Previous Page Next Page 
చిన్నమ్మాయ్ చిట్టబ్బాయ్ పేజి 52

 

    ఆ రోజు ఉదయం తలంటు స్నానం చేసి హల్లో దువ్వెనతో తల దువ్వుతూ జుట్టు ఆరబెట్టుకుంటుంది చిన్నమ్మాయి.

    అంతలో  డోర్ బెల్ మోగింది.

    చిన్నమ్మాయి తలుపు తీసింది.

    ఎదురుగా ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతను నల్లగా, పొడుగ్గా ఉన్నాడు. చిన్నగా కత్తిరిచిన క్రాపు, ప్తెకి తిరిగిన మీసాలు,  కళ్ళకి నల్ల కళ్ళద్దాలు ఉన్నాయి.

    చిన్నమ్మౌఇ చూసి వంకరగా నవ్వాడతను.

    "ఎవరు కావాలి?"

    అతనేమి సమాధానం చెప్పకుండా చిన్నమ్మాయి  బుగ్గ మీద చిటికేశాడు.

    "ఏయ్... ఎవర్నువ్వు?" కోపంగా అరిచింది చిన్నమ్మాయి.

    "నీ మొగుడ్ని" నావ్వుతూ సమాధానం చెప్పాడతను.

    చిన్నమ్మాయి కొద్ది క్షణాలపాటు బిత్తరపోయింది. అంతలోనే తేరుకుంది.

    'ఎవడి రౌడి వెధవ?... విడికెంత ద్తేర్యం? డ్తెరెక్టుగా  ఇంటికి వచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడు' అనుకుని మరుక్షణం తలుపులు మూసెయ్య బోయింది.

    అతను చటుక్కున తన కుడికాలుని రెండు తలుపుల మధ్య అడ్డం పెట్టి చేతుల్తో తలుపులు మూస్కోకుండా పట్టుకున్నాడు.

    "ఈజీ బేబి...ఈజీ" నావ్వుతూ అన్నాడు అతను.

    "ఎవరు నువ్వు?" కోపంగా చూస్తూ మళ్ళి ప్రశ్నిచింది.

    "మళ్ళిమళ్ళి అదే ప్రశ్న వేస్తున్నావ్. అంత సర్దాగా వుందా వినడానికి?
చెప్పానుగా ని మొగుడ్ని అని" తలుపులు తోసుకుని లోపల ప్రవేశిస్తూ అన్నాడు అతను.

    చిన్నమ్మాయికి కంగారు పుట్టింది.

    రెండడుగులు వెనక్కి వేసి లోపలికి చూస్తూ అరిచింది.

    "నాన్నా...నాన్నా"

    "ఊ...ఊ. మీ నాన్నని పిలిస్తే నాకేమ్తెనా భయమని అమకుంటున్నావా? పిలువ్...ఇంకా గట్టిగా పిలివ్...హహహ" నవ్వుతూ మరో రెండడుగులు ముందుకేశాడు.

     "నాన్నా అమ్మా" ఈసారికూడా గట్టిగ, కంగారుగా పిలిచింది చిన్నమ్మాయి.

   ఆమె పిలుపుకి లోపల్నుండి రంగనాయకులు, చాముండేశ్వారి కంగారుగా హాల్లోకి వచ్చారు. వాళ్ళ వెనకే భీమయ్య పండుని ఎత్తుకుని వచ్చాడు.

    ఆ వ్యక్తిని చూడగానే రంగనాయకులు మొహం పాలిపోయింది.

    "చూడు నాన్నా విడేవడో యింట్లోకి ఎలా చొరబడిపోతున్నాడో!! అలా రావడమే కాకుండా పిచ్చివాగుడు కూడా వాగుతున్నాడు" ఆవేశంగా అంది చిన్నమ్మాయి తండ్రికి అతన్ని చూపిస్తూ.

    రంగనాకులు ఏమి మాట్లాడలేదు. అతను తలవోంచుకున్నాడు.

    కాని చాముండేశ్వరి మాత్రం కోపంగా అరిచింది.

    "ఒరేయ్ భీమయ్య...ముందు వీడిని బయటికి గెంటు"

    బిమయ్య ఆగి వెనక్కి తిరిగి రంగనాయకులు  వంక చూశాడు. రంగనాయకులు వెనక్కి వెళ్ళమన్నట్టుగా  భిమయ్యకి స్తేగచేశాడు.

    అతను పకపక నవ్వాడు.

    "నట్టింట్లో వాడట్టా విలన్ లా నవ్వుతుంటే మీరు చూస్తూ ఊర్కుంటారేంటండి బయటికి గెంటించక?" ఆవేశంతో  అంది చాముండేశ్వరి.

    "విడేవడో పిచ్చిపిచ్చి వాగుతున్నాడు నాన్నా!!" చిన్నమ్మాయి కూడా అతన్ని మింగేసేలా  చూస్తూ అంది.

    "పిచ్చివాగుడు వగుతున్నానా? ఏం వాగుతున్నానో కాస్త మీ నాన్నకి చెప్పరాదూ. అది పిచ్చివాగుడో  మంచివాగుడో మీ నాన్న చెప్తాడు" అన్నాడతను వంకరగా నవ్వుతూ.

    "షటప్! నోర్ముయి" ఆవేశంగా అరిచింది చిన్నమ్మాయి.

    ఊ...ఊ...ఊ... తప్పమ్మా. మొగుడ్ని అలా షటప్ గిటప్ అని అనొచ్చో ఊ? హహహ" పగలబడి నవ్వాడు అతను.

    "చూశావా నాన్నా వీడు నాకు మొగుడంట?!" కోపంగా అంది చిన్నమ్మాయి.

    "ఎవడ్రా నువ్వు?నువ్వు హూ అని అంటున్నా, చూడు నిన్నేం చేస్తానో సి" అంటూ అడుగులు ముందుకు వేశాడు భీమయ్య.

    "భిమయ్యా!నిన్ను కాస్తఆగమన్నానా?" విసుగ్గా అన్నాడు రంగనాయకులు. విస్తుపోయారు. పండు బిక్కుబిక్కుమంటూ  అందర్నీ చూస్తున్నాడు.

    కొన్ని క్షణాల తర్వాత తేరుకుంది చాముండేశ్వరి.

    "ఏమిటండి మీరు? అలా బెల్లం కొట్టిన రాయిలా ఉంటారేం? వాడ్ని చాచిపెట్టి గూబమిడ రెండందుకొక?"

    "ఎవండుకుంటాడు ? అల్లుడ్ని ఏ మావ్తెనా అందుకుంటాడా?" వక్రంగా నావ్వుతూ అన్నాడు ఆ వ్యక్తి,

    "అదిగో ... మళ్ళి అదే కూత కూస్తున్నావ్?" చిన్నమ్మాయి అతన్ని మింగేస్తున్నట్టు చూస్తూ అంది.

    "సారి డియర్...నిజమే! ఇంతసేపు నీకు మొగుడ్ని అంటూ సరసాలాడాను....కాని నేను నీకు మిగుడ్ని కాను...కాబోయే మొగుడ్ని కావాలంటే  మీ నాన్నని అడుగు" అన్నాడతను.

    చిన్నమ్మాయి విసురుగా రంగనాయకులు వ్తెపు తిరిగింది.

    "ఇందాకట్నుండిఅలామౌనంగాఉన్నావేంటినాన్నా...ఏంటివీడుకూస్తున్నాది??"

    రంగనాయకులు ఉలకలేదు పలకలేదు, అతని కళ్ళని కన్నీటి పోరా మాత్రం క్రమ్మింది.

    "ఇందాకట్నుండి అందమ్తెన  అమ్మాయివి, అందులో నాకు కాబోయే పెళ్ళానవి  అని వదలి పెట్టేశాను. కాబోయే భర్తని వాడూ విడూ  అంటే అంత బాగుండదు" సీరియస్ గా చిన్నమ్మాయి వంక చూస్తూ అన్నాడతను.

    "ఏంటండి.. మనమ్మాయికి కాబోయే భర్త అని అంటాడేమిటి?వాడలావాగుతుంటే మీరు ఊర్కుంటారేంటి?" నిలదీసి భర్తని అడిగింది చాముండేశ్వరి.

    "అతను అంటుంది నిజమే" మెల్లగా అన్నాడు రంగనాయకులు.

    చిన్నమ్మాయి, చాముండేశ్వరి రంగనాయాకులువ్తెపు కల్లింతింత చేసి ఆశ్చర్యంగా చూశారు.

    "విన్నారుగా... అన్నాట్టు నన్ను నేను పరిచయం చేస్కోలేదు కదూ? నా పేరు శివరావు... నన్ను ముద్దుగా శివా అనిఒ పిలుస్తారు... నువ్వు కూడా  అలానే పిలిస్తే బాగుటుంది రజని..." అన్నాడు ఆ వ్యక్తి.

    చిన్నమాయ్ దుఃఖాన్ని బలవంతంగా ఆపుకుంది.

    "నేనింక వస్తాను... వస్తాను రజని.. ముహూర్తం త్వరలో పెడ్తే సంతోషిస్తా మాంగారూ ... వస్తాను ...బ్తె" అంటూ అక్కడి నుమ్డి నిష్ర్కమించాడు శివరావు.

    కొన్నిక్షణల్లో  ఆ గదిలో మౌనం తాండవించింది.

    హఠాత్తుగా  చిన్నమ్మాయ్ వెక్కి వెక్కి ఏడవసాగింది.చాముండేశ్వరిచిన్నమ్మాయ్ తల నిమురుతూ భర్తని అడిగింది.

    "వాడు చెప్పినదానికి తలూపుతున్నారు... అసలు ఏమిటి మీ ఉద్దేశం?... దిన్ని చిట్టబ్బయికిచ్చి  చేయాలనీ నిర్ణయించుకున్నాం... తాంబూలాలు ఊదా పుచ్చుకున్నాం... ఇప్పుడు హఠాత్తుగా  విడేవడో వచ్చి మనమ్మాయికి కాబోయే మొగుడ్ని అంటే ఊర్కుంటారేం?.. చిట్టబ్బాయి సంగతేం చేశారు?"

    "చిట్టబ్బాయితో  మనమ్మాయి పెళ్ళి జరగదు" తలవంచుకుని మెల్లగా అన్నాడు రంగనాయకులు.

    ఏడుపుని ఆపి చివాలున తలెత్తి తండ్రి వంక చూసింది చిన్నమ్మాయి!

    "ఏం?... ఎందుకని జరుగదు?... నిన్నటిదాకా లేని అభ్యంతరం ఈనాడు ఏమొచ్చింది.... అసలు శివరావు ఎవడూ?... హఠాత్తుగా  ఎక్కడి నుమ్డి ఊడిపడ్డాడు?" ఆవేశంగా అడిగింది చిన్నమ్మాయి.

    రంగనాయకులు దీర్ఘంగా నిట్టూర్చి చెప్పడం ప్రారంభించాడు.


                                                                         15


    డోర్  బెల్ నొక్కాడు చిట్టబ్బాయ్.

    కొన్ని క్షణాల తర్వాత తలుపు తెరుచుకుంది. గుమ్మం అవతల ఉన్న రంగనాయకులు కళ్ళు చిట్లించి చిట్టబ్బాయ్ వంక చూశాడు.

    "నమస్కారం అండి" వినయంగా అన్నాడు చిట్టాబ్బాయ్.

    రంగనాయకులు నవ్వలేదు.

    "నమస్కారం" అన్నాడతను మొహాన్ని సీరియస్ గానే పెట్టి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS