Previous Page Next Page 
చిన్నమ్మాయ్ చిట్టబ్బాయ్ పేజి 53

    అతని సీరియస్ మొహాన్ని చూస్తే చిట్టబ్బాయ్ కి ఇబ్బందిగా అనిపించింది.

    "రజని ఉందా?..." మెల్లగా అడిగాడు.

    "లేదు...ఎక్కడికో వెళ్ళింది" చెప్పాడు రంగనాయకులు గుమ్మానికి అడ్డుగా నిలబడే.

    "ఎప్పుడు వస్తుంది?"

    "ఏమో తెలిదు...." అన్నాడు అతను సీరియస్ గా. ఎవరో పరిచయం లేనివాడికి ఇస్తున్నట్లు ఉన్నాయి అతని సమాధానాలు.

    చిట్టాబ్బాయ్ కి అతని ప్రవర్తన చాల ఆశ్చర్యాన్ని కలిగించింది.

    గుమ్మంకి అడ్డు తొలగి లోపలికి రమ్మని కూడా అనడం లేదు ఆయన.

    "ఈయనకి బి.పి గాని ఉందేమో? అదేక్కువ్తే ఇలా ప్రవర్తిస్తున్నట్టుంది.... అనుకున్నాడు మనసులో.

    ఇద్దరి మధ్యా కాస్సేపు నిశ్శబ్దం...

    చిట్టబ్బాయి తలెత్తి రంగానాయక్య్లు మొహం వ్తెపు చూశాడు అతను.

    చిట్టాబ్బాయ్ మనసు చివుక్కుమంది.

    "నేను వచ్చి వెళ్ళానని రజనికి చెప్పండి..." మెల్లగా అన్నాడు.

    "అలాగే" అని ఇంక దయచెయ్యి అన్నట్టు చూశాడు రంగనాయకులు.

    "వస్తానండి..." అన్నాడు చిట్టబ్బాయి.

    "మంచిది!..."

    చిట్టబ్బాయ్ వెనక్కి తిరగ్గానే అతని వెనకాల తలుపులు ధడేల్ మని మూస్కున్నాయి.

    రంగనాయకులు మెదడ్లో అప్పడప్పడూ పురుగు తోలుస్తుంతుందో లేకపోతే అతను మెంటల్ కేసో అర్ధం కాలేదు చిట్టబ్బయికి.

     మెల్లగా కాళ్ళిడ్చుకుంటూ కాంపౌండ్ వాల్  గేటుని సమీపించాడు. గేటు తీస్కుని బయటికి  వచ్చి, తిరిగి గేటు మూసి గడియా పెడ్తుండగా చూశాడు చిట్టబ్బాయి  కిటికిలోంచి తననే చూస్తున్న చిన్నమ్మయిని.

    తను చూడగానే చిన్నమ్మాయి కిటికిలోంచి చటుక్కున పక్కకి తప్పకుంది.

    చిట్టబ్బాయ్ విపరీతంగా ఆశ్చర్యపోయాడు.

    రజని ఇంట్లోనే ఉందా?....

    ఇంట్లోనే ఉంచుకుని రంగనాయకులు ఎందుకలా లేదని చెప్పాడు?"

    రంగనాయకులు విచిత్రంగా ప్రవర్తించడానికి కారణం ఏమిటి?...

    రజని తనని చూడగానే  చాటుకి ఎందుకు వెళ్ళిపోయింది?

    ఒక్కసారిగా అతని బుర్రలో రకరకాల ఆలోచనలు ముసురుకున్నాయి.

    మూసుకుంటున్న  కిటికీ వంక  అయోమయంగా చూస్తూ స్దానువులా నిల్చుందిపోయాడు చిట్టబ్బాయి.

    చిట్టబ్బాయ్ ని నిస్సత్తువ ఆవహించింది.

    అతని మనసునిండా గజిబిజిగా ఆలోచనలు ముసురుకున్నాయి.

    రంగనాయకులు అలా ఎందుకు ప్రవర్తించాడు అన్న విషయం అతనికి అర్ధం కాలేదు. చిన్నమ్మాయి సంగతి అంతకన్నా అర్ధం కాలేదు.

    "ఎందుకు విల్లకి నామీద కోపం వచ్చింది? హఠాత్తుఅగా  కారణం లేకుండా ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? కారణం లేకపోవడం కాదు, ఎదో ఒక కారణం ఉండే ఉంటుంది.... ఏవిటా కారణం?ఏవిటి?ఏవిటి?

    జుట్టుపిక్కున్నాడు చిట్టబ్బాయి.

    ఒకసారి దినంగా చిన్నమ్మాయి మూసివేసిన కితికివంక చూశాడు.

    "ఇప్పుడు ఆ కిటికీ వెనకాలే  ఉంటుందా రజని?... ఎందుకలా నిర్దయగా కిటికీ మూసేసింది? నేనేం పాపం చేశాను? ఏం ద్రోహం చేశాను? చెప్పవా రజ్జూ??

    మనసులోనే  బాధగా అడిగాడు చిట్టబ్బాయ్.

    అతనికి మరో ఆలోచన వచ్చింది.

    డోర్  బెల్ నొక్కి తలుపు తీసిన తరువాత "మీరు పొరబాట్న చిన్నమ్మాయి లేదని చెప్పారు. కాని తను ఇంట్లోనే ఉంది.  ఇప్పడే కిటికిలో ఉంటే చూశాను. కాస్త పిలుస్తారా?" అని రంగనాయకులితో అంటేనో?

    ప్రఎజనం!

    రంగనాయకులు చిన్నమ్మాయి  లేదని కావాలనే చెప్పాడు. ఖచ్చితంగా పొరబాటున  చెప్పలేదు. ఒకవేళ పొరబాటున చెప్పి ఉంటే లోపల్కి రమ్మని, వచ్చేదాకా కూర్చోమని అని ఉండేవాడు. తాను మాములుగా కేవలం చిన్నమ్మాయికి పరిచయం ఉన్నవాడు కాదు! ఆ ఇంట్లోని అందరికి పరిచయస్తుడు. అంతేకాకుండా ఆ ఇంటికి కాబోయే అల్లుడు!

    చిన్నమ్మాయి కూడా కిటికిలోంచి అతని చూసి కూడా చూడనట్టు కిటికీ రెక్కలు మూసేసింది.

    వాళ్ళు కావాలని తనని అవాయిడ్ చేస్తున్నప్పుడు తను మళ్ళి తలుపు తట్టి చెప్పడంలో ప్రయోజనం?

    ఈసారి  అడిగితే మా ఇంటికి రావోద్దుని డ్తెరెక్టుగా  చెప్తారేమో!-

    అసలు చిన్నమ్మాయి కూడా తనని ఎందుకు అవాయిడ్ చేస్తుంది?

    బాధగా నిట్టూర్చి  భారంగా అడుగులు ముందుకు వేశాడు చిట్టబ్బాయ్.

    ఆలోచించి ఆలోచించి అతని బుర్ర వేడెక్కి పోసాగింది.

    చివరికి ఒక నిర్ణయానికి వచ్చి దగ్గర్లో ఉన్న జనరల్ స్టోర్స్లోకి  దూరాడు చిట్టబ్బాయ్.

    "పోన్ చేస్కోవాలి!" షాపువాడితో అన్నాడు    చిట్టబ్బాయ్.

    "లేదుసార్.." నిర్లక్ష్యంగా అన్నాడు వాడు.

    "అదేంటి?... ఉందిగా!" ఫోన్ వంక చూపిస్తూ అడిగాడు.
    "లేదుసార్..." మళ్ళి అదేమాట.

    "ఫోన్ పనిచెయ్యడం లేదా?"

    విసుగుదలని  మనసులోనే అణచివేస్కుంటూ అడిగాడు.

    "పని చేస్తుందిగాని ఇవ్వను!" కచ్చితంగా చెప్పాడు షాపువాడు.

    "చాలా అర్జంటుగా ఫోన్ చేస్కోవాలయ్యా!.. '  బ్రతిమాలాడ్తూ అడిగాడు చిట్టబ్బాయ్ .

    "మేం అలా అందర్కి ఫోను ఇవ్వమండి... మా కస్టమర్లు అడిగితే ఫోన్ చేస్కొడానికి ఒప్పకుంటాం..."

    క్షణంపాటు ఆలోచించాడు చిట్టబ్బాయి.

    "మీ దగ్గర కూల్ డ్రింక్స్ ఉన్నాయా?" హఠాత్తుగా షాపువాడిని అడిగాడు.

    "ఉన్నాయిసార్..."

    "ఒక లింక ఇవ్వు..."

    "అలాగేసార్" ఉన్నట్టుండి వాడి గొంతులో వినయం పలికేసింది.

    లింకా మూత ఓపెన్ చేసి చిట్టబ్బాయ్ కి  ఇచ్చాడు.

    రెండు గుక్కల్లో బాటిల్ ఖాళి చేశాడు చిట్టబ్బాయ్.

    "ఎంత?" షాపువాడిని అడిగాడు.

    "రెండున్నర"

    జేబులోంచి పర్సు తిసి షాపువాడికి పే చేశాడు.

    "ఇప్పుడు ఫోన్ చేస్కోవచ్చా?" సూటిగా షాపువాడి మొహంలోకి చూస్తూ అడిగాడు చిట్టబ్బాయ్. వాడు కళ్ళు పెద్దవి చేసి అర్ధం కానట్టు చిట్టబ్బాయ్ వంక చూశాడు.

    "నేను మీ కష్టమర్నే కదా?...ఇప్పుడు లింకా కూడా తాగాను" అన్నాడు చిట్టబ్బాయి.
    షాపువాడికి మాట రాలేదు.

    అలాగే అన్నట్టు తల ఊపాడు తెల్లమొహం వేస్కుని.

    చిట్టబ్బాయ్ ఫోన్ దగ్గరికి వెళ్ళి గబగబా నెంబర్ తిప్పాడు. అవతల ఫోన్ రింగావుతున్న శబ్దం వినిపించింది.

    ఎవరో ఎత్తారు. "హలో!"

    అది రంగనాయకుల కంఠం.

    "హలో చిన్నమ్మాయి ఉందాండి?" మెల్లగా అడిగాడు చిట్టబ్బాయ్.

    ఏం సమాదానం ఏమి చెప్పకుండా ఫోన్ డిస్కనెక్ట్ చేసేశాడు రంగానాయకులు.

    చిట్టబ్బాయ్ కి బాధ, దాంతోపాటు ఇరిటేషన్ కలిగింది.

    తనగొంతు వింటే చాలు ఫోన్ పెట్టేస్తున్నాడు. రంగనాయకులు... ఇప్పడేం చెయ్యాలి!...

    కొద్ది క్షణాలు ఆలోచించి ఒక నిర్ణయం తీస్కుని మళ్ళి ఫోన్ చేశాడు.  


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS