Previous Page Next Page 
చిన్నమ్మాయ్ చిట్టబ్బాయ్ పేజి 54

    "హలో..." మళ్ళి రంగనాయకులు గొంతు వినిపించింది అవతల వ్తెపు నుండి.


    "హలో... చిన్నమ్మాయి ఉందాండి" గొంతు మార్చి అమ్మాయిలా మాట్లాడాడు చిట్టబ్బాయ్.


    "ఎవరు మాట్లాడుతున్నారు?" రంగనాయకులు అడిగాడు.


    "చిన్నమ్మాయి క్లాస్ మెట్ ని .."


    "పిలుస్తానుండమ్మా" అన్నాడు రంగనాయకులు.


    చిట్టబ్బాయి చిన్నమ్మాయ్ కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. అసలు వాళ్లు ఎందుకలా ప్రవర్తిస్తున్నారో అడిగేయ్యాలి! తెలియక తనేమ్తెనా పొరబాటు  చేస్తే క్షమించమని అడగాలి!...


    "సార్.. మీ గొంతుకేమ్తెంది సార్?"


    షాపువాడి ప్రశ్నతో  చిట్టబ్బాయ్ ఆలోచనలకు అంతరాయం ఏర్పడింది.


    చిట్టబ్బాయి షాపువాడి వ్తెపు తిరిగాడు. వాడు చిట్టబ్బాయి వంక ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు.


    "ఏమన్నావ్?" అడిగాడు చిట్టబ్బాయి.


    "మీ గోంతుకేమ్తెందని  అడుగుతున్నాను"


    "ఓ...అదా?బాగా చల్లగా ఉన్న కూల్ డ్రింక్ ఇచ్చావ్ కదా? గొంతు పట్టేసింది..." చెప్పాడు చిట్టబ్బాయి. ఇంతలో అవతల నుండి చిన్నమ్మాయ్  గొంతు వినిపించింది.


    "హలో..."


    చిట్టబ్బాయి చెయ్యి వణికింది. చేతిలోంచి రిసీవర్ జారిపడిపోకుండా గట్టిగా  పట్టుకున్నాడు అతను. గుండెకాయ భారంగా కొట్టుకోసాగింది.


    "హలో ఎవరూ?" అడిగింది చిన్నమ్మాయి.


    "నేనే రజని చిట్టబ్బయిని! మెల్లగా అన్నాడు.


    "క్లిక్"


    చిన్నమ్మాయి ఫోన్ డిస్కనెక్ట్ చేసేసింది.


    చిట్టబ్బాయి గుండె బాధతో బరువెక్కింది.


      కన్నరావుకి చాలా చికాకుగా ఉంది.


    అతను ఎయిమ్ లెస్ గా అబిడ్స్ లో , ఆ రద్దీలో నడుస్తున్నాడు.


    "ఏంటో! పోయి పోయి ఆ పొలిసు ఇన్స్ పెక్టర్ కూతుర్నే ప్రేమించాలా?... ఆరోజు అతని గొంతూ, ఊతపదం గుర్తించి ఉడాయించా గాని లేకపోతే పట్టుకుని డొక్కా చేరేసి ఉండేవాడు.. కాదు కాదు.. మర్డర్ చేసి ఉండేవాడు...." అనుకున్నాడు,


    పాపం కన్నారావు ఆ రోజు కాంతామణి యింటి నుండి పారిపోయాక యింటికెళ్ళి చాలా బాధపడ్డాడు.


    కాంతామణి తన గురించి ఏమనుకుంటుంది? చిన్నపిల్లాడిలా పోలీసులకి భయపడ్డం ఏమిటి?


    అయినా పోలీసులకి భయపడ్డం కాదుగాని ప్రేమించినమ్మాయి పిలిసు ఇన్ స్పెక్టర్ కూతురు కావడమే అసలు ఇబ్బంది అంతా.
    అతని కూతుర్ని తాను ప్రేమించడం యిష్టం లేక తప్పదు కేసు బనాయించి  కటకటాలేనక్కి తోయించేస్తేనో?!... లాఠిల్తో  డొక్కలో పోడిపిస్తేనో?


    కాంతామణి దక్కకపోగా ఈ బాధలన్ని పడాలి!!


    ఇలా ఆలోచిస్తూ మదనపడ్డాడు ఓ రెండు రోజులపాటు.


    తరువాత అతనికి అనిపించింది తను వెళ్ళిపోయిన తరువాత కాంతామణి, బంగార్రాజు తన గురించి ఏమనుకున్నారో  తెలుసుకోవాలని.


    అలా అనిపించిన మరుక్షణం కాలని సెంటర్ నుండి వెంటనే కాంతామణి ఫోన్ చేశాడు. ఎంగేజ్ సౌండ్ వస్తుంది.


    దాదాపు ఒక పావుగంటపాటు  ఫోన్ కోసం ప్రయత్నించాడు. కంటిన్యుయస్  గా ఎంగేజ్ సౌండ్ వస్తుంది.


    ఛ ఛా! ఈ ఆడాళ్ళేప్పుడూ అంతే. ఫోన్ లో గంటల తరబడి మాట్లాడతారు అని విస్కుక్కున్నాడు.


    అప్పటికి ఆఫీసుకి టైమ్తెపోవడంతో ఫోన్ వదిలిపెట్టి యింటికి వెళ్ళి గబగబా నాలుగు మెతుకులు చిట్టబ్బాయితో కలిసి కతికి ఆఫీసుకి వెళ్లాడు. ఆఫీసు నాలుగు మెతుకులు చిట్టాబ్బాయితో కలిసి కతికి ఆఫీసుకి వెళ్లాడు. ఆఫీసు  లోంచి కూడా మూడు నాలుగు సార్లు కాంతామణికి  ఫోన్ చెయ్యడానికి  ప్రయత్నించాడు. కాని ఆ నెంబరు దొరకడం లేదు.


    సాయంత్రం యింటికి వచ్చాక మళ్ళి ప్రయత్నించాడు. అప్పుడు కూడా ఆ ఫోన్ నెంబర్ కంటిన్యుయాస్ గా  ఎంగేజ్ సౌండ్ వస్తూంది.
    ఇంక ఆ ఫోన్ ఫాల్టి అనే నిర్ణయానికి వచ్చేశాడు.


    కాంతామణిని కలిసే మార్గం తేలిక అతనికి పిచ్చెక్కిపోయింది.


    ఇన్నాళ్ళూ తాను ఫోన్ చేసి పిలిస్తే ఆమె తాను చెప్పిన చోటికి వచ్చేసేది. ఇప్పడేమో ఫోన్ నెంబరు కలవడం లేదు... ఇంటికెళ్తే వాళ్ళ నాన్న మర్డరు చేస్తానంటూ పట్టుకుంటాడు.


    "ఛి...ఒకసారి తనని యింటికి తీసుకుని రావలసింది...ఈ టైంలో  తనే  యింటికి వచ్చ్చి ఉండేది!..."బాధగా తల పట్టుకున్నాడు కన్నారావు.


    ఒక పక్క కాంతామణి సంబందించిన బాధ్తేతే ఇంకోపక్క చిట్టబ్బయికి సంబంధించిన బాధ.


    చిట్టబ్బయికి ఏమ్తేందో??... రెండు రోజుల్నండి ఉలకడు పలకడూ... దిగులుగా ఆలోచిస్తూ ఉంటాడు ఎప్పడూ. ఏమ్తెందని అడిగితే చెప్పడు. తనతో కూడా మాట్లాడకుండా గదిలో ఓ మూల కూర్చున్నాడు.


    అందుకే కన్నరావుకి విసుగు పుట్టి యింట్లోంచి బయటపడి అబిడ్స్ కి వచ్చాడు. ఆలోచనలతో అతని బుర్ర వేడెక్కి పోసాగింది.
    కాంతామణి ఎలాగ్తెనా కలవాలి!...


    ఎలా?ఎలా?ఎలా!


    "బోయ్... బోయి..."


    వెనక నుండి హరన్ మోగింది.


    "ఓహ్...నేను ట్రాఫిక్ కి అడ్డుగా నడుస్తున్నా..." అనుకుని కాస్త పక్కకి వచ్చి హరన్ కొట్టిన వెహికల్ వంక చూశాడు.


    అది పోలిస్ జిప్.


    అందులో ఇన్ స్పెక్టర్ బంగార్రాజు ఉన్నాడు.


    "హయ్యబాబోయ్..." మనసులోనే అనుకుని ఒక్కసారిగా పరుగందుకుని పక్క సందులోకి  తిరిగాడు కన్నారావు.


    "స్టాప్- స్టాప్... స్టాప్..." గట్టిగా అరిచాడు బంగార్రాజు.


      జీపు ఆపకుండానే పక్కకి తిరిగి ఇన్స్ స్పెక్టర్ బంగార్ర్రాజు వ్తెపు చూశాడు డ్రైవరు.


    "ఎంటిసార్?...ఏమ్తెంది??" అని అడిగాడు వాడు.


    "ప్రశ్నలేయ్యకుండా నోర్ముసుకుని జీపు ఆపు. లేకపోతే మర్డరు చేస్తా"


    "క్రి...షషష"


    సడెన్ బ్రేకుతో ఆగింది జీపు.


    "ఏయ్ సెవెన్ హిల్స్!" పిలిచాడు బంగార్రాజు.


    "యస్ సార్" జీపు వెనక సీట్లోంచి పలికాడు కానిస్టేబులు ఏడుకొండలు.


    "గమనించావా?" వెనక్కి తిరిగి కళ్ళుచిట్లించి చూస్తూ ప్రశ్నించాడు.


    "గమనించాను సార్..." చెప్పాడు ఏడుకొండలు.


    "ఏం గమనించావ్?"


    "ఒక వ్యక్తి పరిగెత్తడం..."


    "శభాష్...ఇప్పుడు నిజంగా నా శిష్యుడి వనిపించావ్" మెచ్చుకున్నాడు బంగార్రాజు.


    "హిహిహి" మురిసిపోయాడు ఏడుకొండలు.


    "ఇంతకి అతను మనల్ని చూసే  పరిగెత్తడా?" అడిగాడు బంగార్రాజు.


    "కచ్చితంగా మనల్ని చూసే పరిగెత్తాడు సార్"


     "ఒక వ్యక్తి పోలిసుల్ని చూసి పరిగేత్తడంటే ఏంటి అర్ధం?.." కళ్ళేగర వేశాడు బంగార్రాజు.


    "ఆ వ్యక్తి దొంగో, ఖూనికోరో అయి ఉంటాడు సార్..."


    "వెర్రి గుడ్... నా తెలివితేటల్లో సగం నికున్నాయి, మనం ఇప్పడేం చెయ్యాలి!"


    "అతన్ని వెంబడించి పట్టుకోవాలి సార్..." హుషారుగా చెప్పాడు ఏడుకొండలు.


    "వెర్రి గుడ్" మళ్ళి మెచ్చుకున్నాడు బంగార్రాజు.


    "సార్! మీరు అనవసరంగా టైమ్ వేస్తూ చేస్తున్నారు, ఈపాటికి అతను పారిపోయే ఉంటాడు." అన్నాడు డ్రైవర్ మధ్యలో కల్పించుకుంటూ.


    "షటప్! అపశకునం మాటలు మాట్లాడావంటే మర్డరు చేస్తా జీపుని త్వరగా పోనియ్" అరిచాడు బంగార్రాజు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS