"ఇదా? బాగుంది... బాగుంది... హిహి" ఏమనాలో తోచక ఎదో ఒకటి అనాలికదా అని అలా అని వెర్రి నవ్వు నవ్వి జేబురుమాల్తో మొహం తుడుచుకున్నాడు కన్నారావు.
"లోపలికి రా... అలా రోడ్డు మీదనే నిలబడిపోయావేం?" కాంపౌండ్ వాల్ గేటు దగ్గార నిలబడి పిలిచింది కాంతామణి.
తక్కుతూ తారుతూ అడుగులు ముందుకు వేశాడు.
"ఇక్కడ కూర్చో...ఇప్పడే మా అమ్మని నాన్నని తీసుకొచ్చి పరిచయం చేస్తాను"
వరండాలో సోఫాలో కన్నరావుని కూర్చోబెట్టి కాంతామణి లోపలికి వెళ్ళింది.
కన్నారావు గోడకున్న పెయింటింగ్స్ వంకా, గుమ్మానికున్న కర్టేన్స్ వంకా, సీలింగ్ ఫాన్ వంకా మార్చి మార్చి చూస్తున్నాడు ఏమి తోచక.
అప్పడే వినిపించింది కన్నరావుకి లోపలి నుండి ఆ గొంతు.
"ఇప్పడే కదమ్మాయ్ బయటికి వెళ్ళావ్. అప్పడే వెనక్కి వచ్చేశావే?... కొంపతీసి ఏ రౌడి వెధవ్తేనా వెంటపడి అల్లరి చేశాడా ఏంటి చెప్పు!.. మర్డర్ చేసేస్తా"
కన్నారావు ఉలిక్కిపడ్డాడు.
"మర్డర్ చేసేస్తా! ఈ పదం నేనెక్కడో విన్నానే!! ఈ గొంతు కూడా విన్నాను. ఎక్కాడా? ఎక్కాడా?? ఎక్కాడా???" బుర్రగోక్కుంటూ ఆలోచించాడు కన్నారావు.
అతనికి గుర్తొచ్చింది ఆ కంఠం ఎవరిదో.
ఇన్ స్పెక్టర్ బంగార్రాజు!!
మనసులోనే గట్టిగా 'బాబోయ్' అని అరిచి బయటికి పరుగు తీశాడు కన్నారావు!
నాలుగు క్షణాల తర్వాత వంరందాలోకి వచ్చిన బంగార్రాజుకి , కాంతామణికి సోఫా ఖాళీగా కనిపించింది.
"ఎక్కడమ్మా అతను?" తెల్లబోయి చూస్తున్న కూతురిని అడిగాడు బంగార్రాజు.
ఆ వెనుక విధిలో కన్నారావు భయంకరంగా పరుగు పెడ్తున్నాడని వాళ్ళకి తెలిదు.
14
చిన్నమ్మాయి తల్లిదండ్రుల దగ్గర్నుండి గ్రీన్ సిగ్నల్ లభించాక, రెండు రోజుల తర్వాత తన ప్రేమ విషయం, పెళ్ళి విషయం తల్లిదండ్రులతో మాట్టడానికి రాజమండ్రి వెళ్ళాడు చిట్టబ్బాయి.
చిట్టబ్బాయి చెప్పింది వింటూనే అతని తండ్రి పరమేశ్వర్రావు ఇంతెత్తున లేచాడు.
"వీల్లేదు... సిగతరగా. అప్పడే ప్రేమించే వయసూ, పెళ్ళి చేస్కునే వయసూ వచ్చేసిందా?" అన్నాడాయన.
"మీకు పధ్నాలుగేళ్ళ వయసులో నాతో పెళ్ళయింది" మెల్లగా అంది పార్వతమ్మ కొడుకుని సపోర్టు చేస్తూ.
"నోర్ముయ్! ఆ రోజులు వేరు. ఈ రోజులు వేరు... వీడికి ఉద్యోగంలో ప్తె ప్రమోషన్ రాణి... అప్పడ్తే తే ఇంకాస్త ఎక్కువ కట్నం వస్తుంది."
"ఆ...ఆ ప్రమోషన్ వచ్చేసరికి నేను ముసలాడ్ని అయిపోతాను. అప్పడు కట్నం రావటం మాట అటుంచి నేనే ఎదురిచ్చి చేస్కోవలసి ఉంటుంది" బుంగమూతి పెట్టి అన్నాడు చిట్టబ్బాయి.
"సిగతరగ నాకే ఎదురు చెప్తున్నావే?" అన్నాడు కళ్ళు పెద్దవి చేసి పరమేశ్వరరావు.
"చాల్లెండి... వాడిని కనిపెంచింది కట్నానికి అమ్మోయ్యడానీకా?... అమ్మాయితో కాపురం చేసేది వాడు. వాడి ఇష్టప్రకారం జరగనియండి... లేకపోతే నేను ఆత్మహత్య చేస్కుంటూ" అంది పార్వతమ్మ దినంగా మొహం పెట్టి.
"సిగతరగా...ఇదొకటి! నువ్వు బాగానే నేర్చుకున్నావ్. ఆత్మహత్య చేస్కుంటా నని బెదిరించడం" విసుగ్గా భార్యవంక చూస్తూ అన్నాడు పరమేశ్వర్రావ్.
"బెదిరించడం కాదు... నిజంగానే ఆత్మహత్య చేస్కుంటూ"
"అబ్బా!" తల పట్టుకున్నాడు పరమేశ్వర్రావు.
"చెప్పండి... ఒప్పకుంటారా ఆత్మహత్య చేస్కోనా?" కళ్ళు వత్తుకుంటూ అడిగింది పార్వతమ్మ.
"ఇప్పటికిప్పుడు ఒప్పెస్కోవాలా? కనీసం అమ్మాయినన్నా మనం చూడాలా వద్దా?... సిగతరగ... అమ్మాయి నచ్చకపోతే మాత్రం నేను ఒప్పకోను" పళ్ళు బిగిస్తూ అన్నాడు పరమేశ్వర్రావు.
"అమ్మాయి నాకు నచ్చింది నాన్నా" అన్నాడు చిట్టాబ్బాయి.
"వాడికి నచ్చినమ్మాయినిచ్చి చేయకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానండి" అంది పార్వతమ్మ మళ్ళిమళ్ళి కళ్ళు ఒత్తుకుంటూ.
"నువ్వెందుకే అమ్మా ఆత్మహత్య చేస్కోవడం? నచ్చినమ్మాయితో కాకుండా వేరే అమ్మాయితో పెళ్ళి జరిగితే చెస్కోవడం? నచ్చినమ్మాయితో కాకుండా వేరే అమ్మాయితో పెళ్ళి జరిగితే నేను ఆత్మహత్య చెస్కోవాలి గాని" తల్లిని ఓదార్చాడు చిట్టబ్బాయి.
పరమేశ్వర్రావు తల పట్టుకున్నాడు.
ఓ పక్క నుండి పార్వతమ్మ, ఇంకో పక్క నుండి చిట్టబ్బాయి పరమేశ్వర్రావు ప్రాణాలు తోడేసి పెళ్ళిమాటలు మాట్లాడ్డానికి ఒప్పించారు. చిట్టబ్బాయి హ్తెదరాబాద్ వెళ్ళి ఈ శుభావార్తని చిన్నమ్మాయికి చెప్పాడు.
ఆ రోజు వాళ్ళిద్దరూ ఓ మంచి చ్తేనిస్ రెస్టారెంట్లో డిన్నరు చేశారు.
పదిరోజుల తరువాత ఓ మంచి ముహూర్తం చూస్కుని హ్తేదరాబాద్ వచ్చారు పార్వతమ్మా, పరమేశ్వర్రావులు. అదేరోజు సాయంత్రం వాళ్లు రంగానాయకులుతో.
"దానిలో నచ్చకపోవడానికేముందండి మాయాదారి సంత!" సంతోషంగా అన్నాడు రంగనాయకులు.
అతని మాటలకి అందరూ నవ్వారు.
చిన్నమ్మాయి, చిట్టబ్బాయిలు ఒకరివంక ఒకరు చూస్కుంటూ ముసి ముసిగా నవ్వుకున్నారు.
"సిగతరగా... మరి.. కట్నకానుకల విషయం మాట్లడుదామా బావగారూ" నావ్వుతూ నసిగాడు పరమేశ్వర్రావు.
"మనకి పిల్ల నచ్చింది... మీరు కట్నాలూ, కానుకలూ అడిగి వాళ్ళని హ్తెరానా పెడ్తే నేను ఆత్మహత్య చేస్కుంటా" భర్త చెవిలో మెల్లగా గొణిగింది పార్వతమ్మ.
"హబ్బా!" పరమేశ్వర్రావు తలపట్టుకున్నాడు.
"ఏంటి బావగారూ తల్నోప్పా? పాత్రేస్కుంటారా?.. ఏమేవ్.. తలనొప్పి మాత్ర, నీళ్ళు కూడా పట్రా" చాముండేశ్వరితో చెప్పాడు రంగనాయకులు.
"తలనొప్పి లేదులే బావగారూ, మాత్రవద్దూ ఏమివద్దూ" అన్నాడు
పరమేశ్వర్రావు.
రంగనాయకులు సర్దుకుని కూర్చుంటూ అన్నాడు "చెప్పండి... మీ అబ్బాయికి ఎంత కట్నం మీరు ఆశిస్తున్నారు?"
"ఏవండి... నేనాత్మహత్య చేస్కుంటానండి" మళ్ళి మెల్లగా భర్త చెవిలో గొణిగింది పార్వతమ్మా.
పరమేశ్వర్రావు పార్వతమ్మవంక గుర్రుగా చూసి, తర్వాతా రంగనాయకులు వ్తెపు తిరిగి బలవంతంగా నవ్వాడు.
"అబ్బే... నేనూర్కే జోక్ చేశానండి బావగారూ మాకు మీ అమ్మాయి నచ్చింది... కట్నకానుకలు ఏవి వద్దు. పెళ్ళి ఘనంగా చేస్తే అంతే చాలు" అన్నాడు.
అప్పటికప్పుడు తాంబూలాలు కూడా పుచ్చుకున్నారు. మరో రెండు నెలల్లో పెళ్ళి చేయాలనీ నిశ్చయించారు ఇరువ్తెపు పెద్దలూ.
ఒకటి రెండు రోజులు హైదరాబాద్ లో గడిపి పరమేశ్వర్రావు, పార్వతమ్మాలు రాజమండ్రి వెళ్ళిపోయారు.
పెళ్ళి కుదిరిన తరువాత మరి స్వేచ్చగా అక్కడికి ఇక్కడికి తిరగ సాగారు చిన్నమ్మాయి, చిట్టబ్బయిలు.
* * *
