బహిర్ముఖముగా సమాధానము తెలియఁగోరుచో,' అనంత శాస్త్రం బహువేదితవ్యం ' ఆయా శాస్త్రములును, దత్ కర్తలును బహుభేదముల వారు. అం వరిదిగ్రాహ్యమోతేల్చువలసినది మరలనాత్మోద్బోధమే. ఘట్టకుటీ ప్రభాత న్యాయమున నెల్లరునెట్లు గాని యాత్మోద్బోధములు నను వర్తింప వలసిన వారే,అనువర్తించు వారే కాక తప్పదు. బహిర్ముఖముగా లభించు విజ్ఞానమును దోడు చేసికొని యాత్మోద్బోధములు నందుకొనఁ గల్గినచో పరమార్ధముల సులువుగాఁ బడయ వీలు పడును.
ఆ నాఁటి సాయంకాలము నా చేతి వాపు చాల తగ్గినది. యోగ సాధనానంతరము రామజపము వలె కొంత దడవుత దేకా నుధ్యానము చేయఁబూనితిని. ఒడలెల్లమంటలెత్తినట్లయ్యెను. అది శ్రీ వారితో చెప్పితిని. నియత సమయములలో తక్క నితర సమయములలో నా యనుష్టానము చేయరా దనియు, ఏ దేని యావశ్యకత కల్గినచో నప్పుడొక క్షణము స్మరించినంత మాత్రమున దానికి జరగఁ దగిన సౌకర్యము జరుగు ననియు, నోటి మాటను చెవి విన్నట్టే మి యభ్యర్ధనముల నది వినఁగల దనియు, ఒక తూరి ప్రార్ధించి నంత నే సర్వసిద్ధముగా నను గ్రహింపఁ గా నది చూచుచుండ గా మరల మరల నడుగు టేల యనియు ననిరి. టెలిఫోనులో ఒక తూరి పిలువగా నవతలి వారు సిద్ధముగా బదులు పలుకు చుండగా దానిని వినక యూరక పిలుపులే పిలుచువాని తీరువంటిది పదింబదిగా స్మరించుచుండుట యనిరి. ఈ యుప దేశపు యాదార్ధ్య మటుతర్వాత పరసహస్రపర్యా యములు నాకును నా మిత్రులకును ననుభూతి కందినది.
1925వ సం, ప్రాంతముల నొక మిత్రుఁడు నిరంతరము శ్రీవారి స్మరణమే రామనామజపమువలె జరుపుట సాగించెను. కొన్నాళ్ళకు శరీర మెల్ల నగ్నిజ్వాల వలె నెయ్యెను. నిద్రలో నరములు బిగించిన ట్లయి త్రుళ్ళిపడుట, క్రమముగా నిద్ర పట్టకుండుట యేర్పడెను. బంధువులు పలు వైద్యములు చేయించిరి. యోగము నే మాన్పించిరి.ఏమియు లాభము లే దయ్యెను. జరపిన తప్పిదమునకు పశ్చాత్తాపము సెంది క్షమింప ప్రార్ధించి సక్రమముగా నడచుకొన సాగించిన తరువాత నారోగ్యము చక్క బడెను. ఆ మిత్రుఁడు నేఁడును క్షేమముగా యోగ సాధనము చేయుచున్నాఁడు.అనధికారముగా, అక్రమముగా సాధనములు సాగించిన వా రింక నెందఱో పశ్చాత్తప్తు లయి బాగు పడవలసిన వారైరి.
* * *
౨౮
నవజీవనము
నాఁటి రాత్రి శ్రీవారి ని దేశముచొప్పున మద్రాసుకు హాయిగా నే బయలు దేరితిని. కుంభకోణమున నుండి మాయవరము దాఁక రైలులో వచ్చితిని. పలువు రక్కడ దిగిచుండిరి. నేనును ఆ స్టేషనులో దిగి అక్కడ చాలాసేపు రైలాగును గాన ప్లాట్ ఫారం మిఁద కొంతదడవు నిటు నటు తడవాడితిని. రైలెక్కి తిని. అది బయలు దేరెను.నేను తలుపు దగ్గరనే నిలుచుంటిని. న న్నెవరో బయటికి పడఁద్రోయు చున్నట్లయ్యెను. మరల తొంటిరీతి కంపము, నిరుత్సాహము తోఁ చెను. తోడ్తో రైలు ద్వారము దగ్గఱ నున్న నాకు హరి ద్వారము తలఁ పునకు వచ్చెను. పాడు తలఁపు క్రిందికి దూకుదునా యనియుఁ దోఁచెను.
అల్లంతలో న న్నెవరో వెనుకకు నెట్టిచున్నట్లయ్యెను. ఇది నాలో జరుగుచున్న సదసద్వి వాదముగా గోచరించెను. పూర్వము కంటె నిప్పుడు గొప్ప జ్వాల లోపల వెలుఁగుచున్న ట్లయ్యెను. పూర్వ మెక్కడోమిణుకు మిణుకు మను నాశా జ్యోతి యుండెడిది. నే నీ సంకల్ప వికల్పములతో నిటు నటు నూగుచుండగా లోఁ గూర్చున్న సహృదయుఁ డొకఁడు భగవదావిష్టునట్లు తన ప్రక్క చోటు చూపుచు ' అయ్యా తలుపు తెఱచి యున్నది. క్రింద పడగలరు! ఇటు వచ్చి కూర్చుండుఁడు' అనెను. వెంటనే వెళ్ళి కూర్చుంటిని. ఆతఁడు లేచి నాకు మఱీ చోటిచ్చెను.' నేను తర్వాతి స్టేషనులో దిగిపోవుడును గాన యిఁక కూర్చుండను' అని నన్నుఁ గూర్చుండబెట్టి తానే తలుపు వేసి దగ్గఱ నిలుచుండెను.న న్నట్లు రక్షించినవారు గురుదేవులే యగుట. వారి ప్రజ్ఞాంశ ము నాలో నుండుట కాల క్రమమున స్పష్టముగా గుర్తింప నయ్యెను.
