కొంత కాలమయిన తర్వాత నేను మరల కుంభకోణము వెళ్ళి యుండఁ శ్రీ వారే నే నడుగ కుండనే యీ విషయమును గూర్చి యిట్లనిరి.' నాకు శిష్యులుగా నుండువా రెవరు గాని లోకమునకు విడ్డూరముగా తోఁచదగిన వేష భాషలతో నుండుట బాగుగాదు. నలుగురతో పాటుగానే యుండ వలెను. ఈ యోగముణ నెవఁ డుగాని ప్రత్యేకముగా కడ తేరఁ జాలడు. తాను, తన చుట్టుపట్టుల వారు, తన యాప్తులు నను క్రమమున ప్రేమ వ్యాపకమగు తీరు ననుసరించి తాను, తన చుట్టుపట్టుల వారు, తన యాప్తులు నను క్రమముగా లోకము నంతను బ్రేముంచి లోక మునంతను గడతేర్చు వాఁడు కావలె తన ప్రేమ సర్వలోక వ్యాపకము కానంత వఱకు నెవ్వఁడు గాని కడ తేరఁ జాలడు. ఆ ఖండము, సర్వ వ్యాపకుఁడు కాక తప్పదు. దేశకుల జాతిమతాది పరిచ్చేద ములతో వేఱు పడిపోవు సర్వ ప్రజతో సామరస్యము కుడు ర్చుకోలేని వాఁడు సంసార బంధమున కొట్టు కాడవలసినవాఁడే! బహిర్ముఖముగా సాగుచున్న బహుత్వమును సాగనిచ్చుచునే అంతర్ముఖముగాఁ దిరిగి అందేకత్వమును గుర్తించి వర్తించుట ఈ యోగ సాధనమున కొక ఫలితము. మన పరిపూర్ణత భవిష్యత్తులో నున్నది గాని భూతము కాలేదు.కనుక భుతమను పీఠిక పై నెలకొని భవిష్యత్తున పరమార్ధ మను భవింపవలసి యున్నది.'
శ్రీవారి దివ్య ప్రజ్ఞలలోనొక్కటియిది. ఎవ్వరుగానిలోనేదేనిసందేహమో, వ్యాదులపాటో చెందుచు సన్నిధికి వచ్చినప్పుడు వారి నడుగకే, వా రడుగకే వింతగా దానికి సమాధానము యాదృచ్చిక సంభాషణ సందర్భమున వెల్ల డించుట-ఒండె-ఆ సమాధానము నడిగి తెలిసి కొనఁగోరి వారి సన్నిధికి వచ్చు నంతలో నాపృచ్చకు తీరులోనే యాస మాధాన మాప్రష్టల కెఱుకపడకుండనో, అంతలోనే యెఱుక కందుచునో శ్రీవారు నోరెత్త నావశ్యకత లేకుండనే బాహిరపడుట__
ఒక చిన్న దృష్టాంతము. ఇంజనీయరింగ్ డిపార్టు మెంటులో ఉద్యోగిగా నున్నయొక శిష్యుని ఢిల్లీలోహెచ్చు జీతముతో నుద్యోగించుటకు సమ్మతింతువా యనిపైయధికారులడిగిరి. నాఁటి సాయంకాలపు టపాలో దానికి బదులు వ్రాసి పంప వలెను. దీని నడిగి తెలిసికొనుటకే ఉదయ మాతఁడు మద్రాసు నుండి వచ్చి వెంటనే తన విషయమును శ్రీ వారికీ విన్నవించెను.' సరే! టపా వేళలోగా యోచించి బదులు చేప్పుదు' ననిరి. సాయంకాలము టపావేళ దాటి పోవచ్చినది. శ్రీవారాతనిఁ బిలిచి బదులేమి గాని చెప్పరయిరి.
ఆతని యోచనలు తీవ్రముగా రేగెను. అనుకూల ప్రతికూల పక్షముల యుక్తులు గుప్పుగుప్పు మని లోనుండి వెల్వడఁ జొచ్చెను. త్రాసున తూపగా ' వెళ్ళవలదు' అన్న పక్షము బరు వెక్కువ గలదిగా గాన వచ్చెను. ఆత్రపాటుతో నదే సమాధానము జాబులో వ్రాసెను.' శ్రీవారు బదులు పలుక రైరి గదా! ఇక నాలసింపరాదు, కనుక దీనినే పోస్టు చేయుదు' నని యాతఁడు యోగశాల నుండి బయల్వెడలెను.
శ్రీవారు తమ యింటివాకిట నుండిరి. రమ్మని కనుసైగ చేసిరి. చేరబోగా ' చేతిలో ఏమిటది?'అనిరి.' బదులు వ్రాసితిని. అనుకూల ప్రతికూల పక్షములు యోచించి చర్చింపఁగా ప్రతికూలపక్షము బలవంతముగా తోఁచెను. తామేమి సెలవిచ్చిన నట్లు చేసెదను. టపావేళ దాటు చున్నది. కాన నాకు తోఁచినది వ్రాసితిని. తద్విరిద్ధముగా మిరు సెలవిచ్చిన నట్లు వెంటనే చేసెదను' అనెను.' ఈజాబే పోస్టులో వేసిరమ్ము' అనిరి. ఆతఁ డట్లే చేసెను.
తర్వాత సమయాంతరమున నిట్లు చెప్పిరి.' మి కేవి గాని సందేహములుతోచినచో తోచినవానికి బదుళ్ళు యోచింపక వెంటనే వాని నట్లే నాకు వ్రాయుటో, అడుగుటో చేయవలదు.మి చేత నయినంతవఱకు వాని సమాధానములను మిరే కనుగొన యత్నింపుఁడు. ఎంతకును సమాధానము దొరకని వానినే నన్నడుగుఁ డు. న్యాయమైన, సంగత మైన ప్రశ్న మెవరికి గాని తోచినచో, నా ప్రశ్నపుఘనత ననుసరించి దానికి తగినంత త్నము చేసినచో సరి యయిన సమాధానము దొరకఁ గలదు. ఆ యత్నము బహిర్ముఖ మగు ప్రాచీన గ్రంధాదుల వల్ల తనకు విజ్ఞు లుగా తోచు నాప్తులవల్ల తెలియఁ దాగిన దగును. అంతర్ముఖ మగుచో ఆత్మోద్బోధ రూపక మగును. ఈ యోగ మట్టిత్మోధమును గోల్పుటకే.
