"అలాగా......మరి నీకేమవుతుందో......అత్తకుతురా?"
"కసక్కవుతుంది....." వెంటనే అన్నాడు సత్తిపండు.
ఆ శాల్తి గుర్రుగా చూశాడు.
* * *
అ టెలిఫోన్ బూత్ అతను మహా తెలివైనవాడు. కాల్ కు మూడు రూపాయలు చార్జి చేస్తున్నాడు. ఓ టీవిని టెలిఫోన్ బూత్ లో పెట్టాడు. 'తలతిక్కల సమయం లైవ్ టెలికాస్ట్" అనగానే 'క్యూ' పెరిగిపోతూనే ఉంది.
* * *
మిడిగుడ్లెసుకుని టివీ ముందు నిలబెట్టాడు సత్తిపండు.
శ్రీచంద్ర పొజిషన్ కూడా అలానే ఉంది.
తలతిక్కల సమయం ప్రారంభమైంది.
* * *
'తలతిక్కల సమయాన్ని మిడిగుడ్లెసుకుని చూస్తోన్న ప్రేక్షకులకు వెల్ కమ్....' అంటూ తన ముందున్న ఫ్రీ హ్యాండ్ ఫోన్ వంక చూసింది. సమీర టీవిలో ఫోగ్రామ్ స్టార్టయింది. స్క్రీన్ మీద సమీర క్లోజప్ లో కనిపిస్తోంది.
ఫోన్ రింగయింది.
"హలో....తలతిక్కల సమయం'
"నేను.....పి,కే. రావునండి......"
"స్పికండి....పి...కే...గారు"
"నాదో ప్రాబ్లం...."
"చెప్పి చావండి" అని మనసులో అనుకుంటూ "ఏమిటండి?" అంది.
"నా తలలో బోల్డు పేలు, ఇంకా బోల్డు చుండ్రు వుంది ఏం చేయమంటారు?"
"మీరు మరి చిలిపి.....ఆ పేలు, చుండ్రూ మీ ఆవిడకు షిప్ట్ చేయండి."
"నాకు సిగ్గేస్తుంది.....ఆ పేలు చుండ్రూ ఆవిడ నుంచే నాకు వచ్చాయి."
"మీ సిగ్గు చిమడా....అది సంగతి. అయితే ఓ అరలీటర్ కిరోసిన్ నెత్తికి దట్టంగా పట్టించి చూడండి."
'క' టివీ వాళ్ళు అలానే చెప్పారు. ఆ పేలు కిరోసిన్ తాగి తాగి బలిశాయండి....."
"అయితే ఓ ప్[పన్జేయండి."
"చెప్పండి"
"కిరోసిన్ ని దట్టంగా పట్టించి ఓ అగ్గిపుల్ల గీసి విసిరేయండి పెలూ, చుండ్రు, మాయం. మీ జుత్తు బూడిదగా మారడము ఖాయం."
"థాంక్యూ యంకరమ్మా"
"వెల్ కమ్ రా జుట్టు పోలిగా"
వెంటనే సమీర స్క్రీన్ మీద క్లోజప్ లో కనిపించి "హి....హ్హి.....హ్హి....హ్హి" అని నవ్వి...."చూశారా......తలతిక్కల సమయం....మీకెంత ఎంటర్ టయిన్ మెంట్ కలిగిస్తుందో! ఇప్పుడు మరో గన్నాయి ప్రశ్న విందాం...." అనగానే మళ్ళీ ట్రింగ్ మని రింగయింది.
"హలో.....తలతిక్కల సమయం...."
"నాదో సమస్యండి."
"చెప్పుకోండి."
"మా ఆయన రోజు 'మాధురీ దీక్షిత్ మాధురీ దీక్షిత్" అని కలవరిస్తున్నారండి."
"ఆవిడ ముంబాయ్ లో కదా ఉంటోంది."
"మాధురీ ధిక్షిత్ అంటే మా పనిమనిషండి."
"అంత మంచి పేరు పనిమనిషికి పెట్టుకోవద్దని చెప్పండి. ఇంతకీ మీ సమస్యమీటన్నారు?"
"మాధురీదీక్షిత్ సమస్యండి. మా పనిమనిషి పేరు రోజు రాత్రుళ్ళు కలవరిస్తున్నారండి..."
"అయితే వెంటనే మీరు రోజు మీ కారు డ్రైవర్ పేరును కలవరించండి. అతనికి దూలోదిలి పోతుంది."
వెంటనే స్క్రీన్ మీద మళ్ళీ క్లోజప్ లో సమీర.
"చూశారా.....ఎంత మంచి సలహ ఇచ్చానో.....భలే....భలే....." అంది.
ఇంతలో మళ్ళీ ఫోన్ రింగయింది.
"మరో బేవార్స్ ఫోన్" అని రిసీవర్ ఎత్తి "హలో" అంది.
"నేనోదినా.......పండుని"
"అరే......పోట్టిలాగూ నువ్వా"
"మీ తలతిక్కల సమయం....పిచ్చి తిక్కగా వుందోదినా....."
"ఈ ఐడియా చెప్పిన ఆ డైరెక్టర్ కె ఆ క్రెడిట్."
"అయితే వాడినడిగినట్టు చెప్పోదినా.....అన్నట్టు నాకో ఫ్రెండు న్నాడు."
"అలాగా"
"అవునోదినా....వాడికింకా పెళ్ళి కాలేదు. వాడి దృష్టి పెళ్ళి వైపు మళ్లేలా ఏదైనా సలహా చెబుతావా?"
"నువ్వు మీ ఫ్రెండ్ ను పెళ్ళి చేసుకోమని బ్రతిమిలాడ్డం మానేయ్."
"మానేసి?"
"మీ ఫ్రెండ్ ని ప్రేమించిన అమ్మాయికి...."
"అమ్మాయికి"
"మంచి సంబంధం చూసి పెళ్ళి చేసేయ్...."
"వ...ది...నా....." గట్టిగా అరుపు రిసీవర్ లో నుంచి వినిపించింది.
స్క్రీన్ మీద ఫోన్ 'ఫట్' మని పగిలిపోయిన దృశ్యం కనిపించింది.
స్క్రీన్ మీద వాయిస్ వినిపించింది.
"సత్తిపండు అనే ప్రేక్షకుడు స్టీరియో ఫోనిక్ సౌండ్ లో గట్టిగా అరిచినందున ఫోన్ పగిలిపోయింది. అంతరాయానికి మిక్కిలి సంతోషపడి ఈ ప్రోగ్రాం ని అపేస్తున్నాం. మళ్ళీ వచ్చేవారం కొత్తఫోన్లో కలుద్దాం......బై..."
* * *
ఆ ప్రోగ్రామ్ ని చూసిన లక్షలాది ఇళ్ళలో విచిత్రమైన వెర్రికేకలు వినిపించాయి.
కొందరు వీధుల్లోకి వచ్చి చొక్కాలు చింపుకుని "ఆహా....నా పెళ్ళంట.....ఓహొ నా పెళ్ళంట.....ఐశ్వర్యారాయ్ పెళ్ళి కూతురంట" అంటూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ పరుగులు తీస్తున్నారు.
ఇలాంటి పిచ్చి ప్రోగ్రామ్స్ కు చస్తే యాంకరింగ్ చేయనని సమీర డిసైడైంది ఈ ప్రోగ్రాం రెస్పాన్స్ ని స్వయంగా రోడ్డు మీదకి వచ్చి చూశాక.
అది వేరే విషయం!
* * *
సత్తిపండు తన గదికి వచ్చేసరికి రామేశ్వరి ఓ చిన్న టిఫిన్ క్యారేజి తో నిలబడి ఉంది.
"ఏంటిలా వచ్చావు రామేశ్వరి?" అన్నాడు తాళం తీసి లోపలికి నడుస్తూ.
"అదిగో మళ్ళీ నన్ను తప్పుగా పిలుస్తున్నావ్.....ఆ...." అని ఏడుపు అందుకుంది.
