట్టబ్బాయి విరక్తిగా నవ్వాడు.

    "దిగులు తప్ప నాకు మిగిలిందేమిటి?"

    "ఏమ్తెందసలు?" చిట్టబ్బాయి విపు  నిమూర్తూ అడిగాడు కన్నారావు.

    చిట్టబ్బాయి చెప్పడం మొదలుబెట్టాడు.

    కన్నారావు చిట్టబ్బాయి చెప్పేది ఆసక్తిగా వినసాగాడు. చిట్టబ్బాయి మధ్యమధ్య కొన్ని క్షణాలు ఆగుతూ దుఃఖాన్ని దిగమింగుకుంటూ చెప్తున్నాడు.

    చిట్టబ్బాయి చెప్పిందంతా విని కన్నారావు దీర్ఘంగా నిట్టూర్చాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS