50. గొంతు మింగుడు పడకపోతే ఏం చేయాలి?
కామాక్షమ్మకు కేన్సరు వచ్చి గొంతుక పూడిపోయినట్లు అయింది. మొదట్లో ముద్ద సరిగ్గా దిగాకపోతూ ఉంటే "ముసలితనం వస్తోందికదా నరాల బలహీనత "అని సరిపెట్టుకుంది. చివరికి మంచినీళ్ళుకూడా గొంతు దిగాకపోవటంతోఆమె డాక్టరు దగ్గరికి వెళ్ళింది. డాక్టరు పరీక్షచేసి ఆమె అన్నవాహికకు దిగువ భాగంలో కేన్సరు కణితి ఏర్పడిందనీ చెప్పాడు. కమాక్షమ్మకి కేన్సరు వచ్చిందని విన్న కొద్దిరోజులకే ఆమె కోడలు రాజారమణికి మంచినీళ్ళు మింగుడు పడుతున్నాయిగాని, అన్నంముద్దగొంతు దిగడం మణివేసింది. ఇంకేముంది, రోజారమణి తనకుకూడా కేన్సర్ వచ్చేసిందని దిగులు పడిపోయింది. నోట్లో అన్నంముద్ద పెట్టుకోబోయేసరికి కేన్సరు గుర్తుకురావడం, మనసు భయంతో కంపించిపోవడం, అన్నంతినలేకలేచి పోవడం మామూలైపోయింది. ఎంతో కాలంనుంచి కేన్సరు వున్న కామాక్షమ్మకి అయితే కొంత అయినా ఆరోగ్యం ఉందిగాని, రోజారమణి తిండితినక, నీళ్ళు తాగలేక ఆమెకు ఏ జబ్బూలేదని చెప్పినా ఆమె మాత్రం ముద్ద మింగటానికే ఇబ్బంది పడిపోతూ దిగులు పడిపోతుంది.
అన్నవాహికలోకేన్సరు వచ్చి కామక్షమ్మకి నిజంగానే అన్నం ముద్ద గొంతుకులోనే అడ్డుపడ్డడ్డు అనిపిస్తే కోదలుకి అత్తగారిని చూసి అనుమానం అనే జబ్బు తెచ్చుకుని అన్నం ముద్దా మింగాలేకుండా తయారైంది. ఆహారం తీసుకుంటూ ఉంటే గుండెల దగ్గర ఎక్కడో అడ్డుబ్పడి పోయినట్లు అనిపించే జబ్బు ఆడవాళ్ళలోఎక్కువ. అయితే అంతమాత్రానఇందంతా మానసిక భయందోళనల వలన జరుగుబోతొందన్ననిర్ణయానికి వచ్చేయకూడదు. కమక్షమ్మాలో లాగానే కొందరికి నిజంగానే గొంతుకుదగ్గరలోనో, అన్నవాహికలోనోకేన్సర్కు సంభందించిన కణితిగాని, ఇతర కణితిగాని ఏర్పడి ఇబ్బంది కలగావచ్చు.లేదా ఆడైనా ఇతర కారణాల వలన అన్నవాహికలో పుండు ఏర్పడవచ్చు. వాపు రావచ్చు, ఆహారం తీసుకుమ్తున్నప్పుడు ముడుచుకుంటూ నిచ్చుకుంటూ ఉండవచ్చు.
ఈ రకంగా ఆహారం గొంతుకలోగాని, గుండెదగ్గర గాని అడ్డుపడి నట్టు అనిపించి ఇబ్బంది కలగడాన్ని విద్యాబాషలో "డిస్ ఫేజియా" అంటారు. ఈరకంగా ముద్దా మింగాలేకపోవడంగొంతుకు దగ్గరే అనిపించవచ్చు, లేదా ఇంకా కొద్దిగా కింద భాగంలో అనిపించవచ్చు. పక్షవాటం వచ్చి నరాల బలహీనత ఏర్పడిన కొందరిలో అన్నం ముద్దా మింగలేకపోవడం, నీళ్ళు టాగలేకపోవడం సహజమే! అటువంటి వారిలో ఆహారం తీసుకుంటున్నా, నీళ్ళు తాగుతున్నా అవి కిందకుపోకుండా ముక్కుల్లోంచిబయటకు వస్తాయి. దానికి కారణం నరాల వ్యవస్థ దెబ్బ తినడంవలన ఆహారం మింగడానికిసాయపడే గొంతులోని కండరాలు సమ్మె చేయటమే!
అన్నవాహికలో నిజంగానే అడ్డం ఏర్పడి ఆహారం కిందకు దిగినపుడు ఎ మాత్రం తీసుకున్నా అది ఎ స్థాయిలో ఆగిపోతోందో రాగి చక్కగా వేలుపేట్టి చూపించగలుగుతారు. హిస్టరీయా రోగిమాత్రం ఒక్కొక్కసారిఒక్కొక్క స్థాయిని చూపించడమే కాకుండా, ఇతర హిస్టిరియా లక్షణాలు కనబరుచుటాడు. రక్తం తక్కువవుందే స్రీలు గోంతుకలోఎ అడ్డం లేకపోయినా అన్నంలాంటివి మింగాలేకపోతున్నామని డాక్టరుతో చెబుతూ ఉంటారు. అటువంటివారిని పరీక్షచేసి చూస్తె రక్తహీనత తప్పగొంతులోగాని, అన్నవహికలోగానిఎటువంటి అడ్డంకులు ఉండవు. నరాల వ్యవస్థకూడా బాగానే ఉంటుంది.
వీరిలో ఆ రక్తహీనత ముఖ్యంగా ఐరన్ లోపంవలన కలుగుటుంది. సాధారణంగా 25_50సంవత్సరాల మధ్య వయస్సు ఉంది బలహీనంగా ఉండే స్రీలకి ఇటువంటి ఇబ్బంది కలుగుతూ వుంటుంది. అయితే కొద్దిమండి పురుషులుకూడా రక్తహీనత ఉన్నప్పుడు గొంతుకులోఏదోఅడ్డంఉన్నట్లు, అన్నం ముద్ద మింగడానికి ఇబ్బందిగా ఉన్నట్టు బాధపడుతూంటారు. వైద్యపరిశీలనప్రకారం ఐరన్ లోపంవలన రక్తహీనత ఉన్నవారు నూటికి పడిహేనుమండి ఆహారం మింగలేకపోతున్నామని ఆరోపిస్తున్నట్టుతెలుస్తోంది. ఇటువంటి వారికి నిదానంగా కాకుండా హాఠాత్తుగాఏదో ఒక రోజున అలా ఉన్నట్టు అనిపించి తరువాత అది సమస్య అయిపోతుంది. మళ్ళీ ఏబాధ లేకుండా దానికాదే తగ్గిపోతుంది. రక్తహీనతవల్ల గొంతుకులోఅడ్డంపడుతున్నట్టు భావించేవారికి మానసికధైర్యంకలిగించి రక్తం పట్టడానికి ఐరన్ టానిక్కులువాడుతూ పోషకాహారం ఇస్తే అంతా బాగుపడిపోతుంది.
కొందరిలో జేరనసహాయానికి కొద్దిగా పైన అన్నవాహికగొట్టం వుబ్బినట్టు అయి ఆహారం కిందకు దిగాడు. మరి కొందరికి స్పింక్టర్ స్పాజమ్ వల్ల ఆహారం జీర్ణకోశంలోకిచేరడం కష్టం అవుతుంది. కొన్ని గుండెజబ్బుల్లోగాని, ఛాతీకిసంభందించిన వ్యాధుల్లోగాని అన్నవాహికమెడ ఒత్తిడికలిగిఆహారం కిందకిదిగమని మోరాయిస్తుంది. అలాగే అన్నవహికకు దిగువభాగంలో పుండు ఏర్పడ్డా ఆహారం మింగుడుపడదు. అన్నవాహికలో కేన్సర్ కణితలు, ఇతర కణితలుకూడా ఏర్పడినా ఆహారం కడుపులోకి పోదు. అలా ఇబ్బందిగా ఉన్నట్టు అనిపిస్తే డాక్టరు చేత పరీక్ష చేయించుకోవడం అవసరం మనసికంగాబాధవున్నదని భ్విమ్చేవారు డాక్టరు ఏమీలేదని చెప్పినమీదుట ధైర్యం తెచ్చుకుని వ్యాధిగురించి ఆలోచించడం మనివేయడంమరీ అవసరం.
****
