Previous Page Next Page 
హెల్త్ సైన్స్ పేజి 53

                                49. మానసిక అశాంతికి నోట్లో పుళ్ళుకూడా కారణమే!

    "ఏమిటి అలా నంగిగామాట్లాడతావు? చెప్పేదేదో సరిగ్గా చెప్పి ఏడు" అంటూ విశ్వేశ్వరావు విమలని  విసుకున్నాడు. విశ్వేశ్వరరావు విసుక్కోవడాలు, గదమాయింపులు విమలకి మామూలే. అయితే అనవసరంగా తనమీద విసుక్కోవాటంతో ఉద్రేకపడిన విమల తగిన జవాబిద్దామని నోరు విప్పబోయేసరికల్లా నోట్లోనుంచినీరు ఊటలాగా కారబోయింది. దానికి తగ్గట్లు నాలిక నొప్పి పట్టుకుని విశ్వేశ్వారావు వైపు అదోలా చూసింది. ఆమె కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి. అది ఏడుపు మాత్రం కాదు. మాట్లాడటానికి విలులేకుండా బాధగా   అనిపించడమే. చివరికి ఓపిక చేసుకుని, "అసలు మీ చికాకు, కోపం వల్లనే నాకు లేనిపోని రోగాలువస్తున్నాయి" అంటూ నంగిగా మాట్లాడుతూనే కోపంగా జవాబిచ్చింది.

    విమల స్పష్టంగా మాట్లాడలేక పోవడానికి ఆమె నోట్లో పుళ్ళు ఏర్పడి బాధ కలిగించడమే కారణం. అలా ఆమెకు నోట్లో చిన్న_చిన్న పళ్ళులా రావడం, మాట్లాడాలన్నా, నోరు మెదపాలన్నా బాధ కలగడం మామూలే. అందులోనూ విశ్వేశ్వార్రావు ప్రవర్తనగాని, మాటలుగానీ తనకి చికాకు కలిగించి మానసికవేదన కలిగించే రోజుల్లో నోట్లో చిన్న_ చిన్న కురుపులులాగావచ్చి ఇబ్బంది కలిగించడం మరింత ఎక్కువ. "మీ వల్లేనాకు ఈ బాధ వస్తోంది" అని విమల తెలిసో తెలియకో అన్నా నోట్లో వచ్చే చిన్న, చిన్న పుండ్లు మానసిక అశాంతికి చుట్టాలలాంటివే. మానసికంగా అందోళన పడేవారిలో ఇలాంటివి తరుచుగా ఏర్పడుతూ ఉంటాయి.

    చాలా మందికి అప్పుడప్పుడు నోటిలోపల, రెండు దవడలమీద, నాలికమీద, పెదవుల లోపల, గొంతుకదగ్గర చిన్న, చిన్న పుండ్లు అకస్మాత్తుగా ఏర్పడతాయి. చిన్న_చిన్న నీటి పొక్కులులాగా నోట్లోలేచి అవి పగిలిపోయి పుళ్ళుగా మారతాయి. ఇవి ఒకటి_రేండో రావచ్చు. లేదా నోటినిండా20_30 దాకారావచ్చు. నోట్లో ఈ పుళ్ళు వచ్చినప్పుడు ఏదైనా మింగాలంటేబాగా నొప్పి అనిపించటం, చివరికి మంచినీళ్ళు గుటకవేయాలన్నా కొందరిలో అమితంగా బాధ కలగడం మామూలు.

    నోట్లో పుండ్లు ఏర్పడబట్టి నీరులాగా ఊరుతుంది. దానితోనోరు విప్పేసరికి నోట్లోంచి నీరులాగా కారిపోతుంది. నాలికపోతుంది. నాలికమీద పుళ్ళు రాబట్టి మాట్లాడాలంటేనొప్పి కలిగి నాలిక సరిగ్గా కదవలేక మాట నంగిగావస్తుంది. నోట్లో ఇలా పుళ్ళు వచ్చినప్పుడు జ్వరం రావడంగాని, ఇతర శారీరకబాధలు గాని ఉండవు. అయితే నొప్పివలన  ఆహారం తీసుకోలేక నీరసం అనిపిస్తుంది. దానికి తోడు బాధవలన ఆ వ్యక్తిలో అందోళన, న్యూరోసిస్ ఎక్కువ అవుతాయి. కొందరిలో ఈ పొక్కులు నోట్లో కొద్దిగావచ్చి బద అంతగా అవుతాయి. కొందరిలో ఈ పొక్కులు నోట్లో కొద్దిగా వచ్చి బాధ అంతగా అనిపించకుండా తగ్గిపోతే, మరికొందరిని ఇవి తెగ ఏడిపిస్తాయి.

    నోట్లో ఇలా చిన్న_చిన్న పుళ్ళులా రావడం పురుషుల్లో కంటె స్రీలలో, ముఖ్యంగా 20_50సంవత్సరాల వయస్సులో ఎక్కువ. కొందరు స్రీలలో బహిష్టులు ఆగిపోయే సమయంలో నోట్లో పొక్కులు రావడం సహజం. నోట్లో వచ్చే పదిశాతం స్రీల్లల్లోఅవి వచ్చినప్పుడు వారికీ వారి మర్మావయవల దగ్గర ఇటువంటి చిన్న_చిన్న పుళ్ళు ఏర్పడతాయి.

    నోటిలో ఇలా వచ్చే పుళ్ళని యూప్తన్ స్టోమటైటిన్ అనీ, డిన్ పేప్టిక్ అల్సర్, అనీ, వేసిక్యూలర్ స్టోమటైటిన్ అని అంటారు. ఇది రావడానికి కొందరికి మానసిక కారణలతోపాటు వైరస్ క్రిములు కూడా కారణమే. మరికొందరిలో టైఫాయిడ్, పొంగులాంటిజ్వరాలు వచ్చినప్పుడు నోటిలో పెద్ద_పెద్ద తయారవుతాయి. పొగాకు నమిలేవారిలో, నీళ్ళు కాని, సోడాకాని కలపకుండా మధ్యం సేవించేవారిలో, మరీ వేడిపదార్ధాలు భుజించేవారిలో, మసాల దినుసులు ఎక్కువ వాడేవారిలో, కొన్నిరకాల టూత్ పేస్టులు వాడినప్పుడు,  మరికొన్ని ఇతర సందర్భాలలోనూ నోటిలో చిన్నవీ_ పెద్దవీ ఏర్పడుతూ ఉంటాయి.  

    నోట్లో పుళ్ళు ఏర్పడినపుడు సరైన కారాణాన్నిగుర్తించి చికిత్స చేయవలసి వుంది. నోటి శుభ్రతను పాటించడం, పుళ్ళామీద త్వరగా మానడానికి పై పూతలాంటివి వాడడం అవసరం. నోట్లోవచ్చిన పుళ్ళను బట్టి యాంటిబయాటిక్స్. కార్డిజోన్ టాబ్లెట్లు,  బి_కాంప్లెక్స్ మందులు వాడవలసి ఉంటాయి.    
                                                                ****

 
   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS