మంచం మీద మంచి నిద్రలో వున్నట్టుగా పడుకుని వుంది విశిష్ట. నిద్రా ముద్రితమైన ఆమె ముఖ, ఎదమీద కొద్దిగా చెదిరిన పైట... అతడి లోని కాముకతను రెచ్చగొట్టాయి.
మదం మీదున్న ఆడది! ఏ మగాడు పిలిస్తేనేం? ఆ పిలుపును కాదనే శక్తి ఎక్కడుంటుంది? ఉన్నా తననికాదని ఈ ఇంట్లో మనుగడ సాగించడం కష్టమని గ్రహించి వుంటుంది. గడియతీసి వుంచి నంగనాచిలా నిద్ర నటిస్తోంది.
మంచాన్ని సమీపించాడు మాధవరావు.
ముసలాణ్ణనుకుంటుందేమో?పుష్టికరమైన ఆహారంతో బలిసిన శరీరమిది! ఒక్కసారి తన పట్టు రుచి చూసిందా, తనే మోహినీగ్రహంలా తన దగ్గరికి పరిగెత్తుకు రావాలి.
ఆ క్షణంలో మాధవరావు వావివరసలు గుర్తురాలేదు.
మీద చెయ్యిపడగానే ఉలికిపాటుతో లేచి కూర్చుంది విశిష్ట. "ఏం పని మీకిక్కడ?"
"తెలీనట్టు నటించకు! మాటలు పొడిగించకు" అంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు.
"ఛీ! ఛీ! మరీ ఇంత వావి వరుసలులేని మనిషా మీరు? కొడుకు భార్యను... పాపమనిపించడంలేదా? అవునుమరి! తన స్టూడెంట్ నే కామించి రేప్ చేస్తానని వెంటపడినవాడి తండ్రి ఇంతకంటే గొప్పగా ఎలా వుండగలడు....!"
"అనవసరంగా భాగవతం చదవకు" అసహనంగా మీద పడ్డాడు మాధవరావు.
"నిన్నేం అభిమానంతో నా కోడల్ని చేసుకోలేదు. నా పరువును పోగొట్టి, నా పదవిని పోగొట్టి మా కుటుంబాన్ని అల్లరిపాలు చేసిన నీ మీద పగ సాధించడానికే చేసుకున్నాను.
నీ సర్వనాశనం ఈ రాత్రితోనే ప్రారంభమౌతుంది. అనవసరంగా బెట్టు చేయకు!" అల్లరిచేసి అందరినీ లేపావంటే మదమెక్కి నువ్వే నన్ను పిలిచావని చెబుతాను" ఆమెను మంచం మీదికి త్రోసి ఆమెమీద పడ్డాడు.
అప్పుడు దూసుకుపోయింది అతడి వీపులోంచి గుండు! వీపంతా భగ్గున మండిపోయినట్టుగా అయింది. గొంతు చించుకున్నట్లుగా వెర్రికేక పెట్టాడు.
ఇటు తిరిగేసరికి గుమ్మంలో రౌద్రంగా నిలువెత్తున నిలబడి వున్నాడు పృద్వీ.
"నువ్వు. నువ్వు కాల్చావా నన్ను?"
జవాబుగా మరో గుండు... మరో గుండు దూసుకు వచ్చింది అతడి చేతిలోని పిస్టలు నుండి. మాధవరావు ఎద భాగమంతా రక్తసిక్తమై పోయింది.
"నేనే కాల్చాను! కొడుకుచేత తాళి కట్టబడిన పిల్లమీద చెయ్యి వేసిన నీచుడివి! వావి వరుసలులేని పశువ్వి! నిన్ను ఈ భూమ్మీద వుంచడం నాకిష్టంలేదు అంత పాపాన్ని ఈ భూమి భరించలేదు. అందుకే భూభారాన్ని తగ్గిస్తున్నా"మళ్లీ కాల్చాడు.
పృద్వీ అచ్చు ఒక ఉన్మాదిలా వున్నాడిప్పుడు! ఒంటికంటి రాక్షసుడయ్యావురా?"
మాధవరావు క్రిందపడి దొర్లుతూనే అన్నాడు.
ఎక్కువ సేపు పట్టలేదు -- -! ఆ బాధ నుండి త్వరగానే విముక్తి పొందాడు.
అతడి ప్రాణం పోయింది.
పృద్వీకి పట్టిన ఉన్మదభూతం దిగిపోతుంటే కొయ్యబారిపోయి నట్టుగా నిలబడిన తల్లి కనిపించింది. ఆమె ముఖంలో ఏదో దిగ్ర్బమ...! బాద!
తల్లి నుదుటి కుంకుమ చెరిపేవేశానన్న వాస్తవం అతనికి అవగత మౌతూనే పృద్వీ బాధతో వణికిపోయాడు. ఏ తల్లికీ ఏ కొడుకూ చేయని అపరాధం చేశాడు.
ఇకముందు ఆమెకు తన ముఖం ఎలా చూపుతాడు !
తనమీద తనకే రోత కలిగింది.
పృద్వీ చేతిలోని పిస్టల్ మళ్లీ పేలింది. ఈసారి అతడి కణతకే గురిపెట్టి పేల్చుకున్నాడు. నిలువునా విరచుకుపడ్డాడు.
కొద్ది క్షణాల తేడాతో తండ్రీ కొడుకులు శవాలుగా మారిపోయారు!
నిశ్చేష్టత నుండి తేరుకోడానికి చాలాసేపే పట్టింది విశిష్టకు.
ఇలా జరుగుతుందని బొత్తిగా ఊహించలేదు విశిష్ట.
తన కారణంగా తండ్రీ కొడుకులు ఒకేసారి చచ్చారు.
దుష్టసంహారం బాగానే జరిగిందికాని, భర్తనూ కొడుకునూ పోగొట్టుకున్న అత్తగారి ముఖం ఎలా చూడాలో తెలియలేదు.
ఆమె ముందు నేరస్తురాలిలా నిలబడిపోయింది.
బాహ్యస్మృతి కోల్పోయినట్టుగా రాతి బొమ్మలా నిలబడిపోయి వుంది కాంతం.
పిస్టల్ పేలిన శబ్దానికి అప్పటికే లేచొచ్చిన పనివాళ్లు "అమ్మ గారూ" అంటూ ఆమెను చుట్టుముట్టారు. జరిగిన సంఘటన తట్టుకోలేక ఆమె కూడా ప్రాణం వదిలేస్తుందేమో అనిపించింది. "అత్తయ్యా" అంటూ ఆర్తిగా సమీపించింది విశిష్ట.
జరిగింది అర్దమౌతున్నకొద్దీ ఒక దుఃఖ కెరటం ఉవ్వెత్తున లేచింది కాంతంలో. అది మరుక్షణం తుఫాన్ గా మారిపోయింది. భర్త మీదా కొడుకుమీదా పడి రోధించసాగింది.
విశిష్ట ఈ ఇంట్లో కోడలిగా అడుగుపెడుతూ వాళ్ల అంత చూడాలనుకుందేగాని ఇలాంటి అంతం ఆమె కోరుకోలేదు.
చాలా సేపటివరకు పోలీసులకు ఫోన్ చెయ్యాలన్న స్పృహేలేదు ఎవరికీ. ఏడుపులు తూడుపులతోనే సరిపోయింది. చివరికి పోలీసులకి ఫోన్ చేశారు.
"పోలీసులు వచ్చి ఆయన నిన్ను ప్రశ్నిస్తే నిన్ను బలవంతం చేయబోయాడని చెప్పకమ్మా! చనిపోయిన ఆయన గురించి ప్రపంచం నీచంగా అనుకోవడం నాకిష్టంలేదు.
