Previous Page Next Page 
ప్రజ్ఞా ప్రభాకరము పేజి 53

        చల్లపల్లిలో నే కవిగారి యుపచారములలో మునిఁయుండుట, వారితో నేను జీడిపప్పు తిని నీరు త్రాగియుండుట కారణములుగా తల తిరుగుట, వాంతులు, జ్వరము నాకు నారంభించెను. ఇంటికి చేరు నప్పటికి నాకు 100 డిగ్రీల జ్వరమున్నది. నేను మందుఁ గొన ననుచుంటిని. కుంభకోణము టెల్లిగ్రాం ఇయ్యఁ గోరితిని. వెంటనే మా వా రట్లు చేసిరి. కాని యది వారి కందట నాఁటి రాత్రి యగునో, మర్నాడగునో, చాల తీవ్రజ్వరము గాన మందిచ్చి తీర వలసిన దే యని నాకుఁ జాటుగా మా తల్లిదండ్రులు, నన్నగారు చర్చించుకొనుచుండిరి. అది వింటిని పిల్చి యడిగితిని.' మందు గొన వలసినదే' యనిరి. అంగీకరించితిని. సాయంకాలము ఆఱుగంటల వేళ కు మందిచ్చిరి. అప్పుడే ఆకాశమున నుండి దభీలున క్రిందఁ బడుచున్నట్టు లయి యొడ లెల్ల చెమ్మటనీరు చిమ్మఁ దొడఁ గెను. పది నిముషములలో జ్వర మెల్లతగ్గెను.' మంది చ్చితిమి. తోడనే తగ్గెను' అని మావారనుకొనిరి.' ఇచ్చిన టెల్ల్లిగ్రాం శ్రీవారికి చేరినది. ట్రీట్మేంటు జరగియుండును. తోడనే తగ్గినది' యని నేను దనిసితిని. మర్నాడు తేటగానే యుంటిని. మందు గొనుచుంటిని. మూఁ డ  వనాఁడు మరల జ్వరము వచ్చెను. నాఁ డు కుంభకోణము నుండి జాబు వచ్చెను.' జ్వరము తగ్గియుండును. మందు గూడ పుచ్చుకొన వచ్చును, అని. మందు పుచ్చుకొనుటకు దైర్యము వ చ్చెను. పుచ్చు కొనుచుంటిని. సెలవు లేదు. శ్రీ రామకృష్ణ కవిగారును జ్వరము మరల మరల వచ్చును తంటాలు గొల్పుచుండుట చే సెలవు తీసికొని మద్రాసుకు వెళ్ళిపోయిరి.

    నేను చిరకాలము సెలవులో నుండి డ్యూటిలో చేరి మరల సెలవు గొనుట దుఃఖకరముగా తోఁచుటచే నెటు చేయను జాలక చిక్కు పడుచుంటిని. ఇంటిదగ్గఱ నుండ నిష్టము లేదు. జ్వరము వచ్చుచునే యుండుటచే నూళ్ళ వెంట నొంటరిగాఁ దిరుగఁ జాలను. ఇట్టి యిక్కట్టులోనింటికి వచ్చిన వారము రోజులలోనే నాకు ఆఫీసు నుండి టెల్లిగ్రాం వచ్చెను.' తత్క్షణమే నీవు తంజావూరు లైబ్రరీ పరిశీలనమునకు వెళ్ళవలసినది. అక్కడ చేరి పనిచేయువలసినది' అని.  అలిగి తన్నితే పఱుపుమిఁద పడ్డట్టు, రొట్టెవిఱిగి నేతిమిఁద పడ్డట్టు నాకు పరమోత్సాహకర మయినది.

    తోడ్తో బయలు దేఱి మద్రాసు వచ్చి ఆఫీసుకు వెళ్ళి లైబ్రేరియ౯ తో మాట్లాడి మద్రాసులో నాగక కుంభకోణమునకే వెళ్ళిపోయితిని. అప్పటికి మా తో బుట్టువుకుటుంబము మద్రాసులో నుండెను. మా తమ్ముఁ డు చి" చంద్రశేఖరము అక్కడ హైస్కూలులోచదువుచుండెను. వాని కక్కడ టైఫాయిడ్ జ్వరము వచ్చెను. శ్రీ వారికి జాబు వ్రాసితిని. మద్రాసులో వారి శిష్యుఁడుగా నున్న మన్మిత్రు నొకని ట్రీట్ చేయవలసినదిగా జాబు వ్రాసిరి. ఆతఁడు వచ్చి ట్రీట్ చేసి యీ జ్వరము  తగ్గిన తర్వాత నీ కుఱ్ఱవానికి శ్రీవారి శిష్యత లభింపజేయవలసిన దనియు, దానివల్ల నీతఁడు కొఱఁ  తలు దొలఁగి యారోగ్యము పడయఁ గలఁ డనియు దివ్యదృష్టికి గోచరించిన దానిని దెలిపెను. నెలా పదిరోజులు జ్వరము వానిని బాధించి విడిచెను.

    కుంభకోణమున శ్రీ వారిని దర్శించి నాకధ యెల్లఁ జెప్పికొంటిని. శ్రీ వారు నన్ను ప్రతివారము సెలవు దినమున తంజావూరి నుండి కుంభకోణము వచ్చుచుండు మనిరి. ఆ కాలమున రైలుఛా ర్జీ అర్ధరూపాయ లోపుగా నుండెను. అట్లే చేయుచుంటిని. తంజావూరిలో నాకుత్యాగరాజయ్య రను మిత్రుఁ డేర్పడెను. ఆయన శ్రీవారి శిష్యుఁడు. ఇర్వురమును గలసి ప్రార్ధనము చేసుకొను చుంటి మి. జ్వరము తగ్గి యారోగ్య వంతుఁ డయిన మాతమ్ముఁడు వదిన గారిని దోడ్కొని కుంభకోణమునకు వచ్చెను. వానిని శ్రీవారి శిష్యునిఁ గావించితిని.

    చల్లపల్లిలో ఆరంభించిన చలిజ్వరము ఎడనెడ నాకు నేను కుంభకోణము వెళ్ళిన తోడనే తీవ్రముగా జ్వరము వచ్చెడిది. మజ్జిగ అన్న మే తినఁ గల్గెడి వాఁ డను. రాత్రి ఒకటి రెండు గంటల వేళ తీవ్రముగా ఆకలి యయ్యెడిది. అప్పుడు ముందుగానే నాకై జాగ్రత్త పడి సచ్చిదా నంద  స్వాముల వారు ఊరుగాయ, మజ్జిగ అన్నము ఎత్తి దాచి యుంచెడివారు. ఆకలయి నపుడు వారిని లేపి యది తిని నీరు ద్రావి నిద్రపోయెడి వాఁడన. ఉదయము జ్వరముతో నే తంజావూరికి వచ్చెడి వాఁ డను-వచ్చిన కొంత సేపటికి జ్వరము తగ్గిపోయెడిది. వారమురోజులు నెమ్మదిగా ఆఫీసు పని  చేయఁ గల్గెడు వాఁ డను. నాతో రామకృష్ణ కవిగారు వగైరా లుండిరి. వారు మద్రాసు వెళ్ళినప్పుడు శ్రీ కుప్పు స్వామి శాస్త్రిగారితో నేనేదో కుంభకోణము వెళ్ళి యోగసాధనముచేయుచుంటిననియు, అక్కడికి వెళ్ళిన తోడనే జ్వరపడి జ్వరముతోనే ప్రతివారము వచ్చుచుందు ననియు చెప్పిరి. వారు కుపితు లయి యుండిరి.

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS