Previous Page Next Page 
శ్రీ శ్రీ కథలు పేజి 52


    అతనికి మళ్ళీ కోపం వచ్చింది.
    'నిన్నెవరయ్యా పంపించారు? హెడ్డుగారు కాదూ?'
    'అత నెవరో నాకు తెలియదు.'
    'అయితే బోధపడింది. మంత్రిగారు పంపించి ఉంటారు. నాకెందుకు తాను ఉద్యోగం ఇయ్యలేదో నచ్చజెప్పాలని......వెళ్ళి అతగాడితో చెప్పు మళ్ళీ కనబడితే మొహంమీద ఉమ్ముతానని.
    'కోపగించకండీ!' నా అంతట నేనే వచ్చాను. నే నెవరినో చెప్పదలచుకోలేదు. నా కేదో కావాలో చెబుతాను.'
    'ఓహో! నువ్వొక దీనుబంధువుడివన్న మాట. నన్ను రక్షిస్తున్నావు. కాని ఆసమయం అంతా మించిపోయిందండి. ప్రియమైన దీనబంధువుడుగారూ! అలాగయితే నాకూతుర్ని కూడా మీరు రక్షించవలసి ఉంటుంది. నా కేమయినా లంచం గానీ యిప్పిస్తారా?...అంతా మాయవెధవలు?....సరేకాని ఎంత ఇస్తారేమిటి?
    'నేనేమి తమకు సమర్పించుకోలేను. దురదృష్టవశాత్తూ నన్ను కూడా సంఘం వెలివేసింది. కాని అయినా...'
    'నాన్సెన్స్! కబుర్లు కబుర్లు చాలా విన్నాను ఈ కబుర్లు ఇకచెప్పకు. నన్ను చనిపోనియ్యకుండా ఎన్ని మాయమాటలు చెప్పబోతున్నావో అవన్నీ నేనెరిగినవే! నీకు తెలుసునోలేదో నేను బాగా చదువుకున్నవాన్ని వేదాంతినికూడా మన ఆస్తిపోవడం. అదీ, చిక్కులూ ఈ అన్నిటివల్లా ఏమయితే నేం విద్యామంత్రిగారిని మ్యూజియంలో ఒక ఉద్యోగం ఇప్పించవయ్యా అని కోరాను. వారు, సరే, నిరాకరించారు. న్యాయంగా నాకు ప్రొఫెసరు కావడానికి తాహతుంది. ఒకరాజుగారి కొడుక్కి కొన్నాళ్ళు ట్యూటరుగా ఉండమన్నారు. కాని మనం వద్దన్నాము. నేను చచ్చిపోతున్నాననుకున్నావు. కాబోలు లేదు కేవలం ఈ చచ్చుశరీరం వదలిపెడుతున్నాను. వీటన్నిటికీ అతీతుణ్ణి నేను కేటో (Cato) ని నేను.
    'మీ ఉన్నతాభిప్రాయాలు ప్రశంసార్హంగా ఉన్నాయి. మళ్ళీ మాట్లాడితే నేనూ వాటితో ఏకీభవిస్తున్నాను. కాని మీరు చచ్చిపోవడానికి ముందు నేను కోరేదేమిటంటే-'
    'మరికొంతకాలం బతకమని వల్లకాదు. నా దగ్గర ఈ వేషాలు పనికిరావు. దెబ్బలాడాలని ఉందా? రా. నాక్కూడా సత్తువ ఉంది. నిన్నూ నీట్లోకి లాక్కుపోతాను.'
    'వద్దు ధన్యవాదాలు! ఒక్క ఉపకారం మీ నుండి కోరుతున్నాను. అంతే!' మానవజాతిని మీ రెంత ద్వేషిస్తున్నా మావంటి దీనుడికోరిక చెల్లించకపోరనే నానమ్మకం. మీలాగే నేనూ వెలిపడ్డాను.'
    'నువ్వంటే ఆశ్చర్యం కలుగుతోంది. 'నేనేమీ వెలిపడడం లేదు. 'నేను స్వేచ్చా ప్రాణిని. జీవితమంటే నాకసహ్యం. కేవలం ఆర్ధికకారణాల వల్ల ఈ నిర్ణయానికి నేను రాలేదు.'
    'మరీమంచిది. అందుచేత నేను కోరేదేమంటే....'
    'లాభం లేదు క్షమించాలి. నే నేమీ ఇయ్యలేను. నాతాలూకు వస్తువులన్నీ ఇంట్లోనే విడిచిపెట్టి వచ్చాను. శుల్కం తీసుకోకుండానే వైతరణి దాటించాలి నన్ను షారన్ (charon)
    'అదేం ఫర్వాలేదు. నేను కోరేదంతే మీ వేస్టుకోటుమాత్రం.'
    మరణానికి సిద్దంగా ఉన్న ఆ సాహసక వేదాంతికి కూడా ఒంటరిని ఒక బిచ్చగాడి చేతులలో పడినందుకు కళకళపాటూ, భయమూ స్పష్టంగా చూపట్టాయి కాని అతడేమీ అనలేదు. ఊపిరిబిగపట్టి అతడు జాగ్రత్తగా మొదట తన పాతహేటు తీసి ట్రిస్టానో కిచ్చాడు. ట్రిస్టానో దానిని చంకనుపెట్టాడు. తర్వాత జాకెట్ తీశాడు. ట్రిస్టానో దానివైపు సంతుష్టిగా చూచి. 'దీని కిక్కడ కన్నం ఉన్నదండీ! అన్నాడు.
    ఆత్మహత్య చేసుకుంటూ మంచిబట్టలు పాడుచెయ్యడమెందుకని ఆలోచించానంది కాని నీ దౌర్జన్యం ఏమీ బాగులేదు. సిగ్గుతెచ్చుకో.'
    'ఏం దౌర్జన్యం చేశాను? నేనేం కూనీ చేస్తాననుకున్నారా? మిమ్మల్ని భయపెట్టనైనాలేదు ఇవన్నీ మీకు మనస్ఫూర్తిగానే ఇస్తున్నారనుకున్నాను.'
    'అయితే నువ్వు జేబు దొంగవుకావన్నమాట.'
    తనసంగతి అతడు సరిగా గ్రహించినందుకు ట్రిస్టానోకు ముచ్చట కలిగింది. కాని దొరికిన వస్తువులు వదలడానికతనికి మనస్కరించలేదు. కోటును ప్రేమగా పట్టుకొని చూస్తూ ట్రిస్టానో అన్నాడు విచారంతో.
    'జేబుదొంగ అనకండి నన్ను. హృదయానికి గాయం చేస్తున్నారు. నే నో పెద్దమనిషిని చూడండి. ఈ కోటును. ఇది మీరుధరించదగ్గదిగా ఉందా?...ఎవరైనా ఏమంటారు? తప్పకుండా మాకు డబ్బుచిక్కులున్నాయంటారు.....అన్నట్టు దయచేసి మీపంట్లాం జేబులుకూడా తిప్పుతారూ? సరి ఏమీలేవు వాటిలో మంచిది. థాంక్స్ మీరు చెప్పదలచింది అయిపోయింది కాబట్టి-
    'లేదు అక్కడే పొరబడ్డావు. నా నిర్ణయానికి డబ్బుచిక్కులు చాలా చాలా అల్పకారణం.'
    'అది తిరుగులేని నిర్ణయమేనా?'
    'తిరుగులేని నిర్ణయం. డబ్బంటే నా కసహ్యం....నేను ప్రొఫెసరుగా ఉన్నప్పుడు కుర్రాళ్ళు నామీద బంగాళాదుంపలు విసిరేవాళ్ళని నా ఉద్యోగం లాగేశారు. మంత్రి నాకు మ్యూజియంలో ఉద్యోగం ఇయ్యలేదు. అయితే ఈ చిన్న కారణాలకే వేదాంతి అన్నవాడు ప్రాణాలు తీసుకుంటాడా? లోకంకోసం వేదాంతులింకా బతకాలి. నువ్విది  చెప్పవచ్చును-మానవ కోటి కింకా వేదాంతుల ఆత్మహత్య లెందుకు చేసుకుంటారో ఆ సూక్ష్మకారణాలు అర్ధంకావు!
    'కాని నేను జేబుదొంగనుకానని మనవి చేసుకున్నాను. నన్ను నమ్మరూ? సరే నా నమ్మకం ఇప్పడే నిరూపిస్తాను మీ పంట్లామూ జోళ్ళూ విప్పి ఇవిగో నావితొడుక్కోండి ఇవి మంచిదుస్తులు ఈజోళ్ళు అమెరికా వస్తువులు నాకోటుకూడా మీకు ఇచ్చివేద్దును కాని అదంత అవసరమని తోచదు. అంటే-కోటుతోకూడా ఎవ్వరూ చచ్చిపోదు. ఈ కటకటాల మీద ఇలా వదిలేస్తారు.'
    వేదాంతి మానవజాతిని బాగా ఎరుగునుగాని చనిపోయే తనకు ఇటువంటి మర్యాద చూస్తే ఆశ్చర్యం కలిగింది. మంచి అంత్యక్రియలే జరుగుతున్నట్లు బోధపడింది ట్రిస్టానో తన అభిప్రాయం స్పష్టంగా బోధపరుస్తున్నాడు.
    'నేను దీనబంధువుడినని మీరు సరిగానే గ్రహించారు. నిజంగా నేను దీనబంధువుడని కాని అందులో నా దొక ప్రత్యేకపురకం ఇతరుల అభిప్రాయాలను నేనెప్పుడూ గౌరవిస్తాను. పైగా ఆత్మహత్య అంటే నా కంగీకారం....ఏమో, ఇంక కొన్నాళ్ళలో నేనుకూడా......! అందుచేత మీ నిర్ణయానికి నేను అడ్డుదగిలేవాణ్ణి కాను. మీ కోరికలకు భంగం కలుగనివిధంగా నాసాయం నేను చేస్తున్నాను.'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS