క్షణం పాటు చిట్టబ్బాయ్, చిన్నమ్మయిలు స్టన్ అయిపోయారు.
తన తండ్రి చిట్టబ్బాయ్ ని అలా అడుగుతాడని, అసలు తన తండ్రి మనసులో అలాటి ఆలోచన ఉందని అప్పాటిదాకా చిన్నమ్మయికే తెలిదు.
కొన్ని క్షణాల తర్వాత ఆశ్చర్యం నుండి తేరుకొన్న చిన్నమ్మాయి, చిట్టబ్బయిలు సంతోషంతో గట్టిగా కేకేశారు.
"కేవ్ వ్ వ్ వ్ వ్.."
* * *
విజయనగర్ కాలని సెంటర్లో ఒక జనరల్ షాపులోకి దూరి షాపువాడి నడిగి ఫోన్ చేశాడు కన్నారావు.
"హలో...."
అవతలి నుండి కాంతామణి గొంతు వినిపించింది.
"హలో ... నేను!... కన్నారావుని మాట్లాడుతున్నా"
"హలో కన్నా నువ్వా? బాగున్నావా?" అడిగింది కాంతామణి.
"బాగున్నాగని ఏం చేస్తున్నావ్?"
"గోళ్ళు గోళ్ళు గిల్లుకుంటున్నా..."
"కాళ్ళావా? చేతులవా?హిహిహి..." జోక్ చేశాడు కన్నారావు.
"చాల్లే ని బోడి జోకులు. ఎక్కడ నుండి ఫోన్ చేస్తున్నావ్? "
"ఇంటి దగ్గర్నుండే!...."
"అదేవిటి? ఇప్పుడు నాలుగేగా అయ్యింది. ఆఫీసుకి వెళ్ళలేదా?"
"వెళ్ళానుగాని పర్మిషను పెట్టి వచ్చేశాను..."
"ఎందుకూ?"
"ఎక్కడిక్తేనా వెళ్దామని. ఏయ్ కాంతా" అలా ట్యాంక్ బంద్ వ్తెపు రావా?" ఆశగా అడిగాడు కన్నారావు.
"రాను!" కఠినంగా వినబడింది కాంతామణి కంఠస్వరం.
ఆమె కంఠస్వరంలోని తీవ్రతకి ఉలిక్కిపడ్డాడు కన్నారావు.
"ఏం? ఎందుకలా అంటున్నావ్?" అయోమయంగా అడిగాడు.
"రోజూ సినిమాకో, పార్కుకో ఇలా ఎక్కడికో అక్కడికి తిరగాలా?"
"నన్ను కలుసుకోవడం నీకిష్టంలేదా కాంతా?" దినంగా అడిగాడు కన్నారావు.
"ఎందుకిష్టం లేదు?" ఎదురు ప్రశ్నవేసింది కాంతామణి.
"మరి రానని ఎందుకు అన్నావ్?"
"పార్కుల్లోనో, ట్యాంక్ బండ్ మీదనే కలవాలా?"
"మరింకేక్కడ కలవాలి!! ?" ఆశ్చర్యంగా అడిగాడు.
"మా ఇంటికి రా..."
"అమ్మో!" అప్రయత్నంగా అన్నాడు కన్నారావు.
"ఏం భయమా? అంత భయపడేవాడివి నా వేంటేందుకు పడ్డావ్? నన్నెందుకు ప్రేమించావ్?" సీరియస్ గా అడిగింది కాంతామణి.
"కాంతా కాంతా! ఎంతమాటన్నావ్ కాంతా? శులల్లాంటి నిమాటలకి నా హృదయం బద్దల్తెపోతూంది కాంతా..." బాధగా అన్నాడు కన్నారావు.
అవతలనుండి కిలకిలా నవ్వు వినిపించింది. కన్నారావు బాధని కాంతామణి సీరియస్ గా తిస్కోలేదు.
"ఏంటి? సినిమాల్లో గాని నాటకాల్లోగాని వేషాలేస్తున్నావా? లేకపోతే ఏంటా డ్తెలాగులు?"
"నేనేం చేసినా అంతే కాంతా. కొన్ని గంటలు దాని ప్రభావం నా మనసుమీద పడిపోతుంది. నిన్న సెకండ్ షోకి ఓ తెలుగు సినిమాకి వెళ్లాను. కధ చెప్పనా?..."
"వద్దులేగాని మా ఇంటికి వస్తున్నావో లేదో ముందు చెప్పు"
కన్నారావు మౌనంగా ఉండిపోయాడు.
"ఏం భయమా?" అవతల నుండి అడిగింది కాంతామణి.
"భయమా? ఎందుకూ హిహి?" ఇబ్బందిగా నవ్వాడు కన్నారావు.
"అయితే రా. నేను నీకోసం ఎదురు చూస్తుంటాను. మా ఇల్లు నీకు తెలుసు కదా ఎక్కడుందో?"
"నాకెక్కడ తెలుసు నువ్వేప్పడ్తేనా చెప్పావా ఏమ్తేనానా?? ఎవన్నా అడిగితే చిక్కు ప్రశ్నలేసి జవాబు చెప్పమని చంపుతావ్."
పకపకా నవ్వింది కాంతామణి.
"ఇప్పాడు చిక్కు ప్రశ్నలేయ్యడం మానేశాగా?"
"మానేస్తే మాత్రం నాకు ఒరిగిందేవిట్లే" నిష్ఠూరంగా అన్నాడు కన్నారావు.
"ఒరిగించుకోడానికే కదా మా ఇంటికి రమ్మంటున్నాను.. ఎడ్రసు చెప్తాను రాస్కో..." అంటూ ఫోన్లో అడ్రసు చెప్పసాగింది కాంతామణి.
"స్టాప్...స్టాప్..." అంటూ అరిచాడు కన్నారావు.
"ఏమిటి? ఏమ్తెంది?" అడిగింది కాంతామణి.
"అలా అడ్రసులు పట్టుకుని నేను రాలేను. నాకు ఏ సందు చూసినా ఒక్కలాగే కనిపిస్తుంది" చెప్పాడు కన్నారావు.
"ని కంటే ఆడపిల్లలు నయం. ఇంతకి ఇప్పుడు నన్నేం చెయ్యమంటావ్?"
కాంతామణి కంఠంలో విసుగు ధ్వనించింది.
"నువ్వె వచ్చి నన్ను తిస్కెళ్ళకూడదూ? నువ్వ ఎక్కడ ఉండమంటే అక్కడ నిలుచుని ఉంటాను...." మెల్లగా అడిగాడు కన్నారావు.
"నీకంటే ఆడపిల్లలు నయంకాదు...నీకంటే చదువులేని పల్లెటూరి ఆడపిల్ల నయం!" కాస్త కోపంగా అరిచింది కాంతామణి.
"ఆ!" నోరు తెరిచాడు కన్నారావు.
"విజయనగర్ కాలని నుండి ట్యాంక్ బండ్ రావడానికి ఎంత టైమ్ పడ్తుంది?"
"ఆటోలో అయితే పావుగంట పడ్తుంది. బస్సు అయితే అరగంట పైనే పడ్తుంది.... మరి బస్సు వచ్చేదాకా వెయిట్ చెయ్యాలిగా?!"
"నడిచి రావడానికయితే ఎంత టైమ్ పడుతుంది?"
"అమ్మె ...అంత దూరం నడవడమే!!"
"లేకపోతే ఏంటి నీ సోది? నువ్వు టాంక్ బండ్ మొదట్లో ఒక పావుగంటలో ఉండు... నేనొచ్చి నిన్ను పికప్ చేస్కుని వెళ్తాను." అతని సమాధానం కోసం ఎదురుచూడకుండా ఫోను పెట్టేసింది కాంతామణి.
కన్నారావు తక్షణం షాపులోంచి బయటపడి ఆటో ఎక్కాడు.
పావుగంటలో ఆటో టాంక్ బండ్ దగ్గరికి వెళ్ళింది.
కన్నారావు ఆటోవాడికి డబ్బాలు పెచేసి ట్యాంక్ బండ్ మొదట్లో నిలుచుని ట్యాంక్ బండ్ ని అటు చివరా, ఇటు చివరా చూస్తున్నాడు.
అతనికి తెలిదు కాంతామణి ఏవ్తెపునుండి వస్తుందో.
టైము మెల్లగా గడుస్తుంది.
కన్నరావుకి చాలా ఇబ్బందిగా ఉంది... అక్కడ నిలబడడానికి కాదు. కాంతామణి ఇంటికి వెళ్ళడానికి!
ఇన్నాళ్ళూ ఆమెతో పార్కులకి, హొటళ్ళకి కలిసి తిరిగాడుగాని, ఆమె ఇంట్లో ఎందరుంటారు? ఎవరెవరుంటారు? మొదలయిన విషయాలు తెలుసుకోనేలేదు కన్నారావు. అతను కూడా ఆమెకి తమ కుటుంబ విషయాలు చెప్పలేదు.
తనని ఇంటికి తిస్కెళ్ళి ఏమని పరిచయం చేస్తుంది?! వాళ్ళు తనని ఎగాదిగా చూస్తూ "మా అమ్మాయి నికేలా పరిచయం? ఎక్కడ పరిచయం ?" అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ వుంటే ఎంత ఇబ్బంది?
జేబులోంచి కర్చీఫ్ తిసి నొసటపట్టిన చమటని తుడుచుకున్నాడు కన్నారావు.
సరిగ్గా అప్పడే అతని ముందు ఒక ఆటో ఆగింది. ఆటోలోంచి కాంతామణి తల తొంగి చూసింది.
"ఆటో ఎక్కు"
కన్నారావు బుద్దిగా ఆటో యెక్కి ఆమె పక్కన కూర్చున్నాడు.
"ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళక తప్పదా? ఇంకెక్కడికయినా వెళ్తేనో?" మెల్లగా సణిగాడు కన్నారావు.
కాంతామణి అతనివంక సీరియస్ గా చూసిందిగాని సమాధానం ఏమి చెప్పలేదు.
ఆటో అశోక్ నగర్ లోని ఒక ఇంటి ముందు ఆగింది.
ఇద్దరూ ఆటో దిగారు.
"ఇదే మా ఇల్లు!" చూపించింది కాంతామణి.
