Previous Page Next Page 
హెల్త్ సైన్స్ పేజి 51

    ఇలా లింఫ్ నాళాలు దెబ్బతిని పోవడమో, అడ్డు పడిపోవడమో కాళ్ళ విషయంలో ఎక్కువ. అందుకనే ఎక్కువుగా బోడకాళ్ళు తయారావుతాయి. ఐతే ఇటువంటి పరిస్థితివల్ల చేతులకీ వక్షోజాలకీ, స్రీల మర్మావయాలకి, పురుషుల బీర్జలకీ, పురుషంగానికి కూడా ఫైలేరియా రావడం మామూలే. మొదట్లో ఈ భాగాల్లో నొక్కితే సొట్టపడతాయి. తరువాత కొంత కాలానికి ఆ భాగాలు గట్టి పడిపోతాయి. దాంతోచర్మం దళసరిగా మారిపోతుంది. వాపువచ్చిన మొదటి రోజుల్లో లోపల ఉండే నాళాలు వాచి నొప్పి_ అనిపించవచ్చు. కాని కొంతకాలానికి ఎటువంటి నొప్పి లేకుండా పోతుంది. కాని లోపల అనేక లింఫ్ నాళాలు ఉంటాయి. ఒక దాని తరువాత మరొకటి దెబ్బతినిటంవల్లగాని కాలు లావుగా మారుతుంది. దళసరిగా మారిన క్రిములలో అడ్డు బడటంవల్ల గాని కాలు లావుగా మారుతుంది. దలసరిగా మారిన చర్మం దానికింద ఉండే కొవ్వునీరుతో ఉబ్బి ముదత్రులు పడుతుంది. అలాంటి కాలు ఏనుగు క్లును గుర్తు చేస్తుంది. ఇలా ఒక్కకాలే మారవచ్చు లేదా రెండు కాళ్ళూ ఏనుగు కాళ్ళుగారూపు దిద్దుకోవచ్చు. అలాగే శరీరంలో ఇతర భాగములు కూడా లావెక్కవచ్చు.

    ఈ వ్యాధికి సంభందించిన క్రిములు రక్తపరీక్షలో చక్కగా కనబడతాయి. ఈ క్రిములు ముఖ్యంగా రాత్రిపూట రోగినిద్రపోతున్న సమయంలో రక్తంతో ప్రాయనిమ్చి చర్మంలోకి వస్తాయి. అందుకనే ఫైలేరియా విషయంలో రక్తపరీక్ష లో ఈ వ్యాధికి సంభందించిన మైక్రోఫైలేరియా కనబడి, తరువాత ఎన్నిసార్లు రక్తపరీక్ష చేసినా క్రిములు కనబడకపవచ్చు. ఐనా ఏనుగు కాళ్ళుఎబ్బెట్టుగా మిగిలిపోతాయి. దీనికి కారణం వారిలో వ్యాధిక్రిములు నాశనమయినా ఆ వ్యాధివల్ల చచ్చుపడిపోయిన నాళాలుతిరిగి కోలుకోలేకపోవటమే. అందుకనే ఒకసారి గట్టిపడిపోయిన బోదకాలు జీవితాతం అలాగే ఉండిపోతుంది.

    బోదకాలు లాగానే పురుషులలో ఫైలేరియా వల్ల వృషణాలులావెక్కి పోవడం, వారిబీజం ఏర్పడటం చాలా సాధారణమైనా విషయం. బోదకాలు రావడం వంశపారంపర్య లక్షణం కాదు. కాని ఒక ఇంటిలో ఒకరికి బోదకాలుగాని, ఫైలేరియా వలన ఇతర వాపులుగాని ఉన్నవారికీ కుట్టిన దోమలు తక్కిన కుటుంబ సభ్యులను కుట్టడంతోఅలా తెలికిగా ఈ వ్యాధి వారికీ సంక్రమిస్తుంది.

    ఫైలేరియా విషయంలో హైట్రీజాన్ లాంటిబిళ్ళలు పూర్తీ మోటాదులలో, పూర్తీకోర్సుతోవాడితే వ్యాధి క్రిములు అతి తెలికిగా నిర్మూలింపబడతాయి. అప్పుడు లింఫ్ గ్లాండ్లు, లింఫ్ నాళ్ళు  మూసుకుపోవడం. దుష్పలితాలు కలగడం ఉండదు. శరీరం వ్యాధికి ప్రభావిటమిపోయాకఎన్నిమండులు వాడినా ప్రయైజనం శూన్యం.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS