బంగార్రాజు కన్నారావు రెక్క పుచ్చుకుని జీపువ్తెపు లాక్కెళ్ళ సాగాడు.
కన్నారావు లబోదిబో అన్నాడు.
ఇనస్పెక్టర్ బంగార్రాజు కన్నరావుని డ్రైవరు పక్కకి తోసి తను జిపెక్కి కన్నారావు పక్కన కూర్చున్నాడు. వెనకసిట్లో ఏడుకొండలు కూర్చున్నాడు.
జీపు రివ్వున ముందుకు కదిలింది.
* * *
అప్పటికి వాళ్ళిద్దరూ ఆ రెస్టారెంటుకి వచ్చి పావుగంటైపోయింది.
కాని ఇద్దరూ పెదవి కదపడం లేదు. మౌనంగా కూర్చున్నారు.
చిన్నమ్మయే తనంతట తాను జరిగిందేమిటో చెప్తుందని చిట్టబ్బాయ్ ఎదురు చూస్తున్నాడు.
చిట్టబ్బాయి ఆ విషయం ఎత్తకా చెప్దామని చిన్నమ్మాయి ఎదురు చూస్తుంది.
ఆ నిశ్శబ్దం ఇద్దరికీ భారించరానిదిగానే ఉంది.
ఇద్దరిలో చెప్పలేని టెన్షన్...
చిన్నమ్మాయి ఏం చెప్తుందోనని చిట్టబ్బాయిలో టెన్షన్...
చిట్టబ్బాయ్ కి ఎలా చెప్పాలో తేలిక చిన్నమ్మయిలో టెన్షన్...
అంతకుముందే ఆర్డరు చేసిన ఐస్ర్కిమ్ ప్లేటుని దగ్గరకు లాక్కున్నాడు. చిన్నమ్మాయి మాత్రం తలవొంచుకుని బొమ్మలా అలానే కూర్చుని ఉంది. ఆమెలో కదలిక లేదు.
"ఐస్క్రిమ్ తీస్కో..." గొంతు పెగాల్చుకుని అన్నాడు చిట్టబ్బాయ్.
చిన్నమ్మాయి మెల్లగా ఐస్క్రిమ్ ప్లేటుని దగ్గరకు లాక్కుంది.
ఇద్దరూ రెస్టారెంట్లో నాలుగు మూలలకి దిక్కులు చూస్తూ మెల్లగా ఐస్క్రిమ్ తినసాగారు.
ముఖాముఖాలు చూస్కోడానికి ఇద్దరికీ ఇబ్బందిగానే ఉంది.
అయిదు నిమిషాల్లో ఐస్క్రిం ప్లేట్లు ఖాళి అయ్యాయి. బేరర్ ఖాళి ప్లేట్లు తేస్కేళ్ళి పోయాడు.
మళ్ళి ఇద్దరూ మౌనంగా కూర్చుండిపోయారు. చివరికి చిట్టబ్బాయి గొంతు సవరించుకుని అన్నాడు.
"మనం ఇక్కడికి ఐస్క్రింలు తినడానికి రాలేదు.
చిన్నమ్మ్మాయి ఏమి అన్లేదు.
"మాట్లాడుకోవడానికి వచ్చాం..." మళ్ళి చిట్టబ్బాయి అన్నాడు కొన్ని సెకన్ల గ్యాప్ తరువాత.
అప్పుడు కోడా చిన్నమ్మాయి పలకలేదు.
"నేనంటే నీకు ప్రేమలేదా రజ్జూ?" దినంగా అడిగాడు చిట్టబ్బాయ్.
చిన్నమ్మాయి చటుక్కున తల ఎత్తి చూసింది.
ఆమె కళ్ళల్లో కన్నీటి పోరా!
చిట్టబ్బాయి మనసు గిలగిల్లడింది.
"నామీద చాలా నమ్మకం ఉందే నీకు?" కళ్ళు వత్తుకుంటూ అంది చిన్నమ్మాయి.
"సారి సారి.. సారి రజ్జూ.. ని ప్రవర్తన బట్టి నేనలా ఆలోచించాల్సి వచ్చింది..." బాధగా ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు చిట్టబ్బాయి.
"నేనేం చెయ్యను చిట్టి...పరిస్ధితులు తారుమారు అయ్యాయి.."
"నిన్నూ నన్నూ దూరం చేసే పరిస్ధితులు...ఏమిటవి?" చిన్నమ్మాయి.
అరచేతిని తన రెండు చేతుల్లోకి తీస్కుని దినంగా అడిగాడు చిట్టబ్బాయి.
చిన్నమ్మాయి దుఃఖాన్ని ఆపుకోలేకపోతుంది. ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెట్టింది.
ఆమె అలా ఏడుస్తుంటే గుండెల్ని ఎవరో పిండేసినట్టయింది చిట్టబ్బయికి.
ఒక పక్క చెప్పలేని బాధ... మరో పక్క ఇబ్బంది.
చిట్టబ్బాయి చుట్టూ చూశాడు...చిన్నమ్మాయి ఏడుస్తుండడం ఎవర్తెనా చూస్తున్నారేమోనని.
అందరూ తాగుతూ, తింటూ ఎవరి గొడవలో వాళ్లు ఉన్నారు.
"రజని...ఇంకా ఊర్కో... ఎవర్తెనా చూస్తారు" ముందుకు వంగి మెల్లగా అన్నాడు.
చిన్నమ్మాయి పవిత కొంగుతో మొహం కప్పకుంది. కొన్ని క్షణాల తరువాత తేరుకుంది ఆమె.
ప్తెట కొంగుతో కళ్ళు ఒత్తుకుని తల ఎత్తి చిట్టబ్బాయి వంక చూసింది. ఆమె కళ్ళు ఉబ్బిపోయి ఎర్రగా ఉన్నాయి.
"చెప్పు రజ్జూ ఏమ్తెంది?" టేబులు మీద ఉన్న ఆమె ఎడమ అరచేతి మీద తన కుడి అరచేతిని వేస్తూ అడిగాడు.
చిన్నమ్మాయి చెప్పడం ప్రారంభించింది.
ఒఅకరోజు హఠాత్తుగా శివరావు రావడం, అతను తనతో మిస్ బిహేవ్ చెయ్యడం, అతనే తనకి కాబోయే భర్తని వాగడం అంతా చెప్పింది. చెప్తున్నంత సేపూ ఆమె కళ్ళల్లో నీళ్ళు ఊరుతూనే ఉన్నాయి.
"మీ ఇంట్లో ఆ సమయంలో ఎవరూ లేరా?" అడ్డుతగుల్తూ అడిగాడు చిట్టబ్బాయి.
"ఎందుకులేరు?... అందరూ ఉన్నారు" చెప్పింది చిన్నమ్మాయ్.
"మరి వాడు అలా పిచ్చివాగుడు వాగుతూ వుంటే చూస్తూ ఊర్కున్నారా?... నాలుగు తగల్నిచ్చి మెడపట్టి బయటికి గేంటేయ్య వల్సింది" ఆవేశంగా అన్నాడు చిట్టబ్బాయ్.
"ఆపని చేసేవారే. మా యింట్లో అందరికి వాడిమీద కోపం వచ్చింది కాని మా నాన్నగారే మా అందరికి అడ్డు తగిలారు... వాడికి సపోర్టు ఇచ్చారు"
చిట్టబ్బాయి ఆశ్చర్యంగా చూశాడు.
"ఎందుకలా చేశారు?"
"వాడు నాకు కాబోయే మొగుడట!!" గుడ్ల నిరు కుక్కుకుంటూ అంది.
"అదేమిటి? మరి మాతో సంబంధం కుదుర్చుకున్నారుగా?!"
చిట్టబ్బాయ్ మొహం క్షణాల్లో పాలిపోయింది.
"నిజమేగాని మానాన్న ఎవరిమాటా వినడంలేదు."
"ఎందుకు?ఎందుకు??ఎందుకు???" ఆవేదనగా అడిగాడు చిట్టబ్బాయి.
చిన్నమ్మాయి ఒకసారి చిట్టబ్బాయి వంక జాలిగా చూసింది.
తరువాత మెల్లగా చెప్పసాగింది.
చిట్టబ్బాయి బాధతోనూ, ఆశ్చర్యంతోనూ చిన్నమ్మాయి చెప్పేది వినసాగాడు.
18
"సార్!... నన్ను వదిలిపెట్టండి సార్... నాకేమి తెలిదు!!" అన్నాడు కన్నారావు దినంగా.
అప్పటికి తాను ఎన్నిసార్లు అన్నాడో లెక్కలేదు.
"ఏ వాజమ్మా పోలిసువాళ్ళను చూసి ఊరికే పరిగెత్తాడు... ఎదో ఒక కారణం ఉంటే తప్ప. ని మొహం చూస్తుంటే నువ్వు తప్పకుండా హత్య చేసే ఉంటావని అనిపిస్తుంది నాకు" అన్నాడు బంగార్రాజు.
"నాకు ఇంకోటి అనిపిస్తుంది సార్" వెనక సీట్లోంచి ఏడుకొండలు అన్నాడు.
"ఏంటది?" అడిగాడు ఇన్స్ పెక్టర్ బంగార్రాజు.
"ఒట్టి హత్యేకాద్సార్... ఏ తెలుగు ఆడపడుచునో తెలుగు స్టయిల్లో రెప చేసి ఆనక తెలుగు హత్యచేసి ఉంటాడు సార్" హుషారుగా అన్నాడు కానిస్టేబులు ఏడుకొండలు.
"షటప్" వెనక్కి చూసి అరిచాడు బంగార్రాజు. ఏడుకొండలు చేత్తో నోటిని మూస్కున్నాడు.
"అనవసరంగా పెలావంతే మర్దరుచేస్తా... ఇతను రెప చేసేవాడిలా లేదుగాని హత్యలు చేసేవాడిలా మాత్రం ఉన్నాడు"
"ఓరి నాయనో...ఎంత ఖర్మ వచ్చిపడిందిరా దేవుడో" అంటూ నేత్తికొట్టు కున్నాడు.
"నా మొహం చూస్తుంటే ఖూనికోర్లో ఉన్నానా సార్?" దినంగా అడిగాడు కన్నారావు.
"పోనీ నువ్వు మమ్మల్ని చూసి ఎందుకలా పరిగెత్తావో చెప్పొచ్చుగా. మేము ణీఊ గురించి పిచ్చిపిచ్చిగా ఏమి అనుకోముగా" అన్నాడు బంగార్రాజు. "చెప్తే మీరు నిజంగానే నన్ను మర్డరు చేస్తారేమోనని" నసిగాడు కన్నారావు.
"నేను చెప్పలేదా సార్... కేవలం హత్యేకాదు, రెప కూడా చేసుంటాడని" హుషారుగా అన్నాడు ఏడుకొండలు.
"నిన్ను అధికప్రసంగం చేయవద్దని అన్నావా?... నోర్ముయ్! లేకపోతే మర్డరు చేస్తాను" కసిరాడు బంగార్రాజు.
"అలాగే సార్" అన్నాడు ఏడుకొండలు.
