మద్రాసు చేరుదాఁ క నే నున్న చోటనుండి కదలక రైలు కంటె ముందుకు దూకుచున్న తలఁ పుల వేగముతో నిద్రమెలఁ కువలతో శాంత్యశాంతులతో మద్రాసు వచ్చితిని.వెంటనే మిత్రులను గలసికొని జరగిన సందర్భము లెల్లఁ దెలిపితిని.అవి వేసవి సెలవుల నాళ్ళు గాన మా బావతో బుట్టులు మా గ్రామమునకు వెళ్ళి యుండిరి.మరల జనార్దనుని హొటలు లో భోజనము చేయుచు ఆఫీసులో అందఱు నా యనారోగ్యమును నెఱిఁగి యుండిన మిత్రులే కాన నా కట్టె తొందర కలిగింప కుండిరి.నాఁటి దాఁక నా యనారోగ్యము ను గూర్చి వంత చెందుచు నే నెక్కువ కాలము జీవింపఁబో నను కొనుచున్న నా మిత్రుఁ డొకఁ డు,ఆఫీసులో ఉద్యోగి కలరా వచ్చి యదాటుగా కాహ్నిపోయి నాకు చాల చింతఁ గొల్పెను.సాయంకాల మయిదు గంటల దాఁ కఁ బని చేసి బడలి యింటికి వచ్చి సాయంకాలానుష్టానమున బడలిక తొలఁగి మరల నుత్సాహినై రాత్రి గడసి ఉదయోపాసనమున మఱింత తేఱి ఆఫీసుకు వెళ్ళుచు డిన క్రమమున నారోగ్య వృద్ధి బడయఁ జొచ్చితిని.దినదినము నరసింహము గారి యింటికి వెళ్ళి వారితోఁ గలసి యుపాసనము జరపు చుంటిని.
ఆ నాళ్ళలో మద్రాసులో శేషయ్యంగా రను నొక వైష్ణవుఁడు తంజావూరు జిల్లా వా స్తవ్యుఁ డు'ధ్రువనాడి'యను సంస్కృత గ్రంధము నుండి యనేకుల జాతకము చదువు చుండెను. ఆ యాచార్యుఁడు తొలుత చాల ననారోగ్య గ్రస్తుఁ డుగా నుండి శ్రీవారి శిష్యుఁడై కుంభకోణమున వసించి యారోగ్యవృద్ధి చెందెను.కాన మా గోష్టిలోని వాఁ డయ్యెను.ఆయన శ్రీవారి జాతకమును,మా గోష్ఠిలోని వారయిన యితరుల జాతకములను జదువు చుండెను.కొంత తద్వైచిత్ర కనుగొనుచు వింత చెందుచుంటిని.
పదిరోజులు గడచి నేను గొంత తేరుకోఁగా నన్ను కృష్ణా జిల్లాలో గ్రంధార్జనమునకుఁ బొమ్మని మా పై యధికారి శ్రీ కుప్పుస్వామి శాస్త్రి గారు నామిఁది యనురాగము తోనే యాజ్ఞ యిచ్చిరి.వెంటనే నేనును,శ్రీ మానవల్లి రామకృష్ణా కవిగారును వెడలితిమి.కృష్ణ కాల్వల క్రొత్త నీటి స్నానపానములు మా కిద్దఱకును సరిపడలేదు.బందరులో నది మంచిది దొరకును గాన వారు దాని నధికముగా గొని తెచ్చిరి.పడవలో కబుర్లు చెప్పుకొనుచు నిద్దఱము దానిని తింటిమి,నేను మితముగా,వా రమితముగా!ఆ రాత్రి కవిగారికి వాంతులు,విరేచనములు,జ్వరము,కలరా అనుకొంటిమి.సత్రములో నుంటిమి.ఆ రాత్రి యా సత్రములో మా బంధువు లొకరు మాకు సర్వోపచారములు చేసిరి.ఉదయము బజారులో టర్పంటైను,బ్రాంది మొదలగు నౌషధద్రవములకుఁ బోగా వర్తకు లెవ్వరు నియ్యరైరి.రామకృష్ణ కవిగారు 'ఎం.ఏ'మద్రాసు నుండి గ్రంధార్జనమునకై రాజా గారిని దర్శించుటకై వచ్చుట,వారితో నేను నుండుట యిత్యాదికము వెల్లడి యయ్యెను.
ఆ యూరికి వచ్చు పెద్దమనుష్యులకు, ఉద్యోగులకు వలసిన పదార్దములు రాజాగారే యియ్యవలెను గాని కోమట్లియ్య గూడ దని యను శాసనము. కవిగారు 'కాళ్ళిడ్చు కొని పోవుచున్నవి.జీవితము నిల్చునట్లు లేదు.కలరా గాఁ బోలును.బ్రాంది కావలెను,కాళ్ళకు టర్పెంటైను రాయ వలె'నందురు.అవి దొరక లేదు.రాజాగారిని దర్శింప మధ్యాహ్నము గాని వీలుపడలేదు.రాజాగారు భోజనా నంతరము నిద్ర లేచిన తర్వతా నేఁ బంపిన వార్త వారికిఁ దెలుపు ననువుపడెను.వలసినవానిని వారు పంపిరి.అప్పటికే కవిగారికి మా బంధువుల యుప చారములచే గుణముగా నున్నది.మందు లక్కఱ లేకేపోయెను.ఈ వార్త ఆఱు మైళ్ళ దూరమున నున్న మాగ్రామమునకు తెలియగా,మా తండ్రిగారు పంపగా మా పినతండ్రిగారు బండిలో మమ్ము తోడ్కొనిపోయిరి.
