Previous Page Next Page 
ఎలమావి తోట! పేజి 56

 

    కొడుకు దొంగగా , హంతకుడిగా ముద్ర వేసుకుని జైలు పాలయ్యాడు. తప్పించుకుని తిరుగుతున్నా నలుగురిలోకి స్వేచ్చగా రాలేని అతని నిస్సహాయత ఎంతో బాధగా వుంది.
    పైగా అమ్మాజీ ఎవరితోనో లేచిపోవటం అతని గుండెలో గాయం చేసింది. ఆ మానని పుండు క్షణక్షణానికి సెలపెస్తూనే వుంది. పారిజాతం సాధింపులు ఆ గాయంపై కారం జల్లినట్లుగా వుంది.
    కుక్క పిల్లల పోషణ పూర్తయింది.
    తోటమాలితో వాటిని బలవంతంగా లాక్కేళ్ళాడు. అవి తమ ప్రాణాలన్నీ స్వప్న చుట్టూ వున్నట్టుగా ప్రవర్తిస్తూ వెళ్ళేయి.
    స్వప్న ఆ తర్వాత అతని వేపు చూసింది.
    కట్టుకున్న చేతులు మరి కాస్తా బిగించుకుని , తల మరి కొంచెం వంచి వినయంగా "అమ్మాయి!" అంటూ పిలిచాడు. ఈ పిల్ల తన కోడలై , తన ముందు యిలా వినయ వినమ్రాలతో వంగి వంగి మాట్లాడవలసింది. అలాంటిది తను పరిస్థితులు మారి యిలా ప్రవర్తించవలసి వస్తోంది!" అనుకున్నాడు.
    "ఏమిటి మామగారూ!" అంది స్వప్న ఆమె కంఠంలో దర్పం, ఠీవి బాగా పలుకుతున్నాయి.
    ఆమె అలా పిలవగానే అతనికి పోయిన ఆశలు చిగురుంచినట్లయింది. ఇన్నాళ్ళుగా పోయిన కళ మళ్ళీ ముఖాన చోటు చేసుకుంది.
    "అమ్మాయీ! అదృష్టం కలిసి వచ్చి వుంటే నువ్వు నా కోడలు కావలసినదానివి. వాడు -ఆ త్రాష్టుడు చేసిన దానితో తల ఎతుకోకుండా అయిపొయింది. పైగా వాడు జైలు నుంచి పరారు కావటంతో అంతా ఉచ్చు బిగించినట్లయింది. ఏం చెప్పమంటావు తల్లీ! బ్యాంక్ లో పైసా తీసేందుకు వీలులేదు కదా! అంతా వాడిపెరే వుంది. డబ్బుతో చచ్చిన చావు అయింది!"
    స్వప్న సమాధానం ఇవ్వలేదు. ఆమె మనస్సు తీవ్రంగా ఆలోచిస్తూ వుంది. "విషవలయం, అంతా విషవలయం. ఇతని కొడుకు ఓ వల విసిరాడు . ఈ ముసలాడు మరో వల పన్నుతున్నాడు------రవి -రవి - ఎలాగూ ఓ ఉచ్చు బిగించే వుంచాడు. ఇన్ని చిక్కుల మధ్య - ఇందరి దుష్టుల మధ్య - తను నెగ్గుకు రావాలి. అది తనతో అవుతుందా?"
    "అమ్మాయీ!" పిలిచాడు వెంకట్రామయ్య.
    "చెప్పండి!" ఆలోచనల్లోంచి బయటికి వచ్చి అంది.
    "నాకు మళ్ళీ రక్షణ కల్పించు తల్లీ!"
    "రక్షణ - నాకే రక్షణ లేదు. నీకేం రక్షణ కలిపించగలను!" అనుకుంది తనలో.
    "నీవు మళ్ళీ దయచుసి నీ ఎస్టేటులో నీ క్రింద ఓ ఉద్యోగం పడేస్తే -- నాలుగు మెతుకులు సంపాదించుకుంటాను. కడుపు నిండా తినక పదిహేను రోజులైంది. రోజూ ఒంటిపూట తిండే! నాదెంత ముసలి ప్రాణం! బిచ్చానికి వేసినట్లు - కుక్కలకి విసిరినట్లు కాస్త తిండి నా ముఖాన పడేస్తే నమ్మకంగా పడి వుంటాను!"
    నిశితంగా చూసింది స్వప్న. "కుక్కలకి పెట్టినది చూసి అసూయపడే స్థితికి దిగజారావా?" అన్నట్టున్నాయా చూపులు.
    తడబడ్డాడు వెంకట్రామయ్య. "ఆఖరికి ఈ యింటికి కాపలాగా వుండమన్నా వుంటాను. బ్రతికినన్నాళ్ళు బ్రతుకుతాను. ఏదో నీవు చల్లగా చూస్తే నీ యింట్లో తలదాచుకుంటాను!"
    ఏదో మెరుపు మెరిసినట్లయింది స్వప్నకి. :ఇతను నాకు శత్రువు. రవి ఏమిటో అర్ధం కావటం లేదు. ఆ ఫోన్ చేసే వ్యక్తీ మాటల్ని బట్టి చూస్తే రవీ శత్రుస్థావరం మనిషే! ఈ యిద్దర్నీ ఒక యింట్లో వుంచేస్తే -----ఒకరంటే ఒకరికి గిట్టదు!" ఆ ఊహ రాగానే 'అయ్యో మామగారూ! అంత మాట అనకండి! పూలమ్మినచోట కట్టెలు అమ్మవలసిన పరిస్థితి ఎందుకు రావాలి. లక్షణంలా గార్డియన్ లాగా వుండండి. మళ్ళీ అప్పటి ఊహలు మదిలోకి రానివ్వకండి!" అంది దర్పంగా.
    'అయ్యో! ఎంత మాట తల్లీ! నా గొంతు కోసినా మళ్ళీ అలా చేస్తానా?" అన్నాడు. అతనికి తన పాచిక పారుతున్నందుకు ఎంతో సంతోషంగా వుంది.
    "మీరూ యింట్లోనే భోజనం చేయండి. వరండాలోనో, ఎక్కడో ఓ చోట ఉండండి. వెళ్ళండి" అంది.
    [పడిపడి దండాలు పెడుతూ వెళ్ళాడతను. అతను వెళ్ళగానే రవి వచ్చాడు.


                                        44

    కారుని పోర్టికోలో ఆపి వచ్చాడు రవి.
    "రడీయా!" హుషారుగా చేతిలోని కీ బంచ్ తిప్పుతూ ప్రశ్నించాడు.
    అతన్ని చూడగానే వెచ్చని గాలి వీచినట్లయింది ఆమెకి. ఏ సమాధానమూ యివ్వలేదు.
    తనూ ఓ కుర్చీ మీద కూర్చుని "ఇంకా అలానే వున్నావేం స్వప్నా! మనం గజపతి నగరం వెళ్లదాం. తిరిగొచ్చేసరికి చీకటివదూ?" అన్నాడు.
    ఊహాపోహాల మధ్య ఊగిసలాడుతూ వున్న స్వప్న చప్పున ఓ నిర్ణయానికి వచ్చి "ఎంత అయిదు నిమిశాలల్లో తయారై వస్తాను. కాఫీ తీసుకో!" అని అయాని కేకేసి కాఫీ తెమ్మని టాయ్ లెట్ వైపు వెళ్ళింది.
    అంతదాకా నిద్రిస్తున్న నాగులా వున్న స్వప్నకి, ఈ క్షణంలో దూకుతున్న సెలయేరులా వెళుతున్న స్వప్నకి తేడా గమనించి ఆ మార్పుకి కారణం బోధపడక అలాగే వుండిపోయాడు రవి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS