దేవతార్చన
తె(ని)గింపు
మైదానాలూ, ప్రభూ, మానవ నిశ్శబ్దాలూ, కడతేరిన
వరండాలు, స్తంభాలు, మేము నడచిన స్థలాలు మేము
చూచిన ముఖాలు, చిన్నపిల్లల పాటలు. కాని అన్నింటికన్నా
మిన్నగా-రహస్య లీపులు, పావిత్ర్యం, రాతిలో మలచిన
ప్రతిమ, సులభరేఖ, మా భాష, ఆకులవీ కలలవీ చిరునవ్వు
విరుపులు, స్వరం కూర్చిన వంపులు, చేతి విసురు, కర
చరణాల స్పర్శ, విశ్వగోళాల ప్రేమ మృత్యువంటే నిర్భీతి.
కొంచెం కాంక్ష. ఔను మరి. వెలుతురు, మా సూర్యుడు,
ప్రభూ, మరిచిపోయిన మనుష్యుల సూర్యుడు, సర్వత్రా
మహానుభావులూ మరుగుజ్జులూ మెసలే కాలంలో
కలిసిపోయిన ప్రభావాలు, Bach అనే మనిషి Cezanne
అనే మనిషి. ఇంకాఎందరో పేర్లులేనివాళ్ళు, ఇప్పుడిప్పుడేకీభ
విస్తూన్న ఎందరెందరో అనామకులు.
మావదనం, అనామధేయ జనానీకాల హాహాకారాలు, మా ఆకృతి, ఒడ్డూపొడుగూ వెలుతురులో నడిచే మనుష్యులు, వివిధ ప్రదేశాలలో, ఆసియాతో ప్రారంభించి, యూరప్, ఆఫ్రికా, తర్వాత మనస్సూ, వయస్సూ ద్రవీభవించిన సముద్రం అట్లాంటిక్ దీనికవతల పడమటగా ఈ దేశం అమెరికా నావికదళాల విన్యాసాలు విల్సన్ వికటహాసం, లియన్ నియాకు స్వాతంత్ర్యం, పోలెండుకు జై, టెక్సాస్ మాగాణాలు, తియ్య దుంపలు, దారిద్ర్యం మా కృతజ్ఞత ప్రభూ, మరి అంకెలకి, మా దుఃఖాన్ని దొంతర పెట్టడానికి, ఒకటి ఏడుపు రెండు నొప్పి, మూడూ పిచ్చి, ఇంకా ఒక వెయ్యి, ఇంకో పదివేలు, కాలాన్ని కొలవడం కాంతి సంవత్సరాలు మాట వరసకి డార్విన్ గడ్డం అనుకుందాం. ఐన్ స్టెన్ కళ్ళు ప్రశస్తికెక్కిన పోలిష్ పియానో విధ్వాంసుని వేళ్ళు అన్నీ అంకెలతోనే లెక్కిద్దాం. పొట్ట మెల్లాస్ దొరల ఐశ్వర్యం ఎవరి దారిద్ర్యం-తగిన పేరు ఆలోచించాలి-అందాం పోనీ దారిద్ర్యం లేదా అనుకుందాం నా దారిద్ర్యమే. ఎవరూ ఎరగని నేను. ఏ పేరూ లేని కుర్రాడు. ఒంటరిగా కూర్చుని దేవునికోసం పత్రికల కోసం కథలు రాసుకునే ఈ యువతి రచయిత అంటే దాని తాత్పర్యం, ఆ పేరులేని భీభత్సం అందులోని ఏకాంతం యశస్సుకై తపస్సు ఆఖరికొక చిన్న కాగితం ముక్క, అంగీకారం ఏయ్ (నా పేరు) ఓయ్ అబ్బాయ్, నువ్వు ప్రసిద్దుడివైనావ్. పత్రికలో పడింది కథ, కృతజ్ఞున్ని ప్రభూ.
.jpg)
---౦౦౦---
