Previous Page Next Page 
వెన్నెల వాకిళ్ళు పేజి 54

   

    "నేను ఇరికించేదేముందండి...ఒక విధంగా అందరం ఇరుక్కున్నట్లే......అంత తేలిగ్గా మనం చిక్కుమనుకోండి. హత్యను పకడ్బందీగానే చేశాను. దాన్ని పొడిచి, ఆ కత్తిని సుందరం చేతిలో పెట్టాను" అన్నాడు వాడు.

    "పెట్టావు కదా! మరింకేం...వాడికి ఉరిశిక్ష ఖాయం" అన్నాడు కరణం.

    "మరెందుకు ఊరికే అలా భయపడతావు?" అన్నాడు గోపాలరావు.
    "ఏదో బాబూ! బక్కప్రాణం......మీలాంటి ధైర్యసాహసాలు నాకేక్కడివి చెప్పండి" అన్నాడు కరణం.

    "అవునవును- మొత్తానికి నువ్వు మేధావివి కరణం" అన్నాడు గోపాలరావు.

    "ఏదో మీ శిష్యరికం చేయటం వల్ల ఈ మాత్రం తెలివితేటలు వచ్చాయి మహా ప్రభూ! అంతా తమరిదయ" అన్నాడు రెండు చేతుల్తో దండం పెడుతూ.

    "ఆ...ఆ ....కృతజ్ఞతలన్ని ముందే చెప్పకు, ముందు ముందు ఇంకా బోల్డు విషయాలున్నాయి" అన్నాడు గోపాలరావు.

    "రేయ్ భీమా! నువ్వు మన గెస్ట్ హౌస్ దాటి వెళ్ళకు. ఈ కేసు తేలి ఆ సుందరంగాడికి ఉరిశిక్ష పడేవరకూ నీకు రాజభోగమే....." అన్నాడు కరణం.

    గోపాలరావు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఈ కేసునుంచి నేను తప్పికోవాలంటే వీడు ఇక్కడుండకూడదు. వేరే ఎక్కడికైనా తరలించాలి. ఎక్కడకు పంపాలి. అసలు పైకి పంపించేస్తే పీడా విరగడవుతుంది. అప్పుడు సాక్ష్యం చెప్పటానికి వాడుండడు. నామీద పోలీసులు అనుమానం రాదు. కరణం ప్రత్యక్షంగా విరోధం పెట్టుకున్నాడు కనుక కరణం తప్పించుకోలేడు.

    అవసరమైతే కేసును అసలు కరణం మీదకే తిప్పొచ్చు. కరణమే హత్యచేసి సుందరం మీదకు కేసు నేట్టాడని ఎస్.ఐ చేత చెప్పించవచ్చు. అవును, అంతే చేయాలి. భీమగాడిని లేపేయాలి. ఎవరు దీనికి సమర్ధులు? ఎవర్ని నియమించినా మళ్ళీ వాడు నాకు వ్యతిరేకంగా తయారవవచ్చు. అందుకే భీమగాడ్ని నేనే స్వయంగా నా స్వహస్తాలతోనే చంపేయాలి గోపాలరావు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.

    "ఏంటి బాబూ మళ్ళీ దీర్ఘలోచనలో పడ్డారు? మికేమండి మహారాజులు. ఎలాగైనా వ్యూహరచన చేస్తారు. తెరవెనుక ఉండి కధ నడిపేవారు మీరు. ఎటొచ్చి నేనే ఇరుక్కుపోయాను" అన్నాడు కరణం.

    "అదేంటి కరణం ! నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు, నువ్వేం దిగులు పడకు. నాకు ఇంత ఉపకారం చేసినవాడివి, నిన్ను వదులుకుంటానా....." అన్నాడు గోపాలరావు.

    "అదేబాబు నా ధైర్యం కూడా. తమరి దయ!" అన్నాడు కరణం .

                                           29

    "ఇప్పుడర్ధమయిందిగా మాధవా! పల్లెటూరి రాజకియలంటే ఎలా వుంటాయో? పాపం మీ అన్నయ్య పెద్దమనిషి.....అయన స్వతంత్ర సమరయోధుడు, నీతిగా కాంట్రాక్టు పనులు చేస్తూ, ఊరికి ఉపయోగపడదామనే ఉద్దేశంతో అభివృద్ధి పనులు చేస్తున్నా, అతన్ని అనవసరంగా రాజకీయ రొంపిలోకి దించారు. నువ్వు ఈ సంక్షోభాన్ని తట్టుకోగలవు, ఆ ఆత్మస్థయిర్యం నీకుంది. కానీ ఆయనకుంటుందా? తిరిగి అయన ఉళ్ళో తలెత్తుకోకుండా చేశాడు ఆ కరణం" అన్నాడు నాగేశ్వరరావు.

    ఇద్దరూ పోలిస్ స్టేషన్ లో సుందరం స్టేట్ మెంట్ తీసుకుని, నాగేశ్వరరావు ఇంట్లో తన ప్రైవేటు గదిలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు.  

    మాధవరావు మనసంతా కరణం మీద కసితో పేరుకుపోయింది.

    నామీద ఎంత కపట నాటకమాడాడు. ఆ గోపాలరావు అండ చూసుకుని, డబ్బుకు కక్కుర్తిపడి, ఉళ్ళో తలెత్తుకోకుండా చేశాడు అనుకుంటూ సిగరెట్ తీసి వెలిగించాడు.

    "మరి ఈ కేసునుంచి సుందరాన్ని బయటకు తీసుకురాగలవా?" అడిగాడు మాధవరావు దిగులుగా.

    "నీకు ఆ సందేహం అక్కర్లేదు, వాడు బైటకోస్తాడు. రేపే వాడికి బెయిల్ మంజూరుచేయిస్తాను. ఈ హత్యలో అన్నీ లోసుగులే వున్నాయి. మనం ఓసారి వరాలు ఇంటికెళ్ళి పరిశిలించాల్సి వుంటుంది...." అన్నాడు నాగేశ్వరరావు.

    "తప్పకుండా. ఇప్పుదేల్ధమా?" అన్నాడు మాధవరావు.

    నాగేశ్వరరావు టైం చూసుకున్నాడు. పదిన్నర అవుతోంది. ఈరోజు కోర్టులో ఇంపార్టెంట్ కేసులు ఏమున్నాయని గుమస్తాను పిలిచి అడిగాడు. అన్నీ వాయిదా కేసులే! గుమస్తాను పంపించి చెప్పాడు.

    "సరే వెళదాం-సరోజా! కాస్త కాఫీ పంపు" అన్నాడు.

                                     *    *    *    *

    సుందరం బాగా తాగి పడుకున్నాడు. వరాలు కూడా కింద చాపమీద పడుకుంది. కరణమే వాళ్ళు నిద్రపోయిన తరువాత మళ్ళి వచ్చి వరాలను చంపి, ఆ కత్తి సుందరం చేతిలో పెట్టి వెళ్ళిపోయి ఉంటాడు. పెద్దగా పెనుగులాట కూడా జరిగి వుండదు. ఆ రాత్రి టేబుల్ మీదున్న గ్లాసులు బ్ర్హాంది సీసా, కూజా, అన్నం ప్లేటు అన్నీ నిట్గా సర్ది పడుకుంది పాపం వరాలు.

    "సుందరమే చంపేటట్లయితే అవన్నీ సర్ధటానికి అవకాశంలేదు. ఆమెకు అప్పటికే ఎంతో ధన సహాయం చేశాడు సుందరం.....పైగా అతనిని ఇకపై మీరు రాకండి, నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన దేవుడు మీరు అందని చెపుతున్నాడు సుందరం. ఇవన్నీ నిజాలని మనకు తెలుసు..... కానీ అవతలి పార్టీ దీనిని నమ్మడు కదా. సుందరమే ఈ హత్య చేశాడని రేపు కరణం తరపున న్యాయవాది వాదిస్తాడు. అది తప్పని మనం ప్రూ చేయాలి. అలా చేయాలంటే మనకు బలమైన సాక్ష్యాధారాలు కావాలి."

    "వరాలు బ్రతికి ఉన్నట్లయితే ఆమె మనకు అనుకూలంగా సాక్ష్యం యిచ్చి వుండేది" అన్నాడు మాధవరావు.

    "ఆమె బ్రతికి ఉన్నట్లయితే ఇక మనకు సమస్యేముంటుందిరా" అన్నాడు నాగేశ్వరరావు.

    "అసలు ఎస్.ఐ. కి మొట్ట మొదటిసారిగా ఈ హత్య జరిగినట్లు ఫోన్ చేసింది ఎవరు? హత్య జరిగిన అరగంటలోనే ఫోన్ చేసి చెప్పాడంటే అది ఒక పధకం ప్రకారం జరిగిన హత్యని తేలిపోయింది. ఆ సమయంలో ఆమె ఇంటికి ఎవరూ రారు. పైగా ఆ సమయంలో సుందరం బాగా తాగి ఉన్నాడు. హత్య చేయటానికి వచ్చిన వ్యక్తీ లోపలికి ఎలా ప్రవేశించాడు? ఇక్కడ ఈ పాయింట్ కోసమే మనం ఆమె ఇంటికి వెళ్ళిరావాలి" అన్నాడు నాగేశ్వరరావు.

    "సరోజా! కాఫీ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టు" అన్నాడు నాగేశ్వరరావు.

    "బావున్నారా అన్నయ్యా! ఏంటి పాపం, సుందరం హత్యకేసులో యిరుకున్నాడా?" అంది దిగులుగా.

    "అవునమ్మా వాడు, ఆ కరణంగాడు పన్నిన కుట్ర ఇదంతా...."అన్నాడు మాధవరావు.

    "మీరు ఎవరికి అపకారం చేయలేదు. భగవంతుడున్నాడు, అన్నీ సక్రమంగా చేస్తాడు" అంది సరోజ.

    "ఓహో! ఇక మేమెందుకో......ఈ లాయర్లు ఎందుకు? మరయితే అరేయ్ మాధవా. ఇక నువ్వు నిస్చంటగా వెళ్ళిరా. వెళ్ళి ఏడుకొండలవాడికి కొబ్బరికాయ కొట్టి ఇంటికెళ్ళు. అన్నీ ఆయనే చూసుకుంటాడు. మా ఆవిడా చెప్పింది కదా" అన్నాడు నవ్వుతూ.

    "మికన్ని వేళాకొళాలే......ఈయనకు భావంతుని మీద నమ్మకం లేదన్నయ్యా....! నన్ను ఇలానే ఏడిపిస్తుంటారు......" అంది సరోజ సీరియస్ గా.

    "వాడు మొదట్నించి అంతేనమ్మా! మేము చదువుకునే రోజులప్పటినుంచి నాస్థికుడే. నువ్వే వాడ్ని అస్తికుడ్ని చేయాలి" అన్నాడు మాధవరావు కూడా నవ్వుతూ.

    "నేను అస్తికుడ్ని కవటమా! ఇంపాజిబుల్" అన్నాడు నాగేశ్వరరావు సీరియస్ గా.

    "సర్లెండి! ముందు ఆ కేసు విషయం చూడండి. పాపం సుందరాన్ని త్వరగా బయటకు తీసుకురండి. మన పోట్లాట ఎప్పుడూ వుండేదే...." అంటూ ఖాళి కప్పుల్ని తీసుకుని.....   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS