Previous Page Next Page 
హెల్త్ సైన్స్ పేజి 52

                                                    48. నోటిపూతఎందుకు వస్తుంది?  

    ఆచారానికి ఆవకాయ అంటే ఎంతో ఇష్టం ఆవకాయ లేనిదే ముద్దా మింగడు పడదు. అటువంటి ఆచారికి అనుకోకుండా అన్నం తినలంతేనే బాధ మొదలైంది. కొద్దిగా కారం తింటేనే చాలు_ నోరు మండిపోయి, కళ్ళగ్రుడ్డుల్లోనీళ్ళుగిర్రున తిరుగుతున్నాయి. దీనికి తోడు నోటికి రెండు వైపులా తెగినట్లయినోరు విప్పాలంటేనే నొప్పి కలుగుతోంది. నలికంతా పూసినట్లు ఎర్రగా తయారైంది. దానితో ఒక్కొక్కసరి మంచినీళ్ళు త్రాగినా మంట పుట్టుతోంది. ఆకలి వేస్తున్నా అన్నం తినలేక కళ్ళు గింజుకుని పోవడం, కళ్ళు తిరగిపోవడంజరుగుతున్నాయి. ఇదంతా ఇలా ఎందుకు అయిందో ఆచారికి అర్ధంకాకుండా ఉంది. వేడిచేసి నోరు పూసిందనుకుని చలన చేయడానికి ఏవేవో తీసుకున్నారు. కాని ప్రయోజనం శూన్యం.

    ఆచారికి ఇలా నోరుపూసి బాధ కలగడానికి అతనికి రిబోప్లే విన్ విటమిను లోపమే కారణం. రిబోఫ్లేవిన్ విటమిన్ బి_కాంప్లెక్స్ గ్రూపుకి చెందిన విటమిన్నే. చాలామందిలోనోరుపూసినట్లు అవడానికి ఈ విటమిన్ లోపం ముఖ్యకారణం. ఈ విటమిన్ లోపంవల్ల నోటిపూతే కాకుండా రకరకాల బాధలు కలుగుతాయి. కొందరికీ పెదాలు పగిలి నిలువుగా గాళ్ళు_ గాళ్ళుగా కనబడతాయి. మరి కొందరిలో కళ్ళు ఎర్రబడ్డట్లు అయి. మంట అనిపిస్తాయి. ఇదేకకుండా ఇంకొందరికి ముక్కుదగ్గర నుంచి నోటి నొసలు వరకు నల్లటి మచ్చలు తయారవుతాయి.

    కొందరు పురుషులలో బీర్జలదగ్గర చర్మం నల్లగా తయారవుతుంది. బీర్జలమీద చర్మం ఎండిపోయినట్లుగా పొలుసులు పోలుసులుగా తయారవుతుంది.

    రిబోఫ్లేవిన్ అన్నిరకాల ఆకుకూరల్లోనూ ఎక్కువుగా లభ్యం అవుతుంది. అందుచేత ఆకుకూరలు ఎక్కువుగా తినేవారిలో నోటిపూతకనబడదు. పాలల్లోనూ, పాలతో తాయారుచేసే ప్లకావువా వంటి తినుబండారాలలోనూ, మాంసం, చేపలు, కాలేయం, ఈస్టులోనూరిబోఫ్లేవిణ్ పుష్కలంగాలభ్యం అవుతుంది. అలాగే పాలిష్ పట్టానటువంతి బియ్యం_ గోధుమల ద్వారా శరీరానికి ఈ విటమిన్ లభ్యం అవుతుంది. మామూలు పపుదినుసుల్లో కంటె నానాబెట్టి మొలకెత్తిన పెసలు, శనగలు వంటి వాటిల్లో రిబోఫ్లేవిన్ ఉంటుంది. మన జీర్ణ కోశంలో ఉండే కొన్ని ఉపయోగకరమైన బాక్టీరియ క్రిములు కూడా రిబోఫ్లేవిన్ ఉత్పత్తి చేస్తాయి.

    పైన వివరించిన ఆహారపదార్ధాలు తగినంత  తీసుకొని వారిలో నోటి పూత రావడం జరిగితే మరికొందరిలో పోగా ఎక్కువుగా త్రాగటంవల్లా, అల్కాహాలు అధికంగా  సేవించటంవల్ల,జీర్ణకోశం సంభంధమైనా వ్యాధులు ఉండటంవల్లాకొన్ని దీర్ఘవ్యాధుల్లా_ ఆహారంలో ఐరన్ లోపంవల్లా, నోటిపూతలాగా వస్తుంది. ఇటువంటి వారిలో తిరిగి ఆరోగ్యం కోలుకునేటట్లు చూడటం, మలబద్దకాన్ని నివ్రిమ్చడం, నోరుని పరిశుభ్రంగా ఉండేటట్లు చూసుకోవడం అవసరం.                 

                                                                      ****


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS